![A Political leader Bites Off 16-Year-Old Boy Nose In UP Lalitpur - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/8/nose.jpg.webp?itok=kLhkjS36)
లక్నో: నలుగురికి మంచి చెడులు చెప్పాల్సిన నాయకులే ఒక్కోసారి వారు చేసే పనులతో నవ్వులపాలవుతుంటారు. ఓ రాజకీయ నాయకుడు కోపంతో తమ ఇంట్లో పని చేసే 16 ఏళ్ల బాలుడి ముక్కును కొరికేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది.
అభయ్ నామ్‌దేవ్ అనే బాలుడు.. సచిన్ సాహూ అనే రాజకీయ నాయకుడి ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బాలుడు చిన్న తప్పు చేశాడని కోపంతో రగిలిపోయిన సాహూ అతడి ముక్కు కొరికేశాడు. తీవ్ర రక్తస్రావమైన బాలుడిని శనివారం రాత్రి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఝాన్సీ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటం వల్ల చర్యలు తీసుకోలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment