gangrape
-
అస్సాంలో ఆ కిరాతకుడు మృతి
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మరణించాడు. నాగావ్ జిల్లాలోని ధింగ్ గ్రామంలో శనివారం ఉదయం అతడు చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అతడికి బేడీలు వేసి, అత్యాచార ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. నిందితుడు హఠాత్తుగా పోలీసులపై దాడి చేసి తప్పించుకొని సమీపంలోని చెరువులో దూకాడని నాగావ్ జిల్లా ఎస్సీ చెప్పారు. చెరువులో రెండు గంటలపాటు గాలించి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి దాడిలో ఒక పోలీసుకు గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రిలో చేర్చామని వెల్లడించారు.మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. చెరువులో దూకి చనిపోయిన నిందితుడి అంత్యక్రియలను తమ గ్రామ ఖబ్రస్తాన్లో నిర్వహించడానికి వీల్లేదని అతడి సొంత గ్రామమైన బార్భేటి ప్రజలు తేలి్చచెప్పారు. అంతేకాకుండా అతడి కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు ముందు జరిగే ప్రార్థనలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, హింసను సహించే ప్రసక్తే లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారం తేలి్చచెప్పారు. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అత్యాచార ఆరోపణలు.. అండమాన్ మాజీ సీఎస్ అరెస్ట్
సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్‌ను అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జితేంద్రకు సమన్లు జారీ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో గురువారం విచారణకు హాజరైన అయన్ను అక్కడే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. క అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జితేంద్ర నరైన్.. మరికొందరితో కలిసి ఒ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. తమ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దాంతో నరైన్‌ను అక్టోబర్ నెలలో హోంశాఖ సస్పెండ్ చేసింది. నరైన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, మున్ముందు కూడా దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయని పోలీసులు శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసును అండమాన్ నికోబార్ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం విడివిడిగా దర్యాప్తు చేస్తోంది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఏమాత్రం సహించమని.. నిందితుల స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకుంటామని నరైన్ సస్పెన్షన్ నోట్లో హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. -
యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి
ఓవైపు సమాజం, టెక్నాలజీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు మహిళలకు రక్షణ సన్నగిల్లుతోంది. మైనర్ బాలికల నుంచి యువతులు, గర్భవతి మహిళలను కూడా కామాంధులు వదిలిపెట్టడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా అత్యాచార బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడి గౌరవమైన పోలీస్ వృత్తికి కళంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్ధుడు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు తెలియజేసి న్యాయం కావాలని కోరిన బాధితురాలిపై పోలీస్ స్టేషన్లోనే ఓ పోలీస్ లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. 13 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై లలిత్పూర్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అఘాత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్టేషన్ ఇంఛార్జ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. కేసు వివరాలను లలిత్పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ వివరిరంచారు. పాలికి చెందిన నలుగురు యువకులు బలికను మభ్యపెట్టి ఏప్రిల్ 22న బోపాల్ తీసుకెళ్లి మూడు రోజుల పాటు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చి పాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తిలక్ధారి సరోజ్‌కు అప్పగించి పరారయ్యారు. చదవండి: భార్యను వదిలి మరో మహిళతో వెళ్లిపోయి.. స్టేషన్ అధికారి బాలిక నుంచి సమాచారం సేకరించి తన బంధువుల మహిళతో కలిపి చైల్డ్ లైన్ సెంటర్‌కు పంపాడు. రెండు రోజుల తర్వాత బాలికను స్టేట్మెంట్ రికార్డు చేయాలనే పేరుతో స్టేషన్‌కు పిలిపించి వేరే గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మళ్లీ బాలికను చైల్డ్‌లైన్ సెంటర్‌కు పంపించాడు. తరువాత కౌన్సెలింగ్ సెషన్లో బాలిక తనకు జరిగిన విషయం చెప్పడంతో చైల్డ్‌లైన్ సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పాలి స్టేసన్ ఇంఛార్జ్ సహా ఆరుగురు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాలు వెల్లడిస్తున్న లలిత్పూర్ ఎస్పీ బాలిక అత్తను కూడా నిందుతురాలిగా చేర్చారు. స్టేషన్ ఇంఛార్జ్ తిలక్‌ధారిని సస్పెండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డిఐజి స్థాయి అధికారి కూడా ఈ విషయంపై 24 గంటల్లో నివేదికను కోరారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. చదవండి: వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్ట్ -
వివాహితపై కామాంధుల సామూహిక అత్యాచారం.. స్పృహ కోల్పోయి
సాక్షి, మైసూరు: మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలో ఒక వివాహితపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 35 సంవత్సరాల వయసున్న బాధితురాలు ఈనెల 11న గొర్రెలను తీసుకొని మేతకు వెళ్లింది. అక్కడ తొలుత రాజు అనే నిందితుడు ఆమెపై బలత్కారానికి యత్నించాడు. ఆమె తీవ్రంగా అడ్డుకుంది. అనంతరం అక్కడే ఉన్న పుట్టణ్ణ, రవిలు రాజుకు తోడయ్యారు. అనంతరం ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. పశువుల్లా మీదపడి అకృత్యానికి పాల్పడటంతో ఆమె స్పృహ కోల్పోయింది. గొర్రెల మంద ఇంటికి వచ్చినా భార్య రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించారు. అస్వస్థతకు గురైన ఆమెను మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం ఆ రోజు జరిగిన ఉదంతాన్ని భర్తకు వివరించింది. మరుసటి రోజు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు రాజును శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..) -
మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..
వేలూరు (చెన్నై): వేలూరు జిల్లా కాట్పాడి–తిరువలం రోడ్డులోని ఒక సినిమా థియేటర్లో గత నెల 17వ తేదీన వేలూరులోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేసే మహిళా డాక్టర్‌తో పాటు ఆమె స్నేహితుడు కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. రాత్రి 1 గంట సమయంలో ఇద్దరూ థియేటర్ ముందు ఆటో కోసం వేచి ఉండగా ఐదుగురు యువకులు వారిని ఆటోలో ఎక్కించుకుని కలెక్టరేట్ సమీపంలో ఉన్న పాలారు వద్దకు తీసుకెళ్లి మహిళా డాక్టర్‌తో వచ్చిన వ్యక్తి గొంతుపై కత్తి పెట్టి బెదిరించి మహిళా డాక్టర్‌పై నలుగురు అత్యాచారం చేశారు. అనంతరం వారిని అదే ఆటోలో ఎక్కించుకుని వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డులో నుంచి రూ.40 వేలు డ్రా చేయించుకుని, వారి వద్ద ఉన్న నగదు, బంగారాన్ని లాక్కున్నారు. అయితే ఈ ఐదుగురు యువకులు డబ్బులు పంచుకోవడంలో కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆంజనేయులు స్వామి ఆలయం ముందు మద్యం మత్తులో ఘర్షణ పడుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వావుసి నగర్‌కు చెందిన పార్తీబన్(20), సంతోష్‌కుమార్(22), నెహ్రూ నగర్‌కు చెందిన భరత్(18), మణిగండన్(22), 17 ఏళ్ల మైనర్ బాలున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మహిళా డాక్టర్ వద్ద నుంచి ఆన్లైన్ ఫిర్యాదును అందుకున్న పోలీసులు మైనర్ నిందితున్ని చెన్నైలోని బాలుర శిక్షణా కేంద్రంలోకి చేర్చారు. నలుగురు యువకులపై రౌడీషీట్ నమోదు చేయాలని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ ఆదేశించారు. చదవండి: (నాటుకోడి కూర కారంగా ఉందే: సీఎం స్టాలిన్) -
హర్యానాలో యువతిపై సామూహిక అత్యాచారం
-
పెళ్లిచేసుకుంటానని..15 రోజులు బంధించి..
రాయ్‌పూర్: పెళ్లి పేరుతో మోసం చేసి బాలిక, ఆమె స్నేహితురాలిపై దారుణానికి ఒడిగట్టారు కొందరు యువకులు. ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. కొరియా జిల్లా జాగ్రాఖండ్కు చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు మాయమాటలతో నమ్మించాడు. స్నేహితులతో కలిసి పథకం ప్రకారం పెళ్లి పేరుతో బాలికను, ఆమె స్నేహితురాలిని వేరే ఊరికి తీసుకెళ్లాడు. తొమ్మిది మంది యువకులు ఆ బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 15 రోజులపాటు కీచకుల చెరలో ఉన్న బాలికలను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. చికిత్స నిమిత్తం బాలికలను ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదుచేసుకుని ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు ఏఎస్పీ నివేదిత శర్మ చెప్పారు. -
దారుణం: రెండు గంటల పాటు కారులో అత్యాచారం
హరియానా: హరియాణాలో 15 ఏళ్ల బాలికపై పైశాచికంగా కబళించిన మృగాలు.. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చి ఓ కాలువలో పడేసిన ఘటన మరవకముందే ఫరీదాబాద్‌లో మరో ఘటన వెలుగుచూసింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ 22 ఏళ్ల మహిళను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అనతరం నడుస్తున్న కారులో ఆ నలుగురు ఆమెపై రెండు గంటలపాటు సామూహిక లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమెను బల్లాబ్‌ఘర్ సమీపంలో పడేసి వెళ్లారు. బాధితురాలు తన సోదరునికి విషయం తెలియజేయడంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. బాదితురాలు స్కార్పియో కారులో వచ్చిన ముగ్గురు, కారు డ్రైవర్ తనపై అత్యాచారం చేశారని తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నిందితులు దొరలేదు. ఈ ఘటన కూడా గత శనివారం జరగడం గమనార్హం. -
దారుణం: కేన్సర్ బాధితురాలిపై గ్యాంగ్‌రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మృగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఓ మైనర్ బాలికపై శనివారం ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాధితురాలు సాయం కోసం అర్థించడంతో అటుగా వచ్చిన మరో వ్యక్తి మానవత్వం మరిచి ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. చివరికి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని సరోజినీనగర్‌లో ఉంటున్న బాధితురాలు(15) రక్తకేన్సర్తో బాధపడుతోంది. యువతికి పరిచయస్తుడైన శుభమ్ అనే వ్యక్తి శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో నూడుల్స్ తినేందుకు ఆమెను ఆహ్వానించడంతో బైక్‌పై అతనితో బయలుదేరింది. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన శుభమ్, తన స్నేహితుడు సుమిత్తో కలిసి ఆమెను బంధించాడు. ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం యువతి సాయం కోసం అర్థించడంతో.. అటుగా వెళ్తున్న వీరేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఆమెపై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వీరేంద్ర యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శుభమ్, సుమిత్‌ల కోసం గాలింపు చేపట్టామన్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులూ సరోజినీనగర్‌కు చెందిన వారేనన్నారు. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం హిస్సార్: హరియాణాలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. ఉక్లానాలోని ఆరేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారం చేసి ఆపై ఆ బాలికను దారుణంగా హత్య చేశాడు. హిస్సార్ పోలీసుల కథనం ప్రకారం... ఫతేబాద్ జిల్లా తొహనా పట్టణానికి చెందిన దంపతులు కూలీ పనులు చేస్తుంటారు. రైల్వే లైన్ పక్కనే నివసించే వీరికి ఇద్దరు సంతానం. అందులో ఆరేళ్ల చిన్నారి శుక్రవారం రాత్రి తన తల్లి, అక్కతో కలసి నిద్రిస్తుం డగా..గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
విద్యార్థినిపై స్కూల్లో గ్యాంగ్‌రేప్
జైపూర్(రాజాస్థాన్): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాద్యాయులే ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని శికార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. షాపురా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న బాలికపై అదే స్కూలు డైరెక్టర్ జగదీస్ యాదవ్, ఉపాద్యాయుడు జగత్ సింగ్ గుర్జార్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అదనపు క్లాసులు ఉన్నాయంటూ సాయంత్ర సమయంలో బాలికను పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో వారు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. అది వికటించటంతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలికకు తెలియకుండానే గర్భస్రావం చేయటంతోపాటు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించిన వైద్యులు రజినీష్ శర్మ, ఆయన భార్య కానన్లపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నింధితుల కోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకుంటామని అజీత్ఘడ్ ఎస్‌హెచ్‌వో మంగళ్‌రాం ఓలా తెలిపారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య
పార్వతీపురంటౌన్/ సీతానగరం: టెన్త్ విద్యార్థినిపై నలుగురు యువకులు లైంగికదాడి చేసి హత్య చేశారు. విజయ నగరం జిల్లా గాదెల వలసలో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన మిరియాల ఇందు సీతానగరం మండలంలోని గాదెలవలసలో 10వ తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం భోజనం చేసేందుకు సైకిల్‌పై ఇంటికివెళ్లింది. తిరిగి పాఠశాలకు వస్తుండగా మార్గంమధ్యలో గాదెలవలసలోని వైన్‌షాపు సమీపంలో పోతల శంకరరావు ఆమెను ఆపి భయపెట్టాడు. గాదెలవలస, బడేవలస మధ్యన ఉన్న మామిడితోటలోకి బాలికను తీసుకెళ్లి సొంగల లోకేశ్, చుక్క రాంబాబు, కోదేటి రవితేజతో కలసి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎక్కడ చెబుతుందోనని గొంతునులిమి హత్యచేసి.. మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయారు. స్కూల్ నుంచి కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి గాదెలవలస వచ్చి విచారించారు. ఇందుతో శంకరరావు మధ్యాహ్నం మాట్లాడినట్లు, ఇందును బెదిరించినట్లు ప్రత్యక్ష సాక్షి పి.అచ్చుత్ వారికి తెలిపారు. గ్రామ పెద్దలతో కలసి శంకరరావును నిలదీయగా.. జరిగిన విషయాన్ని శంకరరావు పెద్దల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇందు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి తరలించారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. -
ఖమ్మంలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
ఖమ్మం: జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. బీ.కాం సెకండియర్ చదువుతున్న తోటి విద్యార్థినిని బర్త్ డే పార్టీకి ఆహ్వానించిన నలుగురు విద్యార్థులు ఆమెపై గ్యాంగ్‌రేప్ పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా వీడియో తీసి బయటకు చెబితే నెట్లో పెడతామని బెదిరించారు. ఇంటికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రులతో జరిగిన దారుణాన్ని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లినట్లు భావిస్తున్నారు. అత్యాచారానికి గురైన బాలిక దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన విద్యార్థులు అందరూ మైనర్లు కావడంతో పోలీసులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
మహిళపై గ్యాంగ్ రేప్
సంభాల్(యూపీ): బరేలి రైల్వే స్టేషన్ నుంచి ఓ మహిళను బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈనెల 16న పానిపట్ వెళ్లేందుకు బరేలి స్టేషన్‌కు వచ్చిన 40 ఏళ్ల మహిళకు ముగ్గురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి గిన్నార్ ప్రాంతంలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. ఆమెతోపాటు 13 ఏళ్ల కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. తన కుమారుడితో ఎలాగో బయటపడ్డానని, తన కుమార్తె ఇంకా అక్కడే ఉందని ఆమె పోలీసులకు తెలిపింది. ఆమెపై నాలుగు రోజులుగా ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ పాండే తెలిపారు. చాందౌసి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్
గుర్గావ్/నోయిడా: దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో మరో సామూహిక అత్యాచారం జరిగింది. 35 ఏళ్ల మహిళపై ముగ్గురు మృగాళ్లు కారులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాజస్తాన్‌కు చెందిన మహిళ గుర్గావ్లోని సోహ్న ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై నడచుకుంటూ వెళ్తుండగా ఆమెను దుండగులు స్విఫ్ట్ కారులోకి లాగారు. అనంతరం ఐదు గంటలపాటు ఆమెపై అత్యాచారం చేస్తూ ఢిల్లీ మీదుగా నోయిడా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఆమెను నోయిడాలో వదిలేశారు. నిందితులు అత్యాచారం చేస్తూ కారులో గుర్గావ్ నుంచి ఢిల్లీ మీదుగా నోయిడా వరకు వచ్చినా..ఏ ఒక్క పోలీసూ గుర్తించకపోవడం రాజధాని ప్రాంతంలోని భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై నోయిడా, గుర్గావ్ పోలీసులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు గౌతమ బుద్ధ నగర్ ఎస్సెస్పీ లవ్ కుమార్ చెప్పారు. 2012లో నిర్భయ ఘటన సమయంలో పెద్ద ఉద్యమమే జరిగినా ఎన్సీఆర్లో మహిళలకు నేటికీ భద్రత కరువైంది. ఎన్సీఆర్ ప్రాంతంలో తరచూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. -
ఢిల్లీలో మరో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. మొన్న ఢిల్లీలో ఒకమహిళపై నిన్న బిహార్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆందోళన రేపగా, దేశ రాజధానిలో మరో అఘాయిత్యం వెలుగు చూసింది. మహిళ (35)ను కిడ్నాప్ చేసిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటలు కొనసాగిన భయానక అకృత్యాన్ని సాగించిన ఈ ముఠా అనంతరం మహిళను గ్రేటర్ నోయిడా సమీపంలో కారులోంచి బయటకు విసిరి వేయడం కలకలం రేపింది. రాజస్థాన్ భరత్పూర్ నగర్‌కు ఈమె పది రోజుల క్రితం హర్యానాలోని సోహనాకు వచ్చింది. గుర్గావ్లోని సోహనా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటలకు మారుతి స్విఫ్ట్ కారులో మహిళను ఎత్తుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు కదిలే కారులో ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం గ్రేటర్ నోయిడాకు తరలించి కారులోంచి విసిరివేసి పారిపోయారు. రోడ్డుపై పడివున్న ఈమెను గమనించిన స్థానిక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడి జరిగినట్టు సీనియర్ పోలీపు అధికారులు ధృవీకరించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్ట గౌతమ్ బుద్ధ్‌నగర్ సీనియర్సూపరింటెండెంట్ లవ్ కుమార్ చెప్పారు. గ్రేటర్ నోయిడాలో చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత తిరిగి బాధిత మహిళను సోహనాకు తీసుకువెళ్లినట్టు తెలిపారు. అనుమానితులు పరారీలో ఉన్నారనీ , ఈ విషయాన్ని దర్యాప్తు చేసేందుకు నోయిడా పోలీస్ బృందం సోహానాకు పంపించామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. కాగా ఢిల్లీలో ఈ నెలలోనే పసిపాపను ఆటోలో తోసేసి మరీ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆందోళన రేపింది. ఈ ఘటనలో తొమ్మిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బిహార్ 14ఏళ్ల మైనర్‌బాలికపై 6గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను రైల్లో తరలిస్తుండగా, ఆమె స్పృహలోకి రావడంతో రైల్లోంచి తోసేశారు. -
బిహార్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్
లఖీసరాయ్/పట్నా: బిహార్‌లో పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. లఖీసరాయ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై విచారించడానికి బిహార్ ప్రభుత్వం సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుల్లో ఇద్దరిని గుర్తించిన పోలీసులు ఆదివారం ఒకరిని అరెస్టు చేశారు. అతను మైనర్ కావడంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. బాలిక శుక్రవారం రాత్రి బహిర్భూమికి బయటకు వెళ్లినప్పుడు నిందితులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. ఆమెపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టిన అనంతరం దగ్గరలోని బన్షీపూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి బలవంతంగా రైలు ఎక్కించారు. అనంతరం కదులుతున్న రైలు నుంచే ఆమెను క్యూల్ స్టేషన్ వద్ద బయటకు తోసేశారు. ఆమెకు నడుము భాగంలో ఫ్రాక్చర్ అయ్యిందనీ, బాగా రక్తం పోయిందనీ వైద్యులు తెలిపారు. -
‘బ్రతిమాలడంతో వదిలేశారు.. లేదంటే హత్యే’
గురుగ్రామ్: ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దులో మరో నిర్భయలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి వెళ్లి తన స్నేహితుడిని కలిసి ఇంటికి తిరిగొస్తున్న మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి మరోమారు అక్కడ కూడా దాడికి దిగారు. దాదాపు ఐదుగంటలపాటు వారి వికృత క్రీడను కొనసాగించారు. అనంతరం ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు బ్రతిమాలుకోవడంతో ఓ రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారు. ఈ ఘటన శనివారం వేకువ జామున చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం 26 ఏళ్ల సిక్కింకు చెందిన మహిళ ఢిల్లీలోని కనౌట్ సమీపంలోని శాదారా ఏరియాలో ఉండే తన స్నేహితుడి ఇంటికి శుక్రవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో వెళ్లింది. అనంతరం అతడితో కలిసి ఢిల్లీలో రాత్రి 7.30 గంటల నుంచి 10.00గంటల మధ్య అతడితో కలిసి సినిమా చేసింది. ఆ తర్వాత 1.30 నుంచి 2గంటల ప్రాంతంలో తన స్నేహితుడు ఆమె కలిసి ఓ క్యాబ్ తీసుకొని గుర్గావ్కు బయలుదేరి వచ్చారు. ఇంటికి కొద్ది దూరంలో ఆమెను దించి స్నేహితుడు వెళ్లిపోగా స్విప్ట్ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులోకి లాగేసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. అనంతరం 6.30గంటల ప్రాంతంలో ఆమెను వదిలేయగా ఓ బైకిస్టు సహాయంతో తిరిగి ఢిల్లీకి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి పాల్పడే ఇద్దరు వ్యక్తులు మాత్రం మూడో వ్యక్తిని దీపక్ అని పిలిచారని చెప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నామన్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. -
మరణ శిక్షా.. జీవిత ఖైదా?
సాక్షాత్తు దేశ రాజధానిలోనే కదులుతున్న బస్సులో అత్యంత ఘోరంగా.. పాశవికంగా సామూహిక అత్యాచారం చేసిన కేసులో నిందితులకు ఐదేళ్ల తర్వాత శిక్ష ఖరారు కానుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఎట్టకేలకు తీర్పు రానుంది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్ష విధించాలా, లేదా జీవిత ఖైదుతో సరిపెట్టాలా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది. వాస్తవానికి ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు వెలువడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం చెలరేగింది. దాంతో ఇప్పుడు బాలనేరస్తుల చట్టాన్ని కూడా సవరించారు. 16-18 ఏళ్ల మధ్య వయసున్నవారు తీవ్రమైన నేరాలు చేస్తే వారిని పెద్దవాళ్లు గానే భావించాలని చెప్పారు. ఫిజియోథెరపీ చదువుతున్న నిర్భయ తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో బస్సు ఎక్కగా, అతడిని చితక్కొట్టి ఆమెపై ఆరుగురు కలిసి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు చేసుకున్న అప్పీలుపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తన తుది తీర్పును శుక్రవారం వెల్లడించబోతోంది. న్యాయమూర్తులిద్దరూ వాళ్ల అప్పీలును తిరస్కరిస్తే, ఇక వారికి ఉరిశిక్ష దాదాపు ఖరారవుతుంది. అయితే అప్పటికీ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరేందుకు అవకాశం ఉంటుంది, లేదా రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయొచ్చు. -
విద్యార్థినిపై కొరియోగ్రాఫర్ గ్యాంగ్‌రేప్
వెస్ట్‌మారేడ్‌పల్లిలో దారుణం.. హైదరాబాద్: నగరంలోని వెస్ట్‌మారేడుపల్లిలో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థిని నగరంలో సందర్శించేందుకు వచ్చింది. బీకామ్ విద్యార్థి అయిన ఆమెకు ఎయిర్‌పోర్టులో పింకీ అనే మహిళ పరిచయం అయింది. తనతో వస్తే హైదరాబాద్ నగరాన్ని తిరిగి చూపిస్తానని మాయమాటలు చెప్పి.. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన అపార్ట్మెంటుకు తీసుకెళ్లింది. అక్కడ ఆమె స్నేహితుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రీత్ సెర్గిల్ విద్యార్థినికి నరకం చూపించాడు. ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత హించించాడు. మరునాడు తన స్నేహితులతో కూడా గ్యాంగ్‌రేప్ చేయించాడు. తనపై జరిగిన దారుణాన్ని టిష్యూ పేపర్ మీద రాసి బయటకు విసరడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఐదుగురు సామూహిక అత్యాచారం జరిపారని బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులు కొరియోగ్రాఫర్ సెర్గిల్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిపై కక్షతో కూతురుపై దారుణం
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల యువతిపై సామూహిక లైంగికదాడి చోటుచేసుకుంది. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిలో ఆమెకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి కూడా ఉన్నాడు. దాదాపు వారం రోజులపైగా ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడి అనంతరం విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల(మార్చి) 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి తొలుత బాధితురాలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. మరో నలుగురు ఆ సమయంలో బయట ఎదురుచూశారు. అనంతరం ఆమె నోరు, చేతులు, కాళ్లు కట్టేసి ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తిస్తూ దాదాపు తొమ్మిది రోజులపాటు లైంగికదాడికి తెగబడి అనంతరం విడిచిపెట్టారు. దీంతో బాధితురాలు, ఆమె తండ్రి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, స్థానిక పోలీసులకు కాకుండా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, స్థానిక పోలీసులపై నమ్మకం లేకే ఇలా చేసినట్లు చెప్పారు. తన తండ్రిపై ఉన్న రాజకీయ కక్షతోనే వారు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. గత పంచాయతీ ఎన్నికల్లో వారు వ్యతిరేకించిన వ్యక్తికి తన తండ్రి మద్దతిచ్చాడనే కక్షతో తనపై దుర్మార్గానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. -
కొత్త పెళ్లికూతురిపై భర్త, స్నేహితుల అఘాయిత్యం!
కొత్తగా పెళ్లయిన ఓ యువతిని ఆమె భర్త, అతడి స్నేహితులు ఇద్దరు కలిసి తుపాకి చూపించి బెదిరించి, అత్యాచారం చేశారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. పల్మావు జిల్లాలోని రహయ్యా గ్రామంలో అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే పెళ్లయిందని డీఎస్పీ హీరాలాల్ రవి తెలిపారు. అతడు, అతడి స్నేహితులు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. ఒక రోజు రాత్రి తన స్నేహితులు బబ్లు సింగ్, అఫ్జల్ మియాలతో కలిసి అన్సారీ ఇంటికి వచ్చాడని, ముందుగా తాను అత్యాచారం చేసి.. తర్వాత తన స్నేహితులతో కూడా చేయించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారాన్ని అన్సారీయే వీడియో తీయించి, ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడట. తర్వాతి రోజు ఉదయం ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని.. తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే.. స్థానిక పోలీసు అధికారి మాత్రం కేసు పెట్టకుండా వాళ్లను వెనక్కి పంపేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేయించినట్లు డీఎస్పీ రవి చెప్పారు. -
పోలీసులుగా వచ్చి ముగ్గురు మహిళలపై..!
గ్రేటర్ నోయిడా: ఇటుకబట్టీ కార్మికులైన ముగ్గురు మహిళలపై ఆరుగురు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. తాము పోలిసులమంటూ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన దోపిడీదారులు ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోని కోళ్లను ఎత్తుకొని పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని కరోలి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు గ్రేటర్ నోయిడా ఎస్పీ సుజాతాసింగ్ తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ‘దుండగులు పోలీసుల పేరిట అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. అక్రమంగా సారా ఉందా అనేది తనిఖీ చేసేందుకు వచ్చామని బెదిరించారు. అనంతరం ఇంట్లో ఉన్న మగవారిని కట్టేసి.. వస్తువులన్నిటినీ దోచుకున్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలను తిని.. ముగ్గురు మహిళలపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోతూపోతూ ఆరు కోళ్లను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు’ అని బాధిత మహిళ భర్త ఒకరు తెలిపారు. -
అక్కను కట్టేసి.. చెల్లెలిపై దారుణం
బదాన్: ఉత్తరప్రదేశ్‌లోని బదాన్ జిల్లా సహస్వాన్ ప్రాంతంలో ఐదుగురు దుండగులు ఓ మైనర్ అమ్మాయిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సోమవారం బాధిత బాలిక (14) తన అక్కతో కలసి ఓ వివాహ వేడుకకు వెళ్లింది. నిందితులు వీరిద్దరిని కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. దుండగులు బాధిత బాలిక అక్కను కట్టేసి, ఆమెపై దారుణానికి పాల్పడినట్టు బద్నాన్ ఎస్పీ సంజయ్ రాయ్ చెప్పారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. -
గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
కర్నూలు: ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామం క్రాస్ రోడ్డు వద్ద ఈనెల 22వ తేదీన వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న గుట్టలోకి బలవంతంగా తీసుకువెళ్లి మద్యం తాపించి అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం, నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ, వినోద్‌కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బోయ రాముడు, గొల్ల దశరథ, బోయ మధుకృష్ణ, లొద్దిపల్లె గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు తదితరులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు విచారణలో తేల్చారు. సోమవారం ఆటోలో ప్రముఖ న్యాయవాది వద్దకు వెళ్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు మాటు వేసి నంద్యాల రోడ్డులోని రాగమయూరి బస్‌స్టాప్ వద్ద అరెస్టు చేశారు. నేరం జరిగిన రోజు కూడా అదే ఆటోను నిందితులు వినియోగించారు. దర్యాప్తులో భాగంగా ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తాలూకా పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలను వెల్లడించారు. -
ఈఫిల్ టవర్ వద్ద సామూహిక లైంగిక దాడి
పారిస్: మాయమాటలు చేసి రప్పించి ముగ్గురు వ్యక్తులు ఈఫిల్ టవర్ వద్ద ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద చోటుచేసుకుంది. ఈ లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురిలో ఒకరు ఆమెతో ఫేస్బుక్ లో చాట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం అల్జీరియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళతో ఫేస్ బుక్‌లో పరిచయం పెంచుకున్నారు. వారిలో ఒకతను ఆమెకు మాయమాటలు చెప్పి బాగా దగ్గరవ్వగా ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడేందుకు ముందే వ్యూహం పన్నారు. పథకం ప్రకారం ఆమెను పారిస్ లోని ఈపిల్ టవర్ వద్దకు రప్పించారు. అనంతరం ఆమెపై అక్కడే ఉన్న చాంప్ దే మార్స్ గార్డెన్లో లైంగిక దాడి చేశారు. ఆ ముగ్గురుని ఓ హోటల్ లో పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి భద్రత, విచారణ దృష్ట్యా పోలీసులు ఇంతకంటే ఎక్కువగా వివరాలు అందించలేదు. -
భర్తను పొడిచి భార్యను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో బులంద్ షహర్ తరహా దాడి జరిగింది. గంగా నదిలో పుణ్యస్నానానికి వెళ్లొస్తున్న దంపతులపై ఓ గ్యాంగ్ దాడి చేసి భర్తను కత్తితో పొడిచి అతడి కళ్లముందే భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం దారుణంగా గొంతునులిమి చంపేశారు. అలీఘడ్ జిల్లాలోని కాస్గంజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఆదివారం గంగానదిలో పుణ్యస్నానం చేసిన దంపతులు సైకిల్‌పై తిరిగొస్తున్నారు. అలా వచ్చే క్రమంలో మార్గం మధ్యలో ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తుల గ్రూపు వారిపై దాడి చేసింది. భర్త సునీల్ కుమార్ వారి నుంచి భార్యను రక్షించుకునేందుకు ప్రయత్నించగా కత్తులతో పొడిచారు. అనంతరం భార్యను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. గొంతు నులిమి హత్య చేశారు. ప్రస్తుతం భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు భర్తను ప్రశ్నించగా కొన్ని విరుద్ధమైన సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. వాటి ప్రకారం బాధితురాలిని అత్తమామలు, భర్త కట్నం వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. అయితే, ఈ హత్య విషయం మాత్రం మిస్టరీగా ఉండిపోయింది. ప్రస్తుతానికి ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. -
'అజాంఖాన్‌కు సుప్రీం మొట్టికాయలు'
న్యూఢిల్లీ: బులంద్ షహర్లో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటన విషయంలో ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక మంత్రి స్థాయి వ్యక్తి అలాంటి ఆరోపణలు చేయడం అనుచితం అని పేర్కొంది. బాధ్యతారాహిత్యంగా మంత్రి ఆ వ్యాఖ్యలు చేసినట్లుందని అభిప్రాయపడింది. అంతేకాదు.. 'మీపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని' ప్రశ్నిస్తూ మంత్రి అజాం ఖాన్‌కి నోటీసులు పంపించింది. 'న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల నమ్మకం సన్నగిల్లేలా అధికారంలో ఉన్న వ్యక్తులుకానీ, అధికార సంస్థగానీ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారసలు' అని సుప్రీంకోర్టు ఆ నోటీసుల్లో ప్రశ్నించింది. ఈ నెల(ఆగస్టు) తొలివారం బులంద్ షహర్ జాతీయ రహదారి 91పై వెళుతున్న ఓ కుటుంబంపై దాడి చేసి అందులోని గృహిణి ఆమె పదమూడేళ్ల కూతురుపై కొంతమంది దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వీటిని ఖండించే క్రమంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నారని, ఈ ఘటన ఒక రాజకీయ కుట్ర అని అజాంఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నేడు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ దుర్మార్గుడు ఉరేసుకోబోయాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై లైంగికదాడి(2012 డిసెంబర్ 16) చేసి అత్యంతపాశవికంగా ప్రవర్తించి ఆమె చావుకు కారణమైన ప్రధాన నిందితుల్లో ఒకరు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఐదుగురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి తిహార్ జైలులో ఉండగా వారిలో వినయ్ శర్మ అనే వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తొలుత పెయిన్ కిల్లర్స్ తీసుకొని అనంతరం టవల్ తో ఉరిపెట్టుకున్నాడు. అది గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని తప్పించి ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. 2013 ప్రారంభంలో తనపై తిహార్ జైలులోని తోటి ఖైదీలు దాడి చేశారని తనకు అదనపు భద్రత కల్పించాలని వినయ్ శర్మ అప్పట్లో డిమాండ్ చేశాడు. కాగా, ఈ కేసులో ఉన్న నిందితులు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందే అదే ఏడాది(2013) మార్చి నెలలో బస్సు డ్రైవర్ రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఉరి వేసుకొని చనిపోగా అతడి తల్లిదండ్రులు మాత్రం పోలీసుల హత్య అని ఆరోపించారు. -
రేపిస్టులను పట్టిచ్చిన బాలిక
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత చిన్నారి ఇచ్చిన క్లూ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని బాధితురాలు గుర్తించడంతో పోలీసుల పని సులువైంది. మందవలి ప్రాంతంలో ఇంటి ముందు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకుపోయి ఆదివారం రాత్రి నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను ఇంటి ముందు వదిలేసి పారిపోయారు. నిందితుల్లో ఒకరైన ఆమిర్ నవ్వును చిన్నారి గుర్తుపట్టింది. ఆరు నెలల క్రితం తన అన్నయ్యతో ఆమిర్ గొడవ పడ్డాడని వెల్లడించింది. బాలిక ఇచ్చిన క్లూ ఆధారంగా రంగంలోకి 25 మంది పోలీసులు సోమవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బైకు విషయంలో తన కొడుకుతో నిందితులు గతంలో గొడవపడ్డారని బాలిక తండ్రి తెలిపారు. ఈ కోపంతోనే తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడివుంటారని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
పంద్రాగస్టు వేడుకలకు వెళ్లొస్తుంటే దారుణం
చండీగఢ్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై వస్తున్న పన్నెండో తరగతి విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం హర్యానాలోని కియోరా అనే గ్రామానికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థిని తన పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలకు హాజరై తిరిగొస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. బైక్ కు కొద్ది దూరంలో మరో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ అమ్మాయిని కత్తితో బెదిరించి ఎత్తుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కిడ్నాప్ చేసిన ప్రాంతం నుచి టిక్ అనే గ్రామంలోని ఓ ఇంట్లో వాళ్లు ఆకృత్యానికి దిగారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. -
గన్‌పెట్టి డ్యాన్సర్‌పై నలుగురు లైంగిక దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ డ్యాన్సర్‌పై నలుగురు మేనేజర్ స్థాయి ఉద్యోగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరంతా ఓ ప్రముఖ ఆయుర్వేద మందుల కంపెనీకి చెందిన వారని తెలుస్తోంది. లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని బాంథారాలో తమ కార్యాలయానికి సంబంధించి ఓ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సత్యవీర్ సింగ్, దేవ్ రాజ్ సింగ్, రాష్ట్రీయ భూషణ్ భారతీ, పరేశ్ తోమర్ అనే నలుగురు మేనేజర్ స్ధాయి ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సత్యవీర్ సింగ్ అనే వ్యక్తి అష్ఫాక్ అనే వ్యక్తి ద్వారా పార్టీలో డ్యాన్స్ చేసేందుకు ఓ ట్రూప్ కావాలని కోరాడు. దీంతో ఆ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన బృందంతో వచ్చిన డ్యాన్సర్ అర్ధరాత్రి గడిచే వరకు ఆడిపాడింది. ఇది చూస్తూ పార్టీలో ఉన్నవాళ్లంతా బాగా తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ నలుగురు మాత్రం పీకల దాకా తాగి అక్కడి ఇతర డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో ప్రధాన డ్యాన్సర్ వారిని ప్రశ్నించింది. సత్యవీర్ సింగ్ మాత్రం పేమెంట్ గురించి మాట్లాడుకుందామని ఓ గదిలోకి పిలిచాడు. అతడి మాటలు నమ్మి ఆమె ఆ గదిలోకి వెళ్లగానే అప్పటికే అందులో ఉన్న ముగ్గురు తలుపు వేశారు. అనంతరం ఆమె తలకు తుపాకీ గురిపెట్టి చంపుతామని బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి నలుగురి అరెస్టు చేసి జైలుకు తరలించారు. వీరంతా లక్నోకు చెందినవారే. -
వరుస రేప్‌లతో అమ్మాయిల ఆందోళన
బరేలి: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న వరుస అత్యాచారాలతో అమ్మాయిలు హడలిపోతున్నారు. ఢిల్లీ- కాన్పూర్ హైవేపై కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, తల్లీకూతుళ్లపై దుండగులు గ్యాంగ్ రేప్ చేయడం.. బరేలి జిల్లాలో 24వ హైవేకు సమీపంలో ఉధ్యాయురాలిని అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడం.. ఈ రెండు ఘటనలు నాలుగు రోజుల వ్యవధిలో జరగడంతో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బరేలి జిల్లాలో కొందరు అమ్మాయిలు ఆకతాయిల చేష్టలకు భయపడి కాలేజీకి వెళ్లడం మానేశారు. తమకు భద్రత కల్పించే వరకు కాలేజీ వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. ఓ కాలేజీకి చెందిన దాదాపు 50 మంది విద్యార్థినులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ధనేలి, ఔరంగాబాద్ గ్రామాల విద్యార్థినులు, తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వెళ్లి షాహి పోలీసులను కలిశారు. స్థానిక యువకులు తమపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కాలేజీ విద్యార్థినుల సమస్య తమ దృష్టికి వచ్చిందని, వారి భద్రత కోసం కాలేజీకి వెళ్లే దారిలో పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు మఫ్టీ దుస్తుల్లో పోలీసులను మోహరిస్తామని బరేలి డీఐజీ ఆశుతోష్ కుమార్ చెప్పారు. అమ్మాయిలకు భద్రత కల్పించాలని కోరుతూ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఎస్పీకి లేఖ రాశారు. -
మహిళ, బాలికపై బందిపోట్ల అత్యాచారం
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లో బందిపోటు దొంగలు ఒకే కుటుంబానికి చెందిన మహిళ, 13 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేశారని పోలీసులు శనివారం చెప్పారు. ఆ కుటుంబం కారులో నోయిడా నుంచి షాజహాన్‌పూర్ వెళ్తుండగా, దొంగలు అడ్డగించి కారుపై దాడి చేశారు. కారులో ఉన్న మగవారిని చెట్టుకు కట్టేసి, మహిళ, బాలికను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. వారి ఆభరణాలు, డబ్బు దోచుకెళ్లారు. కుటుంబంలోని ఓ వ్యక్తి కట్లు విప్పుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఎస్పీ వైభవ్ కృష్ణ తెలిపారు. -
మనాలీలో ఇజ్రాయెల్ మహిళపై గ్యాంగ్ రేప్!
మనాలీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి విహారయాత్రకు వచ్చిన ఓ ఇజ్రాయెల్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. మనాలీ సమీపంలో ఆమెపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై 25 ఏళ్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాధిత యువతి ఆదివారం ఉదయం స్పిటీ వ్యాలీలోని ఖజా ప్రాంతాన్ని సందర్శించాలని అనుకుంది. అక్కడికి వెళ్లేందుకు ఆమె ట్యాక్సీ కోసం ఆమె ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి మనాలీ వరకు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని ఖాజా వెళ్లవచ్చునని ఆమెను నమ్మబలికారు. ఆమె కారు ఎక్కిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి వాహనాన్ని తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తులపై ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని, అందులో ఇద్దరు తనపై అఘాయిత్యం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. నిందితులను పట్టుకొనేందుకు పెద్ద ఎత్తున గాలింపులు చేస్తున్నారు. -
బిహార్‌లో బాలికపై సామూహిక అత్యాచారం
మోతిహరి: బిహార్‌లో గత వారం 12 ఏళ్ల బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 15న మోతిహరి సమీపంలోని బేడీవాన్ మధువన్ గ్రామానికి చెందిన బాలిక గ్రామ సమీపంలోని మామిడితోటలో పండ్లు తెచ్చుకునేందుకు వెళ్లగా ప్రమోద్ సాహ్ని, కమలేశ్సాహ్ని అనే ఇద్దరు వ్యక్తులు బాలికను గ్యాంగ్‌రేప్ చేశారు. తర్వాత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టుచేశారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు గురువారం ధర్నా చేశారు. పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఇంకా స్పృహలోకి రాలేదని వైద్యులు తెలిపారు. -
రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: డానిష్ మహిళ గ్యాంప్ రేప్ కేసులో అయిదుగురు నిందితులకు జీవితఖైదు విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. 2014లో జరిగిన ఈ రేప్ కేసును విచారించిన తిస్ హజారీలోని కోర్టు నిందితులు మహేంద్ర అలియాస్ గంజా(24), మహద్ రాజా(22), రాజు(23), అర్జున్(21), రాజు చక్కా(22)లకు శిక్షను ఖరారుచేసింది. మొత్తం తొమ్మిది మంది డానిష్ మహిళను ఢిల్లీ రైల్వే స్టేషన్ కు దగ్గరలోని డివిజినల్ ఆఫీసర్ క్లబ్ కు సమీపంలో ఎవరూ రాని ప్రదేశానికి తీసుకువెళ్లి రేప్ చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. 55 ఏళ్ల శ్యామ్ లాల్ గత ఫిబ్రవరిలో మరణించాడు. కాగా, మిగిలిన ముగ్గురు మైనర్లు కావడంతో వారిని బాలనేరస్థుల గృహానికి తరలించి విచారిస్తున్నారు. -
కదులుతున్న కారులో.. మూడు గంటలు గ్యాంగ్‌రేప్
కదులుతున్న కారులో.. మూడు గంటల పాటు ఏకధాటిగా ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. కోల్‌కతా విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఉన్న వీఐపీ రో డ్డులో గల ఓ బారులో ఆమె పాటలు పాడుతుంది. తన షిఫ్టు ముగిసిన తర్వాత సెక్టార్ 5 లోని ఓ కేఫ్‌కు వెళ్దామనుకుంది. దాంతో మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుని, సాల్ట్ లేక్ సెక్టార్ 5 లోని ఆర్డీబీ సినిమాస్ వద్ద దిగింది. నగరానికి కొత్త కావడంతో దారి అడుగుతుండగా ఒక వ్యక్తి సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. కానీ అతడు ఆమెను తప్పుదోవ పట్టించాడు. ఆమె నడుస్తుండగా అతడు ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు. కాసేపటి తర్వాత ఉన్నట్టుండి ఓ కారు ఆమె ముందుకు వచ్చింది. అందులోనివాళ్లు ఆమెను లోపలకు లాగారు. లోపల నలుగురు ఉన్నారు. వాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై కదులుతున్న కారులోనే అత్యాచారం చేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కారు ఓ కాలువ దగ్గర ఆగినప్పుడు ఆమె కారు అద్దం తెరిచి, గట్టిగా అరిచింది. దాంతో భయపడిన ఆ నలుగురూ ఆమెను కారులోంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ టాక్సీ డ్రైవర్ చూసి పోలీసులకు తెలిపాడు. వాళ్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఆమె శరీరం నిండా కోసిన గాయాలున్నాయని, ఆమె మానసికంగా కూడా బాగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అయితే గతంలో జరిగిన పార్క్ స్ట్రీట్ ఉదంతంలోలా కాకుండా పోలీసులు వెంటనే స్పందించడం ఇక్కడ విశేషం. అప్పట్లో నాలుగు రోజుల తర్వాత బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించడం తీవ్ర వివాదం అయ్యింది. -
బాలికపై 33 మంది గ్యాంగ్‌రేప్
బ్రెజిల్లో ఘోరం రియో డి జనెరియో: ఇది సభ్యసమాజం తలదించుకునే ఘటన. 33 మంది మానవ మృగాలు 16 ఏళ్ల బాలికను చెరపట్టిన ఘోరమిది. బ్రెజిల్లో జరిగిన ఈ దారుణకాండ ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికపై 30 మందికిపైగా కామాంధులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆ దేశాన్ని తీవ్రంగా వణికించింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో చూసి బ్రెజిల్ ప్రజలు నిర్ఘాంతపోయారు. సో జువో నగరంలో ఈనెల 21న ఈ అత్యాచార ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. బాలిక సో జువోలో తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇది తనను చాలా కలచివేసిందని ఆ బాలిక ఓ పత్రికతో కన్నీళ్లపర్యంతమైంది. తాను కురచ దుస్తులు ధరించానని, అందువల్లనే ఇలాంటి ఘోరం జరిగిందని అనడం సరికాదని చెప్పింది. బాధితురాలినే నిందించడం భావ్యంకాదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. ఘటనను బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మైకేల్ టెమెర్ తీవ్రంగా ఖండించారు.వీరిలో ఇప్పటిదాకా నలుగురిని గుర్తించామని, వీరిని పట్టుకునేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని రియో పోలీస్ చీఫ్ ఫెర్నాడో వెలోసో చెప్పారు. -
గ్యాంగ్‌రేప్: నిందితులు అరెస్ట్
-మరో ఇద్దరు పరారీలో.. శంషాబాద్ : యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను శంషాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మండలంలోని ముచ్చింతల్ గ్రామానికి చెందిన పాండు, పద్మమ్మ కుమార్తె (23) ను అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఈ నెల 15న ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఇంటి సమీపంలో ఉండే వీఆర్ఓ చంద్రమోహన్ తనను గత మార్చి 5న ఇంటికి పిలిచి మరో ముగ్గురుతో కలిసి సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులు చంద్రమోహన్, మహేందర్ అలియాస్ మహేష్, అల్లం శేఖర్, జిత్తు అలియాస్ జితేందర్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుతో పాటు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. శనివారం నిందితులు అల్లం శేఖర్, జిత్తును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మరో ఇద్దరు నిందితులు చంద్రమోహన్, మహేందర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ భాస్కర్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కేరళలో మరో గ్యాంగ్‌రేప్
19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం తిరువనంతపురం: కేరళ నిర్భయ ఘటన తరహాలో ఓ న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనను మరిచిపోకముందే అదే రాష్ట్రంలో మరో దళిత నర్సింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. వర్కల ప్రాంతంలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల దళిత విద్యార్థినిపై మంగళవారం ఆమె స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. నిందితులు పరారీలో ఉన్నారు.మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. వాంగ్మూలం ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేశామని, వైద్య పరీక్షల్లోసామూహిక అత్యాచారం జరిగినట్టు వెల్లడైందని పోలీసులు తెలిపారు. తనకు తెలిసిన ఆటో డ్రైవర్‌తో కలసి బాధితురాలు ఆటోలో వెళ్లిందని, ఆ తర్వాత మరో ఇద్దరు స్నేహితులు వారిని కలిశారని, నిర్జన ప్రదేశానికి ఆటోని తీసుకెళ్లి ముగ్గురూ కలసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఫిట్స్‌కు గురై బాధితురాలు సహాయం కోసం కేకలు వేయగా.. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారన్నారు. ప్రత్యేక వైద్యుల బృందం బాధితురాలికి చికిత్స అందిస్తోందని, ఆమె ఆరోగ్యపరిస్థితి స్థిరంగా ఉందన్నారు. చిత్రహింసలు పెట్టి చంపేశారు కొచ్చి: కేరళలోని పెరంబవూరులో గతవారం నిర్భయ ఘటనను గుర్తు చేస్తూ దారుణ హత్యకు గురైన దళిత న్యాయ విద్యార్థినిని చిత్రహింసలు పెట్టి చంపేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. బాధితురాలి శరీరంపై మొత్తం 38 గాయాలు ఉన్నట్టు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికను అలప్పుజ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం రూపొందించింది. మరోవైపు బుధవారం ఉదయం కేరళ సీఎం ఊమెన్ చాందీ పెరంబవూరు చేరుకుని బాధితురాలి తల్లిని పరామర్శించారు. నిందితులను ఆరెస్ట్ చేస్తామని, బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఈ సందర్భంగా చాందీ బాధితురాలి తల్లికి హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబానికి రూ. పది లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు వెల్లడించారు. కేరళ దళిత యువతి హత్యపై లోక్‌సభ, రాజ్యసభ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. -
రాజమహేంద్రవరం గ్యాంగ్‌రేప్ నిందితులపై నిర్భయ
రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువతిపై గ్యాంగ్‌రేప్ ఘటనలో అరెస్ట్ అయిన నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఆదివారం రాజమండ్రిలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందుకు హాజరుపరిచారు. నిందుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు కిరణ్‌కుమార్‌తోపాటు సతీష్ కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. అలాగే నిర్భయతోపాటు 341, 376- సి, 365, 323, 506 సెక్షన్ల కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ దామోదర్ వివరించారు. -
రాజకీయం చేయొద్దు
► గ్యాంగ్‌రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తాం ► ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని లేఖ రాశాం ► మహిళలపై సమాజంలో మార్పు రావాలి ► ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల కరీంనగర్ సిటీ : వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత యువతి(20)పై గ్యాంగ్‌రేప్ ఘటనను రాజకీయం చేయడం తగదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రభుత్వ పరంగా బాధితురాలికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, రెండుమూడు నెలల్లో తీర్పు వచ్చేలా చూడాలని జడ్జికి లేఖ రాసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతనెల 26న రాత్రి 8 గంటలకు గ్రామస్తుల ద్వారా తనకు విషయం తెలిసిందని, వెంటనే ఎస్పీకి ఫోన్‌చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించానని తెలిపారు. మరుసటి రోజు గ్రామానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చానన్నారు. ఇలాంటి ఘటనలను రాజకీయాలకతీతంగా చూడాలని, పునరావృతం కాకుండా చర్యలకు సహకరించాలని కోరారు. కాని పరిపాలనా అనుభవం ఉన్న వాళ్ల తీరు చూస్తుంటే బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం కన్నా రాజకీయ కోణంలోనే మాట్లాడినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఈ కేసును ఎస్పీ జోయల్ డేవిస్ స్వయంగా విచారిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామన్నారు. నిందితుల్లో అంజయ్య, రాకేశ్‌లు సర్టిఫికెట ప్రకారం మైనర్లని, వైద్యపరీక్షల ద్వారా అంజి మేజర్ అని తేలిందని, రాకేశ్ వయస్సు తేలాల్సి ఉందని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం 16 సంవత్సరాలు నిండిన వాళ్లను కూడా మేజర్ల తరహాలోనే విచారిస్తారన్నారు. సామాజిక ఉద్యమాలు రావాలి.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా లైంగికదాడులు పెరిగిపోతున్నాయని మంత్రి ఆవేదన చెందారు. వీటిని అరికట్టాలంటే కేవలం శిక్షలతోనే సరిపోదని, మానవ విలువలను పెంచేలా సమాజంలో మార్పు రావాలని అన్నారు. సినిమా, సెల్‌ఫోన్, టీవీల్లో అశ్లీల దృశ్యాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం మానవ సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉండొద్దన్నారు. గతంలో సారాకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చినట్లు ఇలాంటి ఘటనలపై సామాజిక ఉద్యమం రావాలని అయన అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసాంఘిక శక్తుల అడ్డా.. కాచాపూర్ గుట్ట
► యథేచ్ఛగా వ్యభిచారం ► గుట్టపై గుడుంబా తయూరీ కేంద్రాలు, పేకాట స్థావరాలు ► చల్లూరు యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది ఇక్కడే ► గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ► పట్టించుకోని పోలీసులు వీణవంక : వీణవంక నుంచి శంకరటప్నం వెళ్లేదారిలో ఆరో నంబర్ కిలోమీటర్ రాయి సమీపంలో 110 ఎకరాల్లో విస్తరించి ఉంది కాచాపూర్ గుట్ట. శంకరపట్నం మండలం పరిధిలోకి వచ్చే ఈ గుట్ట అసాఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పెద్దపెద్ద రాళ్లు, చెట్ల పొదలతో ఉండే గుట్ట రెండు మండలాల అక్రమార్కులకు కలిసివస్తోంది. గతంలో ఇక్కడ అనేక సంఘటనలు జరిగారుు. ఇటీవల చల్లూరు యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది కూడ ఇక్కడే. ‘సాక్షి’ గురువారం ఈ గుట్టవద్దకు వెళ్లి చుట్టపక్కల రైతులు, సమీపంలోనివారితో మాట్లాడింది. ఈ సందర్భంగా ఎన్నో భయంకరమైన విషయూలు వెల్లడయ్యూయి. వీణవంకకు ఆరు కిలోమీటర్లు, శంకరపట్నానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గుట్ట ఉంది. ఇక్కడ ఆరేళ్ల క్రితం గ్రానైట్ క్వారీలు నడిచాయి. రెండేళ్ల క్రితం మూతబడ్డాయి. గుట్ట చుట్టూ ముళ్ల పొదలు, బండరాళ్లు ఉండటంతో కొందరు గుడుంబా తయూరీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. నిర్మానుశ ప్రాంతం కావడంతో ఇక్కడ పేకాటరాయుళ్లు ఆడిందే ఆట. ఇతర జిల్లాల వారుసైతం వచ్చి ఇక్కడ పేకాడతారు. మద్యం బాబులు విందులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ ఏం జరిగినా, ఎంత అరిచినా ఎవ్వరికి కనబడదు.. వినపడదు. ఒకప్పుడు మావోయిస్టులకు ఆశ్రయమిచ్చిన ఈ గుట్ట ప్రస్తుతం ఆసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఆరో నంబర్ మైలురారుుకి కుడివైపు వంద మీటర్ల దూరంలో ఒకప్పుడు క్వారీ నిర్వాహకులు రేకుల షెడ్డు నిర్మించారు. దీని సమీంపలోనే మరో రేకుల షెడ్డు కట్టించారు. నిర్వాహకులు వెళ్లిపోవడంతో రేకుల షెడ్డు శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని కామాంధులు తమకు అడ్డాగా మార్చుకున్నారు. చల్లూరుకు చెందిన యువతిని నోట్పుస్తాకాలు ఇస్తానని చెప్పి బలవంతంగా ఈ గుట్ట వద్దకు తీసుకెళ్లి రేకుల షెడ్డులో గొట్టె శ్రీనివాస్, ముద్దం అంజయ్య, ముద్దం రాకేశ్ సామూహికంగా లైంగికదాడి చేశారు. గతంలో ఎన్నో సంఘటనలు.. ఏడాది క్రితం వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రేమజంట ఈ రేకుల షెడ్డులో మాట్లాడుకుంటుండగా ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఆ జంటపై దాడి చేసి బంగారు ఆభరణాలు, డబ్బు ఎత్తికెళ్లారు. హుజూరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మానకొండూరుకు చెందిన యువతిని ఇక్కడకు తీసుకువచ్చి లైంగిక దాడికి యత్నిస్తుండగా చుట్టు పక్కల ఉండే రైతులు గమనించి యువకుడిని చితకబాదారు. గతంలో వీణవంకలో పనిచేసిన ఓ ఎస్సై ఈ గుట్ట సమీపంలోని పేకాటస్థావరంపై దాడిచేసి పెద్దు ఎత్తున నగదు పట్టుకున్నారు. అరుుతే ఈ గుట్ట శంకరపట్నం మండల పరిధిలోకి రావడంతో నిందితులు తప్పించుకున్నారు. ఈ గుట్ట చుట్టూ ఎన్నో గుడుంబా తయూరీ కేంద్రాలు ఉన్నారుు. కొందరు యువకులు ఇటీవల మద్యం మత్తులో రోడ్డు వెంట వెళ్లేవారిపై దాడి చేశారు. ఇలాంటి సంఘటనలోన్నో ఇక్కడ జరుగుతున్నాయి. పట్టించుకోని పోలీసులు.. గుట్ట రెండు మండలాల సరిహద్దులో ఉండటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ గుట్ట పరిసరాలలో ఆసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కొందరు రైతులు ఇరు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులు మాత్రం తమకేం సంబం ధం అన్నట్లు వ్యవహరించడంతో చల్లూరు యు వతిపై కామాంధులు అఘారుుత్యం చేశారు. ఇప్పటికైన ఆసాంఘిక కార్యకలాపాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఏడాదిలో ఐదు లైంగిక దాడులు ఇందులో రెండు గ్యాంగ్‌రేప్‌లు వీణవంక : లైంగిక దాడి ఘటనలు వీణవంక మండలంలో పెరుగుతున్నారుు. పోలీసుల నిర్లక్ష్యంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. మానవ మృగాలకు కఠిన శిక్షలు పడకపోవడంతో మండలంలో ఏడాది కాలంలో ఐదు అత్యాచార ఘటనలు జరిగాయి. చల్లూరు ఘటనలో సస్పెండ్ అయిన ఎస్సై విదుల్లో చేరినప్పటి నుంచే ఈ ఐదు సంఘటనలు జరిగారుు. 2015, ఏప్రిల్ 6న నర్సింగాపూర్ గ్రామంలో ఓ విద్యార్థిని(16)పై అదే గ్రామానికి చెందిన ఉయ్యాల శ్రీనివాస్ అనే యువకుడు లైంగికదాడి చేశాడు. 2015, మేలో చల్లూరు శివారు గొల్లపల్లి గ్రామంలో ఓ మహిళ(38)పై రాజు అనే వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. చల్లూరు గ్రామంలో 2015, అగస్టు 16న ఓ విద్యార్థిని(15)పై ఇంట్లోనే నీలం రమేశ్ అనే యువకుడు లైంగికదాడి చేశాడు. ఇది అప్పట్లో సంచలనమైంది. మల్లారెడ్డిపల్లి గ్రామంలో 2015, సెప్టెంబర్ 21న మతిస్థిమితంలేని యువతి(20)పై నిమ్మల కుమారస్వామి, పూదరి మొండయ్య, నిమ్మల కళ్యాణ్, దూలం శ్రీనివాస్, నిమ్మల వినోద్ అనే యువకులు నాలుగు నెలలు సామూహిక లైంగికదాడి చేశారు. ఈ నెల 10న చల్లూరుకు చెందిన యువతి(22)పై సామూహిక లైంగికదాడి జరిగింది. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశారు. -
గ్యాంగ్ రేప్ చేసి.. నిప్పు పెట్టారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజిపూర్ జిల్లాలో ముగ్గురు దుండగులు ఓ దళిత బాలిక (14)ను సామూహిక అత్యాచారం చేసి, నిప్పు పెట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు. 7వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి శుక్రవారం స్వగ్రామం నుంచి దగ్గరలోని శివన్ పట్టణానికి వెళ్లేందుకు బయల్దేరింది. ఊరు దాటిన తర్వాత ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా చెరుకుతోటలోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఒంటిపై కిరోసిన్ పోసి అంటించి పరారయ్యారు. బాధితురాలు సాయం చేయాల్సిందిగా కేకలు వేస్తూ చెరుకుతోటలో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
చంపేస్తామని బెదిరించి గ్యాంగ్‌రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్సెరా గ్రామంలో ఈ దారుణం చేసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు యువకులు బలవంతంగా ఇంట్లోకి చొరబడి దారుణానికి పాల్పడ్డారు. జరిగిన సంఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడనుంచి పారిపోయారని సీనియన్ పోలీస్ అధికారి శనివారం వెల్లడించారు. సకీబ్, రకీబ్ లను నిందితులుగా గుర్తించామన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
మాయమాటలు చెప్పి బాలికపై గ్యాంగ్ రేప్
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తి మండలానికి చెందిన బాధిత బాలిక సంక్రాంతి సెలవుల్లో కదిరిలో ఉంటున్న తన మామ ఇంటికి వచ్చింది. సంక్రాంతి పండగ తర్వాత ఆదివారం ఆ అమ్మాయిని తిరిగి స్వగ్రామానికి పంపించేందుకు ఆమె మామ ఆటోలో తీసుకువచ్చి కదిరి బస్టాండ్‌లో బస్ ఎక్కించాడు. అనంతరం బాలిక తండ్రికి సమాచారమిచ్చి ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయిని తీసుకువచ్చిన ఆటో డ్రైవర్, మరో నలుగురు కుట్ర పన్నారు. మీ మామకు యాక్సిడెంట్ అయిందని, తీసుకురమ్మన్నారని మాయ మాటలు చెప్పి బాలికను బస్ నుంచి దింపి ఆటోలో తీసుకెళ్లారు. నల్లమాడ అటవీప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం నిందితులు పరారయ్యారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ వార్త వినగానే బాలిక తల్లికి గుండెపోటు వచ్చింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వాట్సప్‌లో గ్యాంగ్ రేప్ వీడియో, మహిళ ఆత్మహత్య
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత(40)పై నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి ఆ దృష్యాలను వాట్సప్‌లో షేర్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ మహిళ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ముజఫర్ నగర్ జిల్లాలోని చాప్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముజఫర్ నగర్ ఎస్పీ ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ.. 'చాప్రా గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆదివారం నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి వాట్సప్‌లో షేర్ చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది' అని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఆయన దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. -
గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష
రోహ్టక్: మానసిక వికలాంగురాలిని (28) సామూహిక అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేసిన కేసులో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. దోషులకు ఒక్కొక్కరికీ 1.75 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించారు. సోమవారం హరియాణాలోని రోహ్టక్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో పరారైన ఎనిమిదో నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న బాలనేరస్తుడు జువెనైల్ కోర్టును ఆశ్రయించాడు. నేపాల్‌కు చెందిన బాధితురాలు రోహ్టక్లోని తన సోదరి ఇంట్లో ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆమె అదృశ్యమైంది. అదే నెల 4న బహు అక్బర్పూర్ గ్రామంలో ఆమె శవమైతేలింది. ఆమెను సామూహిక అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసినట్టు పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోపల రాళ్లు ఉన్నట్టు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లిందని, తాము ఇటుకలతో ఆమె మర్మాంగాలపై దాడి చేసినట్టు విచారణలో నిందితులు చెప్పారు. మద్యంమత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించామని, ఎందుకు అలా చేశామో తెలియదని ఓ నిందితుడు చెప్పాడు. -
మహిళా కానిస్టేబుల్‌పై ఖాకీల అఘాయిత్యం
-
మహిళా కానిస్టేబుల్‌పై ఖాకీల అఘాయిత్యం
లక్నో: సామాన్య మహిళలకే కాదు... మహిళా పోలీసులకు రక్షణ లేకుండా పోతోంది. అది కూడా పోలీసుల చేతిలో అత్యాచారానికి గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి, అనంతరం మత్తుమందు ఇచ్చిన ఇద్దరు ఖాకీలు, డ్రైవర్ కలిసి సాక్షాత్తూ పోలీస్ వాహనంలోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. . వివరాల్లోకి వెళితే యూనిఫాంలో ఉన్న ఇద్దరు ఖాకీలు, మరోవ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఉత్తరప్రదేశ్ ఇటావాలోని ఝాన్సీకి చెందిన మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మేళా సందర్భంగా విధుల్లో పాల్గొని తిరిగి తన తోటి మహిళా కానిస్టేబుల్‌తో కలిసి వెళుతుండగా, ఖాకీ దుస్తుల్లో పోలీసులు తమను బెదిరించి పోలీసు వాహనంలో ఎక్కించారని, మత్తు పదార్థం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారని ఆరోపిస్తోంది. అనంతరం తుపాకి గురి పెట్టి, చంపేస్తామంటూ అఘాయిత్యానికి పాల్పడి అనంతరం రోడ్డుపై విసిరేసి వెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే హాస్పిటల్లో కూడా తన సోదరికి రక్షణ లేదనీ... తమకు భద్రత కల్పించాలని బాధితురాలి సోదరి విజ్ఞప్తి చేసింది. అనాధలమయిన తమకు న్యాయం జరగాలని... రక్షించాల్సిన పోలీసులే దాడికి పాల్పడితే ఎవరితో చెప్పుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఇటావా సీనియర్ పోలీస్ అధికారి మాంజీ సైని మాట్లాడుతూ ఈ సంఘటనపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సంఘటతో షాక్‌కు గురైన ఆమె తిరిగి ఝాన్సీ వెళ్లడానికి భయపడుతోందన్నారు. కాగా ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరిని బాధితురాలు గుర్తించినట్లు చెప్పారు. దుస్తులపై ఉన్న నేమ్ ప్లేట్స్ ద్వారా అజయ్ యాదవ్, రాజ భాయ్‌గా. మరొకరు డ్రైవర్‌గా గుర్తించిందన్నారు. -
సామూహిక అత్యాచారం ... హత్య
రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రామకృష్ణాపూర్‌లోని శిశుమందిర్ పాఠశాల ఆవరణలో దుర్గంధం రావడంతో స్థానికులు ఆరా తీశారు. ప్రహరీ పక్కన ఉన్న పొదల్లో కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సుద్దాల శైలజ (24)గా గుర్తించారు. ఈ నెల 22న రాత్రి బహిర్భూమి కోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు సుద్దాల వెంకటి, జమున వెతికినా ఆచూకీ లేకపోవడంతో తమ కూతురు కనిపించడంలేదని 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శైలజ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో పోలీసులను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులను పిలిపించి అక్కడే పోస్టుమార్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నీలకంఠేశ్వరావు, డాక్టర్ నీరజ నేతృత్వంలో వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు ముందు హతురాలిపై నిందితులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని ధ్రువీకరించారు. పాఠశాలలోని ఓ తరగతి గదిలో అత్యాచారం జరిపి చెట్ల పొదల్లో పడేసినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. తరగతి గది నుంచి పొదల వరకు రక్తపు మరకలు ఉండడం గమనార్హం. కాగా, శైలజ గతంలో ఇదే పాఠశాలలో విద్యాబోధన చేసింది. అదే పాఠశాలలో హత్యాచారానికి గురవడం గమనార్హం. నిందితులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్ రేప్, హత్య
పాల్గఢ్: నలుగురు దుండుగులు భర్తను చితకబాది, భార్యపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. మహారాష్ట్రలోని పాలగఢ్ జిల్లా వలీవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ నెల 21వ తేదీ రాత్రి నలుగురు దుండగులు వివాహిత ఇంటికి వెళ్లారు. ఆమె తమను దుర్భాషలాడిందని, ఆమెను రేప్ చేస్తామని భర్తకు చెప్పారు. దుండగులు భర్తను కొట్టి, ఆమెను ఇంట్లోంచి లాక్కెళ్లారు. నిందితులు ఆమెపై లైంగికదాడి చేసి, అనంతరం చంపేశారు. ఆమె శవాన్ని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఢిల్లీలో బాలిక కిడ్నాప్.. గ్యాంగ్‌రేప్
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులు.. ఆమెపై గ్యాంగ్‌రేప్ చేశారు. ఆమె తన స్కూలుకు వెళ్తుండగా ఆ ముగ్గురు కిడ్నాప్ చేశారు. తనచేత బలవంతంగా మద్యం తాగించి పది గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారని ఆ బాలిక వాపోయింది. తర్వాత ఆమెను వాళ్లు ఆమె ఇంటిముందు పారేసి వెళ్లిపోయారు. వాళ్లు ఈ అత్యాచారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి ఎంఎంఎస్ తయారుచేశారని, ఫిర్యాదు చేస్తే ఫేస్బుక్లో కూడా పెడతామంటూ బెదిరించారని ఆమె తెలిపింది. అయితే దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దీన్ని బట్టి చూస్తుంటే తనపై అత్యాచారం చేసినవాళ్లకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. -
పదిహేనేళ్ల బాలికపై లైంగిక దాడి
గోండా: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖరగ్‌పూర్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. తన పొలాల్లో పశువులను కాసేందుకు బాలిక వెళ్లగా ఇద్దరు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. స్పృహ కోల్పోయిన స్థితిలో బాలికను గుర్తించిన గ్రామస్థులు సమాచారం వెంటనే తమకు అందించారని, ఆ బాలికను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం ఇప్పిస్తున్నామని అఖండ్ ప్రతాప్ సింగ్ అనే పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దర్యాప్తు వేగంగా జరపుతున్నామని, నిందితులను వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు. -
బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్
మహబూబ్‌నగర్: ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ముగ్గుర్నీ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం... మండలంలోని పెంట్లవల్లికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన సంపంగి రామకృష్ణ (17) ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రామకృష్ణ తాను ప్రేమిస్తున్న బాలికను గ్రామంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితులు పల్లె ప్రకాశ్, రాజేష్‌లను పిలిపించగా వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రామకృష్ణ, ప్రకాశ్, రాజేష్‌లను అరెస్ట్ చేసి వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
రాఖీ కొని వస్తుండగా బాలికపై గ్యాంగ్‌రేప్
ముజఫర్‌నగర్: రాఖీ కొనుగోలు చేసి ఇంటికి వస్తున్న ఓ బాలికపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ముగ్గురూ 15, 16 ఏళ్ల మధ్యవారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు ముజఫర్ నగర్లో రాఖీ తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా, నిందితులు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. -
యువతిపై గ్యాంగ్ రేప్
గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం జరిగింది. ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.. ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడటంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హత్య నిజం.. హంతకులెవరు?
-
హత్య నిజం.. హంతకులెవరు?
= హిమబిందు కేసులో వీడని మిస్టరీ = నిందితులు నిర్దోషులని కోర్టు తీర్పు = పోలీసుల వైఫల్యంపై సర్వత్రా విమర్శలు విజయవాడ సిటీ : హిమబిందు.. సాధారణ బ్యాంక్ మేనేజర్ భార్య. పూజలు, పునస్కారాలు తప్ప ప్రపంచం తెలియని అమాయకురాలు. అలాంటి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆ తర్వాత దారుణంగా హతమార్చారు. ఆమె హత్య నిజం. కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. మరి ఈ దారుణానికి ఒడిగట్టిందెవరనేది తేల్చాల్సిన పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అరెస్టు చేసిన వారి వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగిందే తప్ప గట్టి ఆధారాలు సేకరించడంలో పోలీసులు వైఫల్యం చెందారని కోర్టు తీర్పుతో వెల్లడైంది. పటమట శాంతినగర్‌లోని ఎంటీఎస్ టవర్స్‌కు చెందిన సాయిరామ్ భార్య హిమబిందు(41)పై జరిగిన అత్యాచారం, హత్యపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బ్యాంక్ ఉద్యోగులు, మహిళా సంఘాలు, విద్యార్థినులు అప్పట్లో ఆందోళన చేశారు. చివరకు రాష్ట్ర గవర్నరు సైతం హిమబిందు కేసు దర్యాప్తులో పోలీసుల తీరుపై ఆరా తీశారు. వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం చేశారు. ప్రభుత్వం కూడా కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. సకాలంలో చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో నాలుగో నిందితునిగా పేర్కొన్న జనపాల కృష్ణ బెయిల్‌పై బయటకు వచ్చాడు. దీనిపై ఆగ్రహించిన అప్పటి పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు అప్పటి పటమట ఇన్స్పెక్టర్ రవికాంత్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కేసు విచారణ సమయంలో పలుమార్లు పోలీసు కమిషనర్ స్వయంగా కోర్టుకు వెళ్లి పరిశీలించారు. ఎందరెంత మొత్తుకున్నా పోలీసులు తగు విధంగా దర్యాప్తు చేయలేదనడానికి కేసు కొట్టివేత, కోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. కోర్టు ఎత్తి చూపిన లోపాలు హతురాలిపై అత్యాచారం జరిగినట్టు శాస్త్రీయ పద్ధతిలో ఆధారాల సేకరణ, ప్రధాన నిందితుడు ఉపయోగించిన ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు చెపుతూ ఆ ఫోన్ సాంకేతికతను దృష్టిలో ఉంచుకోకపోవడం లోపాలుగా చెప్పొచ్చు. 15వ తేదీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మరుసటి రోజు మొదటి నిందితుని యజమాని ఇంట్లో భద్రపరిచిన మృతదేహాన్ని సమీపంలోని బందరు కాల్వలో పడేసినట్టు పేర్కొన్నారు. వీరా ప్రాంతంలో లేరంటూనే మృతదేహాన్ని కాల్వలో పడేశారనేందుకు ఆధారాలు చూపలేదు. ఘటనకు ముందు వీరు సమీపంలోని షామియానా షాపులో కుట్ర చేసినట్టు తెలిపారు. దీనిపై యజమానిని విచారించి ఆధారాలు చూపలేదు. అత్యాచారం చేసే సమయంలో నోటికి అడ్డుగా పెట్టిన ఖర్చీఫ్, గొంతుకు బిగించి చంపిన చీర, ఘటన తర్వాత గదిని శుభ్రం చేసినట్టు చెపుతున్న క్లాత్‌ను స్వాధీనం చేసుకొని కోర్టులో స్వాధీనం చేయలేదని తీర్పు సమయంలో న్యాయమూర్తి వెల్లడించారు. తొలుత నగలు పోయిన విషయం చెప్పలేదని, ఆ తర్వాత నిందితులు దొరికిన తర్వాత వాటిని ప్రస్తావించారని చెబుతున్నారు. కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మోదుమూడి సాయిరామ్ 19వ తేదీ వరకు పోలీసులు తమ ఇంటికి రాలేదని చెపుతుంటే 18న ఇంట్లోని ఆధారాల సేకరణ వీడియో సాక్ష్యంతో ఎలా సేకరించారనేది కోర్టు ప్రస్తావించింది. కేసులో కీలకమైన వాచ్‌మెన్‌ను, మరికొందరిని విచారణ నుంచి తప్పించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇలా పోలీసులు మోపిన అన్ని అభియోగాల్లో ఏ ఒక్కదానికి కూడా తగిన సాక్ష్యాలు చూపించలేకపోవడం పోలీసుల వైఫల్యానికి మచ్చుతునక. తొలి నుంచి ఇదే ధోరణి పోలీసుల ధోరణి తొలి నుంచి కూడా ఇలాగే ఉందంటూ సోదరుడు ఉదయ భాస్కర్‌తో పాటు ఇతర బంధువులు ఆరోపించారు. తీర్పు సమయంలో కోర్టు హాల్లోనే ఉన్న హతురాలి భర్త సాయిరామ్ మాట్లాడేందుకు నిరాకరించగా.. ఇతరులు మాట్లాడుతూ పై కోర్టులోనైనా న్యాయం కోసం పోరాడుతామని వారన్నారు. -
కామంతో కాటేసి.. దేహాన్ని రెండు ముక్కలు చేసి
ఆగ్రా: ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళపై స్థానిక గ్యాంగ్స్టర్లు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అత్యంత క్రూరంగా హత్య చేశారు. మహిళ దేహాన్ని రెండు ముక్కలుగా చీల్చేసి కాల్చిపడేశారు. ఈ ఘటన మాల్పురాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు అదే గ్రామ పెద్ద కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ దారుణ సంఘటన కూడా పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఘటనా స్థలం వద్ద మహిళ దుస్తులు, అసంపూర్ణంగా కాలిపోయిన ఆమె శరీర భాగాలు లభించాయి. కాగా, ఇప్పటికే ఆ గ్రామ పెద్ద, మరికొందరు కలిసి మృతురాలి భర్తను సంప్రదించి విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తమవంతు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కాగా మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గ్రామ పెద్దతో పాటు మరో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిర్భయ తరహాలో.. మరో దారుణం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు శవాల్లా చెట్టుకు వేలాడిన దృశ్యం ఇంకా కళ్ల ముందు చెదిరిపోక ముందే బదయూ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. 14 ఏళ్ళ బాలికపై అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొద్దున్నే బిస్కట్లు, స్వీట్లు తెచ్చుకుందామని బయటకు వచ్చిన అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అపహరించుకుపోయారు. బలవంతంగా ఏదో తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఎట్టకేలకు మూడు రోజుల నరకం తర్వాత బంధువుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ''ఎవరో పిలుస్తున్నారని పక్కింటబ్బాయి చెబితే వెళ్లా. అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు. అందరూ కలిసి బలవంతంగా ఏదో తాగించి, బంధించి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు'' అని బాధిత బాలిక పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో తెలిపింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. దీంతోపాటు మరో దిగ్భ్రాంతికర విషయాన్ని కూడా డాక్టర్లు వెల్లడించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ తరహాలో అగ్గిపెట్టె, ప్లాస్టిక్, గుడ్డముక్కలు, చిన్న చెక్కముక్కను బాలిక ప్రయివేట్ పార్ట్ పరీక్షలో కనుగొన్నామని తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
స్కూలు నుంచి వస్తుండగా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. స్కూలు నుంచి వస్తున్న 9వ తరగది విద్యార్థిని నలుగురు దుండగులు అడ్డగించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎతాహ్ జిల్లా అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తప్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సోమవారం బాధితురాలు స్కూల్లో ఫీజు కట్టి ఇంటికి సైకిల్‌పై బయల్దేరింది. దారి మధ్యలో నలుగురు గుర్తుతెలియని యువకులు ఆ బాలికను అడ్డగించి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి నుంచి బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లిపోయారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
రైల్వేస్టేషన్లో యువతి పై గ్యాంగ్‌రేప్
-
రైలు పట్టాల వద్ద గ్యాంగ్ రేప్
గుంటూరు : గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఓ యువతి (22) గత రెండు రోజులుగా రైల్వే స్టేషన్లో ఆశ్రయం పొందుతుంది. అయితే గత అర్థరాత్రి స్టేషన్ ప్లాట్‌ఫారంపై పడుకుని ఉన్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు రిక్షా కార్మికులు ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమెను రైలు పట్టాల పక్కకు లాక్కెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. దాంతో ఆమె స్పృహకోల్పోయింది. శరీరంపై గాయాలతో మూలుగుతున్న ఆమెను గురువారం ఉదయం స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా రిక్షా కార్మికులు ఏసుబాబు, మాణిక్యాలరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించడంతో బాధితురాలుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సామూహిక లైంగిక దాడి.. నిప్పు
నోయిడా: పదో తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం నిప్పు అంటించడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. నోయిడాలోని జవర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం లోకేంద్ర, ప్రదీప్, సోను, లోకేంద్ర భార్య అర్చనా అనే వ్యక్తులు ఈ కేసులో నిందితులు. ముందునుంచే వీరికి చెడు అలవాట్లుఉన్నాయని, గతంలో కొంతమంది అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు తీసేవారని, బాలికను కూడా ఏడు నెలలుగా అలాంటి పనికే బలవంతపెట్టారని, కానీ, ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పడంతో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. కాగా, బాధితురాలు బంధువు మాత్రం ఇప్పటికే వాళ్లు అమ్మాయికి తెలియకుండా ఓ ఎంఎంఎస్ తయారు చేసి రూ.ఐదువేల చొప్పున రెండు సార్లు వసూలు చేశారని తెలిపారు. చివరికి మళ్లీ అలాంటి వేధింపులకే పాల్పడ్డారని, ఈ విషయం ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా.. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో వారు పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. -
నన్‌పై గ్యాంగ్ రేప్ : ప్రధాన నిందితుడి అరెస్ట్
కోల్కత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా నన్‌పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మిలాన్ సర్కార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. సెల్దా రైల్వే స్టేషన్లో మిలాన్ శంకర్‌తో పాటు అతడి ముఖ్య అనుచరుడు అహిదుల్ ఇస్లాం అలియాస్ బాబును కూడా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మిలాన్, బాబు ఇద్దరు బంగ్లాదేశ్‌లోని జీస్సోర్ నుంచి వచ్చారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లా గంగ్నాపూర్ రాణాఘాట్ కాన్వెంట్లోకి ఈ ఏడాది మార్చి 13 తేదీ ఆర్థరాత్రి 12 మంది యువకులు చోరబడ్డారు. అనంతరం కాన్వెంట్‌లోని 72 ఏళ్ల నన్‌పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత లాకర్లోని రూ. 12 లక్షలు దోచుకుని పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానికంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేశారు. దీంతో మమతాబెనర్జీ స్పందించి... సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసులో సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇద్దరు మహిళలపై బందిపోట్లు గ్యాంగ్‌రేప్
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఆరుగురు బందిపోట్లు కుటుంబ సభ్యులను, ఇతర గ్రామస్తులను బంధించి ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున కరౌలి జిల్లా కరన్‌పూర్ ప్రాంతంలో ఈ దుశ్చర్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బందిపోటు దొంగలు మద్యం సేవించి గ్రామంలోకి ప్రవేశించి మగవాళ్లను బంధించారు. ఇద్దరు వివాహితులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గ్రామస్తుల్లో భయం కలిగించేందుకు ఓ దొంగ కాల్పులు జరిపాడు. బుల్లెట్లు గురితప్పి మరో దొంగకు తగలడంతో అతను చనిపోయాడు. గ్రామస్తులు ఎదురుదాడికి దిగి ఓ దొంగను బంధించారు. మిగిలినవారు పారిపోయారు. -
బాలికపై సామూహిక లైంగిక దాడి
రాయ్‌బరేలీ: పదిహేనేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జగత్ పూర్ అనే గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాలిక పొలం పనులకు వెళ్లగా దర్మేశ్ కుమార్, ప్రమోద్ కుమార్, అరవింద్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు బుధవారం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారు ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లగా అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న తమ కూతురును తల్లిదండ్రులు గుర్తించి తమకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
యువతిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్
-
యువతిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్
వరంగల్: వరంగల్ జిల్లా చేర్యాలలో శనివారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో బాధితురాలు ఆమె తల్లిదండ్రులు చేర్యాల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... బాధితురాలి ఇంటి సమీపంలో ఓ యువకుడు... ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడేవాడు. ఆ క్రమంలో శనివారం రాత్రి నీతో మాట్లాడాలి అని చెప్పి ఆమెను బయటకు తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన ఐదుగురు యువకులతో పాటు సదరు యువకుడు కూడా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి పరారైయ్యారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతోపాటు ఆదివారం ఉదయం పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
మహిళపై సామూహిక లైంగిక దాడి
థానే: బంధువుల ఇంటికి వెళుతున్న ఓ మహిళను అడ్డుకుని ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కాసర అనే గ్రామానికి చెందిన 21 ఏళ్ల మహిళ వాడిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలు దేరింది. దేవుల్ అనే రైల్వే స్టేషన్‌కు వెళ్లే క్రమంలో రైలు పట్టాల వెంట ఆమె నడుస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డుకున్నారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. వారి నుంచి బాధితురాలు తప్పించుకొని సాయంత్రం వేళకు ఇంటికి చేరుకోగలిగింది. అనంతరం జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో పోలీసులు రమేశ్ శాబ్లే (22) అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. సచిన్ వాసవే అనే వ్యక్తికోసం మాత్రం తీవ్రంగా గాలింపులు జరిపి పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. గత వారం రోజులుగా మహారాష్ట్రలో వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయి. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
నర్మెట్ట: వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం దొమ్మాకూర్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయగా... బుధవారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొమ్మాకూర్ గ్రామానికి చెందిన మాలోతు శ్రీకాంత్, మాలోతు రూప్లా, భూక్యా బాలు ఈ నెల 16న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డారు. గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పరిష్కారం కోసం జరిపిన చర్చలు విఫలం కావడంతో బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, భూక్యా బాలును అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
'నన్ రేప్' కేసులో ఎనిమిదిమంది అరెస్టు
రణఘాట్(పశ్చిమబెంగాల్): కోల్ కత్తాలో 72 ఏళ్ల సన్యాసిని(నన్)పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ పుటేజ్‌ను సొంతం చేసుకున్న సీఐడీ పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. ఆ దిశగా గాలింపు చర్యలు ప్రారంభించగా ఎనిమదిమంది పట్టుబడ్డారు. మరికొందరని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈలోపు నిందితులను అరెస్టు చేసేందుకు అవసరమైన వివరాలు చెప్పినవారికి రూ.లక్ష అందిస్తామని అంతకుముందు పోలీసులు ప్రకటించారు. కోల్‌కత్తాలోని నాడియా జిల్లా లోని గంగ్నాపూర్ లో 72 సం.రాల నన్ పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అర్థరాత్రి తరువాత ఓ స్కూల్లోకి చొరబడ్డ సుమారు పన్నెండుమంది దొంగల్లో నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. -
నన్ పై గ్యాంగ్ రేప్
కోల్ కత్తా: కోల్ కత్తాలోని నాడియా జిల్లా లోని గంగ్నాపూర్ లో 72 సం.రాల నన్ పై సామూహిక అత్యాచారం కలకలం సృష్టించింది. పోలీసుల సమాచారం ప్రకారం గత అర్థరాత్రి తరువాత స్కూల్ లోకి చొరబడ్డ సుమారు పన్నెండుమంది దొంగలు నన్ పై సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది ఆమెను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈవార్త దావానలంలో వ్యాపించడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానికంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ పీడీ సలీం, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనగా ఆయన అభివర్ణించారు. పూర్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉందని నేరస్తులను తక్షణమే అదుపులోకి తీసుకుని తగినవిధంగా శిక్షిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఫిరాద్ హామీ ఇచ్చారు. -
గ్యాంగ్‌రేప్: నిందితుల్లో డీఆర్డీఏ పీడీ
లక్నో: డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తోపాటు మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ప్రాంతంలోని షామిలిలో ప్రభుత్వ కార్యాలయంలో రెండు నెలల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది. దాంతో బాధితురాలు రాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించింది. నిందితులను అరెస్ట్ చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని బాధితురాలు కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్ నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం నిందితులు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్ఞాన్ ప్రకాశ్,అసిస్టెంట్ ఇంజినీర్ దినేష్ కుమార్,గుమస్తాలు రాజ్‌కుమార్,ఆనంద్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎడిషన్ ఎస్పీ వి.కె.మిశ్రా వెల్లడించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిశ్రా వివరించారు. -
మహిళపై లైంగిక, యాసిడ్ దాడి
హైదరాబాద్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. గజ్వేల్ మండల పరిధిలో దుండగులు రెండో రోజుల క్రితం ఓ యువతిని కిడ్నాప్ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, యాసిడ్ దాడి చేశారు. దుండగులు బాధితురాలిని ఆమె ఇంటి వద్ద పడేసి పరారయ్యారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ట్యూషన్‌కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్
ఢిల్లీ శివార్లలో మరో ఘోరం జరిగింది. ఘజియాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. పదోతరగతి చదువుతున్న ఆ బాలిక.. ప్రైవేటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా స్కార్పియో వాహనంలో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను ఆమె ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ట్యూషన్‌కు వెళ్తుంది. బాధితురాలు నిందితులను గుర్తించిందని పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విశాఖలో బాలికపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్: విశాఖపట్నం నగరంలో దారుణం జరిగింది. దుండగులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అప్పూనగర్ నుంచి సాగర్‌నగర్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కాగా ఆటోడ్రైవర్ దారి మళ్లించి ఆమెను వేరే చోటుకు తీసుకెళ్లాడు. ఆటో డ్రైవర్, అతని స్నేహితులు కలసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమెను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. -
బాలికపై నలుగురు బాలుర సామూహిక అత్యాచారం!
బళ్లారి(కర్ణాటక): హాస్టేటలోని ఓ బహిరంగ ప్రదేశంలో ఓ బాలికపై నలుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బళ్లారి ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్ కథనం ప్రకారం హాస్టేట ఎన్సీ కాలనీకి చెందిన 9 ఏళ్ల విద్యార్థినికి శనివారం అదే కాలనీకి చెందిన నలుగురు బాలురు చాక్లెట్లు ఇస్తామని ఆశ చూపించి సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. నలుగురూ ఆ బాలికపై సామూహికంగా అత్యాచారం చేశారు. నిందితులు నలుగురూ పది నుంచి 13 సంవత్సరాల వారే. వివిధ పాఠశాలలలో చదువుతున్న వారు బాధితురాలికి ఇరుగుపొరుగున ఉండేవారే. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ** -
భర్తను బంధించి భార్యపై సామూహిక అత్యాచారం
బదాన్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. నలుగురు దుండగులు భర్తను బంధించి అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బదాన్ జిల్లా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శనివారం భార్యాభర్తలిద్దరూ ఆస్పత్రికి వెళ్లి.. ఆ రోజు రాత్రి వారి గ్రామానికి తిరిగి వెళ్తుండగా మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు అడ్డగించారు. భార్యాభర్తలను అడవిలోకి బలవంతంగా లాక్కెళ్లారు. భర్తను బంధించి యువతిపై దారుణానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బాలికపై ఏడుగురు యువకుల సామూహిక అత్యాచారం!
రాయ్‌పూర్: ఏడుగురు యువకులు ఓ గిరిజన బాలికపై 9 రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం జష్పూర్ శివారులో ఈ దారుణం జరిగింది. నిందితులలో ఆరుగురిని వేరువేరు ప్రదేశాలలో ఈరోజు అరెస్ట్ చేసినట్లు జష్పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీఎస్ దుబే చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం తప్కరా ప్రాంతానికి చెందిన ఆ బాలిక ఈ నెల 18వ తేదీన తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్లే సమయంలో నలుగురు యువకులు రెండు మోటార్ సైకిళ్లపై వచ్చారు. లిప్ట్ ఇస్తామని చెబితే, ఆ బాలిక రానని తిరస్కరించింది. కానీ వాళ్లు ఆ బాలికను బలవంతంగా ఓ టూరిస్ట్ ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత మరో ముగ్గురు స్నేహితులు కూడా వచ్చి అత్యాచారం చేశారు. అలా వారు ఆ బాలికను 9 రోజుల పాటు వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లి సామూహికంగా ఈ అఘాయిత్యానికి పాల్పడారు. చివరకు ఈ నెల 28న ఆ బాలికను ఓ స్టేడియం వద్ద వదిలి వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు, నిందితులకు సంబంధించి చెప్పిన వివరాల మేరకు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ జష్పూర్కు చెందినవారేనని పోలీసులు తెలిపారు. ** -
డబ్బు అడగబోయినందుకు.. మహిళపై గ్యాంగ్‌రేప్
డబ్బు అడగబోయినందకు 30ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని ద్వారకాలో ఓ గెస్ట్ హౌస్‌లో గతరాత్రి చోటుచేసుకుంది. డబ్బు విషయమై గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన ఆమెను నలుగురు బలవంతంగా గ్యాంగ్‌రేప్ చేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారైయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వికాస్, అనిల్, రమేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
12ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్
12ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో బానియాతర్ పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. భేత్రి రైల్వే క్రాసింగ్ వద్ద మంచినీరు తెచ్చుకునేందుకు బాలిక వెళ్లగా గమనించిన ముగ్గురు యవకులు ఆమెను బలవంతంగా గ్యాంగ్ రేప్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన ఆ యువకులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అత్యాచారానికి గురైన ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
భర్త కళ్ల ఎదుటే భార్యపై గ్యాంగ్‌రేప్
భర్త కళ్ల ఎదుటే 25 ఏళ్ల మహిళపై దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆగ్నేయ బెంగళూరులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో పోలీసులమని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు భర్తను కత్తితో బెదిరించగా, మరో ఇద్దరు అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు భర్తను కత్తితో బెదిరించి ఇంట్లోని బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం భర్త, అత్తను ఓ మంచానికి కట్టిపడేశారు. మరో ఇద్దరు భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన గతనెల 24న ఆగ్నేయ బెంగళూరులో జరిగింది. కానీ ఈ ఘటనపై బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రాలేదు. ఘటన జరిగి నాలుగు రోజుల తర్వాత బాధితులు నిందితులపై ఫిర్యాదు చేశారు. దాంతో నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. నలుగురు నిందితులను గత నెల 31న అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వారిపై 376డి సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. అరెస్టైన నిందితులు కూడా అదే ప్రాంతానికి చెందినవారు. కాగా, ఇప్పటికే వారిపై పలు చోరీ కేసులు నమోదయ్యాయి. -
బాలికపై సామూహిక అత్యాచారం చేయించిన అత్త
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ఆమె అత్త మూడు నెలల పాటు ముగ్గురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. దాంతో ఆమె అత్తతో పాటు.. ముగ్గురు వ్యక్తులపై ఐపీసీ, పోస్కో చట్టాల కింద మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అందుదేవి అనే సదరు మహిళ.. ఆ బాలికను తనకు తెలిసున్న ముగ్గురు వ్యక్తుల వద్దకు తరచు తీసుకెళ్లేదని, ఇలా మూడు నెలల పాటు ఆమెపై అత్యాచారాలు చేయించిందని మహిళా పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ అనితా రాణి తెలిపారు. నిందితులను రమేష్, నరసింహరాం, రత్నారాంగా గుర్తించారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
ప్రియురాలిపై ప్రియుడు, మరో ఇద్దరు గ్యాంగ్ రేప్
మీరట్: ఓ యువతిపై ఆమె ప్రియుడు, మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... భవాన్పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో శాస్త్రి నగర్ కు చెందిన నగీన్ గుప్తా పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి ఆమెను ప్రేమలోకి దించాడు. ఈ విషయం తెలియడంతో అతడిని ఆమె నిలదీసింది. ఈనెల 18న రెస్టారెంట్ కు రావాలని ఆమెకు నగీన్ ఫోన్ చేశాడు. అక్కడ అతడి సోదరుడు ఆశు, స్నేహితుడు నిక్కీ ఉన్నారు. ఆమెను మాటల్లోకి దించి పల్లవపురం ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకున్నారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వీడియో తీశారు. తమ గురించి ఎవరికైనా చెబితే వీడియో ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థిని, వివాహితలపై సామూహిక అత్యాచారం
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో మరో రెండు దారుణ సంఘటనలు వెలుగు చూశాయి. వేర్వేరు సంఘటనల్లో ఓ దళిత విద్యార్థిని, మరో వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ముజఫర్నర్ జిల్లా షామ్లీ ప్రాంతంలో నివసిస్తున్న 26 ఏళ్ల వివాహితపై గత ఫిబ్రవరిలో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి, ఈ విషయం బయటకు చెప్పవద్దని ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. చివరకు ఆమె భర్తకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను సలీమ్, అబిద్, భూరాగా గుర్తించారు. పోలీసులు సలీంను అరెస్ట్ చేశారు. మిగిలివారి కోసం గాలిస్తున్నారు. బాదౌన్‌లో 16 ఏళ్ల దళిత విద్యార్థినిపై ముగ్గురు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెకు వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. బాధితురాలు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఇంటిపక్కన నివసిస్తున్న వ్యక్తి, అతని ఇద్దరు స్నేహితులను నిందితులుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు సంతోష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. -
విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం
వారణాసి: ఆరుగురు వ్యక్తులు ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని చాందౌలి జిల్లా ఇల్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. ఎస్పి మునిరాజ్ కథనం ప్రకారం ప్లస్ టు చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని స్కూల్ కు వెళుతుండగా ఆరుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఆ తరువాత నిందితులు ఆ విద్యార్థినిని అలహాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ ఆ బాలికను నిర్బంధంలో ఉంచి ఆరుగురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ విధంగా వారు ఆరు రోజులపాటు అలా చేశారు. ఆ తరువాత ఆ బాలికను వారు వారణాసి తీసుకువచ్చి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టినట్లు ఎస్పి చెప్పారు. నిందితులలో ఒకడు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లారు. బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ** -
యూపీలో గ్యాంగ్‌రేప్, దోపిడీ
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఖార్కాదా పట్టణంలో మంగళవారం ముగ్గురు దుండగులు 35 ఏళ్ల మహిళను తుపాకితో బెదిరించి, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ముగ్గురు పిల్లలున్న బాధితురాలు బ్యాంకుకు వెళ్తుండగా దుండగులు ఆమెను బెదిరించి, దగ్గర్లోని అడవికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు, మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. మరోవైపు ఢిల్లీలో పనిచేస్తున్న 33 ఏళ్ల నర్సు పై నలుగురు వ్యక్తులు పంజాబ్‌లోని మా న్సా జిల్లాలో సోమవారం అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని నిర్బంధించి, ఆమె వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నారు. -
మహిళపై సామూహిక అత్యాచారం, దోపిడీ
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు దుండగులు ఓ మహిళను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. మీరట్ సమీపంలోని ఖార్ఖాడ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లియిన 35 ఏళ్ల యువతి బ్యాంక్‌కు వెళ్లి తిరిగివస్తుండగా దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. బాధితురాలిని సమీపంలోని అడవికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఆమె దగ్గరున్న డబ్బు, మొబైల్ ఫోన్, బంగారు నగలు దోచుకుని పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
కదిలేకారులో యువతిపై సామూహిక అత్యాచారం
ప్రతాప్‌గఢ్: నలుగురు దుండగులు కదిలేకారులో ఓ 18 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. బాధితురాలిని అలహాబాద్‌కు చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలు రాణిగంజ్‌కు వెళ్లేందుకు నిందితుల్లో ఒకరిని సాయం కోరగా, అతను మరో ముగ్గురిని వెంటతీసుకెళ్లాడు. దారి మధ్యలో నలుగురూ ఆమెపై దారుణానికి పాల్పడి రోడ్డుపైకి తోసేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నలుగుర్ని అరెస్ట్ చేశారు. -
పగలు ఆటోడ్రైవింగ్ రాత్రిళ్లు అఘాయిత్యాలు
* గ్యాంగ్‌రేప్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు * వెలుగు చూస్తున్న అరాచకాలు సాక్షి, హైదరాబాద్: మృగాళ్ల ఆగడాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఒంటరి మహిళలను నమ్మిం చి ఆటోల్లో తీసుకువెళ్లి అఘాయిత్యాలకు పాల్ప డుతుంటారు. పగలంతా ఆటోలు నడపడం, రాత్రిళ్లు అసాంఘికచర్యలకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్ల అకృత్యా లు బయటపడుతున్నాయి. భర్త, మరిదితో కలిసి కూలీ కోసం ఆటోలో వెళ్తున్న మహిళపై హైదరాబాద్ శివారులోని నారపల్లి సమీపంలో ఐదుగురు ఆటోడ్రైవర్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిని మేడిపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు రవి (22)ని గురువారం అరెస్టు చేశారు. రెండు రోజులుగా పరారీలో ఉన్న రవిని విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఆటోఅడ్డా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు రెక్కీ..: నారపల్లికి చెందిన ఇమ్ము అలియాస్ అక్రమ్ (22), అబ్బాస్ (24), జుబేర్(22), ఘట్కేసర్కు చెందిన షెహనాజ్ (20), ఫిర్జాదిగూడకు చెందిన సి.రవి(22) ఆటోడ్రైవర్లే. ఉప్పల్ నుంచి ఘట్కేసర్, ఎల్బీ నగర్‌లకు షేరింగ్ ఆటోలు నడిపిస్తుంటారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వీరంతా ఉప్పల్‌లో కలుసుకుంటారు. విందులతో జల్సా చేస్తారు. రాత్రి 11 గంటలకు ఉప్పల్ బస్టాండ్‌కు వచ్చి ఒంటరి మహిళను టార్గెట్ చేస్తుంటారు. షెహ నాజ్ గుర్తించి మిగతా డ్రైవర్లకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని ఆ మహిళను నమ్మించి ఆటోలోకి ఎక్కిస్తారు. ఆ తరువాత వీరు మేడిపల్లి దాటిన తరువాత అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌లకు పాల్పడుతుంటారు. తాజా ఘటనలో గిరిజన మహిళ తన భర్త, మరిదితో కలిసి ఘట్కేసర్ వెళ్లే షేరింగ్ ఆటో ఎక్కింది. అప్పటి వరకు ఈ ముగ్గుర్ని గమనిస్తున్న నిందితులు ఆ మహిళ ఎక్కిన ఆటోను తమ ఆటోలో అనుసరించారు. బాధితులున్న ఆటోను ఓవర్టేక్ చేస్తూ వెకిలిచేష్టలతో నిందితులు ఇబ్బంది పెట్టారు. నారపల్లి ప్రాంతంలో మహిళను, ఆమె భర్త, మరిదిని నడిరోడ్డు మీద దించి ఆటోవాలా వెళ్లిపోయాడు. నిందితులు ఆ మహిళను బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేక్‌గ్యాంగ్‌ను ఉరి తీయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో 11 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌ను నిర్భయ కేసు మాదిరిగా నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్, అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి, కార్పొరేటర్లు దిడ్డిరాంబాబు, జి.శంకర్‌యాదవ్‌లతో కలసి మాట్లాడారు. నగరంలో విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలకు , కబ్జాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌కు మజ్లిస్ పార్టీ అండ ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలతో స్పష్టమవుతుందన్నారు. నగరంలో ఎక్కడ జంటలు కనిపించినా వారిని వెంబడించి వారి జీవితాలను విషనాగుల్లా కాటేస్తున్న వీరు సమాజంలో జీవించే హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. ఏ పార్టీ అడ్డు వచ్చినా, ఎవరు ఒత్తిడి తెచ్చినా భయపడకుండా స్నేక్‌గ్యాంగ్‌కు ఉరిశిక్షను అమలు చేయాలని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దౌర్జన్యాలు, అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టాల వల్లే రైతుల ఆత్మహత్యలు నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల ముందు 8 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, ఇంటింటికీ ఉద్యోగమిస్తామని వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అధికారం చేపట్టిన తర్వాత చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అప్పులు తెచ్చి విత్తనాలు వేసిన రైతులు వర్షాభావ పరిస్థితులతో నష్టాల పాలై ఆందోళన తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కనీసం ఆత్మహత్యలకు పాల్పడిన బాధితుల కుటుంబాలను పరామర్శించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలను పరిష్కరించడంలో లేదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, పింఛన్లు, రైతుల రుణమాఫీ తదితర అన్ని పథకాలు వుూలన పడ్డాయుని ధ్వజమెత్తారు. నగరంలోని 30 ప్రాథమిక వైద్యశాలలతో పాటు అనేక ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, బీసీ హాస్టళ్లలో విద్యుత్ బిల్లులు కట్టలేదన్న కారణంగా విద్యుత్ సరఫరాను కట్ చేశారన్నారు. హాస్టళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే విద్యార్థులు చదువులెలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
దళిత మహిళపై పది మంది గ్యాంగ్ రేప్
బారేలీ: దళిత మహిళపై పది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బారేలోని కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొలం నుంచి ఇంటికి తిరిగొస్తున్న 40 ఏళ్ల దళిత మహిళను ఎత్తుకెళ్లి పది మంది సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆమె భర్త, కొడుకు కట్టేసి వారీ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి బంధువులపై దుండగులు దాడి చేశారు. పది మంది నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
70 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో 70 ఏళ్ల వృద్దురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... గత అర్థరాత్రి వికారాబాద్‌లో రాజీవ్ గృహకల్ప సముదాయంలో వృద్దురాలిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు పరారు అయ్యారు. బాధితురాలు స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు... తమదైన శైలిలో నిందితుడ్ని విచారిస్తున్నారు. మిగిత నిందితులను కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. -
ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పలేక....
ముజాహిద్ పూర్: ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పలేక, భార్యా కొడుకును చంపేందుకు యత్నించాడో భర్త. ఈ ఘటనలో కొడుకు చనిపోగా, భార్య చావు తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ హత్యకేసులో అసలు నిజాలు వెలుగు చూశాయి. గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపినట్టుగా భావిస్తున్న మహిళ, ఆమె కొడుకును .. నిజానికి భర్త, మరిది హతమార్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం ఎల్కగూడెంకు చెందిన కిశోర్, షాద్‌నగర్‌కు చెందిన సుజాతలు పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుని, హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు. తమ పెళ్లి, బాబు విషయాన్ని ఇంట్లో చెప్పమని సుజాత తరచూ కిశోర్‌తో గొడవపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో అత్తారింటికి తీసుకెళతానని భార్య, కొడుకును కిశోర్, అతడి తమ్ముడు ఆనంద్ బైకుపై తీసుకెళ్లారు. ముజాహిద్పూర్ అటవీప్రాంతంలో ఆమె గొంతు నులిమేశారు. తల్లిని కొడుతుండగా అడ్డొచ్చిన బాబును దారుణంగా హతమార్చారు. అయితే, సుజాత స్పృహ తప్పిపడిపోగా, ఆమె చనిపోయిందనుకుని అక్కడ్నించి వెళ్లిపోయారు. కానీ, ఆమె కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతు ఉండటాన్ని గమనించిన స్థానికులు, ఆసుపత్రికి తరలించగా, ఆమె కోలుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపగా .. వారు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
'ఆ ఘాతుకానికి పాల్పడింది భర్తే'
-
'ఆ ఘాతుకానికి పాల్పడింది భర్తే'
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్లో మూడేళ్ల బాలుడిని చంపి...తల్లిపై అత్యాచారయత్నం కేసులో కొత్త నిజాలు వెలుగు చేస్తున్నాయి. కట్టుకున్న భర్తే ... కొడుకుతో పాటు తనను హతమార్చేందుకు యత్నించినట్లు బాధితురాలు సుజాత వెల్లడించింది. బాధితురాలి వివరణతో పోలీసులు షాక్ తిన్నారు. భర్త శివకుమార్ ముందుగా తనపై హత్యాయత్నం చేసి, అనంతరం కొడుకును చంపి అక్కడ నుంచి పరారయ్యాడని ఆమె తెలిపింది. సుజాత చనిపోయిందనుకుని ఘటనా స్థలం నుంచి భర్త వెళ్లిపోయాడు. అయితే కొన ఊపిరితో ఉన్న సుజాతను స్థానికులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం ముజాహిద్ పూర్ శివారులో మహబూబ్ నగర్ జిల్ఆ కొందుర్గు మండలం వెల్కిచర్లకు వెళ్లే రోడ్డులోని అటవీ ప్రాంతంలో నిన్న ఓ మహిళ అపస్మారక స్థితిలో పడిఉంది. ఈ విషయాన్ని గమనించిన ఓ పశువుల కాపరి స్థానికులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు తెలపటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సుజాత కోలుకోవటంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. బాధితురాలి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్. నిందితుడు శివకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కొడుకుని చంపి.. తల్లిపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దుండగులు అభంశుభం తెలియని మూడేళ్ల కుమారుడిని హత్య చేసి తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. అత్యాచార సంఘటన ఆదివారం రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే అది అటవీ ప్రాంతం కావడంతో్ ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బాధితురాలికి వెంటనే చికిత్స అందించలేకపోయారు. ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి వివరాలు పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకుని చంపి.. తల్లిపై సామూహిక అత్యాచారం
-
అత్యాచారం చేసి.. ఆటోలో నుంచి తోసేసి..
పశ్చిమబెంగాల్లో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను ఆటో లోంచి కిందకు తోసేశారు. కోల్‌కతా శివారు ప్రాంతం ఆక్రాలో ఓ వివాహిత భర్త నుంచి విడిపోయి తల్లి దగ్గర ఉంటుంది. ఆమెకు షఫిక్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధముంది. షఫిక్ ఆమెకు ఫోన్ చేసి పిలిపించుకుని నెంబర్ ప్లేట్ లేని ఆటోలో తీసుకెళ్లాడు. అతని వెంట మరో నలుగురు ఉన్నారు. ఆమెకు మద్యం ఇచ్చి మత్తులోకి వెళ్లిన తర్వాత ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆటోలో నుంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం కోల్‌కతా లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
తుపాకితో బెదిరించి.. బాలికపై సామూహిక అత్యాచారం
దేశరాజధానిలో అత్యాచారాల పర్వం ఆగడం లేదు. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ఆమెకు తెలిసున్న ఐదుగురు కలిసి తుపాకి చూపించి బెదిరించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఈ బాలిక వారం రోజుల క్రితం స్కూలుకు వెళ్తుండగా, దారిలో అటకాయించిన నిందితులు పశ్చిమ ఢిల్లీలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. నిందితులు ఐదుగురిలో ముగ్గురు మైనర్లు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనను తుపాకితో బెదిరించినట్లు బాలిక తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. అత్యాచారం సంఘటనను నిందితులు సెల్ఫోన్లో రికార్డు చేశారని కూడా బాధితురాలు చెప్పింది. అయితే, పోలీసులకు మాత్రం నిందితుల వద్ద తుపాకి ఏమీ దొరకలేదు. తనకు ఒంట్లో బాగోలేదని బాలిక వారం రోజుల తర్వాత చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పుడు తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని, 20 ఏళ్ల నిందితుడిని వాళ్ల ఇంట్లోనే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. -
యువతిపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు ఆగడంలేదు. ముజఫర్‌నగర్ జిల్లాలోని కెతోరా గ్రామంలో ఓ యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి ఏదో పనిమీద ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు సలీం ఖురేషీ, జహీరత్ అనే ఇద్దరు యువకులు ఆమెను ఎత్తుకెళ్లి, ఓ ఇంట్లో ఆమెపై అత్యాచారం చేశారన్నారు. నిందితులిద్దరూ పరారీలో ఉండటంతో వారికోసం గాలిస్తున్నారు. మరో సంఘటనలో మజ్లిస్పూర్ తోఫిర్ గ్రామంలో మరో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. నీతు అనే నిందితుడు ఆమెను ఎత్తుకెళ్ల చెరుకుతోటల్లో అత్యాచారం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్ రేప్
ఐజాల్: అత్యాచారాల సంసృతి ఈశాన్య రాష్ట్రాలకు పాకుతోంది. మిజోరంలో వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఎదుటే వారీ ఘాతుకానికి పాల్పడ్డారు. రొపాయబవాక్ ప్రాంతంలో ఆదివారం ఈ దారుణోదంతం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్తను చెట్టుకు కట్టేసి, అతడి ఎదుటే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. చావల్హ్మున్ ప్రాంతానికి చెందిన జార్జొలియనా(19), పీసీ లాల్హూట్లుయాంగ(20) ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మహిళపై లాయర్, కానిస్టేబుల్ అత్యాచారం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహీలో ఓ మహిళపై న్యాయవాది, కానిస్టేబుల్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య. న్యాయవాది జై ప్రకాష్ యాదవ్, కానిస్టేబుల్ రామ్ ఆశిష్ సింగ్ లు ఈ ఘటనకు పాల్పడినట్లు ఏఎస్పీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై జ్ఞాన్ పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది జై ప్రకాష్ యాదవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు. -
కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
దేశ రాజధాని నగరంలో మరోసారి దారుణం జరిగింది. ఓ యువతిని నలుగురు వ్యక్తులు మాల్ బయట నుంచి అపహరించి, ఆమెను కారులో తీసుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేసి.. తర్వాత రోడ్డుమీద విసిరేసి పోయారు. ఈ దారుణం ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లో జరిగింది. మాల్లో పనిచేస్తున్న ఆ యువతి (22) తనపై అత్యాచారం చేసిన నలుగురి పేర్లను పోలీసులకు తెలిపింది. వారిలో ఒకరు ఆమె బోయ్‌ఫ్రెండు కావడం గమనార్హం. నిందితులతో ఒకరు మైనర్ అని పోలీసులు చెప్పారు. సామూహిక అత్యాచారం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆమెను నోయిడాలోని ఓ ఆస్పత్రి సమీపంలో రోడ్డుమీద విసిరేసి పోయారు. ఈ నలుగురిపైన ఆమె గతంలో కూడా తమకు ఫిర్యాదు చేసిందని, కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి అతుల్ యాదవ్ తెలిపారు. అప్పుడే తనకు రక్షణ కావాలని కోరినా ఆమెను పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి స్నేహితులు ఆరోపించారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు ఫుల్స్టాప్ పడటంలేదు. తాజాగా అక్కడి షామ్లి జిల్లా రసూల్పూర్ గ్రామంలో ఇద్దరు యువకులు 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఆమె మార్కెట్‌కు వెళ్తుండగా, నిందితులు కర్బన్, వసీమ్ ఆమెను బలవంతంగా పట్టుకుని లాక్కెళ్లి, సమీపంలో ఉన్న పొలాల్లో ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. వారిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు మొదలైందని పోలీసులు చెప్పారు. -
మార్నింగ్ వాక్కు వెళ్తే.. సామూహిక అత్యాచారం
చెల్లెలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లిన యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. మలియానా గ్రామానికి చెందిన యువతి (26) మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు కొంతమంది యువకులు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో వెంటనే ఆమె చెల్లి ఇంటివైపు పరిగెత్తి, ఎవరినైనా సాయం పిలవాలని ప్రయత్నించింది. కానీ, వాళ్లు తిరిగి వచ్చేసరికి అక్కడకు కొంచెం దూరంలో ఉన్న పొలాల్లో ఆమె స్పృహ కోల్పోయి కనిపించింది. యశ్పాల్, రాజ్‌పాల్, రాజేంద్ర అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఇద్దరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిందితులు ఐదుగురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అడవుల్లోకి లాక్కెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్
దెవాస్: వివాహితను అడవుల్లోకి లాక్కుపోయి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లోని బారిజాషిలో చోటుచేసుకుంది. బాగ్లీ-పంజాపూర్ రహదారిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు 25 ఏళ్ల వివాహితను అపహరించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వెల్లడించారు. తనపై జరిగిన దారుణాన్ని వెల్లడించేందుకు బాధితురాలు అడవి నుంచి రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించగా ఆమె తేనెటీగలు దాడి చేయడం విషాదమని పోలీసులు తెలిపారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. -
గిరిజన మహిళపై భర్త సహా పదిమంది అత్యాచారం
ఖండ్వా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన జరిగింది. ఓ గిరిజన మహిళపై భర్తతో పాటు పది మంది అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖండ్వా జిల్లా పిప్లాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిలాయ్ ఖేడా గ్రామంలో ఆస్తి తగదాల వల్ల ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. భర్త ప్రోద్బలంతో బంధువులు, ఇతర గ్రామస్తులు పదిమంది కలసి కత్తులతో ఆయన భార్యపై దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి మూత్రం మూత్రం తాగాలని బెదిరించారు. బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులందరినీ అరెస్ట్ చేశారు. బంధువలు ఆమెను చికిత్స నిమిత్తం ఖండ్వా జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
రేపుల రాజ్యం యూపీ!
ఉత్తరప్రదేశ్ రేపుల రాజ్యంగా మారుతోంది. మరో రెండు ఘోరమైన అత్యాచారాలు వెలుగు చూశాయి. రెండు కేసుల్లోనూ రక్షకులే భక్షకులయ్యారు. తొలి సంఘటన మైనర్ బాలికల రేపు, హత్యల ఘటనతో మే 28 నుంచి అట్టుడుకుతున్న బదాయూలోనే జరిగింది. ఒక మైనర్ బాలికను దుండగులు అపహరించి, నెలరోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెది ఇస్లామ్ పూర్. తనను మొదట ఎమ్మెల్యే డ్రైవర్, ఆ తరువాత బబ్రాల్ ఎమ్మెల్యే, సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ ఖిలాడీ యాదవ్ లు అత్యాచారం చేశారని ఆ బాలిక ఆరోపిస్తోంది. నెల రోజులుగా అమ్మాయి కనిపించకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఫలితంగా అమ్మాయిని దుండగులు విడిచిపెట్టారు. ఇక రెండో సంఘటనలో, పోలీస్ నిర్బంధంలో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్లిన ఒక మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా, పలువురు కానిస్టేబుళ్లు బలాత్కరించారు. ఈ సంఘటన హమీర్ పూర్ జిల్లా లోని సుమేర్ పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఎస్ హెచ్ ఓ అరెస్టయ్యారు. కానిస్టేబుళ్లు కాలికి బుద్ధి చెప్పారు. యూపీలో ప్రతి రోజూ కనీసం పది రేపు కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మీద యువ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కి రేపులు పెద్ద తలనొప్పిగా మారాయి. -
యూపీలో మరో సామూహిక అత్యాచారం!
ఉత్తరప్రదేశ్‌లో మరో సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. సంబల్ జిల్లాలోని అసములి ప్రాంత నివాసిస్తున్న ఓ యువతి (35) తనపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. అత్యాచార నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సాంబల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆ ఘటనపై విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్పీ అదేశాలు జారీ చేశారని స్థానిక పోలీసు అధికారి జగ్వీర్ సింగ్ శనివారం వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వైద్య నివేదిక అందిన వెంటనే దర్యాప్తు మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు. జూన్ 5వ తేదీ బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు యువకులు ప్రవేశించి... ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించిందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
గ్యాంగ్ రేప్ చేసి.. యాసిడ్ తాగించి.. ఉరేశారు!!
ఉత్తరప్రదేశ్‌లో మహిళల మానప్రాణాలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతోంది. అక్కడి మనుషులు మరీ రాక్షసుల కంటే కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటిగా అక్కడ దారుణాలు రోజురోజుకూ బయటపడుతున్నాయి. తాజాగా 22 ఏళ్ల యువతిపై కొంతమంది ముష్కరులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించి, చివరకు ఉరేసి చంపేశారు!! బరేలీకి సమీపంలోని బహేరి ప్రాంతంలోని ఐత్పురా గ్రామంలో గల పొలాల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ముఖం మీద కూడా వాళ్లు యాసిడ్ పోయశారని, పోస్టుమార్టం నివేదిక ప్రకారం ముందుగా ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత ఉరేసి చంపినట్లు తెలిసిందని పోలీసు అధికారులు చెప్పారు. బాధితురాలి కడుపులో యాసిడ్ కూడా ఉండటంతో, వాళ్లు బలవంతంగా ఆమెతో యాసిడ్ తాగించి, తర్వాత చంపేసినట్లు తెలిసిందన్నారు. ఆమె ముఖం మీద యాసిడ్ పోసి, తర్వాత ఆమె ఎవరన్న విషయాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు. బాధితురాలు బహుశా ఉత్తరాఖండ్‌కు చెందినవారు కావచ్చని, అందువల్ల ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ అక్కడకు ఓ బృందాన్ని పంపామని సీనియర్ పోలీసు అధికారి రవీంద్ర గౌర్ తెలిపారు. ఇది బహుశా పరువు హత్య గానీ, లేదా అమ్మాయిలతో వ్యాపారానికి సంబంధించిన కేసు గానీ కావచ్చని డిప్యూటీ ఎస్పీ బహేరి కలు సింగ్ అన్నారు. -
15 ఏళ్ల బాలికపై 38 మంది సామూహిక రేప్
డ్రగ్స్ ముఠాకు చెందిన పాడుపడ్డ గుడిసె... ఒంటరిగా15 ఏళ్ల అమ్మాయి... అంతే ....ముష్కరులు రెచ్చిపోయారు. ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఏకంగా 38 మంది ఒకరి తరువాత మరొకరు ఆమెను రేప్ చేశారు. ఈ కిరాతకం కొన్ని గంటలపాటు కొనసాగింది. ఈ ఘాతుకం మలేషియాలోని కెలాంటన్ ప్రాంతంలో జరిగింది. అమ్మాయి దారి తప్పి అడవిలోని ఆ గుడిసెకు చేరుకుంది. అక్కడ ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు పోలీసులు హడావిడిగా ముష్కరుల్ని పట్టుకుంటున్నారు. 13 మందిని అరెస్టు చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. దొరికిన వారిని పరీక్షిస్తే వారి రక్తం, మూత్రంలో మాదక పదార్థం ఆంఫిటమిన్ ఉన్నట్టు తేలింది. అరెస్టయిన వారిలో ఒక తండ్రి, ఆయన పుత్రరత్నాలు ఇద్దరు కూడా ఉన్నారు. విషాదం ఏమిటంటే ఈ ఘాతుకం జరుగుతున్న చోటకు కేవలం 20 అడుగుల దూరంలో ఇతర గుడిసెలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. మే చివరి వారం మహిళల పట్ల ఘోరాలను నమోదు చేసింది. తల్లిదండ్రుల మాట పెడచెవిని పెట్టి పెళ్లి చేసుకున్న యువతిని పోలీసుల ముందే కాల్చి చంపిన ఘటన పాకిస్తాన్ లో జరిగింది. మన దేశంలోని ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు దళిత యువతులను పోలీసులే రేప్ చేశారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మలేషియాలో ఈ ఘోరం నమోదైంది. -
యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ నేరాలకు రాజధాని అన్న విషయం మళ్లీ రుజువైంది. ఇద్దరు పోలీసులు సహా నలుగురు వ్యక్తులు కలిసి 15 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘటన సహారన్పూర్ జిల్లా కొత్వాలి ప్రాంతంలో జరిగింది. ఆ నలుగురు ఆ యుతిని గంగో ప్రాంతం నుంచి ఎత్తుకెళ్లి, సమీపంలోని ఓ అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. సుభాష్్, వివేక్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు జిషాన్ అనే మరో నిందితుడిని కూడా అరెస్టు చేశామని, నదీమ్ అనే నాలుగో నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని సహారన్పూర్ రేంజి డీఐజీ రఘువీర్ లాల్ తెలిపారు. నిందితులైన ఇద్దరు పోలీసులను డిస్మిస్ చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇక మరో సంఘటనలో అదే జిల్లాలోని తటేడా గ్రామంలో ఇద్దరు యువకులు తుపాకితో బెదిరించి మరో 16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. అలీనవాజ్, ఖుష్ నసీబ్ అనే ఇద్దరు యువకులపై కేసు నమోదైంది. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి, తుపాకితో బెదిరించి చెరిచినట్లు పోలీసులు తెలిపారు. -
బీజేపీ నాయకురాలిపై సామూహిక అత్యాచారం
రాంచీ: మన దేశంలో సాధారణ మహిళలకే కాదు నాయకులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. జార్ఖండ్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నాయకురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాంచీ జిల్లా మస్మనొ గ్రామంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం బీజేపీ నాయకురాలి ఇంట్లోకి దుండగులు చొరబడి లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పారు. అడ్డొచ్చిన బాధితురాలి భర్తను చితకబాది, వారి 13 ఏళ్ల కుమార్తెను దూషించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం వారి ఇంట్లో బంగారు, నగదు దోచుకుని పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
'శక్తిమిల్స్' రేపిస్టులకు మరణశిక్ష
-
జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం
మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన జరిగింది. వింధ్యాచల్ ప్రాంతంలో ఓ మహిళా జర్నలిస్టు (30) పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు అష్టభుజ కొండకు వెళ్తుండగా ఆమెపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు వింధ్యాచల్ రేంజి డీఐజీ ఆర్కే శ్రీవాత్సవ చెప్పారు. అతని వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అఘాయిత్యం జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. వైద్య విద్యార్థినికి శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి ముగ్గురు తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భరత్‌పూర్‌కు చెందిన బాధితురాలు ప్రతాప్‌నగర్‌లోని ఓ కళాశాలలో వైద్యవిద్య అభ్యసిస్తోంది. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఈ నెల మొదట్లో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు సంగనీర్ పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయ్‌కుమార్, యోగేంద్రకుమార్, వీరేంద్రకుమార్‌లను నిందితులుగా గుర్తించారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కాగా, నిందితుల్లో ఒకరితో యువతి సహజీవనం చేస్తోందని, అతను ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు చెపుతున్నారు. అతను పెళ్లికి నిరాకరించడంతో ఆమె కోర్టును ఆశ్రయించినట్టుగా భావిస్తున్నారు. -
టీనేజి యువతిపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన సెహత్గంజ్ సమీపంలోని మహదేవ్పాణి వద్ద జరిగింది. భోపాల్‌కు చెందిన ఈ యువతి తన స్నేహితులతో కలిసి ఈ ప్రాంతానికి గురువారం సాయంత్రం వచ్చింది. గుర్తు తెలియని నలుగురు యువకులు వారిద్దరినీ పట్టుకుని, ఆమె స్నేహితుడిని చెట్టుకు కట్టేసి, ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె తన స్నేహితుడి కట్లు విప్పగా, వారిద్దరూ భోపాల్‌కు తిరిగి వెళ్లారు. అనంతరం జరిగిన సంఘటనపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోపాల్ పోలీసులు ఈ కేసును రాయ్‌సేన్ పోలీసులకు బదిలీ చేశారు. వారు నలుగురు గుర్తు తెలియని నిందితులపై సామూహిక అత్యాచారం కేసు నమోదుచేశారు. వారికోసం గాలిస్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ యువతి, ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో కలిసి ఓ పిక్నిక్ స్పాట్ వద్దకు బయల్దేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. -
లిఫ్టు ఇస్తామని చెప్పి.. గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. లిఫ్టు ఇస్తామని చెప్పి.. ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. జాన్పద్ హపూర్ గ్రామానికి చెందిన బాధితురాలు సోమవారం నాడు వారపు సంత కోసం బుధానా గేట్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ ముగ్గురు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. ఆమెను ఫతేలాపూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఒకరి తర్వాత ఒకరిగా ఆమెను చెరిచారు. అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులపై కేసు నమోడు చేశారు. ఫిర్యాదులో ఆమె తెలిపిన వివరాల ప్రకారం చూస్తే, మహిళపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత, ఆమెను హపూడ్ గ్రామానికి తీసుకెళ్లి, కదులుతున్న కారులోంచి ఆమెను కిందకు తోసేసి అక్కడి నుంచి పారిపోయారు. నిందితులలో ఒకరు తనకు తెలియడం వల్లే వారు లిఫ్టు ఇస్తామంటే వాళ్ల వాహనంలో ఎక్కినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నిందితులలో ఇద్దరిని రషీద్, మష్రుగా గుర్తించారు. మొత్తం ముగ్గురినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లారీలో యువతిపై గ్యాంగ్ రేప్
కోల్‌కతా: కోల్‌కతాలోని బాబూఘాట్-ఖిద్దేర్పూర్ ప్రాంతంలో 21 ఏళ్ల యువతిని లారీలోకి తీసుకెళ్లి, ఆమెపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరిని సోమవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. మాదకద్రవ్యాలకు బానిసైన మహమ్మద్ హమీద్ అలియాస్ రాజా అనే నిందితుడిని అరెస్టు చేశామని, అతడు నేరాన్ని అంగీకరించాడని కోల్‌కతా పోలీసు కమిషనర్ ఎస్.కె.పురకాయస్థ చెప్పారు. విషమ పరిస్థితిలో ఆస్పత్రికి చేరిన బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలపై బాధితురాలిని కోల్‌కతాలోని సూపర్ స్పెషాలిటీ ప్రైవేటు ఆస్పత్రి బెల్లె వ్యూ క్లినిక్‌కు తరలించారు. -
డేనిష్ మహిళపై అత్యాచారం: మూడో వ్యక్తి అరెస్టు
దేశ రాజధాని నగరంలో 51 ఏళ్ల డేనిష్ మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మూడో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. రాజు సింగ్ (23) అనే వ్యక్తిని గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసి, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధాంశు కౌశిక్ ఎదుట హాజరు పరచగా, ఆయన మూడు రోజుల కస్టడీకి పంపారు. మహేందర్ అలియాస్ గంజా, మహ్మద్ రజా అనే ఇద్దరు నిందితులతో రాజు సింగ్ గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు. మొత్తం ఎనిమిది మంది నిందితులలో రాజు ఒకడు. వీళ్లంతా కూడా సంచారజీవులే. జనవరి 14వ తేదీ రాత్రి ఢిల్లీలో ఓ డేనిష్ మహిళ (51)ని వీళ్లు కత్తులు చూపించి బెదిరించి, దోచుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. బాధితురాలి నుంచి వారు దొంగిలించిన ఐ ప్యాడ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సామూహిక అత్యాచారం: నిందితులకు జైలు శిక్ష
16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు రాన్ సింగ్ (65), శ్రీభగవాన్ (44)లకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యూఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జ్ ఎం.సి.గుప్తా తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఒకొక్కరికి రూ. 30 వేల జరిమాన విధించారు. ఉద్యోగం పేరుతో బాలికకు రప్పించి ఆమెపై అత్యాచారం చేయడం హేయమైన చర్యగా జడ్జి అభివర్ణించారు. నిందితులలో రాన్ సింగ్ ఓ కంపెనీలో గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని బంధువుల అమ్మాయికి భరసా ఇచ్చాడు. అందుకోసం న్యూఢిల్లీ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఆ క్రమంలో ఆ యువతి న్యూఢిల్లీలోని రాన్ సింగ్ రూమ్‌కు వెళ్లింది. దాంతో ఉద్యోగంపై మరో వ్యక్తితో మాట్లాడాలని చెప్పి ఆ యువతిని కారులో ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ సింగ్‌తోపాటు, మరో వ్యక్తి శ్రీభగవాన్ యువతిపై అత్యాచారం జరిపారు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఘటనపై విచారణ జరిపిన కోర్టు శనివారం శిక్షను ఖరారు చేసింది. 2003, డిసెంబర్ 6న యువతిపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. -
కొల్‌కత్తలో మరో నిర్భయ మృతి
-
అత్యాచారానికి గురై.. బాలిక ఆత్మార్పణ
సామూహిక అత్యాచారం చేయడమే కాక.. ఆ తర్వాత కూడా విపరీతంగా బెదిరించడంతో పశ్చిమబెంగాల్లో ఓ బాలిక (16) బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. డిసెంబర్ 23వ తేదీన ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, తీవ్ర గాయాలతో ఆమె మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇటు ఆస్పత్రి సిబ్బంది గానీ తమ కుమార్తెను ఏమాత్రం పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది అసలు తమ కుమార్తెకు సరిగా చికిత్సే అందించలేదని, ప్రభుత్వం తరఫు నుంచి కనీసం ఒక్కరు కూడా వచ్చి పలకరించిన పాపాన పోలేదని ఆయన వాపోయారు. తన కుమార్తె చనిపోయినా.. తాను మాత్రం ఆ దుండగులను ఉరి తీసేవరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ అమ్మాయి చనిపోలేదని, ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వమే ఆమెను చంపేశారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్యాంలాల్ చక్రవర్తి ఆరోపించారు. తరచు ఆమెను వాళ్లు వేధింపులకు గురిచేస్తున్నా.. ప్రభుత్వం ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. బీహార్‌కు చెందిన ఈ కుటుంబం పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు వలస వచ్చింది. -
యూఎస్ పర్యాటకురాలిపై అత్యాచారం: నిందితులకు జైలు శిక్ష
భారత్‌లో అందాలు వీక్షించేందుకు వచ్చిన యూఎస్ పర్యాటకురాలు (30)పై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు యువకులుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను కూలుమనాలీ కోర్టు ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా జడ్జి పురంధర్ వైద్య తీర్పు వెలువరించారు. అలాగే ఒకొక్కరికి రూ 10 వేలు చొప్పును జరిమాన విధించారు. ఓ వేళ నిందితులు జరిమాన చెల్లించలేని పక్షంలో మరో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని జడ్జి స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో యూఎస్‌కు చెందిన ఓ యువతి భారతలో పర్యాటించేందుకు న్యూఢిల్లీ చేరుకుంది. ఆ క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని అందాలు వీక్షించేందుకు కూలుమనాలి విచ్చేసింది. అయితే లిఫ్ట్ ఇస్తామని చెప్పి ముగ్గురు నేపాలీ డ్రైవర్లు ఆ యువతిపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదు తీసుకుని పరారైయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పలువురు కారు డ్రైవర్లను పోలీసులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, నిందితులను అరెస్ట్ చేశారు. దాంతో నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులంతా నేపాల్‌కు చెందిన వారని, హిమాచల్ ప్రదేశ్‌లో కారులను బాడుగకు తీసుకుని నడుపుతూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. -
జీపీఎస్ లేని వాహనాలపై కొరడా
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన జరిగిన తర్వాత రవాణా విభాగంలో భారీ మార్పులే కనబడుతున్నాయి. ప్రయాణికుల భద్రతతో పాటు ఇతర నియమాలను పాటించని అన్ని వాహనాలపై దాడులు చేసేందుకు నియమించిన ప్రత్యేక బృందం అనుకున్న మేరకు ఫలితాలను రాబట్టగలుగుతోంది. ఈ ఏడాది నియమాలు పాటించని 202 చార్టెర్డ్ బస్సుల పర్మిట్‌ను రద్దు చేసింది. ఈ సంఖ్య స్వల్పంగా కనిపిస్తున్నా గతేడాదితో పొల్చుకుంటే ఇది మెరుగనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు ఒక్క బస్సు పర్మిట్‌ను కూడా రద్దు చేయని రవాణా శాఖ అధికారులు ఈసారి 2,529 చార్టెర్డ్ బస్సుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేయగా, మరికొన్నింటిని సస్పెండ్ చేశారు. నిర్భయపై అత్యాచారం బస్సులో జరగడంతో దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో అప్రమత్తమైన రవాణా శాఖ ప్రజా రవాణా వాహనాలపై దృష్టి సారించింది. ప్రతి వాహనం సెప్టెంబర్‌లోపు జీపీఎస్ వ్యవస్థను అమర్చుకోవాలని ఆదేశాలు జారీచేసింది. లేకపోతే చలాన్లు విధిస్తామని, పర్మిట్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది.నవంబర్ నెలాఖరువరకు నియమాలు పాటించని 2,500 బస్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ వరకు సమయమిచ్చినా జీపీఎస్ అమర్చుకోని 451 గ్రామీణ్ సేవా వాహనాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2,138 వాహనాల పర్మిట్‌ను కూడా రద్దు చేసింది. అలాగే 2,464 ఆటో యజమానులపై కూడా రవాణా శాఖ చర్యలు తీసుకుంది. నవంబర్ వరకు 3,05,549 చార్టెర్డ్ బస్సులు ఇప్పటికీ జీపీఎస్ అమర్చుకోలేదని తెలిపింది. 2011-12లో 1,549 ప్రయాణికుల వాహనాలు స్వాధీనం చేసుకున్న రవాణాశాఖ ఈసారి 10,144 వాహనాలను జప్తు చేసుకుంది. ఇప్పటివరకు 1.54 లక్షల ప్రజా సేవ వాహనాల (పీఎస్వీ)కు పోలీసులు తనిఖీ చేసి గుర్తులు జారీ చేశారు. నగరంలోని 1,515 గుర్తింపు పొందిన పాఠశాలల్లో తమ బస్సులను పోలీసులు తనిఖీ చేశారని 582 సంస్థల యజమానులు రవాణాశాఖకు లేఖలు రాశారు. తాము ఎలాంటి రవాణా సదుపాయం కల్పించడం లేదని 764 పాఠశాల యజమానులు పేర్కొన్నారు. -
బాలికపై ముగ్గురు బాలుర అత్యాచారం
-
బాలికపై ముగ్గురు బాలుర అత్యాచారం
రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన తగాదాలు కక్షగా మారి అది చివరకు ఓ బాలిక అత్యాచారానికి గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో స్థానికంగా నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య తగాదాలు ఉండటంతో.... ఒక కుటుంబానికి చెందిన పిల్లలు... మరొక కుటుంబం వారిని ఎలాగైనా అభాసుపాలు చేయాలని పథకం వేశారు. ఆ కుటుంబంలోని అమ్మాయితో స్నేహాన్ని నటిస్తూ, ఆమెను మభ్యపెట్టి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తుండగా మిగిలినవారు ఆ ఘటనను సెల్ఫోన్లలో కూడా చిత్రీకరించారు. అనంతరం సెల్ ఫోన్లలో స్నేహితులకు పంపిస్తున్న విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక డీఎస్పీ సరిత మాట్లాడుతూ నిందితులపై నిర్బయ, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ముంబైలో గ్యాంగ్ రేప్
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మరో గ్యాంగ్ రేప్ వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి స్నేహితులే ఈ అకృత్యానికి పాల్పడ్డారు. సబర్బన్ జార్జిగాన్లోని సంతోష్‌నగర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. దీపావళి వేడుకలు చేసుకుందామని చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వారీ దురాగతానికి ఒడిగట్టారు. ఆరుగురు నిందితులు 20 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. షాక్ నుంచి ఆలస్యంగా కోలుకున్న బాధితురాలు ఆదివారం తన బామ్మకు విషయం చెప్పింది. బామ్మతో కలిసి బాధితురాలు దిన్దోషి పోలీస్ స్టేషన్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. -
ముజఫర్ నగర్ పునరావాస కేంద్రంలో యువతిపై అత్యాచారం
ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఫుగునా జిల్లా జోగ్యా ఖేరి గ్రామంలోని పునరావాస శిబిరంలో మత ఘర్షణ బాధితురాలిపై శనివారం సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఫుగునా గ్రామంలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో బాధితులను వేరే ప్రాంతానికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను సచిన్, సునీల్ కుమార్ లుగా గుర్తించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. బాధితురాలు పునరావాస శిబిరంలో తల్లితండ్రులతో కలిసి ఉంటుందని పోలీసులు తెలిపారు. అత్యాచార విషయాన్ని బయటపెడితే చంపివేస్తామని నిందితులు బెదిరించినట్టు తెలిసింది. -
గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
టీనేజ్ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులను హౌరా, కొల్కత్తా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. వారిని కోర్టులో హారుపరుచగా న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... 24 పరిగణ జిల్లాలోని రాజర్ ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యాచారానికి బాధితురాలు వైద్య సహాయకురాలిగా విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. అయితే ఆ యవతి విధులు నిర్వహించిన అనంతరం నివాసం చేరుకునేందుకు బిదాన్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకునేందుకు ప్రవేట్ వాహనం ఎక్కింది. ఆ వాహనం కొంత దూరం వెళ్లిన తర్వాత అప్పటికే ఆ వాహనంలో ఉన్న ఇద్దరు యువకులు ఆ యువతిపై డ్రైవర్ కళ్ల ఎదుటే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దాంతో ఆ యువతి సృహ కొల్పోయింది. సృహ వచ్చి చూసుకునే సరికి కొల్‌కత్తాలోని వ్యభిచార కేంద్రమైన సోనాగాచ్లోని గదిలో పడి ఉండటంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఇద్దరు యువకులను పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు. -
రాజధానిలో మరో నిర్భయ.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
నిర్భయ సంఘటన తర్వాత దేశ రాజధాని సహా అన్ని ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడినా ఇప్పటికీ మహిళలకు రక్షణ ఉండట్లేదు. నిర్భయ లాంటి ఘటనే మరొకటి మళ్లీ దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో జరిగింది. పాతికేళ్ల వివాహిత మహిళపై కదులుతున్న కారులో నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వారిలో ఇద్దరు సాహిబాబాద్ ప్రాంతానికి చెందిన ఓ భూస్వామి కొడుకులు. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసిన తర్వాత వారు నలుగురూ ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టి అక్కడినుంచి పారిపోయారు. తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదైంది. ఢిల్లీలోని నంద్ నగరి ప్రాంతంలో నివసించే ఆ మహిళ అర్తాలా ప్రాంతంలోని ఓ దర్గాలో ప్రార్థనలు చేసుకోడానికి ఒంటరిగా వచ్చింది. తన ఇంటి యజమాని కొడుకు హేమంత్ లాలా, మరో ఇద్దరు తనను వెంబడించారని, తాను తిరిగి వెళ్లేటప్పుడు ఒంటరిగా ఉండటంతో తమ కారులోకి లాగేసి తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తర్వా హిందన్ నది సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను వదిలి పారిపోయారు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే బాగోదని కూడా వారు బెదిరించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేశామని, ఆ నివేదికలు ఇంకా రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
వివాహితపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్టు
ఒంటరిగా ఉన్న వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన నేరంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పింప్రి తలావో ప్రాంతంలో జరిగింది. బ్రహ్మ లాహు జైపాల్, లక్ష్మణ దుర్గ పట్టిమణి, వినోద్ హరిశ్చంద్ర జాదవ్ అనే ఈ ముగ్గురు బుధవారం నాడు ఒంటరిగా ఉన్న 30 ఏళ్ల వివాహితపై అత్యాచారం చేశారు. బాధితురాలు నిందితులను గుర్తించి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వారు ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. -
గ్యాంగ్ రేప్ చేశారు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసులో కీలక మలుపు
-
గ్యాంగ్ రేప్ చేశారు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసులో కీలక మలుపు
‘అభయ’పై దారుణానికి తెగబడిన ఇద్దరు కారు డ్రైవర్లు తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితికి బాధితురాలు స్నేహితులు ఆస్పత్రికి తరలించడంతో తప్పిన ప్రమాదం నిందితుల్ని పట్టిచ్చిన సీసీ కెమెరాలు వారిపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కిందా కేసు నమోదు సాక్షి, సిటీబ్యూరో: మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ ఉదంతం కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్ ఉలిక్కిపడేలా, ఢిల్లీ నిర్భయ కేసును తలపించేలా.. ఇద్దరు కారు డ్రైవర్లు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని కారులో దాదాపు 25 కి.మీ తీసుకువెళ్లి వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిర్ధారణైంది. యువతి నెలసరిలో ఉన్నప్పటికీ కారులోనే పెనుగులాట మధ్య 40 నిమిషాలకు పైగా ఇద్దరూ అత్యాచారం జరపడంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమైంది. దయనీయమైన స్థితిలో హాస్టల్‌కు చేరిన యువతిని స్నేహితులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. బాధితురాలికి సంబంధించిన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆమెకు ‘అభయ’ అనే పేరు పెట్టారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ వివరాలు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన అభయ (22) ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చి గౌలిదొడ్డిలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ప ని చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విధులు ముగించుకుని.. ఇనార్బిట్ మాల్లో షాపింగ్ తర్వాత రాత్రి 7.30 సమయంలో హాస్టల్‌కు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. అర్ధగంట తర్వాత వచ్చిన ఓ బస్సు ఎక్కింది. చిన్న తప్పు.. చాటింగ్ తెచ్చిన ముప్పు: బస్సు ఏమార్గంలో వెళుతుందో అంచనా వేయడంలో చేసిన చిన్న పొరపాటు దారుణానికి నాంది పలికింది. బస్సు తాను వెళ్లాల్సిన మార్గం నుంచి వేరే రూట్లోకి మళ్లడంతో అభయ రహేజా మైండ్‌స్పేస్ చౌరస్తా వద్ద దిగిపోయింది. అక్కడినుంచి గౌలిదొడ్డి వెళ్లేందుకు తిరిగి మైండ్‌స్పేస్ చౌరస్తాకు వచ్చింది. 8.40 గంటల ప్రాంతంలో తెల్లరంగు కారు వచ్చింది. డ్రైవర్ ఎక్కడకు వెళ్లాలని అడిగి ఆమెను కారు ఎక్కించుకున్నాడు. కారు వెనక సీట్లో మరో వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రాంతంలో షేరింగ్ ప్రయాణాలు సాధారణం కావడంతో అతడూ తన మాదిరే ఉద్యోగై ఉంటాడని అభయ భావించింది. తర్వాత కారు ఎటు వెళుతున్నదీ గమనించకుండా స్నేహితుడితో సెల్‌ఫోన్ చాటింగ్‌లో మునిగిపోయింది. ఖాజాగూడ జంక్షన్‌కు చేరుకున్న కారు అక్కడ ఎడమ వైపు తిరిగింది. గౌలిదొడ్డి వెళ్లడానికి కుడివైపు తిరగాల్సిన కారు మరోదిశకు మళ్లడాన్ని అభయ చూడలేదు. చివరకు కారు ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఎక్కుతున్నప్పుడు ఆమె గమనించినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. అభయ కేకలు బయటకు విన్పించకుండా కారు అద్దాలను మూసేసి నిందితులు అప్పా జంక్షన్ మీదుగా 22కిమీ దూరంలోని కొల్లూరు జంక్షన్ వరకు రింగ్‌రోడ్ పైనే ముందుకువెళ్లారు. తర్వాత సర్వీస్ రోడ్డులోకి దింపి లింగంపల్లి మార్గంలో ఉన్న బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక దట్టమైన టేకు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. నిన్నూ, నీ తల్లిదండ్రులను కూడా చంపుతామని బెదిరిస్తూ ముందుగా డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి, ఆ తరవాత మరోవ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత హాస్టల్ వద్ద వదిలేశారు. విషయం ఎవరికి చెప్పినా చంపేస్తామని హెచ్చరించారు. హాస్టల్‌కు చేరిన అభయను స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అర్ధగంట ఆలస్యమైతే ఆమెకు ప్రాణహాని జరిగేదని వైద్యులు వెల్లడించారు. సెల్ఫోన్లోనే స్నేహితుడికి సమాచారం: డ్రైవర్ దారి మళ్లించి తీసుకెళుతున్నాడని గమనించిన అభయ సెల్ఫోన్లోనే బెంగళూరులోని తన స్నేహితుడికి విషయం తెలిపింది. అతడి సలహాతో కేకలు పెట్టడంతో ఆమె సెల్‌ఫోన్ లాక్కున్న దుండగులు స్విచ్ఛాఫ్ చేశారు. ఈలోగా మరోసారి కాల్ చేసిన అభయ స్నేహితుడు ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో హైదరాబాద్ బాలానగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు శ్రీనివాస్‌కు విషయం చెప్పాడు. అతను రాత్రి 10.50 గంటలకు మాదాపూర్ ఇన్స్పెక్టర్ నారాయణ గౌడ్, ఏసీపీ కేవీ రాంనర్సింహారెడ్డికి సమాచారమిచ్చాడు. వారు గాలించినా అభయ ఆచూకీ లభించలేదు. ఇంతలో ఆమె హాస్టల్‌కు చేరుకున్న సమాచారం తెలిసింది. తాను ఎక్కింది తెల్లరంగు కారని, డ్రైవర్ పేరు సతీష్ అని అభయ పోలీసులకు చెప్పింది. దర్యాప్తులో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్‌కు చెందిన సీసీ కెమెరాను పోలీసులు పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి 12.04లకు స్కూల్ ముందు నుంచి తెల్లకారు సమీపంలోని పొదల వైపు వెళ్లినట్లు, తెల్లవారుజామున 1.02 గంటలకు తిరిగి వెనక్కు వెళ్లినట్లు గుర్తించారు. ఆ ఫుటేజ్ అస్పష్టంగా ఉంది. సతీష్ అనే పేరుతో డ్రైవింగ్ లెసైన్సులు కలిగిన వారి వివరాలు ఆరా తీయగా, రాష్ట్రంలో 50 వేల మందికి ఆ పేరుతో లెసైన్సులు ఉన్నట్లు తేలడంతో మరోసారి సీసీ కెమెరా ఫుటే జీని ఆశ్రయించారు. ఎన్ఐఏ సహకారంతో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఫుటేజ్‌ను అభివృద్ధి చేసిన అధికారులకు కీలకాధారాలు లభించాయి. సదరు కారు వోల్వో కంపెనీకి చెందిన ఎస్-60 మోడల్‌గా గుర్తించారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓల్వో షోరూమ్‌లో విచారించి అది ఏపీ 09 టీవీఏ 2762 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన కారుగా గుర్తించారు. ఇద్దరూ కారు డ్రైవర్లే: పీయూష్ అనే వ్యక్తి ఈ కారును 24ఁ7 ట్రాన్స్‌లైన్ ట్రావెల్స్‌కు అద్దెకిచ్చాడు. అలెగ్జాండర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్న సీపీ అగర్వాల్ దానిని వాడుతున్నారు. వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్ (30) డ్రైవర్. ఈ కారు డ్రైవర్ సతీషే నిందితుడిగా రూఢీ చేసుకున్న పోలీసులు అతడికి అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ రోజు కారులో ఉన్నది నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన తన స్నేహితుడు, కారు డ్రైైవర్ నెమ్మడి వెంకటేశ్వర్లు (28)గా సతీష్ వెల్లడించాడు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. సతీష్, వెంకటేశ్వర్లు కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో ఉంటున్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన సంయుక్త పోలీసు కమిషనర్ యం.శివప్రసాద్, అదనపు డీసీపీ జానకీ షర్మిల, ఎస్ఓటీ ఓఎస్డీ యస్.గోవర్ధన్‌రెడ్డి, ఏసీపీ రాంనర్సింహారెడ్డి, ఇన్స్పెక్టర్లు పి.నారాయణ, కుషాల్కర్, చంద్రశేఖర్, బాలకోటిలను కమిషనర్ అభినందించారు. నిందితులపై ఐపీసీ 363, 364, 365, 366, (కిడ్నాప్) 376 (డి) (గ్యాంగ్‌రేప్) సెక్షన్లు, 2013 నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి : హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్భయ తరహా సంఘటనలు హైదరాబాద్‌లోనూ చోటు చేసుకోవడం చాలా తీవ్రమైన అంశమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పూర్వాపరాలను పరిశీలించి ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దుండగుల చేతిలో శారీరక, మానసిక హింసకు గురైన బాధితురాలు త్వరగా కోలుకోవాలని జగన్ మంగళవారం నాటి ప్రకటనలో ఆకాంక్షించారు. ప్రభుత్వం ఆమెకు అవసరమైన వైద్య సదుపాయాలను అందించడంతో పాటు ఈ ఘోరానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో కుమార్తెకు చికిత్స చేయించేందుకు వెళ్లిన ఓ యువతిపై ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హొషంగాబాద్లో ఓ యువతి తన కుమార్తెను చికిత్స కోసం ఇటీవల ఆస్పత్రిలో చేర్పించింది. ఆదివారం రాత్రి వాష్‌రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమెను సెక్యూరిటీ గార్డు, వార్డు బాయ్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన గురించి బాధితురాలు తన భర్తకు తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఆదిత్య, దీపక్‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం: ముగ్గురి అరెస్టు
ఒడిశా రాష్ట్రంలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం, హత్యాప్రయత్నం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు (27) ఇప్పటికీ కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల హాస్టల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కటక్ జిల్లాలోని బంకి ప్రాంతంలో మద్యం వ్యాపారం చేస్తున్న ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండు విధించింది. గిరిజన మహిళ అడవికి సమీపంలోని తన తల్లిదండ్రుల కూరగాయల తోటలో పనిచేస్తుండగా ఆమెను ఈ ముగ్గురూ ఎత్తుకెళ్లారు. కటక్ సమీపంలోని కౌమడ ప్రాంతంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె స్పృహలేని పరిస్థితిలో.. కాళ్లు కట్టేసి కనపడింది. ఒంటిపై తీవ్రగాయాలు కూడా అయ్యాయి. దీంతో, అత్యాచారం అనంతరం ఆమెపై హత్యాయత్నం కూడా జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలోప తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితురాలికి చికిత్స, ఉద్యోగం, నష్టపరిహారం అందించాలంటూ స్థానికులు రాస్తారోకో చేశారు. -
ముజఫర్‌నగర్‌లో మరో రెండు సామూహిక అత్యాచారాలు
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో అకృత్యాల జాబితా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. తమ ఇళ్లను తగలబెట్టి, తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిన్ననే ముగ్గురు మహిళలు పోలీసులకు ఫిర్యాదుచేయగా, ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు కూడా ముందుకొచ్చారు. వీళ్లు కూడా ఫుగనా గ్రామానికి చెందినవాళ్లే. నలుగురు వ్యక్తులు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వీళ్లు ఫిర్యాదుచేశారని ఎస్ఎస్పీ హెచ్ఎన్ సింగ్ తెలిపారు. అల్లర్లు తీవ్రంగా ఉండటంతో గ్రామం వదిలిపెట్టి పారిపోయిన ఈ బాధితులు.. చాలాకాలం తర్వాత తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. తిరిగి వచ్చేసరికి తమ ఇళ్లన్నీ సర్వ నాశనం అయిపోయాయని వారు వాపోయారు. ముజఫర్ నగర్, పరిసర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 62 మంది మరణించగా, కొన్ని వేల మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
జింద్: హర్యానాలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురయింది. జింద్ జిల్లా రాజానా కుర్ద్ గ్రామంలో ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. సోమవారం ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. 15 ఏళ్ల బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లినప్పుడు దుండగులు ఆమెను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులు పవన్, నరేందర్, దాల్షర్గా గుర్తించారు. ఈ ముగ్గురు రాజానా కుర్ద్ గ్రామానికే చెందిన వారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితులపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
మాపై సామూహిక అత్యాచారం: ముజఫర్‌నగర్ బాధితులు
ముజఫర్‌నగర్ అల్లర్లలో కేవలం దోపిడీలు, గృహదహనాలు మాత్రమే కాదు.. సామూహిక అత్యాచారాలు కూడా జరిగాయట!! ఈ విషయమై ఆ జిల్లాలోని ఫుగనా గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అల్లర్ల సమయంలో తమ ఇళ్లను కాల్చేశారని, తమపై సామూహిక అత్యాచారాలు చేశారని ఇన్నాళ్ల తర్వాత వాళ్లు బయటకొచ్చి చెప్పారు. ఈ మేరకు వాళ్లు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అల్లర్లలో పాల్గొన్నవాళ్లు తమ ఇళ్ల మీదకు వచ్చి దాడి చేశారని కూడా చెప్పినట్లు అదనపు ఎస్పీ (రూరల్) అలోక్ ప్రియ దర్శి తెలిపారు. ఈ దారుణానికి గాను 17 మందిపై పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలలో దాదాపు 49 మంది ప్రాణాలు పోగా, 40 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. -
మణిపూర్‌లో మహిళపై గ్రామరక్షకుల అత్యాచారం
రక్షకులే భక్షకులయ్యారు. మణిపూర్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన తమెన్‌గ్లాంగ్ జిల్లాలో గ్రామ రక్షక దళానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 21వ తేదీన తన స్వగ్రామమైన డిస్లాండ్కు ఆమె తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగినా.. ఆలస్యంగా వెలుగుచూసింది. నోనీ పోలీసు స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న గ్రామ రక్షకదళం సభ్యులు బాగా తాగి, ఆ మత్తులో ఆమెను వేధించి, తర్వాత సమీపంలోని ఓ అడవిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వా నోనీ పోలీసు స్టేషన్లో బాధితురాలు తన భర్తతో కలిసి ఈ ఆరుగురిపై ఫిర్యాదు చేసింది. వారందరినీ వెంటనే రక్షకదళం విధుల నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు వారికి సోమవారం వరకు రిమాండు విధించింది. -
ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం.. బాధితురాలు అదృశ్యం
కామాతురాణాం న భయం.. న లజ్జ అంటారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని కూడా చూడకుండా.. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకా దారుణం ఏమిటంటే వాళ్లలో ఓ వైద్యుడు కూడా ఉన్నాడు!! జైపూర్ నగర శివార్లలోని చోము పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సెప్టెంబర్ 24వ తేదీన ఈ దారుణం జరిగింది. డాక్టర్ చౌదరి, చెత్రమాల్ కుమావత్, సాగర్, అత్తా ఖాన్, ముఖేష్ బాగర్ అనే ఐదుగురు తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపిందని చోము ఏసీపీ ప్రతాప్ రామ్ మీనా తెలిపారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాల కింద నిందితులపై ఫిర్యాదు దాఖలైందని ఆయన చెప్పారు. అయితే.. బాధితురాలి నుంచి పూర్తిస్థాయిలో వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం విఫలం కావడం ఈ కథలో మరో కోణం. ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ ఉత్తచేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. బాధితురాలు తన ఇంట్లో కూడా కనపడటంలేదు. ఇప్పుడు బాధితురాలు కనిపిస్తే తప్ప ఈ కేసులో ముందడుగు వేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు. -
బెంగాలీ మహిళపై బీహార్‌లో సామూహిక అత్యాచారం
బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఓ బెంగాలీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం తెలిపారు. బీహార్ సరిహద్దుల్లోని బలరాంపూర్ గ్రామానికి చెందిన బాధితురాలు రోడ్డుపక్కన తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉంది. అటువైపు నుంచి వెళ్తున్న జాతీయ విపత్తు నివారణ బృందం అధికారులు ఆమెను గమనించి కాపాడినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుమారు 30 ఏళ్ల వయసులో ఉన్న ఆ బెంగాలీ మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పాట్నా సీనియర్ ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఆస్పత్రిలోని వైద్యులు నిర్ధారించారన్నారు. నలుగురైదుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్లు ఆస్పత్రి సమీపంలో పనిచేస్తున్న ఓ తాపీమేస్త్రీ సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసిందని చెప్పారు. కోల్‌కతాలోని హౌరా రైల్వే స్టేషన్లో తాను తన భర్తతో గొడవపడి వేరే ఏదో రైలు ఎక్కేసినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ఈ కేసులో పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
నిర్భయ తీర్పును స్వాగతించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గతేడాది డిసెంబర్లో న్యూఢిల్లీ సామూహిక అత్యాచారం గురైన నిర్భయ కేసులో దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్వాగతించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మానవ మృగాలుగా ప్రవర్తించిన దోషులకు ఇది సరైన శిక్ష అని ఆయన అభివర్ణించారు. దేశంలో మహిళలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరం విఫలం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫార్మాసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆమె న్యూఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు. అయితే నిర్భయ అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ నెలాఖరున మరణించింది. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో ఆ ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షించాల దేశంలోని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాకేత్ కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు బాలనేరస్తుడు కావడంతో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
అత్యాచారం కేసులో ఆరుగురికి యావజ్జీవ ఖైదు
బెంగళూరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే గత సంవత్సరం అక్టోబర్ నెలలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ ఓ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. నిందితులందరూ తమ జీవితకాలం మొత్తం.. అంటే మరణించే వరకు జైల్లోనే గడపాల్సి ఉంటుందని తీర్పునిచ్చే సందర్భంలో సివిల్, సెషన్స్ జడ్జి సంగణ్నవర్ తెలిపారు. దాంతో పాటు దోషులు ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయల జరిమానా విధించారు. ఈ దారుణ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ఉన్ప్పటికీ, ఏడో నిందితుడు రాజా అప్పటినుంచి పరారీలోనే ఉన్నాడు. ఎనిమిదో నిందితుడు మైనర్ కావడంతో అతడిని ప్రత్యేకంగా బాల నేరస్థుల కోర్టులో విచారిస్తున్నారు. నేపాల్ దేశానికి చెందిన బాధితురాలు మూడో సంవత్సరం న్యాయవిద్య చదువుతోంది. ఆమెపై యూనివర్సిటీ ప్రాంగణంలోనే అత్యాచారం జరిగింది. -
షిర్డీ సమీపంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
సాయినాథుడు నడయాడిన ప్రాంతమది. అందరూ చల్లగా ఉండాలని, పదిమందికీ మేలు జరగాలని చెప్పిన సాయి సంచరించిన ప్రాంతంలోనే ఘోరం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకాలోని జేవూర్ పటోడా గ్రామానికి చెందిన బాధితురాలు తన సోదరితో కలిసి ఉంటుంది. గురువారం ఉదయం ఆమె తన ఇంటి నుంచి బయటకు వెళ్లగానే నిందితులు బలవంతంగా ఆమెను కొంతదూరం తీసుకెళ్లి, అక్కడ సమీపంలో ఉన్న పొలాల్లో ఆమెపై అత్యాచారం చేసి, అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఏం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా చెప్పే పరిస్థితిలో కూడా లేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద గుర్తు తెలియని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో కొన్ని పగిలిన గాజులు, మట్టి సేకరించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం అహ్మద్‌నగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్చారు. -
మహిళా ఫోటో జర్నలిస్ట్ పై అత్యాచారం