గ్యాంగ్రేప్: నిందితుల్లో డీఆర్డీఏ పీడీ | GANGRAPE UP: DRDA project director among 4 booked for gangrape | Sakshi
Sakshi News home page

గ్యాంగ్రేప్: నిందితుల్లో డీఆర్డీఏ పీడీ

Published Thu, Feb 19 2015 8:42 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

గ్యాంగ్రేప్: నిందితుల్లో డీఆర్డీఏ పీడీ - Sakshi

గ్యాంగ్రేప్: నిందితుల్లో డీఆర్డీఏ పీడీ

లక్నో: డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్తోపాటు మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ ప్రాంతంలోని షామిలిలో ప్రభుత్వ కార్యాలయంలో రెండు నెలల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది. దాంతో బాధితురాలు రాష్ట్ర మహిళ కమిషన్ను ఆశ్రయించింది. నిందితులను అరెస్ట్ చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని బాధితురాలు కమిషన్కు విజ్ఞప్తి చేసింది.

ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్ నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం నిందితులు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్ఞాన్ ప్రకాశ్,అసిస్టెంట్ ఇంజినీర్ దినేష్ కుమార్,గుమస్తాలు రాజ్కుమార్,ఆనంద్లపై కేసు నమోదు చేసినట్లు ఎడిషన్ ఎస్పీ వి.కె.మిశ్రా వెల్లడించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిశ్రా వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement