మహిళ, బాలికపై బందిపోట్ల అత్యాచారం | Woman and her daughter allegedly gangraped in Bulandshahr | Sakshi
Sakshi News home page

మహిళ, బాలికపై బందిపోట్ల అత్యాచారం

Published Sun, Jul 31 2016 9:32 AM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

Woman and her daughter allegedly gangraped  in Bulandshahr

బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లో బందిపోటు దొంగలు ఒకే కుటుంబానికి చెందిన మహిళ, 13 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేశారని పోలీసులు శనివారం చెప్పారు. ఆ కుటుంబం కారులో నోయిడా నుంచి షాజహాన్‌పూర్ వెళ్తుండగా, దొంగలు అడ్డగించి కారుపై దాడి చేశారు.

కారులో ఉన్న మగవారిని చెట్టుకు కట్టేసి, మహిళ, బాలికను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. వారి  ఆభరణాలు, డబ్బు దోచుకెళ్లారు. కుటుంబంలోని ఓ వ్యక్తి కట్లు విప్పుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఎస్పీ వైభవ్ కృష్ణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement