dacoits
-
బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్‌ఖండ్‌లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్పూర్, చిత్రకూట్‌లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్‌ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అయితే అప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్‌పై ప్రతాప్‌గఢ్‌లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు. దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్‌లలోని రాజకీయాలన్నీ అతని కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది. -
పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా?
ఇస్లామాబాద్: శనివారం తెల్లవారు జామున సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి "మరి మాతా" హిందూ దేవాలయాన్ని కూల్చిన 24 గంటలు గడవక ముందే మరో ఆలయంపై పాకిస్తానీ దుండగులు రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. సింధ్ ప్రావిన్సులో కొందరు దుండగులు హిందువులు నివసించే కాష్మోర్ ప్రాంతంలో అక్కడి హిందూ సమాజం నిర్మించుకున్న దేవాలయం పైనా చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్ల మీదా రాకెట్ లాంఛర్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని కాష్మోర్-కందకోట్ ఎస్.ఎస్.పీ ఇర్ఫాన్ సమ్మో తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో స్థానిక హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తామని ఈ సందర్బంగా సమ్మో అభయమిచ్చారు. ఈ దేవాలయంలో బాగ్రి సమాజానికి చెందిన వారంతా ఏడాదికి ఒకసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటామని, ఆలయంపై ఈ విధంగా దాడి చేయడం పిరికి చర్య అని అన్నారు బాగ్రి సమాజానికి చెందిన డాక్టర్ సురేష్. దుండగులు ఫైర్ చేసిన చాలా రాకెట్ లాంచర్లు జనావాసాల వద్ద పడ్డాయని కానీ అవి పేలకపోవవడంతో ప్రాణనష్టం జరగలేదని లేకుంటే మరింత విధ్వంసం జరిగి ఉండేదని ఆయన తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన భారతీయ యువకుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినందుకు ప్రతీకారంగా కాష్మోర్-ఘోట్కీ నదీతీరాన ఉండే కొంతమంది ఆగంతకులు గతంలో హెచ్చరించారు. బహుశా ఇది వారి చర్యే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: బంపరాఫర్.. అద్దెకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లభ్యం.. -
సివిల్ సర్వీస్ అధికారులపై బీజేపీ నేత ‘బందిపోటు’ కామెంట్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్సీ) ద్వారా నియమితులైన అధికారుల్లో చాలామంది బందిపోట్లే అంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోడి దొంగకు అయినా శిక్ష పడుతుందేమో గానీ మినరల్ మాఫియాను నడుపుతున్న అధికారులను అస్సలు టచ్ చేయలేం అన్నారు. ఈ మేరకు బాలాసోర్ జిల్లాలో బలియాపాల్‌లోని ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒడిశా ఎంపీ, గిరిజన వ్యవహారాలు, జలశక్తి సహాయ మంత్రి బిశేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను ఢిల్లీలో ఉండగా సివిల్ సర్వీస్ కార్యాలయం తన నివాసం వెనకాలే ఉండేదని, దానిపట్ల ఎంతో గౌరవం ఉండేదన్నారు. అప్పట్లో తనకు ఆ సర్వీస్ ద్వారా నియమితులైన వారందరూ అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులని, ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉంటారనే భావన ఉండేదన్నారు. కానీ ఇప్పుడు తన ఆలోచన మారిందన్నారు. అక్కడ నుంచి వచ్చిన వారిలో చాలామందిని బందిపోటు దొంగలుగా భావిస్తున్నానని చెప్పారు. అలా అని నూటికి నూరు శాతం అందరూ అలానే ఉన్నారని చెప్పడం లేదు. కొంతమంది మాత్రం అలానే ఉంటున్నారని నొక్కి చెప్పారు. మన విద్యా వ్యవస్థలో నైతికత లేకపోవటం వల్లే ఇలాంటి చదువుకున్న వ్యక్తుల అవినీతిని సమాజం భరించాల్సి వస్తోందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: జంషెడ్‌డ్‌పూర్‌లో ఘర్షణ..రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) -
షాకింగ్: పోలీసు క్యాంప్‌పై 150 మంది బందిపోట్ల దాడి
ఇస్లామాబాద్: దారి దోపిడిలో భాగంగా బందిపోట్లు దాడి చేయటం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఎదురించిన వారిని విచక్షణరహితంగా చంపి దోపిడి చేస్తుంటారు. అలాంటి షాకింగ్ సంఘటనే పాకిస్థాన్‌లోని సింధు రాష్ట్రంలో వెలుగు చూసింది. అయితే, తమపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులపై దాడికి దిగింది దొంగల ముఠా. రోంటి రీజియన్ కచా ప్రాంతంలోని ఓ పోలీసు క్యాంపుపై భారీ సంఖ్యలో బందిపోట్లు ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డీఐజీ జావేద్ జాస్కాని తెలిపిని వివరాల ప్రకారం.. కచా ప్రాంతంలో దుండగుల ఆక్రమణలు పెరిగిపోయిన క్రమంలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అయితే, ఒక్కసారిగా 150 మంది బందిపోట్లు పోలీసు పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. ఓ డీఎస్పీ, ఇద్దరు ఎస్హెచ్ఓలతో పాటు మొత్తం ఐదుగురు పోలీసులను హత్యచేశారు. మృతులు డీఎస్పీ అబ్దుల్ మాలిక్ భుట్టో, ఎస్హెచ్ఓ అబ్దుల్ మాలిక్ కమాన్‌గర్, ఎస్హెచ్ఓ డీన్ ముహమ్మద్ లెహారి, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సలీమ్ చాచాదర్, జటోయ్ పటాఫిలుగా గుర్తించారు. పోలీసు క్యాంపుపై బందిపోట్లు దాడి చేసిన క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భారీగా బలగాలను కచా ప్రాంతానికి తరలించారు. బందిపోట్లు దాడి చేసినప్పటికీ తమ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు డీఐజీ. మరోవైపు.. పోలీసులపై దాడిని ఖండించారు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి. పోలీసుల ప్రాణాలు తీసిన దండగులు తగిన శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా? -
అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఉయ్యూరు మండలం కాటూరులో గత మంగళవారం ఓ ఇంట్లో చొరబడి బీభత్సం చేసిన అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు చేసినట్లు సీపీ ద్వారాకా తిరుమలరావు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో ఆ దొంగల బ్యాచ్‌లోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి సీపీ ద్వారాకా తిరుమల రావు మాట్లాడుతూ.. దోపిడి సమయంలో దొంగలు ఒరియా భాషలలో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. అదేవిధంగా పట్టుబడిన నిందితులు దోపిడి దొంగతనాల్లో ఆరితేరిన పెద్దింటి గొల్లలుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా నుంచి ఏడాది క్రితం కృష్ణా జిల్లా బొడ్డుపాడుకి ఈ పెద్దింటి గొల్లలు మకాం మార్చారని తెలిపారు. అపహరించిన సొమ్మును ఆ ముఠా నుంచి పోలీసులు స్వాదీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకొని రోజుల వ్యవధిలోనే చేధించిన సిబ్బందికి సీపీ ద్వారకా తిరుమలరావు అభినందనలు తెలిపారు. -
పాతబస్తీలో బందిపోటు ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బందిపోటు ముఠా గుట్టును కాలాపత్తర్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు గురువారం సీపీ అంజనీకుమార్ తెలిపారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ నెల 17న కాలాపత్తర్‌లో దారి దోపిడీకి పాల్పడింది ఈ ముఠానే. మధ్యప్రదేశ్‌కు దీపంజాయ్ బుందేలా హైదరాబాద్‌కి వచ్చి.. చర్లపల్లి జైలులో ఉన్న తన సోదరుడిని ములాఖత్ ద్వారా కలిశారు. అయితే అదే రోజు దొంగల ముఠా సభ్యులు కూడా జైల్లో ఉన్న ఆఫ్రోజ్ ఖాన్‌ను కలిశారు. ఆ తర్వాత బుందేలా కదలికలను పసిగట్టిన ముఠా సభ్యులు సయ్యద్ యూనస్, సయ్యద్ అబద్దీన్లు తమను అతడికి పరిచయం చేసుకున్నారు. బుందేలా మధ్యప్రదేశ్‌కు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి బయలు దేరగా.. నిందితులు తమ కారులో డ్రాప్ చేస్తామని నమ్మబలికారు. కారులో వెళ్తుండగా కాలాపత్తర్‌లోని జీవన్ లాల్ మిల్క్ వద్ద బాధితున్ని కొట్టి 18 వేల రూపాయల నగదు, గోల్డ్ రింగ్‌ను చోరీ చేశారు. ముఠా సభ్యులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. వారిలో కొందరిపై పీడీ యాక్ట్‌లు కూడా ఉన్నాయ’ని తెలిపారు. -
అక్కడి ఎన్నికల్లో బందిపోట్ల ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లా చిత్రకూట్ హిందువులకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన పట్టణం. అయోధ్య రాముడు గడిపిన 14 ఏళ్ల వనవాసంలో 11 ఏళ్లు ఈ ప్రాంతం అడవుల్లోనే గడిపాడన్నది ప్రతీతి. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతానికి రాముడు అయోధ్య నుంచి సతీసమేతంగా నడిచివచ్చారంటూ స్థానికులు ఇక్కడ ఓ దారిని చూపిస్తారు. ‘రామ్ వన్ పథ్’గా ఈ మార్గాన్ని అభివద్ధి చేస్తానంటూ తెగ ప్రచారం చేయడం ద్వారా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మొదటిసారి విజయం సాధించారు. ఆయన ఏమీ చేయలేకపోవడంతో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అదే హామీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆయన కూడా తన హామీని నిలబెట్టుకోలేక పోయారు. ఈ నేనపథ్యంలో మొత్తం చిత్రకూట్ అసెంబ్లీ అభివద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు హామీల మీద హామీలు ఇస్తున్నారు. కులాలు, వర్గాలు ఓట్లను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో ఈ హామీలను ప్రజలెవరు నమ్మడం లేదు. ఈ నియోజక వర్గం ఎన్నికలపై బందిపోట్ల ప్రభావం కూడా ఎక్కువే. అందుకే 1998, 2003, 2013 ఎన్నికల్లో మాజీ బందిపోటు ప్రేమ్ సింగ్ విజయం సాధించారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి కేవలం 722 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆయన కూడా నియోజక వర్గం అభివద్ధికి ఎలాంటి కృషి చేయకపోయినా ఆయనకు భయపడి ప్రజలు ఓటేశారట. 2017లో ప్రేమ్ సింగ్ మరణించడంతో ఆయన స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలాంషు చతుర్వేది ఉప ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఇప్పటికీ బిబ్లీకోల్, సాధనా పటేల్ లాంటి చిన్న స్థాయి బందిపోట్లు ఎన్నికల్లో పోటీ చేసిన కనీసం పదివేల ఓట్లు వస్తాయని స్థానిక వ్యాపారి ప్రద్యూమ్న త్రిపాఠి వ్యాఖ్యానించారు. చిత్రకూట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒక్క బందిపోటైనా పోటీ చేస్తారట. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమేనని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతం ఆర్థికంగా బాగా వెనకబడి ఉండడం, దాచుకోవడానికి చుట్టూ దట్టమైన అటవి ప్రాంతాలు ఉండడం దోపిడీ దొంగలు పెరగడానికి కారణమని స్థానిక ప్రజలే చెబుతున్నారు. ఎప్పటిలాగా ఈసారి కూడా కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అర్థం అవుతుంది. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 1,98,933 మంది. 40 శాతం ఉండే జనరల్ క్యాటగిరీ ఓటర్లలో 36 శాతం బ్రాహ్మణలు కాగా, ఆరు శాతం మంది ఠాకూర్లు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నీలాంషు చతుర్వేదిని కాంగ్రెస్ మళ్లీ నిలబెట్టింది. ఈసారి కూడా బ్రాహ్మణులు మూకుమ్మడిగా మంచిపేరుగల నీలాంషుకే మద్దతిస్తుండడంతో బీజేపీ ఠాకూర్లకు చెందిన సురేంద్ర సింగ్ గహావర్ను పోటీకి నిలబెట్టింది. బీఎస్పీ పార్టీ 19.72 శాతం ఓట్లు కలిగిన షెడ్యూల్ కులానికి చెందిన రవీంద్ర సింగ్ పట్వారీని నిలబెట్టింది. ఇక షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఓటర్లు 18.91 శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన ఓటర్లు 21 శాతం ఉన్నారు. ఓబీసీల మద్దతు కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీ–కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఇంక ఆ అభ్యర్థికి తిరుగే ఉండేది కాదని అంటున్నారు. -
అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం
-
అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం
సాక్షి, గుత్తి : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తన ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అడ్డుకునే క్రమంలో ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని గుత్తి కుమ్మరవీధిలోని ఓ ఇంట్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లో బీరువాలు, లాకర్లు వెతుకుండగా ఇది గమనించిన ఇంటి యజమాని దొంగలను అడ్డుకున్నారు. కానీ దోపిడీ దొంగలు యజమానికి హత్యచేసి 25 తులాల బంగారం, రూ. 5లక్షల నగదుతో ఉడాయించారు. స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
చీరల దొంగకు.. ఇలాంటి శిక్షా?
న్యూఢిల్లీ: చీరలు చోరీ చేసిన వ్యక్తిని బంధిపోటుగా (దోపిడీదారుడిగా) చూడటమేంటని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఐదు చీరలు చోరీ చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్ ప్రయోగించడంపై చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్ అశ్చర్యానికి లోనైనట్లు తెలిపారు. దోపిడీదారులు, డ్రగ్స్ మాఫియా నిందితులను చూసినట్లుగా సాధారణ కేసులో నిందితుడికి ఏడాదిపాటు జైలుశిక్ష విధించడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఇలాగైతే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ పోతారని ఆ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వడానికి రెండు వారాల సమయం ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదుకాని వ్యక్తిని అరెస్ట్ చేసి నిర్బంధించడం ఎంతమేరకు సమంజసమని.. ఇందులో రాజకీయ కోణమేదైనా దాగి ఉందా అని అడ్వైజరీ బోర్డును వివరణ కోరారు. సీహెచ్ ఎల్లయ్య అనే వ్యక్తిని గతేడాది మార్చి 19న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పీడీ యాక్ట్-1986 ప్రకారం.. అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. తెలంగాణ కౌన్సిల్ ప్రకారం.. ఎల్లయ్య ఆరు నెలల వ్యవధిలో మూడు పర్యాయాలు ఇలాంటి చోరీలకు పాల్పడ్డాడు. రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలోని తెలంగాణ అడ్వైజరీ బోర్డు నిర్ణయం మేరకు ఎల్లయ్యను అరెస్ట్ చేశారు. రాష్ట్ర బోర్డు నిర్ణయంపై విచారణ జరిపించాలని బాధితుడు ఎల్లయ్య హైకోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. బోర్డు నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. భార్య సాయంతో న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఎల్లయ్య పేరు మీదుగా ఒక్క కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదనీ, చోరీకి పాల్పడ్డడని చెప్పేందుకు సాక్షులేవరూ లేరని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తించింది. -
'3 నెలల్లో శిక్షించకుంటే ఆత్మహత్య చేసుకుంటా'
బులంద్‌షహర్: తల్లీకూతుళ్లను సామూహిక అత్యాచారం, దోపిడీకి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిని బాధితులు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐదుగురు పోలీసులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిందితులను మూడు నెలల్లోగా శిక్షించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాళ్ల భర్త, తండ్రి హెచ్చరించారు. రాజధాని ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ- కాన్పూర్ హైవేపై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, దోపిడీకి పాల్పడి, తల్లీకూతుళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీస్ చెక్ పోస్టుకు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణకాండపై దర్యాప్తు చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. రెండు పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఎస్పీ, సిటీ ఎస్పీ, సీవో, ఎస్ఓఎస్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. బాధితులను జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనను లోక్ సభలో లేవనెత్తాలని బీజేపీ నిర్ణయించింది. -
మహిళ, బాలికపై బందిపోట్ల అత్యాచారం
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లో బందిపోటు దొంగలు ఒకే కుటుంబానికి చెందిన మహిళ, 13 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేశారని పోలీసులు శనివారం చెప్పారు. ఆ కుటుంబం కారులో నోయిడా నుంచి షాజహాన్‌పూర్ వెళ్తుండగా, దొంగలు అడ్డగించి కారుపై దాడి చేశారు. కారులో ఉన్న మగవారిని చెట్టుకు కట్టేసి, మహిళ, బాలికను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. వారి ఆభరణాలు, డబ్బు దోచుకెళ్లారు. కుటుంబంలోని ఓ వ్యక్తి కట్లు విప్పుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఎస్పీ వైభవ్ కృష్ణ తెలిపారు. -
ఇద్దరు మహిళలపై బందిపోట్లు గ్యాంగ్‌రేప్
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఆరుగురు బందిపోట్లు కుటుంబ సభ్యులను, ఇతర గ్రామస్తులను బంధించి ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున కరౌలి జిల్లా కరన్‌పూర్ ప్రాంతంలో ఈ దుశ్చర్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బందిపోటు దొంగలు మద్యం సేవించి గ్రామంలోకి ప్రవేశించి మగవాళ్లను బంధించారు. ఇద్దరు వివాహితులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గ్రామస్తుల్లో భయం కలిగించేందుకు ఓ దొంగ కాల్పులు జరిపాడు. బుల్లెట్లు గురితప్పి మరో దొంగకు తగలడంతో అతను చనిపోయాడు. గ్రామస్తులు ఎదురుదాడికి దిగి ఓ దొంగను బంధించారు. మిగిలినవారు పారిపోయారు. -
మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు
మధురై: జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్-లో ఓ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆయన భార్య దోపిడీకి గురయ్యారు. దోపిడీ దొంగలు మంత్రి దంపతులను తుపాకీతో బెదిరించి మరీ దోచుకున్నారు. ఈ సంఘటన రైళ్లలో ప్రయాణికుల భద్రత దుస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. గురువారం మధురై జిల్లాలోని కోసికోలన్ దగ్గర జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలోకి ఆయుధాలతో చొరబడ్డ దొంగలు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి జయంత్ మలైయా దంపతులతో పాటు మరికొంతమంది ప్రయాణికులను కూడా దోచుకున్నారు. అంతేకాదు ఇదే మార్గంలో వెళ్తున్న మరో రైలులో కూడా ఈ గ్యాంగ్ లూటీకి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో షాకైన ఆర్థికమంత్రి జయంత్ .. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుని కలవనున్నారని సమాచారం. గతంలో కోసి కలన్ రైల్వేమార్గాన్ని టార్గెట్ చేసుకొని ప్రయాణికులను దోచుకున్నఘటనలు అనేకం జరిగినట్టు తెలుస్తోంది. -
పాపం పోలీసులని తెలియక..
మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లపై దాడికి దొంగల యత్నం సాక్షి, ముంబై: అహమ్మదాబాద్ నేషనల్ హైవే సమీపంలో ఉన్న కాసా ప్రాంతం సమీపంలో మఫ్టీలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళా పోలీసులపై దోపిడీ దొంగలు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి....కాసా ప్రాంతంలో అధికంగా దారిదోపిడీలు జరుగుతుండటంతో దొంగలను పట్టుకోవడానికి కాసా ప్రాంత పోలీసులు పథకం పన్నారు. ఈ మేరకు మఫ్టీలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు అద్దె వాహనం తీసుకుని సాధారణ ప్రయాణికులుగా ఆ ప్రాంతంలో ప్రయాణించారు. అనంతరం దారిలో వాహనం రిపేర్ వచ్చినట్లు ఆపి దొంగల కోసం ఎదురుచూడసాగారు. వారు ఊహించినట్లుగానే కొంతసేపటికి ఐదుగురు వ్యక్తులు వచ్చి వారిని ప్రశ్నించారు. వాహనంలో డ్రైవర్‌తోపాటు ముగ్గురూ మహిళలే ఉండటంతో బెదిరించి దోపిడీ చేసేందుకు యత్నించారు. అంతవరకు సాధారణ మహిళలుగా నటించింది కానిస్టేబుళ్లుగా గుర్తించిన దొంగలు ఒక్కసారిగా ఖంగుతిని పారిపోయేందుకు యత్నించారు. తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై కారం పొడి చల్లారు. అయితే దొంగల్లో ఇద్దరిని పోలీసులు పట్టుకోగలిగారు. మిగిలిన ముగ్గురూ సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారని, త్వరలోనే వారినీ పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
నిఘావర్గాలు హెచ్చరించినా పోలీసుల నిర్లక్ష్యం..
గోరంట్ల పరిధి ప్రశాంతినగర్‌లో దొంగల హల్చల్ పట్టపగలే యథేచ్ఛగా రూ.30 లక్షల విలువైన సొత్తు దోపిడీ సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాలన్నా, బంగారు ఆభరణాలు ధరించి బయటకు రావాలన్నా జనం హడలిపోతున్నారు. నిఘా వర్గాలు హెచ్చరించిన రెండు రోజులకే నగర శివారు గోరంట్ల గ్రామంలో శుక్రవారం దోపిడి దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంటిలో పనిమనిషిని కట్టిపడేసి సుమారు రూ. 30 లక్షల విలువ చేసే సొత్తు దోచుకెళ్లడం పోలీసులు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు చేసే ముఠాలు తిరుగుతున్నాయని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు రెండు రోజుల కిందట హెచ్చరికలు చేశాయి. ఈ విషయంపై అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా గోరంట్లలో జరిగిన దోపిడీ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. గోరంట్లలో దోపిడీ.... గోరంట్ల పరిధి నగరాలులోని పాండురంగానగర్‌లోగల ప్రశాంతినగర్ రెండో లైన్లో రిటైర్డ్ అగ్రికల్చర్ అధికారి మిరియూల లక్ష్మినారాయణ కుమారుడు మిరియూల మురళీకృష్ణ నివాసం ఉంటున్నారు. ఆయన బ్రాడీపేటలో పంచమి ప్రాజెక్ట్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వృద్ధుడైన తండ్రి లక్ష్మీనారాయణను ఇంట్లో ఉంచి తెల్లవారుఝామున మురళీకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లల్ని తీసుకుని అన్నవరం వెళ్లారు. ఇది గమనించిన ఆరుగురు గుర్తు తెలియని దుండగులు తెల్లని కారులో మురళీకృష్ణ ఇంటికి వచ్చి వరండాలో కూర్చున్న లక్ష్మినారాయణను అమాంతం ఎత్తుకెళ్లి ఇంట్లో కూచోబెట్టారు. అనుకోని సంఘటనతో ఆయన నోటమాటరాలేదు. ఇదే అదనుగా దొంగలు తమ పని కానిచ్చారు. సుమారు 12.45 గంటల సమయంలో మురళీకృష్ణ కార్యాలయంలో పనిచేస్తున్న దబేర శ్రీనివాసరావు అనే యువకుడు లక్ష్మీనారాయణకోసం హోటల్ నుంచి భోజనం తీసుకుని వచ్చాడు. ఓ దుండగుడు శ్రీనివాసరావును లోపలకు లాగి కాళ్ళు, చేతులు కట్టేసి, ముఖానికి ప్లాస్టర్ వేశారు. హతమారుస్తామని బెదిరించారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు రూ. 23లక్షల బంగారు ఆభరణాలు, రూ. 7లక్షల నగదును చక్కబెట్టారు ఒంటిగంటన్నర సమయంలో అక్కడకు పనిమనిషి రావడాన్ని బయటవున్న దొంగలకు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లోపలకు సమాచారం అందించారు. దాంతో దొంగలు చప్పుడు కాకుండా బయటకు వచ్చి కారులో వెళ్లిపోయారు. ఇప్పటికైనా దృష్టి సారించాలి.... నగరంలో ఆరు పోలీసు స్టేషన్లు ఉండగా, ఇటీవల వరకు అరండల్‌పేట, గుంటూరు రూరల్, కొత్తపేట, పాతగుంటూరు స్టేషన్లకు సీఐలు లేరు. దీంతో పోలీసు సిబ్బంది ఇష్టాను సారంగా వ్యవహరించారు. ఇటీవల అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ ఆయా స్టేషన్లకు అటాచ్‌మెంట్‌పై సీఐలను నియమించినప్పటికీ కొత్త కావడంతో వారికి ఇంకా అవగాహన రాలేదు. ఏదేమైనా నగరంలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు చూసి నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా దొంగతనాలు, దోపిడీలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నగర వాసులు కోరుతున్నారు. -
దోపిడీ దొంగల కిరాతకం
చోరీకి వచ్చి దాడి.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేసి బంగారు ఆభరణాలతో పాటు నగదుతో ఉడాయించారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెరుకు నర్సింహ అదే గ్రామంలో ఖిలాషాపురం క్రాస్ రోడ్డు వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంటికి కొంత దూరంలో సోదరుడు సత్తయ్య నివసిస్తున్నాడు. నర్సింహ సోదరుని వద్ద ఉంటున్న వారి తండ్రి ఆరురోజుల క్రితం మరణించాడు. సంప్రదాయాల ప్రకారం గురువారం ఐదవరోజు కార్యక్రమాలు నిర్వహించి రాత్రి నర్సింహ తన సోదరుడి ఇంటి వ ద్దనే భార్య రేణుకతో ఉండిపోయాడు. కుమారుడు హర్షవర్ధన్(08), కూతురు అఖిలానందిని(11), అత్త బూడిద లచ్చమ్మ (51), లచ్చమ్మ తల్లి లింగంపల్లి రాధమ్మ(71)లను ఇంటికి వెళ్లి పడుకోమని పంపాడు. వారు వచ్చి.. హోటల్లోని ఇంట్లో పడుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున దుండగులు ఇంటి వెనకాల తలుపును పైకి లేపి ఇంట్లో దూరారు. మధ్య గదిలో ఉన్న బీరువాను తెరుస్తుండగా అలికిడికి కుటుంబ సభ్యులు లేవడంతో వారిపై దాడికి తెగ బడ్డారు. కత్తి, రాడ్లతో దాడి చేయగా లచ్చమ్మతో పాటు మనుమరాలు అఖిలానందిని అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న రాధమ్మను వరంగల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. తీవ్ర గాయాలతో ఉన్న హర్షవర్ధన్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దొంగలు లచ్చమ్మ, రాధమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవడంతో పాటు బీరువాలోని తొమ్మిది తులాల బంగారం, రూ.90 వేల నగదు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య ఇంట్లోకి దూరి రూ.11 వేల నగదు, మూడు గ్రాముల బంగారం అపహరించడంతో పాటు మరో రెండిళ్లను దోచుకోవడానికి యత్నించారు. వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, అడిషనల్ ఎస్పీ కె.శ్రీకాంత్ సంఘటనా స్థలిని సందర్శించారు. -
చచ్చినట్లు ...35 బక్కెట్ల నీళ్లు ఇవ్వాల్సిందే
మనిషికి గాలిలోని ఆక్సిజన్ తరువాత అతి ముఖ్యమైనది నీరు. అలాంటి నీటి కోసం భవిష్యత్‌లో యుద్ధాలు చేసే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల సంగతి ఏమోకానీ భారత్ లోనూ ఆ సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో నీటి సమస్య వేధిస్తోంది. అసలే తాగునీటి కొరతతో అల్లాడుతున్న అక్కడ గ్రామీణులకు బందిపోట్ల నుంచి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. అది కూడా తాగునీటి కోసం అంటే నమ్మరేమో. బందిపోట్లకు ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు. దాంతో ఆ ప్రాంత గ్రామస్తుల నీటి కష్టాలు వారి ప్రాణాల మీదకు తెస్తోంది. బుందేల్‌ఖండ్ ప్రాంత ప్రజలు ఓవైపు కరువు ఛాయలు, మరోవైపు తాగునీటికి కటకటలాడే దుస్థితి ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి బందిపోట్లు ఓ షరతు విధించారు. అది ఆషామాషీ షరతు కానే కాదు....ఏకంగా రోజుకు 35 బకెట్ల తాగునీటిని తమకు సరఫరా చేయాలని అక్కడ 28 గ్రామల ప్రజలకు హుకుం చేశారు. దీనిని రోజువారీ ‘నీటిపన్ను’గా వారు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో గ్రామం వంతుల వారీగా కరువుకాలంలోనూ చచ్చి.. చెడి 35 బకెట్ల నీటిని బందిపోట్లకు సరఫరా చేస్తోంది. ఇందు కోసం మైళ్ల కొద్ది నడిచి ఈ నీటిని సేకరిస్తోంది. నిజానికి దశాబ్దాల కిందటే బందిపోటు దొంగల సంస్కృతి దేశంలో చాలావరకు తగ్గిపోయింది. అయినా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొద్దిసంఖ్యలో ఉన్న బందిపోట్లు ఇంకా ఆగడాలు కొనసాగిస్తున్నారు. ఆహారం, తాగునీరు, ఆశ్రయం కోసం గ్రామాలపై విరుచుకుపడుతున్నారు. బందిపోటు ముఠా నాయకుడి ఆచూకీ చెప్తే పెద్ద ఎత్తున రివార్డు ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే దట్టమైన అడవి ప్రాంతాన్ని తమ ఆవాసంగా చేసుకొని అమాయక గ్రామీణ ప్రజలను బెదిరించి బతకడమే ఈ బందిపోట్లకు ధ్యేయంగా మారింది. ఇక దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అక్కడ పోలీసులు చెబుతున్నారు. ఇక నీటి కష్టాలు ఎలా ఉంటాయంటే ....నీళ్లు లేవని కొన్ని ప్రాంతాలలో యువకులకు పెళ్లిళ్లు కావటం లేదంటే అతిశయోక్తి కాదు. ఆప్రాంతపు యువకులకు తమ ఆడపిల్లలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవటంతో వారు బ్రహ్మచారులుగానే మిగిలిపోవాల్సి వస్తోంది.