జైపూర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. ఆరుగురు బందిపోట్లు కుటుంబ సభ్యులను, ఇతర గ్రామస్తులను బంధించి ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున కరౌలి జిల్లా కరన్పూర్ ప్రాంతంలో ఈ దుశ్చర్య జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు బందిపోటు దొంగలు మద్యం సేవించి గ్రామంలోకి ప్రవేశించి మగవాళ్లను బంధించారు. ఇద్దరు వివాహితులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గ్రామస్తుల్లో భయం కలిగించేందుకు ఓ దొంగ కాల్పులు జరిపాడు. బుల్లెట్లు గురితప్పి మరో దొంగకు తగలడంతో అతను చనిపోయాడు. గ్రామస్తులు ఎదురుదాడికి దిగి ఓ దొంగను బంధించారు. మిగిలినవారు పారిపోయారు.
ఇద్దరు మహిళలపై బందిపోట్లు గ్యాంగ్రేప్
Published Tue, Apr 28 2015 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement