DRDA project director
-
చిత్తూరు.. మీ ఓటు చెక్ చేసుకోండిలా..
సాక్షి, చిత్తూరు : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కలెక్టరేట్లోని ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ : 08572–240899 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఓటు నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
గ్యాంగ్‌రేప్: నిందితుల్లో డీఆర్డీఏ పీడీ
లక్నో: డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తోపాటు మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ప్రాంతంలోని షామిలిలో ప్రభుత్వ కార్యాలయంలో రెండు నెలల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది. దాంతో బాధితురాలు రాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించింది. నిందితులను అరెస్ట్ చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని బాధితురాలు కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్ నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం నిందితులు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్ఞాన్ ప్రకాశ్,అసిస్టెంట్ ఇంజినీర్ దినేష్ కుమార్,గుమస్తాలు రాజ్‌కుమార్,ఆనంద్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎడిషన్ ఎస్పీ వి.కె.మిశ్రా వెల్లడించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిశ్రా వివరించారు.