పోలీసులుగా వచ్చి ముగ్గురు మహిళలపై..!
పోలీసులుగా వచ్చి ముగ్గురు మహిళలపై..!
Published Thu, Nov 3 2016 4:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
గ్రేటర్ నోయిడా: ఇటుకబట్టీ కార్మికులైన ముగ్గురు మహిళలపై ఆరుగురు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. తాము పోలిసులమంటూ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన దోపిడీదారులు ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోని కోళ్లను ఎత్తుకొని పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని కరోలి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు గ్రేటర్ నోయిడా ఎస్పీ సుజాతాసింగ్ తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
‘దుండగులు పోలీసుల పేరిట అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. అక్రమంగా సారా ఉందా అనేది తనిఖీ చేసేందుకు వచ్చామని బెదిరించారు. అనంతరం ఇంట్లో ఉన్న మగవారిని కట్టేసి.. వస్తువులన్నిటినీ దోచుకున్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలను తిని.. ముగ్గురు మహిళలపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోతూపోతూ ఆరు కోళ్లను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు’ అని బాధిత మహిళ భర్త ఒకరు తెలిపారు.
Advertisement
Advertisement