loot
-
దుకాణమంతా దోచేయండి
పెర్త్: ఆషాడం సేల్. సగం ధరకే పట్టుచీర. బట్టల దుకాణాల్లో తరచూ కనిపించే ప్రకటన ఇది. ఇక జనరిక్ మందుల దుకాణాల్లో 70 శాతం, 80 శాతం డిస్కౌంట్ బోర్డులను అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా 100 శాతం డిస్కౌంట్. అంటే ఉచితంగా పట్టుకెళ్లండి అనే షాప్ మీరు ఎక్కడా చూసి ఉండరు. అలాంటి దుస్తుల దుకాణం కొద్దిసేపు తెరచి ఉంచితే మరు నిమిషంలో సరుకంతా మటుమాయమైన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. పెర్త్ నగరంలో స్ట్రీట్‌ఎక్స్ అనే దుస్తుల షోరూమ్ ఉంది. దాని యజమాని డేనియల్ బ్రాడ్షాకు కొత్త ఆలోచన వచ్చింది. ‘‘టీ–షర్ట్‌లను షాప్‌లో సిద్ధంగా ఉంచుతా. దోచేయండి’’అని యువతకు మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు. అంతే ఇక. టీ–షర్ట్‌లను పట్టుకెళ్లేందుకు యువత పోటెత్తింది. గురువారం ఉదయం దుకాణం షట్టర్ పైకెత్తగానే యువతీయువకులు పరుగుపరుగున లోపలికి దూరేసి దొరికింది పట్టుకెళ్లారు. ఎగబడి కలబడి టీ–షర్ట్‌లను ఎగరేసుకుపోయారు. తొక్కిసలాటలో దెబ్బలు తగులుతాయని ముందు జాగ్రత్తగా ఒక యువకుడు హెల్మెట్, మోకాళ్లు, మోచేతులకు ప్యాడ్లు ధరించిమరీ జనంలోకి దూకాడు. తోపులాటలో చిన్నపాటి గీసుకుపోవడం లాంటి దెబ్బలు తప్ప చెప్పుకోదగ్గ, ఆస్పత్రిలో చేరేంత స్థాయి గాయాలు ఎవరికీ కాలేదు. గతంలో సైతం షాప్ యజమాని ఒక భారీ ట్రక్కు నిండా దుస్తులు ఇలాగే ఉచితంగా దోచేసే ఆఫర్ ఇచ్చాడని అక్కడికొచి్చన ఒకావిడ చెప్పింది. గురువారం దుకాణంలో దాదాపు 400 టీ–షర్ట్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. -
టమాటా ట్రక్కు బోల్తా.. పండుగ చేసుకున్న జనం
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ. 100ను దాటింది. దీంతో సామాన్యులు టమాటాను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్‌లో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని సాగర్ నుండి టమోటాలతో ఢిల్లీ వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటన బంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజువా గ్రామం సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టమాటాలతో నిండిన ట్రక్కు బోల్తా పడిందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు టమాటాలను ఏరుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ట్రక్కు నుంచి బయటపడిన టమాటాలు సంచులలోకి ఎత్తి తీసుకువెళ్లగా, మరికొందరు దర్జాగా ట్రక్కు లోనికివెళ్లి, టమోటాలను దక్కించుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ గుమిగూడిన జనాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 15 క్వింటాళ్లకు పైగా టమాటను జనం దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ ట్రక్కులోని టమాటాలను మరో వాహనంలోని ఎక్కించి, అది వెళ్లాల్సిన గమ్యస్థానానికి తరలించేందుకు డ్రైవర్‌కు సహకరించారు. -
రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్
లక్నో: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం పేరిట దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. మందిర నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ క్యూఆర్ కోడ్లు వెలుగులోకి వచ్చాయి. వీటిని గుర్తించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ కుంభకోణానికి గురికావద్దని ప్రజలను కోరింది. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య పేరిట ఓ సోషల్ మీడియా పేజ్‌ను దుండగులు క్రియేట్ చేశారు. ఇందులో పోస్టు చేసిన క్యూఆర్ కోడ్‌తో రామ మందిర నిర్మాణం పేరుతో నిధులను అందించమని వినియోగదారులను కోరుతున్నట్లు గుర్తించామని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. ప్రజలు ఈ మోసానికి గురికావద్దని కోరారు. "మీకు చేతనైనంత విరాళం ఇవ్వండి. డైరీలో మీ పేరు, నంబర్ నమోదు చేయబడుతుంది. ఆలయం పూర్తయిన తర్వాత, మీ అందరినీ అయోధ్యకు ఆహ్వానిస్తారు. నేను ఉన్నాను. అయోధ్యలోనే ఉన్నాను." అని రామాలయం పేరుతో విరాళాలు కోరిన వ్యక్తి కోరాడు. దీనిపై స్పందించిన వీహెచ్‌పీ.. ఇలాంటి మోసాల్లో బాధితులు కావద్దని ప్రజలకు తెలిపారు. ఇదీ చదవండి: Ayodhya Airport: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణమిదే!
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుడి ప్రసాదాన్ని అక్కడి భక్తులు దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తుందట. ఆలయల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు,పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్‌లోని రాజసమంద్ని శ్రీనాథ్జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయడం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుంది. ప్రసాదాన్ని దొంగిలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చేసి తింటే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. దీనివల్ల తమ కష్టాలు, దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి పోతుంటారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోరు. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్జీ స్వామివారికి ఇష్టమట. ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవలె మమోత్సవం జరగగ్గా అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. -
లూటీకి మాత్రమే కాంగ్రెస్ గ్యారెంటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. ఆ పార్టీ లూటీకి మాత్రమే గ్యారెంటీ ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన డబ్బు వసూళ్ల కోసం కర్ణాటకను ఆ పార్టీ ఏటీఎంలా మార్చేయడం సిగ్గు చేటన్నారు. కర్ణాటకలోని కొందరు కాంట్రాక్టర్ల నివాసాలపై దర్యాప్తు సంస్థల్లో సుమారు రూ.100 కోట్ల అక్రమసొత్తును బయటపడినట్లుగా వచ్చిన వార్తలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతి డీఎన్ఏకి ఇది ఒక చిన్న మచ్చుతునక మాత్రమేనని ఆయన సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులైన ఈ కాంట్రాక్టర్లే గత బీజేపీ ప్రభుత్వం కమీషన్లు వసూలు చేస్తోందంటూ ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి పెచ్చుమీరిందని ఆరోపించారు.‘కాంగ్రెస్, అవినీతి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను కూడా కాంగ్రెస్ అవినీతికి ఏటీఎంలుగా మార్చుకుంది. ఇప్పుడు తెలంగాణ, మధ్యప్రదేశ్‌లను కూడా ఏటీఎంలుగా మార్చి ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఉద్దేశించిన ధనాన్ని దోచుకోవాలని కలలుగంటోంది. కాంగ్రెస్ లూటీకి మాత్రమే గ్యారెంటీ ఇవ్వగలదు’అని నడ్డా ఆరోపించారు. హామీలు ఇవ్వడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి హామీలకు బదులు గ్యారెంటీలిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. -
Karnataka Assembly elections 2023: బీజేపీది చీకటి పాలన: సోనియా
హుబ్బళ్లి: అధికార బీజేపీని గద్దె దించకుండా దేశం అభివృద్ధి చెందదని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ పేర్కొన్నారు. బీజేపీ పాల న లూటీ, మోసం, అహంకారం, విద్వేషాల తో నిండిఉందని ఆమె తూర్పారబట్టారు. సోనియా గాంధీ శనివారం మొట్టమొదటి సారిగా కర్ణాటకలో ని హుబ్బళ్లి ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. హుబ్బళ్లి సభలో ఆమె మాట్లాడారు. బీజేపీ దోపిడీ పాలన, చీకటి పాలనకు వ్యతిరేకంగా గొంతు కలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు. బీజేపీ అణచివేతలతో ప్రజలు వణికిపోతున్నారని ఆమె అన్నారు. ‘లూటీ వ్యాపారంగా మారిం 2018లో మీ రు వారికి అధికారం ఇవ్వలేదు కానీ, వారు బలవంతంగా చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత వారి 40 శాతం కమీషన్ ప్రభుత్వం దోపిడీలో భాగంగా మారిపోయింది’అని సోనియా అన్నారు. ఇలా ఉండగా.. ‘40 శాతం కమీషన్ సర్కార్, భరించలేనంతగా పెరుగుతున్న ధరలు, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఎప్పటికీ పూర్తికాని నిర్మాణా లతో బెంగళూరులో గుంతలు..వాస్తవమైన ఈ సమస్యలపై ప్రధాని ఏమాత్రం మాట్లాడరు’అని కాంగ్రెస్ పేర్కొంది. -
సిగ్గు..సిగ్గు.. వీధి వ్యాపారిని దోచేసిన జనం!
న్యూఢిల్లీ: కష్టాలు వచ్చినప్పుడే మనలోని అసలు మనిషి బయటకు వస్తాడు. బాగున్నప్పుడు విలువలు చెప్పి.. కష్టాల్లో ఉన్నప్పుడు తప్పులు చేస్తే ఇక విలువలకు అర్థం ఏం ఉంటుంది. ఇప్పడు ఈ ముచ్చట ఎందుకంటే పైన చెప్పిన డైలాగ్‌కు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి ప్రస్తుతం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చోటు అనే వ్యక్తి బండి మీద మామిడి పళ్లు పెట్టుకుని అమ్ముతుంటాడు. ఈ క్రమంలో నిన్న ఓ స్కూల్ దగ్గర పండ్ల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటుండగా.. చోటుకు, పక్క దుకాణదారుకి గొడవ జరిగింది. వారిద్దరూ అలా కొట్టుకుంటుండగా ఆ పక్క వెళ్లే జనాలు దీన్ని అదునుగా భావించి చోటు బండి మీద ఉన్న మామిడి పళ్లను అందినకాడికి అందుకుని వెళ్లారు. కొందరు హెల్మెట్‌లో పెట్టుకుని మరి వెళ్లారు. చోటు వచ్చి చూసేసరికి బండి మొత్తం ఖాళీ అయ్యింది. దాదాపు 30 వేల రూపాయల విలువైన మామిడి పళ్లను ఎత్తుకెళ్లారు జనాలు. ఖాళీ బండి చూసి లబోదిబోమంటున్నాడు చోటు. లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలుగా జనాలకు పనులు లేవు.. డబ్బులు కూడా లేవు. మరోవైపు మామిడి పళ్ల రేటు ఆకాశాన్ని తాకింది. ఈ క్రమంలో జనాలు.. ఇదే చాన్స్‌గా అందినకాడికి మామిడి పండ్లను ఎత్తుకుని వెళ్లారు. (ఈ ఏడాది నయమే..) -
ఫైబర్ నెట్ ప్రాజెల్టు రెండో దశలోనూ దోపిడి
-
నీళ్లను కూడా అమ్ముకుంటున్న తెలుగు తమ్ముళ్లు
గుంటూరు వెస్ట్: దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. మట్టి, ఇసుక అమ్ముకుని కోట్లు గడించిన నేతలు చివరకు రైతులకు అందాల్సిన సాగునీటిని కూడా దారి మళ్లించి అమ్మేసుకుంటున్న వైనం సోమవారం మీ కోసం కార్యక్రమంలో వెలుగులోకి వచ్చింది. అమరావతి మండలం నరుకుళ్ళపాడు, పరిసర గ్రామాల రైతులు దాదాపు 400 మంది వచ్చి ఈ విషయమై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ.ఎం.డి.ఇంతియాజ్, డి.ఆర్.ఒ.శ్రీలత, జెడ్పీ సీఈఓ సూర్య ప్రకాశరావు, జె.సి–2 విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. మీ కోసం కార్యక్రమానికి వచ్చిన కొన్ని ఫిర్యాదులివి. నీళ్ళు అమ్ముకుంటారా? రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం అదే రైతుల నోట్లో మట్టి కొడుతుంటే అధికారులు వేడుక చూస్తున్నారు. పాటిబండ్ల, మండెపూడి డొంక ద్వారా నరుకుళ్ళపాడు ఎం.మైనర్ కాలువకు వచ్చే నీటిని అధికార పార్టీ కార్యకర్తలు తూముల ద్వారా నీటిని మళ్లించి అక్రమంగా ట్యాంకర్ల ద్వారా విక్రయించుకుంటున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో దాదాపు 300 ఎకరాలకు నీళ్లు అందడంలేదు. బీద బడుగు వర్గాల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో స్థానిక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితంలేదు. కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయకపోతే రాస్తారోకో చేస్తాం. –కె.హరిబాబు, అల్లం దేవదానం రెడ్డి తదితరులు తహసీల్దార్ అమ్ముడుపోయి మాకు అన్యాయం చేశాడు మాది శావల్యాపురం మండలం మతుకుమల్లి గ్రామం. ఇక్కడ మాకు ఎకరం పొలం ఉంది. దీనికి పట్టాదారు, రైతు హక్కు పుస్తకం, బి–1 ఫారాలు, శిస్తు అన్నీ ఉన్నాయి. మా పొలం సరిహద్దులో ఉండే వ్యక్తికి అమ్ముడుపోయిన తహసీల్దార్, వీఆర్వోలు మాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మా అమ్మకు ఇప్పుడు 70 ఏళ్లు. అధికారులు మాకు న్యాయం చేయకపోగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. –ఎం.రంగమ్మ, కుమారుడు వికలాంగులనే కనికరం కూడా లేదా? నా కుమార్తె కమలకు వినబడదు, మాట్లాడలేదు. గతంలో మాకు మానసిక వికలాంగురాలు కింద సర్టిఫికెట్ ఇచ్చారు. వాస్తవానికి మాకు రావాల్సింది డెఫ్ అండ్ డంబ్ సర్టిఫికెట్. దీనికోసం ఎన్నో పర్యాయాలు తిరిగినా ఫలితం లేదు. జీజీహెచ్‌కు వెళ్లమని చెబుతున్నారు. అక్కడ మా గోడు వినేవాడే లేడు. గతంలోనూ కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాం. వికలాంగుల పట్ల కాస్త దయతలచండి. –జానపాటి విద్యావాణి పేదలకందని ప్రభుత్వ పథకాలు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు నెలకు రూ.35 వేలు జీతం తీసుకుంటోంది. ఆమె భర్తకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్లో రూ.2 లక్షలు రుణం కూడా పొందాడు. ఈ విషయాలను ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురించినా ఎందుకు చర్యలు చేపట్టలేదు. నేను ఎంతో కాలంగా తెల్ల రేషన్ కార్డు కోసం తిరుగుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. –ఎం.జార్జి, తాడేపల్లి -
న్యూఇయర్ వేడుకల్లో జనాలు, దొంగలు మాత్రం..
సాక్షి, రంగారెడ్డి : అందరూ న్యూ ఇయర్ వేడుకలో మునిగి తేలుతుండగా.. దొంగలు మాత్రం అదే అదునుగా చూసుకున్నారు. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం రగన్నగుడ గ్రామంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దుండుగులు చోరికి ప్రయత్నించారు. బ్యాంకు వెనుక నుంచి గోడకు రంధ్రం చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లోపల లాకర్ తెరవడంలో మాత్రం విఫలయత్నం పొందారు. లాకర్ తెరుచుకోకపోవడంతో, దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయినట్టు తెలిసింది. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉండగా.. దుండగులు ఈ చోరికి ప్రయత్నించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అక్కడున్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. -
న్యూ ఇయర్ వేళ బ్యాంక్ చోరీకి విఫలయత్నం
-
ఆర్టీసీ దసరా దోపిడి
-
నాలుగే నిమిషాల్లో ఇల్లుగుల్ల
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కారులో వచ్చిన దొంగలు తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి క్షణాల్లో పని ముగించుకుని వెళ్లిపోయారు. విలువైన వస్తువులన్నిటినీ ఇంట్లోనే ఉన్న సూట్‌కేసులో సర్దుకుని అక్కడి నుంచి దర్జాగా ఉడాయించారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కాగా చూసి ఆశ్చర్యపోవటం పోలీసుల వంతయింది. వివరాల్లోకి వెళితే దొడ్డబళ్లాపురం పాత బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న బెస్తరపేటలో నివసిస్తున్న నరేష్ బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరిగే పూజకు వెళ్లాడు. విషయం పసిగట్టిన గుర్తు తెలియని దొంగలు దర్జాగా కారులో అక్కడికి చేరుకున్నారు. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.30 వేల నగదుతో ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉన్న ఒక సూట్‌కేస్‌లో సర్దుకుని వెళ్లిపోయారు. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నరేష్ కుటుంబం చోరీ జరిగిన సంగతి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు ఇద్దరు ఒక ఇండికా కారులో వచ్చి నాలుగే నిమిషాల్లో చోరీ సొత్తున్న సూట్‌కేస్‌తో వెళ్లడం ఇంటి ముందు ప్రైవేటు కార్యాలయం సీసీ టీవీలో రికార్డయింది. తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రైతు కంట్లో ఇసుక
► బరితెగించిన మాఫియా ► జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ ► రోజూ తమిళనాడుకు 200 పైగా లారీలు ► మరో 150 లారీలకు పైనే కర్ణాటక రాష్ట్రానికి ► అధికారులకు నెలకు రూ.30 లక్షల మామూళ్లు ► ఇసుక దొంగలతో అధికార పార్టీ నేతల కుమ్మక్కు జిల్లాలో ఇసుక బకాసురుల అవతారమెత్తిన టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నదులు, చెరువులు, కుంటలు.. ఇలా దేన్నీ వదలడం లేదు. ‘ఉచితం’ మాటున అందిన కాడికి అడ్డంగా తోడేస్తున్నారు. ఎదురు తిరిగిన వారికి నరకం చూపిస్తున్నారు. అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసి కక్ష తీర్చుకుం టున్నారు. వీరితో కుమ్మక్కయిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇందులో పోలీసులదే పెద్ద చేయిగా కనిపిస్తోంది. స్వర్ణముఖినది పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో పనిచేసే సీఐలు, ఎస్ఐలకు నెలకు రూ. 30 లక్షల మేర మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ఇసుక మాఫియా అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికారులతో చేతులు కలిపి రైతుకు చుక్కలు చూపిస్తున్నారు. సాగు, తాగునీరులేకుండా వారి నోట్ల ఇసుక కొడుతున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, చిత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు, పూతలపట్టు ప్రాంతాల్లో ఇసుక దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఏర్పేడు సంఘటనతో ఆరు రోజులు ఆగినా ఆపై యథాతథంగా కొనసాగుతోంది. ఇసుకాసురుల ఆగడాలకు జిల్లాలోని నదులన్నీ వాటి స్వరూపాన్ని కోల్పోతున్నాయి. చెరువులు, బావులు బావురమంటున్నాయి. జిల్లాలోని స్వర్ణముఖి, పాలారు, నీవా, కాళంగి, కౌండిన్య నదుల్లో దాదాపు 70 శాతం ఇసుక దోపిడీకి గురైనట్లు అంచనా. ఆ ఉదంతంతో మరింత దోపిడీ కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపైదెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశాడు. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న వనజాక్షిని సీఎం అభినందించక పోగా ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. దీంతో జిల్లాలోని అధికారులందరూ ఇసుక దందాను అరికట్టే విషయంలో వెనుకంజ వేయడం మొదలు పెట్టారు. చిత్తూరు జిల్లాలో నిన్నా మొన్నటి వరకూ పనిచేసిన కలెక్టర్ ఇసుక దోపిడీపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్నది బహిరంగ సత్యం. పోలీసులు, మైనింగ్ శాఖలను అప్రమత్తం చేయకపోగా, నోరు తెరవలేని రెవెన్యూ అధికారులను ఇసుక తరలింపు మండలాలకు తహసీల్దార్లుగా నియమించారు. దీనికి తోడు కొంత మంది సీఐలు, ఎస్ఐలు మాఫియా నేతలతో మైత్రీబంధాలను బలపర్చుకుని నెలసరి మామూళ్లకు అలవాటు పడ్డారు. దీంతో రెండేళ్లుగా ఇసుక తరలింపు ఊపందుకుంది. ఎక్కడెక్కడి నుంచి ఎటు వైపు.. జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, తొట్టంబేడు, వరదయ్యపాళెం మండలాల్లో ఎక్కువ ఇసుకను తోడేస్తున్నారు. ప్రభుత్వం ఉచితమని ప్రకటించాక ఇక్కడి దోపిడీ మరింత ఎక్కువైంది. శ్రీకాళహస్తి మండలలోని చుక్కలనిడిగల్లు, పుల్లారెడ్డి కండ్రిగ, అమ్మపాళెం, తొండమనాడులోనూ, ఏర్పేడు మండలం మునగలపాలెం, గోవిందాపురం సరిహద్దుల్లో స్వర్ణముఖిని కేంద్రంగా చేసుకుని రోజూ వందల ట్రక్కుల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీకి నాయకత్వం వహిస్తోన్న టీడీపీ నేత ధనుంజయలునాయుడు గ్రామమైన గోవిందాపురంలో ఒక్కో ఇంట్లో మూడేసి ట్రాక్టర్లు ఉన్నాయి. ఇసుక తరలింపు కోసమే ఇక్కడ కొంత మంది ట్రాక్టర్లు కొన్నారు. ఇక్కడి టీడీపీ నాయకులు రెండేళ్లలో ఇసుక దోపిడీ ద్వారా వందల కోట్లు సంపాదించారని సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయలు నాయుడు రూ.2 కోట్లతో తిరుపతిలో ఇల్లు నిర్మించుకుంటున్నాడంటే అధికార పార్టీ నేతల అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పోలీసుల పాత్రే కీలకం జిల్లాలో ఇసుక మాఫియాతో పోలీసులు మిలాఖత్ అయ్యారు. ప్రధానంగా శ్రీకాçళహస్తి, సత్యవేడు, ఏర్పేడు, రేణిగుంట స్టేషన్లలో పనిచేసే కొందరు పోలీస్ అధికారుల పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఏర్పేడు దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు మునగలపాలెం వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ గ్రామ బాధితులు సీఐ సాయినాథ్‌పై ఎక్కువగా ఫిర్యాదు చేశారు. రాజీ చర్చల పేరిట సీఐ గ్రామస్తులను నిర్లక్ష్యం చేశాడని, ఇసుక మాఫియాకు సహకారం అందించారని చెప్పారు. అదేవిధంగా ఏర్పేడు ఎస్ఐ రామకృష్ణపై కూడా ఆరోపణలున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ మధ్యనే సీఐని వీఆర్‌కు పంపి, ఎస్ఐని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో పనిచేసే పోలీస్ అధికారుల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. శ్రీకాళహస్తి, సత్యవేడు, తొట్టంబేడు, వరదయ్యపాళెం పోలీసుల పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలిసింది. తమిళనాడు వెళ్లే ఇసుక లారీలన్నీ వరదయ్యపాళెం స్టేషన్ మీదగానే వెళ్లాలి. ఈ నేపథ్యంలో ఇక్కడున్న పోలీసు అధికారులు మాఫియాతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటున్నారన్నది ఆరోపణ. జిల్లా అంతటా ఇదే తంతు చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి ప్రాంతాల్లోనూ ఇసుక భారీగా దోపిడీకి గురవుతోంది. పలమనేరు నియోజకవర్గం నుంచి నిత్యం 60కి పైగా లారీలోడ్లు రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. కృష్ణాపురం, సముద్రపల్లె, పెంగరకుంట, రామాపురం, ముసలిముడుగు గ్రామాలకు పక్కనే ఉన్న కౌండిన్య నది నుంచి ఇసుక తోడేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ మండలస్థాయి టీడీపీ నేత నేరుగా ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నుంచి రాత్రిపూట అధికార పార్టీ నాయకులు ఇసుకను తరలిస్తున్నారు. గాజులేరు, ఎర్రావారిపాలెం, కప్పలేరు ప్రాంతాల్లో భారీగా ఇసుక చోరీ జరుగుతోంది. బహుదానది నుంచి ఎక్కువ మొత్తంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. శాంతిపురం మండలం సోగడబళ్లచెరువు, చేగడదిన్నెచెరువు, రెడ్డపల్లె, పాలారు వంకల నుంచి నిత్యం ఇసుక దోపిడీ జరుగుతుంది. పరారీలో ఇసుకాసురులు కాగా ఏర్పేడు సంఘటన తరువాత శాండ్ మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలున్న టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. వ్యవహారం ఎటు తిరిగి తమ మెడకు చుట్టుకుంటుందోనన్న భయంతో ఎక్కువ మంది ఇసుకాసురులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చాలా మంది బెంగళూర్, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. వీరిని వెతికి పట్టుకునే విషయంలో జిల్లా పోలీసులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో దోపిడి
-
పాదచారిని బెదిరించి నగదు దోపిడి
శంషాబాద్: రంగారెడ్డిజిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని రెండు బైకులపై వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.8,500 నగదు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రాంతంలో దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
తుపాకీతో బెదిరించి...పాత నోట్ల చోరీ
గయా(బిహార్): బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు బ్యాంకులో చొరబడి తుపాకీతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బుతో ఉడాయించారు. ఈ సంఘటన గయాజిల్లాలోని గ్రామీణ్ బ్యాంక్ ఆఫ్ బిహార్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. తుపాకీతో బ్యాంకు మేనేజర్‌ను బెదిరించి రూ.21.30 లక్షలు దోచుకెళ్లారు. చోరీ చేసిన మొత్తంలో కేవలం 1.20 లక్షలు మాత్రమే కొత్త కరెన్సీ ఉందని, మిగతా 20.10 లక్షలు రద్దైన పాత 500, 1000రూపాయల నోట్లు ఉన్నట్టు గయా డీఎస్పీ అలోక్ కుమార్ తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో మేనేజర్‌తో పాటూ కేవలం ఇద్దరు కస్టమర్లు మాత్రమే బ్యాంకులో ఉన్నట్టు ఆయన చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. సీనియర్ ఎస్పీ గరిమా మల్లిక్, అడిషనల్ ఎస్పీ బలరామ్ కుమార్ చౌదరిలతో పాటూ మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పోలీసులుగా వచ్చి ముగ్గురు మహిళలపై..!
గ్రేటర్ నోయిడా: ఇటుకబట్టీ కార్మికులైన ముగ్గురు మహిళలపై ఆరుగురు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. తాము పోలిసులమంటూ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన దోపిడీదారులు ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోని కోళ్లను ఎత్తుకొని పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని కరోలి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు గ్రేటర్ నోయిడా ఎస్పీ సుజాతాసింగ్ తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ‘దుండగులు పోలీసుల పేరిట అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. అక్రమంగా సారా ఉందా అనేది తనిఖీ చేసేందుకు వచ్చామని బెదిరించారు. అనంతరం ఇంట్లో ఉన్న మగవారిని కట్టేసి.. వస్తువులన్నిటినీ దోచుకున్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలను తిని.. ముగ్గురు మహిళలపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోతూపోతూ ఆరు కోళ్లను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు’ అని బాధిత మహిళ భర్త ఒకరు తెలిపారు. -
సత్తెనపల్లిలో దారి దోపిడీ
సత్తెనపల్లి(గుంటూరు): సత్తెనపల్లి మండలంలోని నర్సరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద దారిదోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు సంతూరు సుబ్బారావు అనే వ్యాపారిని బాగా కొట్టి రూ.60 వేలు దోచుకెళ్లారు. ఈ ఘటన బుధవారం రాత్రి 11.30 సమయంలో జరిగింది. గురువారం ఉదయం బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం
కాటేదాన్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు ఓ యువకుడు విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వర్షానికి రోడ్డుపై ఎవరు లేకపోవడంతో యువకుడు దాదాపు 32 నిమిషాల పాటు ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. పైక్యాబిన్ను మాత్రమే తొలగించాడు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కాటేదాన్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం సెంటర్‌కు ఎలాంటి సెక్యూరిటి గార్డును ఏర్పాటు చేయలేదు. కేవలం సీసీ కెమెరాను మాత్రమే ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో 20-25 సంవత్సరాల వయస్సు గల ఓ యువకుడు ఏటీఎం సెంటర్లోకి వచ్చాడు. ఏటీఎం క్యాబిన్‌ను గట్టిగా లాగడంతో తెరుచుకుంది. ఇందులో ఏటీఎం సెంటర్‌కు చెందిన ఏసీ రిమోట్ కంట్రోల్, ఏటీఎంలో స్లిప్‌ల కోసం ఏర్పాటు చేసే కాగితపు బండిల్లను స్టోర్‌గా దీనిని వాడుకుంటారు. ఇందులో డబ్బు ఏమైనా దోరుకుంతుందేమో అని నిందితుడు చూశాడు. కానీ ఏమీ దొరకకపోవడంతో తనతో తెచ్చుకున్న స్కూడ్రై వర్తో ఇతర భాగాలను తొలగించేందుకు ప్రయత్నించాడు. దాదాపు 32 నిమిషాల పాటు నిందితుడు ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. భారీ వర్షం కురుస్తుండడంతో ఈ సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడం, ఏటిఎంకు ఎవరు రాకపోవడంతో విషయం తెలియలేదు. ప్రతి రోజు రాత్రి సమయాలలో పెట్రోలింగ్ పోలీసులు ఏటీఎం సెంటర్లను పరిశీలిస్తుంటారు. 3 గంటల ప్రాంతంలో కానిస్ట్టేబుల్ ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చి పరిశీలించగా క్యాబిన్ తెరిచి ఉంది. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉదయం పోలీసులు ఫింగర్‌ప్రింట్స్‌ను సేకరించారు. అలాగే బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించి వీడియోను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టెక్ ఎగ్జిక్యూటివ్‌ను కిడ్నాప్ చేసి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు దుండగులు.. ఐటీ కంపెనీ సీనియర్ మేనేజర్‌ను కిడ్నాప్ చేసి, విచక్షణారహితంగా కొట్టి, దోపిడీకి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. సుమిత్ చక్రవర్తి అనే ఉద్యోగి బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు ఆండ్రూస్ గంజ్ బస్టాప్ వద్ద కంపెనీ బస్ కోసం ఎదురు చూస్తుండగా, ఆయన వద్దకు ఇద్దరు యువకులు వచ్చి తమను బీఎస్ఎఫ్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. మహారాణి బాగ్‌కు వెళ్లేందుకు దారి అడిగారు. కొన్ని నిమిషాల తర్వాత మరో వ్యక్తి కారులో వచ్చి నోయిడా సెక్టార్ 20కు వెళ్లే దారి అడిగాడు. ముందు వచ్చిన ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇవ్వాలని కోరగా మూడో వ్యక్తి అంగీకరించాడు. వారితో పాటు రావాలని ముగ్గురు యువకులు కోరగా, సుమిత్ నిరాకరించాడు. అయితే ముగ్గురు బలవంతంగా ఆయనను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. కారులోపల మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. కారులో నలుగురు దుండగులు సుమిత్తో గొడపపెట్టుకుని చేయిచేసుకున్నారు. ముఖంపైన, ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టారు. సుమిత్ రింగులు, మొబైల్ ఫోన్, పర్స్ లాక్కున్నారు. దుండగులు మధ్యలో కారు ఆపి ఆయనతో డెబిట్ కార్డు పిన్ నెంబర్ అడిగారు. ఏటీఎంకు వెళ్లి ఆయన ఎకౌంట్ నుంచి 40 వేల రూపాయలు డ్రా చేశారు. అనంతరం నోయిడా హైవే వైపు గంటసేపు ప్రయాణించారు. పారి చౌక్ వద్ద కారు ఆపి సుమిత్‌ను బయటకు తోసివేశారు. ఆయన ఎడ్రెస్, వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, ఈ విషయం పోలీసులకు చెప్పవద్దని బెదిరించారు. సుమిత్ ఆటోలో ఇంటికి వెళ్లగా, ఆయన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమిత్ గాయాల తీవ్రతను చూసి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే..
ససారం: ఏటీఏంలో లోడ్ చేయడానికి వ్యాన్‌లో తీసుకెళ్తున్న 20 లక్షల రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లిన ఘటన బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో చోటుచేసుకుంది. కరాఘర్ పోలీసు స్టేషన్‌కు దగ్గరలోని ఎస్బీఐ ఏటీఏంలో గత రాత్రి డబ్బును నింపేందుకు ఆగి ఉన్నవ్యాన్లోని డబ్బును గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై క్యాషియర్, సెక్యూరిటీ గార్డ్లను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాయితో కొట్టి.. బట్టలు చింపి..
అజ్మీర్: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన నలుగురు విదేశీయులపై ఆరుగురు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. అనంతరం వారిని దోచుకున్నారు. ఈ క్రమంలో వారికి గాయాలు కూడా అయ్యాయి. అయితే, ఆ ఆరుగురిలో ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. ఒక మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. అజ్మీర్ ఎస్పీ నితీన్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా, బ్రిటన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు స్పెయిన్, టర్కీ కి చెందిన ఇద్దరు మహిళలు రెండు బైక్ లపై అజయ్ పాల్ దామ్ కు వెళ్లారు. బాగా తాగిన ఆరుగురు దోపిడీ దారులు తొలుత వారిని వెంబడించారు. బాగా తాగి అనకూడని మాటలు అన్నారు. అదే సమయంలో ఓ టూరిస్టు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రాయితో కొట్టారు. ఆ తర్వాత అందులో ఓ మహిళనకు కిందకు లాగి ఆమె దుస్తులు చింపేశారు. వారు ఏదో ఒకలా వారి నుంచి తప్పించుకొని స్థానికుల సహాయంతో బయటపడ్డారు. ఈ దాడిపై స్పందించిన పోలీసులు వేగంగా కదిలి ఆరుగురుని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. -
మహిళను కాల్చి చంపిన దుండగులు
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ప్రాంతంలో అగంతకులు రెచ్చిపోయారు. డబ్బుకోసం ఓ మహిళను కాల్చి చంపారు. లూటీ చేయడానికి వచ్చిన ముగ్గురు దుండగులు డబ్బును కాజేయడంతోపాటు, మహిళను కడతేర్చిన ఘటన ఫూల్ బెహర్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. రెండు లక్షల రూపాయలతో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని వెంటాడిన సాయుధ దుండగులు అగ్గర్ ఖుర్ద్ గ్రామ సమీపంలో మహిళను కాల్చి చంపి వారివద్ద ఉన్న డబ్బును దోచుకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. 35ఏళ్ళ ఆర్తీ దేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్ తమ రెండేళ్ళ కొడుకు, ఓ బంధువుతోపాటు ప్రయాణిస్తున్నారు. ఉన్నట్లుండి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని సాయుధ దుండగులు వారివద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే వచ్చిన ముగ్గురిలో ఒకరిని ఆర్తీ దేవి గుర్తించడంతో వెంటనే ఆమెను పిస్టల్ తో కాల్చి చంపి, డబ్బును లూటీ చేశారు. ఇటీవల తాము కొనుక్కున్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం రెండు లక్షల రూపాయల డబ్బుతో పాటు తమ అత్తమామల వద్దకు బయల్దేరామని, అగ్గర్ ఖుర్ద్ గ్రామ సమీపంలోకి వచ్చేసరికి అగంతకులు డబ్బును లూటీ చేయడమే కాక తన భార్యను తుపాకీతో కాల్చి చంపారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దుండగుల జాడ తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. -
రూ.8 కోట్లు కాజేసిన దుండగులు
హైదరాబాద్: మల్కాజ్‌గిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) లో రూ.8 కోట్ల డిపాజిట్లను దుండగులు కాజేశారు. బ్యాంక్ లిక్విడేటర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చర్చి హుండీని పగులగొట్టిన దుండగులు
అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని చర్చిలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు స్థానిక సీఎస్ఐ చర్చి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న హుండీని ద్వంసం చేసి.. రూ.10వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
లిఫ్ట్ అడిగి దారి దోపిడి
పశ్చిమగోదావరి: పాపం పోనిలే అని లిఫ్ట్ ఇస్తే..నిలువునా దోపిడీ చేశాడు. ఈ సంఘటన చేబ్రోలు దగ్గర ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న కారును లిఫ్ట్ అడిగి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎక్కాడు. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారిని బెదిరించి రూ. 8 లక్షలు దోపిడీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదే చేసి దుండగుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'వాళ్లు దేశాన్ని లూటీ చేశారు'
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సజావుగా సాగనీయకుండా విపక్ష కాంగ్రెస్ పార్టీ దేశానికి నష్టం చేస్తున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. గడిచిన 10 ఏళ్లు దేశాన్ని పాలించిన ఆ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నదని, దీనికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నదన్నారు. జీఎస్టీ, ల్యాండ్ బిల్లులను అడ్డుకోవడంద్వారా కాంగ్రెస్ దేశ ప్రగతికి అడ్డుతగులుతున్నదని, వారిని ప్రజలు చీదరించుకుంటున్నారని వెంకయ్య చెప్పారు. -
అనంతపురం గంగమ్మ ఆలయంలో చోరీ
రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలోని గంగమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. కొంతమంది దుండగులు ఆలయ ద్వారం పగలగొట్టి లోనికి ప్రవేశించి హుండీని దోచుకున్నారు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ ఈవోకు సమాచారం అందించారు. ఈవో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఆలయంలోని హుండీ ఆదాయాన్ని రెండు నెలలుగా లెక్కించలేదని, కానుకలు భారీగానే ఉండవచ్చని ఈవో తెలిపారు. -
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం
-
చింతలపూడి ఆంధ్రాబ్యాంక్‌లో చోరికి యత్నం
చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఆంధ్రాబ్యాంక్‌లో దుండగులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ కార్యాలయంలోని కిటికీ అద్దాలు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చింతలపూడి పోలీసులు విచారిస్తున్నారు. కాగా బ్యాంక్‌లో నగదు చోరీకి గురైందా లేదా అనే దానిపై పోలీసులు ఇంకా నిర్థారణకు రాలేదు. చోరీ యత్నంపై బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించారు. బ్యాంక్ అధికారులు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు క్లూస్ టీమ్‌తో పాటు డాగ్ స్వ్కాడ్ కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. -
శాంసంగ్ కంపెనీలో భారీ దోపిడీ
శావో పౌలో: బ్రెజిల్‌లోని శావో పౌలోకు సమీపంలో గల శాంసంగ్ కంపెనీ ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా సినిమా పక్కీలో జరిగింది. బ్రెజిలియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన కాంపినాస్ వద్ద గల శాంసంగ్ ఫ్యాక్టరీలోకి దాదాపు 20 మంది సాయుధ దొంగలు చొరబడి 215 కోట్ల రూపాయల విలువైన 40 వేల సెల్ఫోన్లు, కంప్యూటర్లను ట్రక్కుల్లో వేసుకుని మరీ పరారయ్యారు. నైట్‌షిప్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును ఫ్యాక్టరీకి కొంత దూరంలో దొంగలు హైజాక్ చేశారు. బస్సులోని ఎనిమిది మందిని బందీలుగా పట్టుకున్నారు. వారి గుర్తింపుకార్డులు, సెల్ఫోన్లు లాక్కున్నారు. ఆరుగురిని గుర్తుతెలియని చోటుకు తరలించి, ఇద్దరితో ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన తర్వాత బందీలను అడ్డుపెట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కున్నారు. ఉద్యోగుల నుంచి సెల్ఫోన్లు కూడా తీసుకున్నారు. ఏమీ జరగనట్లే ఉండాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు ఈ దోపిడీ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. దొంగలు మూడు గంటలపాటు ఫ్యాక్టరీలో తిరుగుతూ తీరిగ్గా పని కానిచ్చేశారు. ఈ సంఘటనలో ఉద్యోగులెవరూ గాయపడలేదని, ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో దశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీస్ లెఫ్టినెంట్ విటర్ చావస్స్ తెలిపారు. విలువైన వస్తువులున్న చోటికే దొంగలు వెళ్లారు. అంటే ఈ దోపిడీ వెనక ఇంటిదొంగల పాత్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి గురైన సెల్ఫోన్లు, కంప్యూటర్ల మొత్తం విలువను ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వెల్లడించింది. -
ఎల్ఐసీ మేనేజర్ నుంచి 19 లక్షల దోపిడీ
బీహార్‌లోని అరారియా జిల్లాలో ఓ ఎల్ఐసీ మేనేజర్‌ను కొంతమంది దుండగులు తుపాకులతో బెదిరించి రూ. 18.9 లక్షలు దోచుకున్నారు. సోమ్‌నాథ్ మిశ్రా అనే సదరు మేనేజర్ సదర్ బజార్ ప్రాంతంలోని తన కార్యాలయం నుంచి డబ్బు తీసుకుని దాన్ని అదే భవనంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మేనేజర్‌తో పాటు ఆ సమయంలో ఓ ప్యూన్ కూడా వెంట ఉన్నాడు. నలుగురు సాయుధులు ఎల్ఐసీ కార్యాలయం వెలుపల వేచి ఉన్నారు. మేనేజర్ బ్యాంకుకు వెళ్లేలోగానే తుపాకి చూపించి ఆయనను బెదిరించి డబ్బు ఉన్న బ్యాగ్ తీసుకుని అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. అప్పటికే ఆ దొంగల సహచరులు బయట మోటార్ సైకిళ్లపై వేచి ఉన్నారని, వీళ్లు రాగానే ఎక్కించుకుని వేర్వేరు దారుల్లో పారిపోయారని అన్నారు. దోపిడీదొంగలను పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. డబ్బు వస్తున్న విషయం వాళ్లకు ముందే ఎలా తెలిసిందని కూడా విచారిస్తున్నారు.