ససారం: ఏటీఏంలో లోడ్ చేయడానికి వ్యాన్లో తీసుకెళ్తున్న 20 లక్షల రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లిన ఘటన బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో చోటుచేసుకుంది. కరాఘర్ పోలీసు స్టేషన్కు దగ్గరలోని ఎస్బీఐ ఏటీఏంలో గత రాత్రి డబ్బును నింపేందుకు ఆగి ఉన్నవ్యాన్లోని డబ్బును గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై క్యాషియర్, సెక్యూరిటీ గార్డ్లను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.