SBI ATM
-
4 నిమిషాలు.. రూ.29.69 లక్షలు!
ఇబ్రహీంపట్నం రూరల్: ముఖాలకు మాస్క్‌లు.. చేతులకు గ్లౌస్లు.. వెంట ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లు.. దర్జాగా స్విఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంలోకి చొరబాటు.. కట్ చేస్తే సినీ ఫక్కీలో నాలుగంటే నాలుగే నిమిషాల్లో రూ.29,69,900 కొట్టేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ చోరీ ఘటన జరిగింది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తెల్లని కారులో ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు.ముందుగా ఒక వ్యక్తి కారులోంచి దిగి ఏటీఎంలోకి ప్రవేశించాడు. అలారం మోగకుండా వైర్లు కత్తిరించాడు. తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. మరో ఇద్దరు వెంటనే కారు దిగి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లతో రాత్రి 1:55 గంటలకు ఏటీఎం లోపలికి ప్రవేశించారు. ఒక వ్యక్తి సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టాడు. దీంతో సీసీ కెమెరాలు బ్లర్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోయింది. వెంటనే గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి, అందులో ఉన్న రూ.29.69 లక్షల నగదు అపహరించుకుపోయారు. ముందే రెక్కీ? ఈ చోరీకి ఒకటి రెండు రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం నాలుగు నిమిషాల్లో పని పూర్తి చేయడంతో దొంగలను ప్రొఫెషనల్స్‌గా భావిస్తున్నారు. కాగా, దుండగుల కారు పహాడీషరీఫ్ వైపు నుంచి వచ్చి మళ్లీ అటే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ చోరీ జరిగిన పది నిమిషాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదిభట్ల పోలీసులకు సమాచారం వచి్చంది. వెంటనే అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు పరారయ్యారు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్, సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, క్రైం డీసీపీ అరవింద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు . ఐదు బృందాలతో గాలింపు రావిర్యాలలో జరిగిన ఈ చోరీ ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆదిభట్ల పోలీసులు, క్రైమ్ సిబ్బంది, ఎస్ఓటీ, సైబర్ క్రైమ్ సిబ్బందిని కలిపి మొత్తం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు వెళ్లిన స్థలాలను, వారి కారు నంబర్‌ను గుర్తించే పనిలో పడ్డారు. -
రంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ
-
దుండగుల గమ్యం గజ్వేల్!
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ తర్వాత గజ్వేల్ వెళ్లాలని భావించారు. సికింద్రాబాద్ నుంచి ఆటోను ఆ ప్రాంతానికే మాట్లాడుకున్నారు. అయితే మార్గమధ్యంలో డ్రైవర్ వ్యవహారశైలిపై వారికి అనుమానం రావడంతో తిరుమలగిరిలో దిగిపోయారని పోలీసుల తాజా దర్యాప్తులో తేలింది. రోషన్ ట్రావెల్స్‌కు చెందిన మేనేజర్ జహంగీర్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు చేస్తున్న నగర పోలీసులు వివిధ కోణాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. బీదర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సైతం దర్యాప్తులో పాలు పంచుకుంటోంది. ఆటో దిగి బ్యాగులు, వస్త్రాలు కొని... ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనంపై బీదర్‌లో దాడి చేసి, ఒకరిని కాల్చి పంపిన దుండగులు నగదుతో హైదరాబాద్ చేరుకున్న విషయం విదితమే. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్‌పూర్‌కు టిక్కెట్లు బుక్ చేసుకోవడం, మినీ బస్సులో బ్యాగుల తనిఖీ, జహంగీర్‌పై కాల్పులు తర్వాత దుండుగల గమ్యం మారింది. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటో ఎక్కిన ఇద్దరూ రైలు మిస్ అవుతుందని, తొందరగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లాలని డ్రైవర్‌ను కంగారు పెట్టారు. సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వరకు వెళ్లిన ఈ ద్వయం అక్కడ కొత్త బ్యాగ్‌లు, వస్త్రాలు ఖరీదు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో లాడ్జిల్లో గదులు ఇప్పించే దళారులు తిరుగుతూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి వీరి వద్దకు వచ్చి రూమ్ కావాలా అంటూ ప్రశి్నంచాడు. గజ్వేల్‌లో మకాం వేయాలని ప్లాన్... తాము ఉండటానికి రూమ్ కావాలని చెప్పిన దుండగులు అయితే ఇక్కడ వద్దని, గజ్వేల్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉందని చెప్పారు. అక్కడ అద్దె ఇల్లు దొరికే వరకు హోటల్లో రూమ్ కావాలని చెప్పారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దళారి తనకు పరిచయస్తుడైన గజ్వేల్‌లోని దళారితో మాట్లాడాడు. అతడు రోజుకు రూ.1500 అద్దెకు రూమ్ సిద్ధంగా ఉందని చెప్పడంతో ఇరువురినీ గజ్వేల్ వెళ్లమని ఇక్కడి దళారి సూచించాడు. అలా వెళ్లడానికి ఆటో మాట్లాడి పెట్టమని దుండగులు కోరడంతో సికింద్రాబాద్ దళారి రూ.1500 కిరాయికి ఆటో సైతం మాట్లాడి పెట్టాడు. గజ్వేల్ దళారి నెంబర్ ఆటోడ్రైవర్‌కు ఇచ్చి, ఇద్దరినీ అతడి వద్ద దింపి రమ్మని చెప్పాడు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతూనే ఆటోడ్రైవర్ ఓసారి దళారితో మాట్లాడాడు.పదేపదే దళారీతో మాట్లాడుతుండటంతో... వీరి ఆటో బయలుదేరిన తర్వాత గజ్వేల్ దళారి రెండుసార్లు డ్రైవర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆటో తిరుమలగిరి వరకు వెళ్లిన తర్వాత మరోసారి కాల్ చేయడంతో దుండగులకు అనుమానం వచి్చంది. అక్కడ ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆటో ఆపమని చెప్పిన ఇరువురూ బ్యాగ్‌లతో సహా ఆటో దిగి రూ.500 చెల్లించి వెళ్లిపోయారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో నగదును ట్రాలీ బ్యాగ్‌ల నుంచి మరో బ్యాగుల్లోకి మార్చుకున్నారు. ఆపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత వ్రస్తాలు సైతం మార్చేశారు. అక్కడ నుంచి మళ్లీ తిరుమలగిరి ప్రధాన రహదారి మీదికి వచ్చి బోయిన్పల్లి వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఈ విషయాలు గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఆటోడ్రైవర్లు, దళారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు.బీ–క్లాస్ పట్టణాలనే ఎంచుకుని... ఈ నేరాలు జరిగిన తీరు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు దుండగులు బీ–క్లాస్ సిటీలు, పట్టణాలనే ఎంపిక చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. పోలీసుల అప్రమత్తత, హడావుడి తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే దుండగులు ఇలా చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని ఈ తరహాకు చెందిన పట్టణం బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లకుండా ఇలాంటి పట్టణమే అయిన గజ్వేల్ వెళ్లడానికి ప్రయతి్నంచారు. ఈ కీలకాంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. మరోపక్క బీదర్‌లో నేరం చేయడానికి, అక్కడ నుంచి సిటీ రావడానికి నిందితులు వినియోగించిన వాహనాన్ని సైతం హైదరాబాద్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారని తెలిసింది. -
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
ఎస్బీఐకి కన్జ్యూమర్ కోర్టు మొట్టి కాయలు వేసింది. కస్టమర్ మోసపోయిన రూ.80వేల నగదును వెంటనే బ్యాంక్ చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.జూలై 4, 2015న ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కి నగర నివాసీ పార్థసారథి ముఖర్జీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరస్తులు న్యూఢిల్లీలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంల నుంచి రూ.80,000 విత్‌డ్రా చేశారు. విత్ డ్రా అయినట్లు ముఖర్జీ ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది. వెంటనే సదరు బ్యాంక్‌కు మెయిల్ పంపాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎం నుంచి ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున మొత్తం ఎనిమిది సార్లు విత్ డ్రా చేసినట్లు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే ఉత్తరాఖండ్ కన్జ్యూమర్ కోర్టునూ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కన్జ్యూమర్ కోర్టు సమస్యను పరిష్కరించి, బాధితుడికి న్యాయం చేయాలని ఢిల్లీ ఎస్బీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టేందుకు ఎస్బీఐ బ్యాంక్‌ను సీసీటీవీ పుటేజీ ఇవ్వాలని కోరారు. అందుకు ఎస్బీఐ అధికారులు తిరస్కరించారు. ఎస్బీఐ అధికారుల తీరుపై బాధితుడు కన్జ్యూమర్ కోర్టుకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే, అగంతకులు విత్ డ్రాపై బ్యాంక్ సత్వరమే చర్యలు తీసుకుందని, తన బ్యాంక్ బ్రాంచ్‌తో పాటు ఇతర బ్యాంక్ బ్రాంచీలకు సమాచారం ఇచ్చామని బ్యాంక్ అధికారులు కన్జ్యూమర్ కోర్టుకు తెలిపారు. తమ (ఎస్బీఐ) సేవల్లో ఎలాంటి లోపాలు లేవని, బ్యాంక్ ఖాతాదారుడు అగంతకులకు కార్డ్ వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ అందించారని స్పష్టం చేసింది. ఎస్బీఐ బ్యాంక్ తీరును ప్రశ్నించిన కన్జ్యూమర్ కోర్టు బాధితుడు నష్టపోయిన రూ.80వేల మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.వివాదాస్పద లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో పోలీసు విచారణను ముగించలేమని రాష్ట్ర కమిషన్ గమనించింది. రికార్డులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా బ్యాంక్ సేవల్లో లోపాలు ఉన్నాయని భావించామనే, కాబట్టే ఈ తీర్పు ఇచ్చినట్లు ఉత్తరా ఖండ్ కన్జ్యూమర్ కోర్టు వెల్లడించింది. -
ఎస్బీఐ ఏటీఎంకు నిప్పు.. మిషన్‌లోని నగదు ఉందా? కాలిపోయిందా?
అనంతపురం క్రైం: అనంతపురంలోని కోర్టు రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు శనివారం వేకువజామున ఇద్దరు దుండగులు నిప్పుపెట్టారు. ఏటీఎంలో రూ.32 లక్షల నగదు ఉండగా, అందులో రూ.8,500 డ్రా చేసిన అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. మిషన్‌లోని రూ.31,91,500 నగదు ఉందా, కాలిపోయిందా అనేది ముంబై నుంచి వచ్చే టెక్నీషియన్ తేల్చాల్సి ఉంది. టూటౌన్ పోలీసుస్టేషన్ సీఐ శివరాముడు, ఎస్ఐ రాంప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. ఈ ఏటీఎం సెంటర్లో 2 మిషన్లు ఉన్నాయి. డబ్బు డ్రా చేసేందుకు శనివారం వేకువజామున 1.58 గంటలకు ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. ఓ వ్యక్తి తలకు టోపీ ధరించాడు. షార్ట్, టీషర్ట్‌తో ఉన్న మరో వ్యక్తి కూడా టోపీ ధరించి ఉన్నాడు. తమకు కావాల్సిన డబ్బు డ్రా చేసుకున్న తర్వాత నిమిషం వ్యవధిలోనే ఏటీఎంపై పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఆంజనేయులు అనే వ్యక్తి గమనించి కొందరి సహాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మంగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మంచిర్యాలలో దోపిడీని.. హైదరాబాద్ నుంచి పసిగట్టారు
జైపూర్ (చెన్నూర్): మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం కొల్లగొట్టేందుకు దుండగులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారు. దొంగలు సీసీ కెమెరాలు బ్లాక్ చేయగా.. ఏటీఎంలోని సీక్రెట్ సీసీ కెమెరా ద్వారా గమనించిన హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సిబ్బంది స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో దండగులు పారిపోయారు. ఎస్బీఐ ఏటీఎంలోకి బుధవారం వేకువజామున మూడున్నరకు గుర్తు తెలియని దుండగుల ముఠా చొరబడింది. కారు, మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగుల్లో ఒకరు చేతులకు గ్లౌజ్‌లు, తలకు మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. దొంగలు ఏటీఎం కేంద్రంలోకి రాగానే పెప్పర్‌స్ప్రేతో సీసీ కెమెరాలను బ్లాక్ చేశారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం కట్ చేసి నగదు ఉన్న రెండు బాక్సులను బయటకు తీశారు. మరో బాక్సు కోసం ప్రయత్నిస్తుండగా.. ఏటీఎంలోపల ఉన్న సీక్రెట్ కెమెరా ద్వారా ఎస్బీఐ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం పరిశీలించి వెంటనే 100 నంబరుకు డయల్ చేసి సమాచారం అందించారు. దీంతో ఎస్టీపీపీలో ఉంటున్న జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ రాజు, ఎస్సై రామకృష్ణ బ్లూకోల్ట్స్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. వారి రాకను గమనించిన దుండగులు నగదు ఉన్న బాక్సులు, గ్యాస్‌కట్టర్ మిషన్, ఇనుప రాడ్డు అక్కడే వదిలి పారిపోయారు. ఏసీపీ, సీఐ, ఎస్సై, బ్యాంకు మేనేజర్ వం«శీ సమక్షంలో ఏటీఎంలో ఉన్న డబ్బును లెక్కించగా రూ.22,44,500 భద్రంగా ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా డబ్బు చోరీకి గురయ్యేదని పోలీసులు తెలిపారు. -
దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్
జమ్మూ కాశ్మీర్ స్థానికులకు, పర్యాటకులకు ఎస్బీఐ భారీ బహుమతి ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారం శ్రీనగర్ లోని దాల్ సరస్సులోని హౌస్‌బోట్‌లో తేలియాడే ఎటిఎంను ప్రారంభించింది. "స్థానికులు, పర్యాటకుల సౌకర్యం కోసం శ్రీనగర్ దాల్ సరస్సులో హౌస్‌బోట్‌లో ఎస్బీఐ ఎటిఎమ్ ప్రారంభించింది. దీనిని ఎస్బీఐ ఛైర్మన్ ఆగస్టు 16న ప్రారంభించారు. ప్రముఖ దాల్ సరస్సులోని #FloatingATM దీర్ఘకాలిక అవసరాన్ని నెరవేరుస్తుంది. ఇది శ్రీనగర్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని" ఎస్బీఐ ఒక ట్వీట్ లో పేర్కొంది. ఎస్బీఐ 2004లో కేరళలో తేలియాడే ఎటిఎంను మొదటిసారి ప్రారంభించింది. కేరళ షిప్పింగ్, ఇన్ లాండ్ నావిగేషన్ కార్పొరేషన్ (కెఎస్ఐఎన్ సీ) యాజమాన్యంలోని ఝాంకర్ యాచ్ లో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్ ఏర్పాటు చేసింది. ఎర్నాకుళం & వాయ్పియన్ ప్రాంతం మధ్య ఈ హౌస్‌బోట్ పనిచేస్తుంది. తన తన కస్టమర్ల సౌలభ్యం కొరకు ఎస్బీఐ నిరంతరం సేవలు అందిస్తుంది. భారతదేశంలో 22,224 బ్రాంచీలు, 63,906 ఎటిఎమ్/సిడిఎమ్ నెట్ వర్క్ తో ఎస్బీఐ అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా ఉంది. SBI opened an ATM on a Houseboat at #DalLake, Srinagar for the convenience of locals & tourists. It was inaugurated by the Chairman, SBI, on 16th August. The #FloatingATM in the popular Dal Lake fulfills a long-standing need & will be an added attraction to the charm of Srinagar. pic.twitter.com/nz3iddHIdp — State Bank of India (@TheOfficialSBI) August 19, 2021 -
రూ. 200 కోట్లు- 2,000 ఉద్యోగాలు!
ముంబై, సాక్షి: ఏటీఎం నిర్వాహక కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా రూ. 1,300 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. తొలి దశలో భాగంగా రూ. 180-200 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వైస్‌చైర్మన్ రాజీవ్ కౌల్ వెల్లడించారు. తద్వారా రూ. 2,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా వేశారు. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. పీఈ దిగ్గజం బేరింగ్‌కు ప్రధాన వాటా కలిగిన కంపెనీ ఏడేళ్ల కాలంలో రూ. 1,300 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా ఏటీఎంల నిర్వహణ, క్యాష్ మేనేజ్మెంట్ బిజినెస్‌లను భారీగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. సీఎంఎస్ ఇన్ఫోలో.. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 100 శాతం వాటాను కలిగి ఉంది. (మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!) కంపెనీ కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ నుంచి 3,000 ఏటీఎంల నిర్వహణకు సీఎంఎస్ ఇన్ఫో కాంట్రాక్టును పొందింది. దీనిలో భాగంగా స్థల ఎంపిక, ఏటీఎంల ఏర్పాటు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులు, రోజువారీ నిర్వహణ చేపట్టవలసి ఉంటుంది. ఏడేళ్లపాటు అమల్లో ఉండే కాంట్రాక్టును మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మొదట్లో సెక్యూరిటీ మేనేజ్మెంట్ కంపెనీ లాజిక్యాష్ సొల్యూషన్స్‌ను సీఎంఎస్ ఇన్ఫో కొనుగోలు చేసింది. నిశా(ఎన్ఐఎస్ఏ) గ్రూప్ నుంచి సొంతం చేసుకున్న ఈ సంస్థ కారణంగా నిర్వహణలోని ఏటీఎంల సంఖ్య 62,000 నుంచి 72,000కు పెరిగినట్లు తెలుస్తోంది. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) రోజుకి రూ. 5,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో 1,13,981 ఆన్సైట్, 96,068 ఆఫ్‌సైట్ ఏటీఎంలున్నాయి. వీటికి అదనంగా బ్యాంకులు 3,27,620 మైక్రో ఏటీఎంలను సైతం కలిగి ఉన్నాయి. సీఎంఎస్ ఇన్ఫో సగటున రోజుకి రూ. 5,000 కోట్ల నగదును నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. కాగా.. ఏటీఎంల నిర్వహణలో దేశీయంగా ఏజీఎస్ ట్రాన్సాక్ట్, ఎస్ఐఎస్, రైటర్స్ కార్ప్ తదితర సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. -
హైదరాబాద్: వనస్థలిపురం ఏటీఎంలో భారీ చోరీ
-
వనస్థలిపురం: ఏటీఎంలో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలో సోమవారం చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చోటుచేసుకుంది. ఏటీఎం చోరీ చేయడానికి మొత్తం ఐదు మంది ముఠా సభ్యులు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. దుండగుల్లో ఏటీఎంలోకి గ్యాస్ కటర్‌తో ఒక్కరూ మాత్రమే వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (టట్లుబాజీ గ్యాంగ్: కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లు) నాలుగు ఏళ్ల క్రిందట ఇదే ఏటీఎంలో ఈ దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాజా చోరీ నేపథ్యంలో పాత నేరస్థులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులు 6 బృందాలుగా దుండగుల కోసం గాలిస్తున్నారు. ఏటీఎంలో అలారం లేకపోవడంతో రెండవ సారి కూడా దొంగతనం జరిగిందని పోలీసులు భావిసున్నారు. కనీస అలారం సౌకర్యం ఏర్పటుచేయని ఏటీఎం మేనేజ్మెంట్పై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చోరీలో దుండగులు ఏటీఎం నుంచి ఎంత మొత్తం దోచుకెళ్లారనేది తెలియాల్సి ఉంది. -
ఎస్బీఐ నికర లాభం జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో నికర లాభం 52 శాతం ఎగసింది. రూ. 4,574 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14.6 శాతం వృద్ధితో రూ. 28,182 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ. 75,342 కోట్లకు చేరింది. జీవిత బీమా అనుబంధ సంస్థలో వాటా విక్రయం కారణంగా ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం మెరుగుపడినట్లు బ్యాంక్ పేర్కొంది. పన్నుకుముందు లాభం 25 శాతం పుంజుకుని రూ. 6,341 కోట్లను దాటింది. ప్రొవిజన్లు 23 శాతం తక్కువగా రూ. 10,118 కోట్లకు చేరాయి. ఎన్పీఏలు ఓకే క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.44 శాతం నుంచి 5.28 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 1.59 శాతానికి క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 206 వద్ద గరిష్టాన్ని తాకగా.. 201 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. -
ఎస్బీఐ కొత్త నిబంధన రేపటి నుంచే..
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) ఎంటర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డుకు లింక్ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి నగదు వస్తుంది. ఓటీపీ లేకపోతే 10 వేల రూపాయలకు మించి నగదు తీసుకోలేరు. ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు వినియోగదారుల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. (చదవండి: పెట్రో ధరలు : మూడో రోజూ ఊరట) -
ఎస్బీఐ కార్డు మొబైల్ యాప్‌లో ఐఎల్ఏ
ఎస్బీఐ కార్డ్ సంస్థ తన మొబైల్ యాప్‌లోకి చాట్‌బాట్ ఐఎల్ఏ (ఇంటరాక్టివ్ లైవ్ అసిస్టెంట్) ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని తీసుకురావడమే దీన్ని ఉద్దేశ్యం. 40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఏను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా ఎస్బీఐ కార్డు నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ కన్వర్షన్, బ్యాలన్స్ బదిలీ, క్రెడిట్ కార్డుపై రుణం, ఇతర అకౌంట్ నిర్వహణ ఆప్షన్లు అన్నవి పరిశ్రమలోనే మొబైల్ చాట్‌బాట్ ద్వారా ఆఫర్ చేస్తుండడం మొదటిసారి అని పేర్కొంది. చాట్ బాట్‌పై లైవ్ చాట్ ఆప్షన్ కూడా ఉంది. దీని ద్వారా ప్రత్యేకమైన కేసుల్లో పరిష్కారాన్ని నేరుగా కస్టమర్ కేర్ ప్రతినిధి అందించడం జరుగుతుంది. ఎస్బీఐ కార్డ్ వెబ్‌సైట్‌పై ఐఎల్ఏ సేవను గతేడాది ప్రవేశపెట్టగా, తాజాగా దీన్ని మొబైల్ యాప్‌నకూ తీసుకొచ్చినట్టు అయింది. -
డబ్బులు చూసి షాక్ అయిన కస్టమర్..!
సాక్షి, మైలవరం/విజయవాడ : ఏటీఎం నుంచి నగదు డ్రా చేసిన ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అతను డ్రా చేసిన సొమ్ములో చిరిగిపోయిన రెండువేల నోట్లు రావడమే దీనికి కారణం. ఈ ఘటన మైలవరంలో వెలుగుచూసింది. నారాయణ థియేటర్ కాంప్లెక్స్‌లో గల స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో మద్దాలి గణేష్ అనే స్థానికుడు రూ.30 వేలు డ్రా చేయగా.. అందులో10 రెండువేల రూపాయల నోట్లు చినిగిపోయినవి రావడంతో అతను నిర్ఘాంతపోయాడు. ముప్పయి వేలలో ఇరవై వేలు చిరిగిపోయినవి వచ్చాయని వాపోయాడు. ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్యాంకులు సైతం ఇలా వినియోగదారులను మోసం చేస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా చాలాసార్లు చిరిగిన నోట్లు పెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. -
ఏటీఎంకు తాళం వేసి కీ మరిచారు..
హైదరాబాద్: బ్యాంకు ఆవరణలోని ఏటీఎంలో డబ్బులు భద్రపరిచిన బ్యాంకు అధికారులు మిషన్‌కు తాళం వేసి.. కీని మాత్రం మరిచిపోయారు. తార్నాక విజయపురిలోని ఎస్బీఐ లాలాగూడ బ్రాంచ్‌లో 2 ఏటీఎం మిషన్లతో పాటు ఒక మనీ డిపాజిట్ మిషన్‌ను గతంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి బ్యాంకు అధికారులు ఏటీఎం మిషన్లలో డబ్బులు భద్రపరిచేందుకు తాళాలు తీశారు. డబ్బులు మిషన్లలో పెట్టిన తర్వాత మిషన్‌కు తాళం వేసి.. కీని మాత్రం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. డబ్బు లు డ్రా చేసేందుకు వెళ్లిన స్థానికులు ఏటీఎంకు తాళం కీ అలాగే ఉండటాన్ని గమనించి పోలీసు లకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీçసులు తాళం కీని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సెలవు కావడం, బ్యాంకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అధికారులను రప్పించేందుకు పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత బ్యాంకు అధికారులు వచ్చి కీని స్వాధీనం చేసుకున్నారు. -
తెలంగాణలో ఎస్బీఐ ఏటీఎంలు మూసివేత
-
స్టేట్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ
సాక్షి, మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం నక్కలదిన్నే తండాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో క్యాష్ చాంబర్‌ను గ్యాస్ కట్టర్‌తో కోసి డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ విషయం శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగుచూసింది. ఏటీఎంలో ఉంచిన నగదు రూ. 22లక్షలు చోరీకి గురయ్యాయని ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ కెఎస్ఆర్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు, సీసీ కెమెరా ఇద్దరూ ఏటీఎం కేంద్రం వద్ద లేకపోవటంతో ఈ ఘటనకు పాల్పడిందెవరనేది తెలియడం లేదు. శనివారం సాయంత్రం పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఇకపై ఎస్బీఐ లావాదేవీలపై చార్జీల మోతే
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల విధించిన కొత్త చార్జీలు నేటి(జూన్ 1) నుంచి అమలు చేయనుంది. ఎటీంఎం, ఆన్లైన్ క్యాస్ ట్రాన్సాక్షన్లపై బాదుడు షురూ అయినట్టే. మొబైల్ యాప్ 'ఎస్బీఐ బ్యాంక్ బడ్డీ'తో నగదు విత్ డ్రా, తదితరాలకు కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో ఇకనుంచి నగదు ఉపసంహరణ, చెల్లింపులపై ఇక చార్జీల మోత మోగనుంది. ఇటీవల సవరించిన ఎస్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెలా తొలి నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై రూ.50 సేవా పన్నును వసూలు చేయనుంది. ఇక ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డు ద్వారా నగదు విత్‌డ్రా చేస్తే రూ.10, ఇతర బ్యాంకు ఎటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.20 వడ్డించనుంది. ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి. నాన్ మెట్రో, మెట్రో నగరాల్లో 10 లావాదేవీలు ఉచితం. ఈ ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 50 వసూలు చేస్తుంది. దీంతోపాటు నెలకు రూ.50 వేలకు మించి చెల్లింపులు జరిపే వారి నుంచి 5 శాతం టీడీఎస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ఐఎంపీఎస్, యూపీఐ, ఐయూఎస్ఎస్‌డీల ద్వారా రూ.లక్ష వరకు లావాదేవీలపై సేవా పన్ను కాక అదనంగా రూ.5 చెల్లించాల్సిందే. రూ. లక్ష నుంచి 2 లక్షల మధ్య లావాదేవీలపై రూ.15, రూ.2 లక్షల నుంచి 5లక్షల లావాదేవీలపై రూ.25 అదనంగా వడ్డించనుంది. మరోవైపు చిరిగిన నోట్ల మార్పిడిపై కూడా బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేయనున్నాయి. పాడైపోయిన నోట్లను మార్చుకోవాలని వెళితే, ఆ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రూ. 2 ప్లస్ సర్వీస్ చార్జ్ ని బ్యాంకు వసూలు చేస్తుంది. -
‘సీఎం మాటలు అబద్దాలుగా మిగిలాయి’
విజయవాడ: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరకులపాడు నారాయణ రెడ్డిది రాజకీయ హత్యేనని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. నారాయణరెడ్డి హత్యకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షనిజాన్ని అరికడతామన్న సీఎం చంద్రబాబు మాటలు అబద్దాలుగా మిగిలిపోయాయనని విమర్శించారు. రాజకీయ హత్యలపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. హత్యారాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, రాజకీయ హత్యలను ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని వారు ఆకాంక్షించారు. -
ఎస్బీఐ ఏటీఎంలో మంటలు
ఏలేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఏటీఎంలోని ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి పక్కనే ఉన్న మరో రెండు దుకాణాలకు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. -
గాంధీ బొమ్మను మరిచిపోయారట!
భోపాల్: నిత్యవసర సరుకుల కొనేందుకు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వెళ్లిన వ్యక్తికి కొత్త 500 రూపాయల నోట్లు నకిలీవి రావడంతో షాక్ తిన్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరేనాలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు గోవర్ధన్ శర్మ నేటి ఉదయం డబ్బులు డ్రా చేసుకునేందుకు మోరెనాలోని ఏ ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. డబ్బు డ్రా చేసిన తర్వాత షాక్ తినడం అతడి వంతయింది. ఏటీఎం నుంచి వచ్చిన రూ.500 నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మ ముద్రించి లేకపోవడంతో నకిలీ నోట్లు అని గుర్తించి తాను మోసపోయానని గ్రహించాడు. ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు తాను డ్రా చేసిన నోట్లను చూపించి అసలు విషయాన్ని చెప్పాడు. అతడు ఏటీఎంలో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేశాడు. వెంటనే ఎస్బీఐ అధికారులు కొందరు ఏటీఎం వద్దకు వచ్చి నోట్లను పరిశీలించారు. అవి నకిలీ నోట్లు కాదని, అయితే ఆ నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రించడం మరిచిపోయారని వివరణ ఇచ్చుకున్నారు. ఆ నోట్లను తిరిగి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు పంపిస్తామని ఆ ఎస్బీఐ ఉద్యోగి వివరించారు. పెద్ద నోట్లరద్దు చేసిన ఐదు నెలల తర్వాత కూడా దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఏటీఎం కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తుండగా.. మరోవైపు పదే పదే ఎస్బీఐ ఏటీఎంలలో ఇలా నకిలీ నోట్లు వస్తుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్లు దర్శనమిచ్చాయి. అంతకుముందు ఢిల్లీలోని మరో ఏటీఎం నుంచి ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసినపుడు చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోటు కనిపించడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ షాజహాన్పూర్లో పలు ఏటీఎం కేంద్రాల నుంచి రూ. 2000 నోట్లు నకిలీవి కలకలం రేపిన విషయం తెలిసిందే. -
నకిలీ నోట్లపై విచారణ జరుపుతాం: కేంద్రం
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని ఎస్బీఐ ఏటీఎంలో రూ.2000 నకిలీ నోట్లు వస్తున్నాయన్న విషయంపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ మీడియాకు తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణిని ఆపడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.2000 నకిలీ నోట్లు వచ్చాయని పత్రికల్లో వార్తలు వచ్చిన దరిమిలా ఆయన స్పందించారు. ‘ప్రభుత్వం నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. కొంత మంది దేశంలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో పూర్తి స్థాయి విచారణ తర్వాతే వెల్లడించగలం’ అని మంత్రి తెలిపారు. మరోవైపు తమ ఏటీఎంల నుంచి దొంగ నోట్లు రావడమన్నది చాలా అరుదని, నగదు క్వాలిటీని పరిరక్షించడంలో ఎంతో బలమైన వ్యవస్థ ఎస్బీఐ సొంతమని బ్యాంకు తెలిపింది. నగదును ఏటీఎంలకు తరలించిన వ్యక్తులపై విచారణ కొనసాగుతుందని ప్రకటించింది. ఎస్బీఐలో ఉండే సరికొత్త మెషిన్లు నోట్లలో చిన్నపాటి లోపాలున్నా పట్టేస్తాయనీ, అందువల్ల బ్యాంకు బ్రాంచీల్లో కానీ, ఏటీఎంల్లో కానీ నకిలీ నోట్లు వచ్చే అవకాశం లేదని స్టేట్ బ్యాంక్ స్పష్టం చేసింది. -
ఎస్బీఐ ఏటీఎంలో రూ.2000 దొంగనోట్లు
న్యూఢిల్లీ: నిత్యావసర ఖర్చులకోసం డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు బిత్తరపోయాడు. రూ.8000ను విత్ డ్రా చేయగా మొత్తం రూ.2000 దొంగ నోట్లు రావడంతో అవాక్కయ్యాడు. వాస్తవానికి నోటు అచ్చం కొత్త రూ.2000 నోట్ల మాదిరిగానే ఉన్నప్పటికీ దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అనే పేరిట నోట్లు ముద్రించి ఉన్నాయి. ఫిబ్రవరి 6న ఈ ఘటన ఢిల్లీలోని సంఘం విహార్‌లో గల ఎస్బీఐ ఏటీఎంనుంచి ఈ నోట్లు రావడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఒరిజినల్ నోటుపై ఎలాంటి అక్షరాలను ఉపయోగించారో అచ్చం అలాంటివే దొంగనోట్ల ముద్రణకు వాడారని, వాటర్ మార్క్ వద్ద చురాన్ పట్టి అని రాసి ఉందని, మిగితా అన్ని అంశాలు కూడా ఆర్బీఐ మాదిరిగానే ముద్రించారని ఆ వ్యక్తి తెలిపాడు. బ్యాంకు అధికారులను కూడా సంప్రదించి పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. -
అనంత ఏటీఎంలో నోట్ల వర్షం..
గుంతకల్లు: దేశంలో ఏటీఎంలు డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. రాజస్థాన్, అసోం ఏటీఎంల్లో విత్ డ్రా చేసిన డబ్బు కంటే ఎక్కువ మొత్తం వచ్చిన ఘటనలు మరువక ముందే అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. గుంతకల్లు పట్టణంలో సోమవారం రాత్రి ఎస్బీఐ ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఖాతాదారులు రూ.3 వేలు విత్ డ్రా చేస్తే రూ.6వేలు, అంతకు మించి కూడా డబ్బులు వచ్చాయి. దీంతో ఖాతాదారులు ఆనందంగా వచ్చినంత డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై ఓ ఖాతాదారుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు బ్యాంకు అధికారులకు తెలిపారు. అధికారులు ఏటీఎంను పరిశీలించి మూసివేశారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ఏ ఖాతాదారుడు ఎంత తీసుకున్నారనేది సర్వర్‌లో నమోదవుతుందని, ఆ వివరాలు సేకరించి వారు తీసుకున్న డబ్బును తిరిగి తీసుకుంటామని తెలిపారు. -
విమానాశ్రయంలో పనిచేయని ఏటీఎం
దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల గగ్గోలు గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో ఎస్బీఐ ఏటీఎం పనిచేయక దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకూ 34 విమాన సర్వీసుల్లో వేలాదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. దేశీయ ప్రయాణికులతో పాటు ఇతర దేశాల ప్రయాణికులు ఇక్కడి ఏటీఎంకి వచ్చి భంగపడుతున్నారు. అవసరానికి ఏటీఎం పనిచేయక పోవడంతో ఇబ్బందిగా ఉందని పలువురు ఆవేదన చెందుతున్నారు -
ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ
-
ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కొత్త నోట్లను విత్ డ్రా చేసుకోవడానికి పార్లమెంటు వీధిలోని ఎస్ బీఐ ఏటీఎం వద్దకు వచ్చారు. సాధారణ ప్రజలతో పాటే క్యూ లో వేచి చూశారు. గంటల తరబడి క్యూలో వేచి వున్న చిల్లర బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నాలుగు వేల రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు తాను ఏటీఎం వద్దకు వచ్చినట్లు చెప్పారు. నల్లధనం పేరుతో ప్రజలకు మోదీ ప్రభుత్వం నరకం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నేటి నుంచి ఏటీఎంలలో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రజలు బారులుతీరారు. ఏటీఎంల వద్ద రద్దీ విపరీతంగా ఉండటంతో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశాలు జారీ చేసింది. -
ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం
హైదరాబాద్: వనస్థలిపురం సహారా ఎస్టేట్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో గురువారం అర్థరాత్రి దొంగలు చోరీకి యత్నించారు. ఏటీఎంను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. నగదు ఉన్న లాకర్ తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. ఆ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు నమెదు చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం
జిన్నారం: మెదక్ జిల్లా జిన్నారం మండలం బొల్లారంలోని పారిశ్రామిక వాడలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఏటీఎంలోకి చొరబడిన దుండగులు ముందుగా సీసీ కెమెరాలను కొట్టి ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. కొంత మేర ధ్వంసం చేశారు. పెట్రోలింగ్ పోలీసుల రాకతో పరారయ్యారు. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంలో యువకుడి హల్చల్
తెనాలి: మద్యం మత్తులో ఓ యువకుడు ఏటీఎంలో హల్ చల్ చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్లో ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం ఓ యువకుడు ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేస్తుండగా గమనించిన స్థానికులు అతనిని అడ్డుకున్నారు. అయినా యువకుడు వినకపోవడంతో చితకబాది అనంతరం రైల్వే పోలీసులకు అప్పగించారు. యువకుడు మద్యం మత్తులో ఉండడంతో ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. అతను ఏవరనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు -
పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే..
ససారం: ఏటీఏంలో లోడ్ చేయడానికి వ్యాన్‌లో తీసుకెళ్తున్న 20 లక్షల రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లిన ఘటన బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో చోటుచేసుకుంది. కరాఘర్ పోలీసు స్టేషన్‌కు దగ్గరలోని ఎస్బీఐ ఏటీఏంలో గత రాత్రి డబ్బును నింపేందుకు ఆగి ఉన్నవ్యాన్లోని డబ్బును గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై క్యాషియర్, సెక్యూరిటీ గార్డ్లను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏటీఎంలో దొంగనోట్లు
ఖర్చుల కోసం డబ్బులు తీయడానికి ఏటిఎంకు వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు తన ఎకౌంట్లో నుంచి రూ. 9 వేలు డ్రా చేశాడు. కిరాణ దుకాణంలో బిల్లు చెల్లించడానికి డబ్బులు ఇవ్వగా.. షాపు యజమాని మీరు ఇచ్చింది 'దొంగ నోటు సార్..' అని చెప్పడంతో షాక్ తిన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగ నోట్లే అని తేలడంతో.. లబోదిబో మనుకుంటూ బ్యాంకు అధికారులను ఆశ్ర యించాడు. బ్యాంకు అధికారులు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని ఏటీఎంల నిర్వాహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలసలో మంగళవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ ఉపాధ్యాయుడు భీమిలి రోడ్డులోని ఆంధ్రాబ్యాంక్ సమీపంలోగల ఎస్బీఐ ఏటీఎం నుంచి రూ. 9 వేలు డ్రా చేశాడు. అనంతరం అవన్ని దొంగనోట్లు అని తేలడంతో.. అవాక్కై బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించినా లాభం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
లక్కవరం (తూర్పు గోదావరి) : ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో ఏటీఎంలో ఉన్న సీసీ కెమరాలతోపాటు పరికరాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా లక్కవరం సెంటర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంలో డబ్బు మాయం
తూర్పుగోదావరి(రావులపాలెం): రావులపాలెం మండలకేంద్రంలోని సీఆర్సీ రోడ్డు వద్ద నున్న ఎస్బీఐ ఏటీఎంలో రూ.32 లక్షల 75 వేల 200 మాయమయినట్లు బ్యాంకు అధికారులు రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఏటీఎంను అమలాపురం డీఎస్పీ ఎల్ అంకయ్యతో పాటు స్థానిక సీఐ, ఎస్‌లు పరిశీలించారు. అనంతరం ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఏటీఎంను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏటీఎం కెపాటిసీ రూ.38 లక్షలు. బ్యాంకు సమయాన్ని బట్టి ఎంత మనీ తగ్గితే అంత మనీ ఏటీఎంలో పెడతారు. ఏటీఎంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందా లేక ఏటీఎంలో డబ్బు పెట్టేవాళ్లు ఏమైనా గోల్మాల్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంను ధ్వంసం చేసిన ఆనవాళ్లు లేకపోవడంతో బ్యాంకుకు చెందిన ఉద్యోగులే ఏమైనా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో భారీ అగ్నిప్రమాదం
ఎస్ఆర్ నగర్ ఎస్బీఐలో ఘటన హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ ఎస్బీఐ కస్టమర్ వెయిటింగ్ హాల్లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంక్ నుంచి భారీగా పొగలు రావడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఎస్బీఐ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. వెంటనే అప్రమత్తం కావడంతో భారీ నష్టం తప్పింది. సంఘటనా స్థలాన్ని డీఐజీ మురళీ కృష్ణ, ఏసీపీ వెంకటేశ్వర్లు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలు ఇప్పుడే చెప్పలేమని వారు తెలిపారు. -
ఏమార్చి... ఏటీఎం కార్డు మార్చి...
లంగర్‌హౌస్(హైదరాబాద్): ఏటీఎం కేంద్రంలో దృష్టి మరల్చి ఓ వ్యక్తి ఏటీఎంను కొట్టేశారు.. దానిని వాడుకుని రూ.61 వేలు డ్రా చేసుకున్నారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీ నివాసి సుభాన్ ప్రై వేట్ ఉద్యోగి. సోమవారం అతడు నానల్‌నగర్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. కార్డుతో డబ్బు డ్రా చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో వరుస క్రమంలో ఉన్నట్లుగా వెనక కొందరు ఉండగా ఇద్దరు వ్యక్తులు అతనికి చెరో వైపు చేరారు. తాము సహకరిస్తామంటూ వారిద్దరూ అతని చేతిలో ఏటీఎం కార్డును యంత్రంలోకి పెట్టి తీసి, పిన్ నంబర్ కొట్టమన్నారు. అనంతరం 3 వేల నగదు సుభాన్ డ్రా చేశాడు. ఆపై వారి వద్ద నుంచి తన ఏటీఎం కార్డు తీసుకొని వెళ్లిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం డబ్బులు డ్రా చేయడానికి సుభాన్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ కార్డు పని చేయడం లేదని తెలిసింది. అప్పటికీ గమనించని అతను తన కార్డు పని చేయడంలేదని బ్యాంకును సంప్రదించాడు. బ్యాంకు సిబ్బంది చూసి... డబ్బు డ్రా అయినట్లు చెప్పటంతో లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎం కేంద్రంలో సాయం చేస్తామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి..పనికిరాని కార్డును తనకు అంటగట్టి వెళ్లిపోయారని, తన కార్డును వాడుకుని ఖాతాలోని రూ.61 వేలు డ్రా చేసుకున్నారని పేర్కొన్నాడు. -
కడప ఎస్బీహెచ్ ఏటీఎంలో దొంగతనం
కడప(వైఎస్సార్ జిల్లా): కడప నగరంలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో దొంగలు పడ్డారు. స్థానిక అప్సర థియేటర్ రోడ్డులోని శివాలయం సమీపంలో ఉన్న ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి కొంతమంది దొంగలు ప్రవేశించి రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టి, నగదు దోచేశారు. చోరీకి గురైన సొమ్ము వివరాలు తెలియాల్సి ఉంది. బ్యాంకు అధికారుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. -
గంగువాడ ఏటీఎంలో చోరీ యత్నం
పాతపట్నం: మండలంలోని గంగువాడలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి దొంగలు గురువారం అర్ధరాత్రి తర్వాత ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో పరారయ్యారు. స్థానికులు, సెక్యూరిటీ గార్డు కథనం ప్రకారం.. గంగువాడ ఏటీఎం వాచ్‌మన్ కె.భాస్కరరావు ఆ కేంద్రానికి తాళాలు వేసి లోపల పడుకున్నాడు. గురువారం అర్ధరాట్రి 12.20గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చితాళాలు పగలు గొట్టారు. వాచ్‌మన్ నిద్రలేచి.. ఏంకావాలని ప్రశ్నించాగా డబ్బులు డ్రా చేయాలని చెప్పారు. అయితే ఉదయం రావాల్సిందేనని చెప్పినా, వారు వినిపించుకోకుండా తాళాలు బద్ధలు గొట్టారని వాచ్‌మన్ తెలిపారు. అరిచే ప్రయత్నం చేయగా ఆయనపై దాడికి దిగారు. ఆయన తప్పించుకుని అరుస్తూ గ్రామంలోకి పరుగెత్తడంతో దుండగులు బైక్‌పై పరారయ్యారు. గ్రామస్తులు గాలించినా వారు దొరకలేదు. స్థానికులు పోలీసులకు, బ్యాంకు సిబ్బందికి ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. స్థానిక సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్సై బి.సురేష్‌బాబు వచ్చి విచారణ జరిపారు. పాలకొండ డీఎస్పీ సిహెచ్.ఆదినారాయణకు విషయాన్ని తెలియజేయడంతో ఆయన వచ్చి వాచ్‌మన్‌తో మట్లాడారు. దొంగలకు సంబంధించిన ఒక బ్యాగ్, యాక్సిల్ బ్లేడ్ దొరికాయని పోలీసులు తెలిపారు. పాలకొండ సీఐ ఎన్.వేణుగోపాలరావు డాగ్‌స్కాడ్, వేలిముద్రలు సేకరించారు. 2012లో ఇదే స్టేట్‌బ్యాంక్‌లో దొంగలు చోరీ చేశారని, ఇది రెండోసారి అని స్థానికులు చెప్పారు. ఒడిశా సరిహద్దులో ఉండటం వల్ల ఆ ప్రాంతానికి చెందినవారే దొంగతనాలకు పాల్పడుతున్నారా? ఇంకేవరైనా ఉన్నారా? అన్నది తేలాల్చి ఉందని, సీసీ పుటేజీలు పరిశీలిస్తామని సీఐ తెలిపారు. -
SBI ఏటిఎం చోరికి విఫలయత్నం
-
ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం, నగదు చోరీ
ఎస్బీఐ ఏటీఎంపై దుండగులు కన్నేశారు. ఆ ఏటీఎం మెషిన్లో నగదును దొంగలించేందుకు తమతో తెచ్చుకున్న కత్తులు కటారులతో ఎంతోగానూ ప్రయత్నించారు. అయినా ఆ ఏటీఎం తెరుచుకోలేదు. దాంతో ఏకంగా ఏటీఎంను బద్ధలు కొట్టేశారు. అనంతరం నగదును అపహరించారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని సదాశివపేటలోని చోటుచేసుకుంది. -
ఏటీఎం కార్డులు మార్చి రూ.1.30 లక్షలు డ్రా
లబోదిబోమంటున్న బాధితులు మెదక్ మున్సిపాలిటీ : ఏటీఎం నుంచి డబ్బులు తీసిస్తామంటూ దొంగలు కార్డులు మార్చి రూ.1.30 లక్షలు డ్రా చేసుకున్న సంఘటన పట్టణంలో సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండల పరిధిలోని సర్దన గ్రామానికి చెందిన రైతు సురేష్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో మెదక్ పట్టణం ఆటోనగర్‌లో గల ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎం సెంటర్ వద్ద సెక్యూరిటీగార్డు డ్రెస్‌లో ఉన్న వ్యక్తి డబ్బులు తీసిస్తానంటూ సురేష్ ఏటీఎం కార్డు తీసుకున్నాడు. కొంత డబ్బును సురేష్‌కు తీసిచ్చాడు. ఆ వెంటనే సురేష్ కార్డుకు బదులు మరో ఏటీఎం కార్డును అతనికిచ్చాడు. విషయం గమనించని సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శని, ఆదివారాల్లో అర్ధరాత్రి సమయంలో తన ఏటీఎం కార్డు నుంచి రూ.80 వేలు డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో సురేష్ ఆందోళన చెందాడు. దీంతో ఏటీఎం కార్డును చూసుకోగా కార్డు మారిన విషయాన్ని గుర్తించాడు. దీంతో చేసేది లే సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో సంఘటనలో...రూ.50వేలు మండలంలోని బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఎండీ పాషా శనివారం పట్టణంలోని డబ్బులు తీసుకునేందుకు మెదక్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు ఏదో రిసిప్ట్ వస్తోందని, ఒకసారి ఏటీఎం కార్డు ఇవ్వాలని అడగ్గా పాషా తన కార్డును ఇచ్చాడు. కొంత సేపటి తరువాత సెక్యూరిటీ గార్డు మరో కార్డును పాషా చేతికి ఇచ్చాడు. అయితే ఆదివారం తన కార్డు ద్వారా రూ.50 వేలు డబ్బులు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆందోళన చెందిన పాషా సోమవారం పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ అంజయ్య తెలిపారు. -
మైదుకూరు ఎస్ బీఐ ఏటీఎంలో భారీగా దొంగనోట్లు
కడప: వైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు ఎస్ బీఐ ఏటీఎంలో దొంగనోట్లు రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఎస్ బీఐ ఖాతాదారుడు 20 వేల రూపాయలు డ్రా చేయగా భారీ మొత్తంలో దొంగనోట్లు బయటపడ్డాయి. సుమారు 17,500 రూపాయలకు పైగా దొంగ నోట్లు ఉన్నట్టు సమాచారం. ఎస్ బీఐ ఏటీఎంలోనే దొంగ నోట్లు రావడంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆందోళనలో ఉన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ బీఐ ఏటీఎంలోనే దొంగనోట్లు రావడంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
వందకు బదులు వెయ్యి రూపాయలు
కొత్తవలస: ఇది ఎస్బీఐ ఏటిఎం. ఐదు వందల రూపాయలు కావాలంటే ఐదు వేలు వస్తున్నాయి. ఇంకేముంది. తెలిసిన వాళ్లంతా ఎగబడి మరీ లాగేశారు. ఇలా రూ. 5 లక్షల వరకూ నొక్కేశారట. విజయనగరం జిల్లా కొత్తవలస-సబ్బవరం రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ వింత చోటుచేసుకుంది. స్థానిక విజయనగరం రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ యజమాని ఒక్కరే రూ. 30 వేలు విత్‌డ్రా చేసినట్లు భోగట్టా. నాలిక్కరుచుకున్న స్థానిక ఎస్బీఐ సిబ్బంది వెంటనే ఏటీఎం మిషన్‌ను సరిచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మిషన్‌లో మూడు బాక్సులుంటాయని, వాటిలో వంద, ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు అమర్చాల్సి ఉంటుందన్నారు. అయితే వంద రూపాయల నోట్ల స్థానంలో వెయ్యి రూపాయలు ఉంచడం వల్ల ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఏఏ అకౌంట్ల ద్వారా డబ్బులు విత్‌డ్రా అయ్యాయో తెలుస్తుందని, వారి నుంచి నగదు మళ్లీ లాగేస్తామని తెలిపారు. -
ఏటీఎం ను పగులగొట్టి చోరీకి విఫలయత్నం
ఉరవకొండ, న్యూస్‌లైన్ : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సీఎస్ఐ చర్చి వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో మిషన్‌ను పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేసి ఓ దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయుంలో సీఐ యుల్లంరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం అర ్ధరాత్రి ఉరవకొండ పట్టణానికి చెందిన పులి రావూంజనేయుులు సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రం లోపలకు వెళ్లి, మిషన్‌ను రాడ్‌తో పగులగొట్టి డబ్బు చోరీ చేసేందుకు యత్నించాడు. అయితే అది ఎంతకూ తెరచుకోలేదు. దీంతో ఎంత సేపటికీ డబ్బు బయటకు రాకపోవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోతుండగా రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు లోకేష్, రాజన్న గమనించారు. ఆ సమయంలో ఏటీఎం మిషన్ కింది భాగంలోని షట్టర్ తెరుచుకుని ఉండడంతో అనుమానించి రావూంజనేయుులును వెంటాడి పట్టుకున్నారు. నిందితుడు గతంలో దొంగతనాలు చేసేవాడని సీఐ వెల్లడించారు. సమయ స్ఫూర్తితో దొంగను పట్టుకున్న కానిస్టేబుళ్లకు సీఐ నగదు రివార్డును అందజేశారు. కాగా శనివారం ఉదయం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, సీఐ యుల్లంరాజు, ఎస్ఐ శంకర్‌రెడ్డి ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించారు. నగదు భద్రంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
గురితప్పింది