
‘సీఎం మాటలు అబద్దాలుగా మిగిలాయి’
వైఎస్‌ఆర్ సీపీ నేత చెరకులపాడు నారాయణ రెడ్డిది రాజకీయ హత్యేనని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు.
విజయవాడ: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరకులపాడు నారాయణ రెడ్డిది రాజకీయ హత్యేనని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. నారాయణరెడ్డి హత్యకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షనిజాన్ని అరికడతామన్న సీఎం చంద్రబాబు మాటలు అబద్దాలుగా మిగిలిపోయాయనని విమర్శించారు. రాజకీయ హత్యలపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
హత్యారాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, రాజకీయ హత్యలను ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని వారు ఆకాంక్షించారు.