కడప నగరంలోని ఎస్‌బీహెచ్ ఏటీఎంలో దొంగలు పడ్డారు.
కడప(వైఎస్సార్ జిల్లా): కడప నగరంలోని ఎస్‌బీహెచ్ ఏటీఎంలో దొంగలు పడ్డారు. స్థానిక అప్సర థియేటర్ రోడ్డులోని శివాలయం సమీపంలో ఉన్న ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి కొంతమంది దొంగలు ప్రవేశించి రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టి, నగదు దోచేశారు. చోరీకి గురైన సొమ్ము వివరాలు తెలియాల్సి ఉంది. బ్యాంకు అధికారుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు.