బీమా కార్యాలయంలో భారీ దొంగతనం | Massive theft insurance office | Sakshi

బీమా కార్యాలయంలో భారీ దొంగతనం

Apr 21 2016 11:40 AM | Updated on Sep 3 2017 10:26 PM

కడప నగరంలోని ద్వారకాటవర్స్‌లో ఉన్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది.

కడప నగరంలోని ద్వారకాటవర్స్‌లో ఉన్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు కార్యాలయం వెనుక తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని సేఫ్ లాకర్ బాక్స్‌ను ఎత్తుకుపోయారు.

 

గురువారం ఉదయం గమనించిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సేఫ్‌లాకర్‌లో రూ.2.80 లక్షల నగదుతోపాటు రూ.68వేల చెక్కులు ఉన్నట్లు కార్యాలయం మేనేజర్ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. సంఘటన స్థలాన్ని ఒన్‌టౌన్ సీఐ రమేష్ పరిశీలించారు. కార్యాలయంలో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement