united india insurance
-
మూడు ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు మూలధనం!
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు వాటి ఆర్థిక పనితీరు ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల మూలధన సమకూర్చే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్), యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు (యూఐఐసీ) ఉన్నాయి. ఆదాయాలపైకాకుండా, లాభార్జనకు వ్యూహాలు రచించాలని గత ఏడాది ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మూడు సంస్థలకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఈ మూడు సంస్థలకు ఆర్థికశాఖ రూ.5,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్ఐసీఎల్కు రూ.3,700 కోట్లు కేటాయించగా, ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.1,200 కోట్లు లభించాయి. ఇక చెన్నై ఆధారిత యూఐఐసీకి కేటాయింపులు రూ.100 కోట్లు. మూడు సంస్థలూ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా తగిన సాల్వెన్సీ నిష్పత్తులను కలిగిలేవు. సాల్వెన్సీ రేషియో 150 శాతం ఉండాల్సి ఉండగా, ఎన్ఐసీ విషయంలో 63 శాతం, ఓఐసీ 15 శాతం, యూఐఐసీ 51 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలలో కేవలం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ అయ్యింది. మిగిలిన మూడు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్నాయి. ఇందులో ఒకదానిని ప్రైవేటీకరించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) యాక్ట్ సవరణకు ఆమోదముద్ర వేసింది. -
ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు అదనపు మూలధనం
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు గట్టెక్కేందుకు మరింత తోడ్పాటు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 3,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మూడు సంస్థలు – నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం రూ. 5,000 కోట్లు సమకూర్చింది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అత్యధికంగా రూ. 3,700 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు రూ. 1,200 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ. 100 కోట్లు దక్కాయి. ప్రభుత్వ రంగంలో మొత్తం నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. -
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం నిధులు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం మరిన్ని నిధులు సమకూర్చనుంది. వాటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు ఇది తప్పనిసరి అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.5,000 కోట్ల నిధులను సమకూర్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా, నియంత్రణపరమైన నిధుల అవసరాలను చేరుకునేందుకు వీలుగా వీటికి ఎంత మేర సమకూర్చాలనే దానిపై ఆర్థిక శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుందని సదరు అధికారి తెలిపారు. వాటి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యంగా లేదని, సాల్వెన్సీ మార్జిన్ పెంచేందుకు నిధుల సాయం అవసరమని చెప్పారు. కంపెనీలు తమకు వచ్చే క్లెయిమ్‌లకు చెల్లింపులు చేస్తుంటాయని తెలిసిందే. ఈ చెల్లింపులకు మించి నిధులను బీమా సంస్థలు కలిగి ఉండడాన్ని సాల్వెన్సీ మార్జిన్‌గా చెబుతారు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం కనీసం 1.5 సాల్వెన్సీ మార్జిన్ అయినా ఉండాలి. -
జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌యు) జనరల్ ఇన్స్యూరెన్స్ లో పనిచేసే ఉద్యోగులు చివరకు రాబోయే కొద్ది రోజుల్లో 15 శాతం వేతన సవరణ జరిగే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. 60 వేల మంది పిఎస్‌యు ఉద్యోగులకు వేతనాల సవరణలు 2021లో జరగనున్నాయి. అంటే రాబోయే రోజుల్లో వీరికి గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. వేతన సవరణ సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు చివరిసారిగా 2017లో వేతన సవరణ జరిగింది. అందువల్ల, వేలాది మంది ఉద్యోగులు తమ వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల, జీఐపీఎస్‌ఏ ఛైర్మన్, న్యూ ఇండియా అస్యూరెన్స్ సీఎండీ అతుల్ సహాయ్ మాట్లాడుతూ.. " వేతన సవరణ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది. డిసెంబర్లో ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. కానీ, ఉద్యోగులు బకాయిల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన ఉద్యోగుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారని నివేదిక తెలిపింది. ప్రస్తుతం సాధారణ బీమా రంగంలో నాలుగు పిఎస్‌యులు ఉన్నాయి. అని నేషనల్ ఇన్స్యూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్. 60,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలలో పనిచేస్తున్నారు. నాలుగు సంస్థలలో న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, ఇది ఒకటి మాత్రమే మంచి ఆర్థిక స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. మార్కెట్ వాటా తగ్గడం, ప్రైవేట్ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా మిగిలిన బీమా కంపెనీలు ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోతున్నాయి. (చదవండి: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్!) -
ఎల్ఐసీ, యుఐఐసీకు సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి : పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భారత జీవిత బీమా సంస్థతో పాటు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకు లేఖ రాశారు. ప్రధానమంత్రి జన జీవన్ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ చెల్లించాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి కోరారు. కోవిడ్–19, లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని, మరోవైపు అసంఘటిత రంగంలో కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, అందువల్ల క్లెయిమ్స్‌ను వెంటనే చెల్లించాలని సీఎం జగన్ ఆ లేఖల్లో పేర్కొన్నారు. -
‘ఏపీలో పోలీసులకు బీమా పెంపు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘ పోలీసు సంక్షేమ నిధి’ నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. పోలీసు బీమా మరింతగా పెరిగిందని.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్‌లో పెరుగుదల కనిపించిందని సీఎం జగన్ అన్నారు. గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తుండగా.. ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచామని ఆయన అన్నారు. అలాగే ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నామని తెలిపారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్‌తోపాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే దానికింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచామని సీఎం జగన్ తెలిపారు. ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షల రూపాయలను అందిస్తూ విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇందులో 64,719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. పదవీవిరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సహా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం జగన్‌ను కలిసిన ఏఎస్పీలు: 2014 నుంచి పెండింగులో ఉన్న ప్రమోషన్లకు అంగీకారం తెలిపి.. పదోన్నతి కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏఎస్పీలు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం డీఎస్పీల నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏఎస్పీలు మీడియాతో మాట్లాడుతూ.. పదోన్నతుల్లో పక్షపాతం లేకుండా అన్ని కేటగిరి అధికారులకు అర్హతల ప్రకారం ప్రమోషన్లు కల్పించారని ముఖ్యమంత్రిలతో వ్యాఖ్యానించామని తెలిపారు. గతంలో కొంత మందికే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని.. ఈసారి పక్షపాతానికి తావులేకుండా అర్హతలున్న వారందరికీ సమాన స్థాయిలో పదోన్నతులు వచ్చాయని సీఎం తెలిపామన్నారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని కొత్తగా ప్రమోషన్లు పొందిన ఏఎస్పీలు తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పాల్గొన్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదములు: పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ పోలీసుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. వారాంతపు సెలవుతో 64 వేలమంది పోలీసు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని.. పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ విలువ పెంచి మరింత భరోసా ఇచ్చినందుకు పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
బీమా కార్యాలయంలో భారీ దొంగతనం
కడప నగరంలోని ద్వారకాటవర్స్లో ఉన్న యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు కార్యాలయం వెనుక తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని సేఫ్ లాకర్ బాక్స్‌ను ఎత్తుకుపోయారు. గురువారం ఉదయం గమనించిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సేఫ్లాకర్లో రూ.2.80 లక్షల నగదుతోపాటు రూ.68వేల చెక్కులు ఉన్నట్లు కార్యాలయం మేనేజర్ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. సంఘటన స్థలాన్ని ఒన్‌టౌన్ సీఐ రమేష్ పరిశీలించారు. కార్యాలయంలో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. -
బీమా రంగంలో కెరీర్‌కు ‘అసిస్టెంట్’!
యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్... దేశంలో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ. రూ.10 వేల కోట్లకు పైగా స్థూల ప్రీమియం, 1600కు పైగా కార్యాలయాలతో శరవేగంగా విస్తరిస్తున్న సంస్థ. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అసిస్టెంట్ల నియామకానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష విధానం తదితరాలపై ఫోకస్... మోటార్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కీలక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తాజాగా 750 అసిస్టెంట్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. ఖాళీల వివరాలు కేటగిరీ పోస్టులు ఎస్సీ 111 ఎస్టీ 52 ఓబీసీ 182 అన్ రిజర్వ్డ్ 405 మొత్తం 750 ఆంధ్రప్రదేశ్: కేటగిరీ పోస్టులు ఎస్సీ 4 ఎస్టీ 2 ఓబీసీ 6 అన్ రిజర్వ్డ్ 12 మొత్తం 24 తెలంగాణ కేటగిరీ పోస్టులు ఎస్సీ 4 ఎస్టీ 2 ఓబీసీ 7 అన్ రిజర్వ్డ్ 13 మొత్తం 26 వేతనం: మూల వేతనం రూ.7640 ఉంటుంది. ప్రారంభంలో మెట్రో సిటీలో అయితే నెలకు దాదాపు రూ.17 వేలు అందుతుంది. అలవెన్సులు పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటాయి. నిబంధనలకు లోబడి సంస్థ ఉద్యోగ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయి. అర్హత 2015, జూన్ 30 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్. లేదా కనీసం 60శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ 50 శాతం) ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత. ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకుంటారో అక్కడి ప్రాంతీయ భాష తెలిసుండాలి. వయోపరిమితి 2015, జూన్ 30 నాటికి కనిష్ట వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు (ఎస్సీ/ఎస్టీలకు 15 ఏళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు) మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం తొలుత ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ, కంప్యూటర్ ప్రొఫిషయన్సీ టెస్ట్‌లకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష 35 మార్కులకు, ఇంటర్వ్యూ 15 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషయన్సీ టెస్ట్‌కు మార్కులు ఉండవు కానీ తుది జాబితాలో చోటుసంపాదించాలంటే అందులో అర్హత సాధించాలి. ఆన్లైన్ పరీక్ష: సెక్షన్ ప్రశ్నలు మార్కులు రీజనింగ్ 40 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 50 న్యూమరికల్ ఎబిలిటీ 40 50 జనరల్ నాలెడ్జ్ 40 50 కంప్యూటర్ నాలెడ్జ్ 40 50 మొత్తం 200 250 రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. 250 మార్కులను 35 మార్కులకు కుదించి, ఆ మేరకు ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులను లెక్కిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. ముఖ్య తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 7, 2015. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20, 2015. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు: జూలై 7-జూలై 20, 2015. కాల్ లెటర్స్ డౌన్లోడ్ ప్రారంభం: ఆగస్టు 20, 2015 ఆన్లైన్ పరీక్ష: ఆగస్టు 30, 2015. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.75, ఇతరులకు రూ.450 ఉంటుంది. పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్: చీరాల, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, కంచికచెర్ల, గొండ్లవల్లేరు, ఏలూరు, విజయనగరం. తెలంగాణ: హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. వెబ్సైట్: uiic.co.in ప్రిపరేషన్ ప్రణాళిక రీజనింగ్: అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ ఓరియెంటేషన్, స్పేషియల్ విజువలైజేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, సాల్వింగ్ అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిలోజిస్టిక్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్ కన్‌క్లూజన్ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. Ex: Sushil walked 15 metres towards South, took a left turn and walked 20 metres again he took a left turn and walked 15 metres. How far and in which direction is he from the starting point? 1) 20 metres, West 2) 20 metres, East 3) 50 metres, West 4) 50 metres, East 5) data inadequate న్యూమరికల్ ఎబిలిటీ: సింప్లిఫికేషన్, యావరేజ్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, ఏరియా, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రస్ట్, టైమ్ అండ్ స్పీడ్, ఇన్వెస్ట్మెంట్, ఎల్సీఎం అండ్ హెచ్‌సీఎఫ్, ఏజెస్ ప్రాబ్లమ్స్, బార్ గ్రాఫ్, పిక్టోరియల్ గ్రాఫ్, పై చార్ట్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్: వెర్బ్, ప్రిపోజిషన్, యాడ్వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఎర్రర్ కరెక్షన్/రికగ్నిషన్, టెన్సెస్, సెంటెన్సెస్ అరేంజ్మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్, కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ అండ్ గ్రామర్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ యూసేజ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్: సాధారణ పరిజ్ఞానం, వర్తమాన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. దేశాలు-కరెన్సీలు, పుస్తకాలు-ఆథర్స్, అవార్డులు-విజేతలు, క్రీడలు-విజేతలు, టెక్నలాజికల్ ఇన్నోవేషన్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి. దినపత్రికలు చదవడం చాలా ముఖ్యం. వీటిని చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను నోట్స్‌లో రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటర్నెట్ సోర్సుల ద్వారా ఈ విభాగంపై పట్టు సాధించవచ్చు. Ex: Who amongst the following is the author of the book "Many Lives Many Masters''? 1) Robin Cook 2) Brian L. Weiss 3) L.K.Advani 4) Admiral Vishnu Bhagwat 5) None of these కంప్యూటర్ నాలెడ్జ్: కంప్యూటర్‌కు సంబంధించి బేసిక్ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఈ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. బేసిక్ కంప్యూటర్ టెర్మినాలజీ, బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్ అండ్ ప్రోటోకాల్స్, నంబర్ సిస్టమ్, నెట్వర్క్ బేసిక్స్ (ల్యాన్ అండ్ వ్యాన్), సెక్యూరిటీ టూల్స్, వైరస్, హ్యాకింగ్, కంప్యూటర్ షార్ట్‌కట్స్ వంటివాటిపై దృష్టిసారించాలి. Ex: A person who used his or expertise to gain access to other peoples computers to get information illegally or do damage is? 1) Hacker 2) Analyst 3) Instant messenger 4) programmer 5) spammer -
గొర్రెల కాపరులకు బీమా
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : గొర్రెల పెంపకం కోసం రాత్రనక పగలనక చెట్లుపుట్టల్లో తిరుగుతూ కాపరులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గొర్రెలకు బీమా సౌకర్యం ఉన్నప్పటికీ.. కాపరులకు బీమా లేకపోవడంతో వారి కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందడం లేదు. ఈ విషయాన్ని దృష్టి పెట్టుకుని ప్రభత్వుం గొర్రెలకాపరులకు కూడా బీమా సౌకర్యం కల్పించింది. ఈ ఏడాది నుంచే గొర్రెల పెంపకందారులకు సామూహిక బీమా పథకాన్ని అమలు చేయనుంది. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న కాపరులు బీమాకు అర్హులు. సంవత్సరానికి రూ.350 ప్రీమియం కాగా, కాపరులు రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.250 కేంద్ర ఉన్ని అభివృద్ధి బోర్డు, కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. గ్రామంలో కనీసం 25 మంది పెంపకందారులు ముందుకు వస్తేనే బీమా సౌకర్యం కల్పిస్తారు. ప్రీమియం చెల్లించిన కాపరులు సాధారణ మరణం పొందితే రూ.1.50 లక్షలు, ప్రమాదం వల్ల అంగవికలురుగా మారితే రూ.75 వేలు, పూర్తిగా వికలాంగులైతే రూ.1.50 లక్షల పరిహారం అందుతుంది. కాపరులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలుంటే వారికి నెలకు రూ.100 ఉపకారవేతనం లభిస్తుంది. గొర్రెల బీమా ప్రీమియం పెంపు.. యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా సామూహిక గొర్రెల బీమా పథకం జిల్లా అంతటా అమలులో ఉంది. 6శాతం ఉన్న ప్రీమియం ను 7శాతానికి పెంచారు. ప్రీమియం, సర్వీసు టాక్స్ కలిపి చిన్న గొర్రెలకు రూ.118 చెల్లించాలి. ఇందులో గొర్రెల పెంపకందారు రూ.48 చెల్లిస్తే పశుసంవర్ధక శాఖ రూ.70 భరిస్తుంది. పెద్ద గొర్రెలకు రూ.236 చెల్లిస్తే.. పశుసంవర్ధక శాఖ రూ.140 భరిస్తుంది.