బీమా రంగంలో కెరీర్‌కు ‘అసిస్టెంట్’! | United India Insurance Company Limited | Sakshi
Sakshi News home page

బీమా రంగంలో కెరీర్‌కు ‘అసిస్టెంట్’!

Published Thu, Jul 9 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

United India Insurance Company Limited

 యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్..
 యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్... దేశంలో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ. రూ.10 వేల కోట్లకు పైగా స్థూల ప్రీమియం, 1600కు పైగా కార్యాలయాలతో శరవేగంగా విస్తరిస్తున్న సంస్థ. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అసిస్టెంట్ల నియామకానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష విధానం తదితరాలపై ఫోకస్...
 
 మోటార్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కీలక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తాజాగా 750 అసిస్టెంట్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఈ సంఖ్య పెరిగే అవకాశముంది.
 
 ఖాళీల వివరాలు
 కేటగిరీ    పోస్టులు
 ఎస్సీ    111
 ఎస్టీ    52
 ఓబీసీ    182
 అన్ రిజర్వ్‌డ్    405
 మొత్తం    750
 ఆంధ్రప్రదేశ్:
 కేటగిరీ    పోస్టులు
 ఎస్సీ    4
 ఎస్టీ    2
 ఓబీసీ    6
 అన్ రిజర్వ్‌డ్    12
 మొత్తం    24
 తెలంగాణ
 కేటగిరీ    పోస్టులు
 ఎస్సీ    4
 ఎస్టీ    2
 ఓబీసీ    7
 అన్ రిజర్వ్‌డ్    13
 మొత్తం    26
 వేతనం: మూల వేతనం రూ.7640 ఉంటుంది. ప్రారంభంలో మెట్రో సిటీలో అయితే నెలకు దాదాపు రూ.17 వేలు అందుతుంది. అలవెన్సులు పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటాయి. నిబంధనలకు లోబడి సంస్థ ఉద్యోగ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయి.
 
 
 అర్హత
 2015, జూన్ 30 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్. లేదా కనీసం 60శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ 50 శాతం) ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత. ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకుంటారో అక్కడి ప్రాంతీయ భాష తెలిసుండాలి.
 
 వయోపరిమితి
 2015, జూన్ 30 నాటికి కనిష్ట వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు (ఎస్సీ/ఎస్టీలకు 15 ఏళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు) మినహాయింపు ఉంటుంది.
 
 ఎంపిక విధానం
 తొలుత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ, కంప్యూటర్ ప్రొఫిషయన్సీ టెస్ట్‌లకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష 35 మార్కులకు, ఇంటర్వ్యూ 15 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషయన్సీ టెస్ట్‌కు మార్కులు ఉండవు కానీ తుది జాబితాలో చోటుసంపాదించాలంటే అందులో అర్హత సాధించాలి.
 
 ఆన్‌లైన్ పరీక్ష:
 సెక్షన్    ప్రశ్నలు    మార్కులు
 రీజనింగ్    40    50
 ఇంగ్లిష్ లాంగ్వేజ్    40    50
 న్యూమరికల్ ఎబిలిటీ    40    50
 జనరల్ నాలెడ్జ్    40    50
 కంప్యూటర్ నాలెడ్జ్    40    50
 మొత్తం    200    250
 రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.
 250 మార్కులను 35 మార్కులకు కుదించి, ఆ మేరకు ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన మార్కులను లెక్కిస్తారు.
 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
 
 ముఖ్య తేదీలు
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 7, 2015.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20, 2015.
 ఆన్‌లైన్లో ఫీజు చెల్లింపు: జూలై 7-జూలై 20, 2015.
 కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ ప్రారంభం: ఆగస్టు 20, 2015
 ఆన్‌లైన్ పరీక్ష: ఆగస్టు 30, 2015.
 దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.75, ఇతరులకు రూ.450 ఉంటుంది.
 
 పరీక్ష కేంద్రాలు
 ఆంధ్రప్రదేశ్:    చీరాల, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, కంచికచెర్ల, గొండ్లవల్లేరు, ఏలూరు, విజయనగరం.
 తెలంగాణ:    హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్,
 వరంగల్, ఖమ్మం.
 వెబ్‌సైట్: uiic.co.in
 
 ప్రిపరేషన్ ప్రణాళిక
 
 రీజనింగ్:
 అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ ఓరియెంటేషన్, స్పేషియల్ విజువలైజేషన్, సీటింగ్ అరేంజ్‌మెంట్, సాల్వింగ్ అనాలిసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్, రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్, సిలోజిస్టిక్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్‌మెంట్ కన్‌క్లూజన్ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
 
 Ex:    Sushil walked 15 metres towards South, took a left turn and walked 20 metres again he took a left turn and walked 15 metres. How far and in which direction is he from the starting point?
     1) 20 metres, West    2) 20 metres, East
     3) 50 metres, West    4) 50 metres, East
     5) data inadequate
 
 న్యూమరికల్ ఎబిలిటీ:
 సింప్లిఫికేషన్, యావరేజ్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, ఏరియా, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రస్ట్, టైమ్ అండ్ స్పీడ్, ఇన్వెస్ట్‌మెంట్, ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్, ఏజెస్ ప్రాబ్లమ్స్, బార్ గ్రాఫ్, పిక్టోరియల్ గ్రాఫ్, పై చార్ట్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 ఇంగ్లిష్ లాంగ్వేజ్:
 వెర్బ్, ప్రిపోజిషన్, యాడ్‌వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఎర్రర్ కరెక్షన్/రికగ్నిషన్, టెన్సెస్, సెంటెన్సెస్ అరేంజ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్, కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ అండ్ గ్రామర్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ యూసేజ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 జనరల్ అవేర్‌నెస్:
 సాధారణ పరిజ్ఞానం, వర్తమాన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. దేశాలు-కరెన్సీలు, పుస్తకాలు-ఆథర్స్, అవార్డులు-విజేతలు, క్రీడలు-విజేతలు, టెక్నలాజికల్ ఇన్నోవేషన్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి. దినపత్రికలు చదవడం చాలా ముఖ్యం. వీటిని చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను నోట్స్‌లో రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటర్నెట్ సోర్సుల ద్వారా ఈ విభాగంపై పట్టు సాధించవచ్చు.
 Ex:    Who amongst the following is the author of the book "Many Lives Many Masters''?
     1) Robin Cook    2) Brian L. Weiss
     3) L.K.Advani
     4) Admiral Vishnu Bhagwat
     5) None of these
 
 కంప్యూటర్ నాలెడ్జ్:
 కంప్యూటర్‌కు సంబంధించి బేసిక్ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఈ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. బేసిక్ కంప్యూటర్ టెర్మినాలజీ, బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్ అండ్ ప్రోటోకాల్స్, నంబర్ సిస్టమ్, నెట్‌వర్క్ బేసిక్స్ (ల్యాన్ అండ్ వ్యాన్), సెక్యూరిటీ టూల్స్, వైరస్, హ్యాకింగ్, కంప్యూటర్ షార్ట్‌కట్స్ వంటివాటిపై దృష్టిసారించాలి.
 Ex:    A person who used his or expertise to gain access to other peoples computers to get information illegally or do damage is?
     1) Hacker        2) Analyst
     3) Instant messenger
     4) programmer    5) spammer
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement