సాక్షి, అమరావతి : పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని కోరుతూ ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భారత జీవిత బీమా సంస్థతో పాటు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకు లేఖ రాశారు. ప్రధానమంత్రి జన జీవన్ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ చెల్లించాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి కోరారు. కోవిడ్–19, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని, మరోవైపు అసంఘటిత రంగంలో కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, అందువల్ల క్లెయిమ్స్‌ను వెంటనే చెల్లించాలని సీఎం జగన్ ఆ లేఖల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment