మైదుకూరు ఎస్ బీఐ ఏటీఎంలో భారీగా దొంగనోట్లు
కడప: వైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు ఎస్ బీఐ ఏటీఎంలో దొంగనోట్లు రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఎస్ బీఐ ఖాతాదారుడు 20 వేల రూపాయలు డ్రా చేయగా భారీ మొత్తంలో దొంగనోట్లు బయటపడ్డాయి. సుమారు 17,500 రూపాయలకు పైగా దొంగ నోట్లు ఉన్నట్టు సమాచారం.
ఎస్ బీఐ ఏటీఎంలోనే దొంగ నోట్లు రావడంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆందోళనలో ఉన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ బీఐ ఏటీఎంలోనే దొంగనోట్లు రావడంపై పోలీసులు విచారణ చేపట్టారు.