Maidukuru
-
టీడీపీ శిబిరంలో ఆందోళన!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాసేవ, విశ్వసనీయత ఇవన్నీ ఒక ఎత్తయితే, ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్, సమీకరణలు మరో ఎత్తు. వర్గ రాజకీయాలకు పేరున్న రాయలసీమ.. అందులో కడప జిల్లాలో ఆ పాళ్లు మరింత ఎక్కువ. ఇలాంటి వర్గ సమీకరణలో టీడీపీ శిబిరం విఫలమైంది. మరోవైపు గెలుపు తథ్యమని అతి విశ్వాసంతో ఉన్న అవకాశాన్ని చేజార్చుకున్నారు. కడప, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి తెరపైకి వచ్చింది. దీంతో పోలింగ్ అనంతరం తెలుగుదేశం శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.👉 కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యం ఎక్కువ. ఎన్నికలు ఏవైనా ఏకపక్షంగా ఫలితాలు ఉండేవి. ఇప్పటికీ వైఎస్సార్సీపీకి ప్రజానీకం అండగా ఉన్నప్పటికీ ఈమారు కొన్ని ప్రాంతాల్లో కాస్త తేడా కన్పించింది. అందుకు కారణంగా ఆయా నేతల వ్యక్తిగత వ్యవహారశైలి, మరోవైపు టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓటమి పాలవుతున్న నేపథ్యం, సామాజిక సమీకరణలు ఇలాంటి కారణాల రీత్యా కాస్త అనుకూల పవనాలు కన్పించాయి. కాగా, టీడీపీ అభ్యర్థులు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రావాల్సి ఉండగా, తిరోగమనంలో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటూ వచ్చారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.ఓటమికి కారణమవుతున్న అతి విశ్వాసం..కడప అసెంబ్లీ పరిధిలో ఎన్నడూ లేనివిధంగా విద్వేషాలు తెరపైకి వచ్చాయి. ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న ప్రజానీకం మధ్యలో కలతలు సృష్టించారు. ఎన్నికల కోసం హిందూ–ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చారు. ఎలాగైనా గెలుస్తామన్నా ధీమా టీడీపీ శిబిరంలోకి వచ్చి చేరింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ టికెట్ ఆశించిన కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబ మద్దతు స్వీకరించడంలో విఫలమయ్యారు. మరోవైపు శాంతికి నిలయమైన కడపలో దుందుడుకు చర్యలను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడే ఇలా ఉంటే, ఎమ్మెల్యేగా ఎన్నికై తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అంచనాకు తటస్తులు వచ్చారు. అదే టీడీపీకి శాపంగా మారిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగు తున్న అంజద్‌బాషా మంచితనాన్ని గమనించిన ప్రజలు పోలింగ్‌లో ఆ ప్రభావం చూపారని పలువురు వివరిస్తున్నారు. ఇలాంటి స్థితి కమలాపురంలో కూడా తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయినప్పటికీ స్థానికంగా ఆయన మద్దతు కోరలేదు, స్వగ్రామం కోగటంలో ప్రచారానికి వెళ్తూ, సమాచారం కూడా ఇవ్వలేదు. పైగా అవసరం లేదన్నట్లుగా టీడీపీ అభ్యర్థి పుత్తా కుటుంబం వ్యవహరించింది. మరోవైపు టీడీపీ నేత సాయినాథశర్మతో ఎన్నికలు సమీపించే కొద్ది గొడవలు పెట్టుకొని దూరం చేసుకున్నారు. ఈ ఇద్దరు నేతలను దూరం చేసుకోవడం టీడీపీకి ప్రతిబంధకంగా మారిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈనేపథ్యంలో భారీ మెజార్టీ దక్కుతుందని భావిస్తున్న కమలాపురం మండలంలో టీడీపీకి ఊహించని స్థాయిలో లోటు ఏర్పడిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.స్వయంకృతాపరాధమే..మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ రెండుసార్లు వరుసగా ఓడిపోయారు. ఈమారు కొంత సానుభూతి వ్యక్తమైంది. ఇలాంటి స్థితిలో అనుకూలంగా మల్చుకోవాల్సి ఉండగా చేజార్చుకుంటూ వచ్చారని పలువురు వివరిస్తున్నారు. ముందే యాదవ ముద్ర వేసుకొని రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారనే అపప్రద ఉంది. కాగా.. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో కొనసాగుతున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి కుటుంబాన్ని పొగబెట్టి బయటికి పంపించారు. దీంతో ఆ సామాజిక వర్గం ఆవేదనతో రగిలిపోయింది. ఉన్న ఒక్క నాయకున్ని కూడా నిలుపుకోలేదనే భావన వ్యక్తమైంది. ఎస్సీ, ముస్లీం మైనార్టీ వర్గీయులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకీ అండగా నిలిచారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి విజయం సునాయసమైందని విశ్లేషకుల భావన. గట్టి పోటీ ఇవ్వగలమని భావించినా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ వెనుకంజలో పడింది. మరోమారు ఓటమి తప్పదని పుట్టా, పుత్తా వర్గీయులు భావిస్తూనే, పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సెల్ప్‌గోల్ కొట్టుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో కౌంటింగ్ సమీపించే కొద్ది టీడీపీ శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనడం గమనార్హం. -
చింపేస్తాం.. పీకేస్తాం.. నారా లోకేష్ ఓవర్ యాక్షన్
సాక్షి, వైఎస్సార్(చాపాడు): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఆదివారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఈవెనింగ్ వాక్‌లా సాగింది. మూడు రోజులపాటు సాయంత్రం 5 గంటల తర్వాతే లోకేశ్ పాదయాత్ర జరిగింది. ఇదేం పాదయాత్ర అని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పాదయాత్ర పొడవునా ప్రతి గ్రామం వద్ద అక్కడికి వచ్చే కొద్దిపాటి మందిని లోకేశ్ దగ్గరకు రప్పించుకుని సెల్ఫీలు తీయించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సీఎం ఫ్లెక్సీపై లోకేశ్ వాగ్వాదం.. రాత్రికి చించివేత ఇదిలా ఉంటే.. మండల కేంద్రమైన చాపాడులో శనివారం రాత్రి జరిగిన పాదయాత్రలో చాపాడు వద్ద వెలసిన పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం పేరుతో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీపై పోలీసులతో లోకేశ్ వాగ్వాదం చేశారు. తమ తండ్రిని కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీని చింపేస్తాం.. పీకేస్తాం.. అంటూ మైదుకూరు అర్బన్ సీఐ చలపతి, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిలతో ఆయన వాగ్వాదం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చాపాడు కూడలిలో ఉన్న ఇద్దరు పోలీసులను కారులో వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించి అక్కడి సీఎం జగన్ ఫ్లెక్సీని చించేశారు. దీనిపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయగా ఆదివారం పోలీసులు ఖాజీపేట ప్రాంతంలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఖాజీపేట మండలంలోనూ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీనీ టీడీపీ కార్యకర్త చించివేయడం వివాదాస్పదమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. చదవండి: RBI Report: అలర్ట్.. నకిలీ నోట్లపై ఆర్బీఐ కీలక రిపోర్ట్ -
రూ.1,513 కోట్లతో ఎన్‌హెచ్ 167బి
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌లో మరో ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. వైఎస్సార్ జిల్లాను చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ ‘ఎన్‌హెచ్–167బి’ ని రెండు లేన్లు + పావ్డ్ సోల్డర్స్ (12 అడుగుల వెడల్పు)గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం మైదుకూరు నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు సమర్పించిన నివేదికలో ఈ రహదారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. 189 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు ప్యాకేజీల కింద మొత్తం రూ.1,513.31 కోట్లతో నిర్మించేందుకు ఆమోదించారు. దీన్లో మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు 46 కిలోమీటర్ల రహదారికి రూ.369.81 కోట్లతో పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. మిగిలిన రూ.1,143.5 కోట్ల పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పూర్తికావచ్చింది. -
మద్యం దొంగతనం చేశాడనే నెపంతో...
మైదుకూరు: తాము అక్రమంగా దాచి ఉంచిన మద్యం బాటిళ్లలో రెండు బాటిళ్లను దొంగిలించాడనే నెపంతో ఐదుగురు వ్యక్తులు ఓ 17 ఏళ్ల యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ అమానుష ఘటన వివరాలిలా ఉన్నాయి. వనిపెంట, పరిసర గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి వాటిని స్థానిక నాలుగు రోడ్ల వద్ద తుప్పల్లో దాచి ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఆదివారం తాము దాచిన మద్యం బాటిళ్లలో రెండు తక్కువగా ఉన్నట్లు గమనించారు. వాటిని వనిపెంట ఎస్సీ కాలనీకి చెందిన యంగోళ్ల నానిసుధీర్ అనే యువకుడే దొంగిలించి ఉంటాడని భావించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో నాలుగు రోడ్ల వద్ద ఉన్న మెకానిక్ షెడ్ వద్ద నాని సుధీర్‌ను పట్టుకుని కొట్టారు. అయితే తాను మద్యం దొంగతనం చేయలేదని సుధీర్ మొత్తుకున్నప్పటికీ పట్టించుకోని నిందితులు.. పెట్రోల్‌ను అతని ముఖంపై పోసి నిప్పంటించారు. దీంతో ముఖం, ఛాతి, చేతులు, చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. సుధీర్ చనిపోతాడేమోనని భయపడిన నిందితులు అతన్ని బైక్‌పై ఎక్కించుకుని మైదుకూరు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం కారులో కడపకు తరలించి అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న నాని సుధీర్ కుటుంబ సభ్యులు కడపకు చేరుకుని అతన్ని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగళూరులో మైదుకూరు విద్యార్థి ఆత్మహత్య!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థి మోక్షజ్ఞ రెడ్డి (20) కాలేజీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించాడు. ఈ ఘటనపై బెంగళూరు వర్తూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు.. యువకుడు మైదుకూరు పట్టణవాసి. వర్తూరు సమీపంలోని గుంజూరులో ఉన్న ప్రైవేటు కాలేజీలో బీబీఏ చదువుతున్నాడు. శనివారం నుంచి తల్లిదండ్రులకు ఆ యువకుడు ఫోన్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బెంగళూరులో ఉన్న స్నేహితులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. వారు వెంటనే హాస్టల్ గది వద్దకు వెళ్లి తలుపు తీయగా మోక్షజ్ఞ ఉరివేసుకుని కనిపించాడు. వర్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం వైదేహి ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుని మరణంపై అనుమానం ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి నిజానిజాలు బయటికి తీయాలని డిమాండ్ చేశారు. చదవండి: పరువు కోసం కూతురిని కడతేర్చిన తండ్రి బైక్‌పై లిఫ్ట్ అడిగి.. ఆపై దోపిడీ -
యువకుడి ఆత్మహత్య
సాక్షి, మైదుకూరు(కడప) : మండల పరిధిలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బేతంచర్ల ఎర్రన్న, సుబాన్‌బీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సుబాన్‌బీ చెల్లెలిని ఎర్రన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి దస్తగిరి అనే కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. దస్తగిరిని బీటెక్ వరకు చదివించారు. ఐదేళ్ల నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దస్తగిరి తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేఆర్‌పురం పోలీసులు విచారణ చేపట్టగా దస్తగిరి ఈనెల మూడవ తేదీన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నాడని అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుంచి చూడగా దస్తగిరి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఉత్సలవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి.. కడప కోటిరెడ్డిసర్కిల్/అర్బన్: కమలాపురం రైల్వే గేటు సమీ పంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(35) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే హెడ్ కానిస్టేబుల్ వి.సుభాన్ బాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తుపట్టిన వారు 9440900811,9502051021 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. మైదుకూరు రూరల్ : మండల పరిధిలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బేతంచర్ల ఎర్రన్న, సుబాన్‌బీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సుబాన్‌బీ చెల్లెలిని ఎర్రన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి దస్తగిరి అనే కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. దస్తగిరిని బీటెక్ వరకు చదివించారు. ఐదేళ్ల నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దస్తగిరి తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేఆర్‌పురం పోలీసులు విచారణ చేపట్టగా దస్తగిరి ఈనెల మూడవ తేదీన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నాడని అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుంచి చూడగా దస్తగిరి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఉత్సలవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. -
టీడీపీని భూస్థాపితం చేయడమే నా టార్గెట్..
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడమే తన ధ్యేయమని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన సోమవారం వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో భవిష్యత్ కార్యచరణపై డీఎల్ ఈ సందర్భంగా కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..టీడీపీ సర్కార్ రాష్ట్రంలో పూర్తిగా అవినీతిమయ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందిన డీఎల్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది కూడా. 2014 ఎన్నికల్లో డీఎల్...టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం డీఎల్ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. మైదుకూరు టికెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డీఎల్ కోరినట్లు సమాచారం. అయితే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎల్...టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో, ఆయన మరో పార్టీలో చేరతారా, లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
పుట్టా అనుచరుడా.. మజాకా!
► రైతు సంఘంలో ఉన్నట్లు మోసం ► ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ సబ్సిడీ కింద ట్రాక్టర్ తీసుకున్న టీడీపీ నాయకుడు ► కేసు నమోదు చేయాలంటున్న బాధితులు వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నాయకుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ఓ టీడీపీ నాయకుడు ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ సబ్సిడీ కింద ట్రాక్టర్ తీసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...చాపాడు మండలంలోని రాజుపాళెంకు చెందిన టీడీపీ నాయకుడు పల్లెం శ్రీనివాసులు ఓ రైతు కుటుంబం నుంచి పట్టాదారు పాసుబుక్, రేషన్, ఆధార్ కార్డులు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో సబ్సిడీ కింద ట్రాక్టర్ తీసుకున్నాడు. దీనిపై అధికారులు కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాధిత మహిళ జాకట జ్యోతి తెలిపారు. పల్లెం శ్రీనివాసులు మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్ ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. గతేడాది కురిసిన అకాల వర్షాలకు రాజుపాళెంకు చెందిన జాకట స్వామిదానం, జ్యోతిలకు చెందిన వరి, మినుము పంట దెబ్బతింది. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పల్లెం శ్రీనివాసులు అప్పట్లో పంటకు నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి జ్యోతి పేరుతో ఉన్న 1.26 ఎకరాల పట్టాదారు పాసుబుక్, ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ పత్రాలను ఇప్పించుకున్నాడు. దీనికి ముందే రాజుపాళెంలో శ్రీవెంకటేశ్వర రైతు మిత్ర సంఘం సృష్టించి రూ.6 లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌ను రూ.3లక్షల సబ్సిడీతో ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనివాసులు పొందాడు. ఈ గ్రూపులో జాకట జ్యోతి సభ్యురాలు. శ్రీనివాసులు బంధువులైన పి.గంగన్న, ఎం.రామసుబ్బయ్య, ఎం.గోపాల్, ఎం.పెద్దబాలయ్యల పేర్లతో సబ్సీడీ కింద ట్రాక్టర్ పొందినట్లు విషయం తెలుసుకున్న జ్యోతి దంపతులు అవాక్కయ్యారు. తాను ఎలాంటి సంతకాలు పెట్టలేదని, పంట నష్ట పరిహారం కోసం శ్రీనివాసులుకు భూమి, ఆధార్, రేషన్‌కార్డుల పత్రాలు ఇచ్చామని, తన సంతకాలను ఫోర్జరీ చేశాడని విచారం వ్యక్తం చేశారు. కనీసం వ్యవసాయాధికారులు కూడా విషయం తమకు తెలుపలేదని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, 420 కేసులు నమోదు చేయాలి దళితులమైన తమను నమ్మించి తమ పత్రాలను తీసుకుని, ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద ట్రాక్టర్ పొందిన పల్లెం శ్రీనివాసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 కేసు నమోదు చేయాలని దళిత దంపతులు స్వామినాథం, జ్యోతిలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అన్ని రకాలైన పత్రాలు ఉండటంతో మంజూరు ఈ ఘటనపై మండల వ్యవసాయాధికారి సురేష్‌బాబును వివరణ కోరగా శ్రీవెంకటేశ్వర రైతు మిత్రం సంఘం పేరుతో అన్ని రకాలైన ఆధార పత్రాలు, సంతకాలు ఉండటంతో ట్రాక్టర్ మంజూరైందని తెలిపారు. -
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
మైదుకూరు (వైఎస్సార్ జిల్లా) : నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరులో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం.. మున్సిపాలిటి పరిధిలోని సర్వాయి పల్లి రోడ్డులో నివాసముంటున్న వెంకటేష్(7), రాజేష్(5) అనే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు.. బాత్రూం నిర్మించడం కోసం తీసిన గుంతలో పడి మృతిచెందారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
దైవ దర్శనానికి వెళుతూ..
ప్రొద్దుటూరు క్రైం / మైదుకూరు : ‘పోదాం పదమ్మా.. లేట్‌గా వెళ్తే గుడిలో ఎవరూ ఉండరమ్మా..’ కుమారుడి మాటలివి. ‘అబ్బా నీకెప్పుడూ తొందరే.. నిదానంగా పోదాం.. ఆలస్యంగా వెళితే స్వామి ఎక్కడికి పోడులే..’ ఇవి తల్లి మాటలు. ఇవే ఆ తల్లీకొడుకుల మధ్య చివరి మాటలయ్యూరుు. మైదుకూరు మండ లంలోని వరదాయపల్లె సమీపంలో కారు ఢీకొన్న సంఘటనలో గుడిసెనపల్లి శ్రీహరి(12) అక్కడికక్కడే మరణించాడు. కళ్లెదుటే బిడ్డను మృత్యువు కబళించడంతో ఆ తల్లికి కడుపు కోతే మిగిలింది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. మైదుకూరు మండలంలోని జీవీ సత్రం సమీపంలో ఉన్న శెట్టిపల్లె గ్రామానికి చెందిన చిన్న నరసింహులు వ్యవసాయ కూలీ. అతడికి శ్రీహరితో పాటు మరో ఇద్దరు కుమారులున్నారు. జీవీ సత్రంలోని వివేకానంద పాఠశాలలో శ్రీహరి ఆరో తరగతి చదువుతున్నాడు. శెట్టిపల్లె నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని వరదాయపల్లె సమీపంలో నరసింహస్వామి ఆలయం ఉంది. అక్కడ శ్రీహరి పెదనాన్న పూజారిగా వ్యవహరిస్తున్నాడు. శ్రీహరి ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తుంటాడు. గుడికి వెళ్లి మొక్కుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడే గడపడం అతడికి అలవాటుగా మారింది. తల్లిని తొందరపెట్టి.. ఎప్పటిలాగే ఈ ఆదివారం అతడు గుడికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. గుడికి వెళ్లాలంటే ఆటోలోనే వెళ్లాలి. సమీపంలో ఆటో నిలబడి ఉండడంతో ‘త్వరగా రామ్మా.. పోదాం’ అంటూ తల్లిని తొందర పెట్టాడు. తల్లి చిన్న ఓబుళమ్మతో కలిసి అతడు ఆటోలో బయలుదేరాడు. జీవీ సత్రం సమీపంలో ఆటో దిగిన తర్వాత నరసింహస్వామి గుడికి కొంత దూరం నడిచి వెళ్లాలి. ముందు శ్రీహరి నడుస్తుండగా, తల్లి వెనకాలే వస్తోంది. రోడ్డు దాటుతున్న శ్రీహరిని బద్వేల్ వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది. రోడ్డు పక్కన పడిపోరుున శ్రీహరిని చూసి అతడి తల్లి కేకలు వేసింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమారుడిని చూసి ఆమె హరీ అంటూ అతడిపై పడిపోయింది. స్థానికులు అక్కడకు చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నిం చారు. అప్పటికే అతడు చనిపోయూడు. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని అతడి తల్లి తీవ్రంగా రోదించింది. సమాచారం అందుకున్న పోలీసులు సం ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహా న్ని పోస్ట్‌మార్టం కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలియగానే శెట్టిపల్లె గ్రామంలోని బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. -
మైదుకూరు ఎస్ బీఐ ఏటీఎంలో భారీగా దొంగనోట్లు
కడప: వైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు ఎస్ బీఐ ఏటీఎంలో దొంగనోట్లు రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఎస్ బీఐ ఖాతాదారుడు 20 వేల రూపాయలు డ్రా చేయగా భారీ మొత్తంలో దొంగనోట్లు బయటపడ్డాయి. సుమారు 17,500 రూపాయలకు పైగా దొంగ నోట్లు ఉన్నట్టు సమాచారం. ఎస్ బీఐ ఏటీఎంలోనే దొంగ నోట్లు రావడంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆందోళనలో ఉన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ బీఐ ఏటీఎంలోనే దొంగనోట్లు రావడంపై పోలీసులు విచారణ చేపట్టారు.