సాక్షి, వైఎస్సార్(చాపాడు): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఆదివారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఈవెనింగ్ వాక్‌లా సాగింది. మూడు రోజులపాటు సాయంత్రం 5 గంటల తర్వాతే లోకేశ్ పాదయాత్ర జరిగింది. ఇదేం పాదయాత్ర అని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పాదయాత్ర పొడవునా ప్రతి గ్రామం వద్ద అక్కడికి వచ్చే కొద్దిపాటి మందిని లోకేశ్ దగ్గరకు రప్పించుకుని సెల్ఫీలు తీయించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సీఎం ఫ్లెక్సీపై లోకేశ్ వాగ్వాదం.. రాత్రికి చించివేత
ఇదిలా ఉంటే.. మండల కేంద్రమైన చాపాడులో శనివారం రాత్రి జరిగిన పాదయాత్రలో చాపాడు వద్ద వెలసిన పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం పేరుతో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీపై పోలీసులతో లోకేశ్ వాగ్వాదం చేశారు. తమ తండ్రిని కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీని చింపేస్తాం.. పీకేస్తాం.. అంటూ మైదుకూరు అర్బన్ సీఐ చలపతి, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిలతో ఆయన వాగ్వాదం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.
రాత్రి 11 గంటల ప్రాంతంలో చాపాడు కూడలిలో ఉన్న ఇద్దరు పోలీసులను కారులో వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించి అక్కడి సీఎం జగన్ ఫ్లెక్సీని చించేశారు. దీనిపై స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేయగా ఆదివారం పోలీసులు ఖాజీపేట ప్రాంతంలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఖాజీపేట మండలంలోనూ వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీనీ టీడీపీ కార్యకర్త చించివేయడం వివాదాస్పదమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
చదవండి: RBI Report: అలర్ట్.. నకిలీ నోట్లపై ఆర్‌బీఐ కీలక రిపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment