Padayathra
-
బీఆర్ఎస్లో జోష్.. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఎక్స్ వేదికగా నిర్వహించే ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.ఇందులో భాగంగా పాదయాత్రపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ‘‘పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో భవిష్యత్‌లో పాదయాత్ర చేస్తా. రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృతంగా పాదయాత్ర చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం. కాంగ్రెస్ పాలనలో నష్టం నుంచి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం’’ అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ వ్యూహాలతో కేటీఆర్ పాదయాత్రఎన్నికల్లో పరాజయం. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం.రోజురోజుకి పార్టీ బలహీన పడుతుండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ఆ హామీల్ని నిలబెట్టుకోలేదని, దాంతో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అంచనా వేస్తున్న కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.దీనికి సంబంధించి ఆయన ఈ మధ్యనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని గులాబీ పార్టీనేతలు చెప్పుకుంటున్నారు.పార్టీని ఉద్యమ పార్టీగా మలచి,ప్రజల అభిమానం గెలుచుకుని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన కేసీఆర్ తిరిగి పార్టీని బలోపేతం చేయడం కోసం పాదయాత్రకి ప్రణాళిక సిద్ధం చేశారట. ఇందులో భాగంగా కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై, ప్రజల సమస్యలను తెలుసుకుని అధికార పార్టీని నిలదీస్తారని ఇందు కోసం ఆయా ప్రాంతాల్లో నేతలు వ్యవహరించాల్సిన తీరును ఇప్పటికే వివరించారని, త్వరలోనే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. -
పాదయాత్ర లో ఎదురైన కష్టాలు చెప్పిన సీఎం జగన్
-
చింపేస్తాం.. పీకేస్తాం.. నారా లోకేష్ ఓవర్ యాక్షన్
సాక్షి, వైఎస్సార్(చాపాడు): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఆదివారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఈవెనింగ్ వాక్‌లా సాగింది. మూడు రోజులపాటు సాయంత్రం 5 గంటల తర్వాతే లోకేశ్ పాదయాత్ర జరిగింది. ఇదేం పాదయాత్ర అని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పాదయాత్ర పొడవునా ప్రతి గ్రామం వద్ద అక్కడికి వచ్చే కొద్దిపాటి మందిని లోకేశ్ దగ్గరకు రప్పించుకుని సెల్ఫీలు తీయించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సీఎం ఫ్లెక్సీపై లోకేశ్ వాగ్వాదం.. రాత్రికి చించివేత ఇదిలా ఉంటే.. మండల కేంద్రమైన చాపాడులో శనివారం రాత్రి జరిగిన పాదయాత్రలో చాపాడు వద్ద వెలసిన పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం పేరుతో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీపై పోలీసులతో లోకేశ్ వాగ్వాదం చేశారు. తమ తండ్రిని కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీని చింపేస్తాం.. పీకేస్తాం.. అంటూ మైదుకూరు అర్బన్ సీఐ చలపతి, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిలతో ఆయన వాగ్వాదం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చాపాడు కూడలిలో ఉన్న ఇద్దరు పోలీసులను కారులో వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించి అక్కడి సీఎం జగన్ ఫ్లెక్సీని చించేశారు. దీనిపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయగా ఆదివారం పోలీసులు ఖాజీపేట ప్రాంతంలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఖాజీపేట మండలంలోనూ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీనీ టీడీపీ కార్యకర్త చించివేయడం వివాదాస్పదమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. చదవండి: RBI Report: అలర్ట్.. నకిలీ నోట్లపై ఆర్బీఐ కీలక రిపోర్ట్ -
వద్దంటే వినకపోతివి.. లోకేశ్
కర్నూలు: యువగళం పాదయాత్ర జిల్లాలో 40 రోజుల పాటు సాగిందంట. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ పాదయాత్ర చేశారంట. నిజమేనా? అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు ఏదో ఊహించుకుంటే, ఇక్కడ ఏదో జరిగింది. జనం నుంచి స్పందన లేక.. మాట్లాడే మాట అర్థం కాక.. ఫ్లెక్సీల మధ్య వంద మంది జనంతో సభలను మమ అనిపిస్తూ.. ఈవినింగ్ వాక్‌ను తలపించే పాదయాత్ర జిల్లాలో నవ్వులపాలైంది. అడుగడుగునా కనిపించే అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యేలపై నాలుగు రాళ్లేయడంతో లోకేశ్ యాత్ర ముగిసింది. ఎవరో రాసిచ్చిన స్పీచ్‌ను కూడా సరిగా చదవలేక.. అందులోని వాస్తవాలను సరిచూసుకోకపోవడం మొదటికే మోసం తీసుకొచ్చింది. ఇంతేనా.. ప్రతీ నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడం గమనార్హం. టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టి పాదయాత్ర ఏప్రిల్ 13న అనంతపురం జిల్లా నుంచి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోకి చేరింది. 14 నియోజకవర్గాల్లో సాగిన యాత్ర మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం దాటి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లికి చేరింది. 40 రోజుల పాటు సాగిన పాదయాత్రను టీడీపీ శ్రేణులు పెద్ద ప్రహసనంలా నిర్వహించారు. జనాల తరలింపునకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలీ చెల్లించేందుకు.. ఉదయం, సాయంత్రం వెయ్యి మంది కనిపించేలా చూసుకునేందుకు నేతలు పడిన కష్టం అంతాఇంతా కాదు. కూలీ చెల్లించినా జనాల్లో ఆసక్తి లేక ఎమ్మిగనూరు సభ అట్టర్‌ఫ్లాప్ కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పట్టింది. పాదయాత్రలో కూడా దారిలో కలిసే కులాలు, సంఘాలు, గ్రామాల వ్యక్తులను సాధారణంగా వచ్చే వారిని కాకుండా ‘ప్రత్యేకంగా అరేంజ్’ చేసిన వారితో నడిపించారు. దీంతో యాత్ర సహజత్వాన్ని కోల్పోయి నేతలకు విసుగుతెప్పించింది. ముఖాముఖి కార్యక్రమాలు కూడా పూర్తిగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులతో నడిపించారు. బహిరంగసభ అర్థాన్నే మార్చేసిన లోకేశ్ జనాలు రాకపోవడంతో బహిరంగసభ అర్థాన్నే లోకేశ్ మార్చేశారు. ఇప్పటి వరకు సభ అంటే ఒక గ్రౌండ్ తీసుకుని వేదిక ఏర్పాటు చేస్తే ప్రాంగణం జనంతో నిండిపోయేది. కానీ లోకేశ్ యాత్రలో నిర్వహించిన సభలు మొత్తం సగటున 60 అడుగుల వెడల్పు, 160 అడుగుల పొడవుతో చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందులో కొంతమందిని తరలించి దాన్నే బహిరంగసభలా నిర్వహించారు. ఎమ్మిగనూరులో 80‘‘170, కోడుమూరులో 60‘‘160, పాణ్యంలో 60‘‘120, శ్రీశైలంలో 60‘‘120 లెక్కన వేదికలు ఏర్పాటు చేశారు. ఇలా బహిరంగసభను నిర్వహించింది రాష్ట్ర చరిత్రలో లోకేశ్ ఒక్కరే కావడం గమనార్హం. ఈవినింగ్ వాక్‌లా పాదయాత్ర కర్నూలు జిల్లాలో ఉదయం, సాయంత్రం యాత్ర నిర్వహించారు. రోజుకు సగటున 10కిలోమీటర్ల మేర నడిచారు. జనాలు రాకపోవడంతో లోకేశ్, ఆయన బృందం, వందమంది కూడా కార్యకర్తలు లేకుండా యాత్రలు నడిచాయి. దీంతో ఆత్మకూరు నుంచి ఉదయం పూట యాత్రకు ఫుల్స్టాప్ పెట్టారు. కేవలం సాయంత్రం 4గంటల తర్వాత ఒక పూట మాత్రమే యాత్ర నిర్వహిస్తున్నారు. దీంతో పాదయాత్ర కాస్త ‘ఈవినింగ్ వాక్’ను తలపిస్తోంది. అవగాహన లేమితో అభాసుపాలు పాదయాత్రలో లోకేశ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అతన్ని అభాసుపాలు చేశాయి. స్వతహాగా అవగాహన లేకపోవడం, స్థానికంగా ఇన్‌చార్జ్‌లను కాకుండా తాను ప్రత్యే కంగా ఏర్పాటు చేసుకున్న టీం ఇచ్చిన నోట్స్ చదవడంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ అభివృద్ధిపై సత్యదూర వ్యాఖ్యలు చేశారు. కోడుమూరు సభలో గోరంట్ల బ్రిడ్జి నిర్మిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పారని, టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామ ని లోకేశ్ అన్నారు. వాస్తవానికి బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.24కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులను ఓఎంఆర్ కన్స్ట్రక్షన్ చేస్తోంది. శంకుస్థాపన కోసం ఆర్థికశాఖ మంత్రి బుగ్గనతో పాటు ఎమ్మెల్యేలు సుధాకర్, శ్రీదేవి, కుడా చైర్మన్కోట్ల హర్షవర్దన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. లోకేశ్ తప్పులు మాట్లాడినా వాస్తవాలు స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసుకాబట్టి నియోజకవర్గంలో అభాసుపాలయ్యాడు. చివరకు డోన్‌లో జరిగిన ఎస్సీల ముఖాముఖిలో విదేశీ విద్య గురించి మాట్లాడుతూ ‘దళితులు పీకింది, పొడిచింది ఏమీ లేదని, తాను దానిపై పోరాటం చేశాన’ని అన్నారు. దీనిపై జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఎమ్మెల్యేలు కూడా అవినీతికి పాల్పడ్డారంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు వాస్తవాలను వివరిస్తూ ధ్వజమెత్తారు. దీనికి కనీసం ఆధారాలు చూపించి గట్టి కౌంటర్ కూడా టీడీపీ నేతలు ఇవ్వలేకపోయారు. విభేదాలు.. తన్నులాటలు ► పాదయాత్ర మొదలైన రోజు నుంచి అడుగడుగునా వర్గ విభేదాలు లోకేశ్‌కు తలనొప్పిగా మారాయి. ► డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి, కేఈ ప్రభాకర్ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సుబ్బారెడ్డికి సహకరించే ప్రసక్తే లేదని కేఈ వర్గం తేల్చిచెప్పింది. కరపత్రాలు పంపిణీ చేసింది. ► ఆలూరులో కోట్ల సుజాతమ్మ, వైకుంఠం మల్లికార్జున, వీరభద్రగౌడ్, శివప్రసాద్ ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు. దేవనకొండ క్రాస్‌లో కోట్ల, శివప్రసాద్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ► మంత్రాలయంలో తిక్కారెడ్డి, ఉలిగయ్య, ముత్తురెడ్డి వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. ► ఎమ్మిగనూరులో ఐదు రోజులు యాత్ర సాగితే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన వర్గం పూర్తిగా గైర్హాజరయ్యారు. ► కోడుమూరులో లోకేశ్‌కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలకడం మినహా యాత్ర జరిగిన రెండురోజులు లోకేశ్‌తో కలిసి ఇన్చార్జ్జ్ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి అడుగు కూడా నడవలేదు. కోడుమూరు బహిరంగసభలోనూ కన్పించలేదు. ► నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ, ఆమె వర్గం భౌతికంగా దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అఖిల రిమాండ్‌కు వెళ్లింది. ఇదీ నిజం! పశ్చిమప్రాంత రైతాంగానికి మేలు చేసే పులికనుమ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణప్రతిష్ట చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.263 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి హోదాలో 2008 సెప్టెంబర్ 21న పులికనుమ ప్రాజెక్టుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు పులికనుమ ప్రాజెక్టు మిగులు పనులకు (ఎల్లెల్సీ నుంచి పులికనుమ వరకు అప్రోచ్ కెనాల్ తవ్వటం) రూ.24కోట్లు కేటాయించి ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇది తమ ఘనతగా లోకేశ్ చెప్పుకోవడం హాస్యాస్పదం. గోనెగండ్ల మండలం వేముగోడు – తిప్పనూరు మధ్య తిప్పనూరు బ్రిడ్జిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.9కోట్లతో నిర్మిస్తే అది కూడా తమ ఘనతేనంటూ చెప్పుకోవడం పట్ల ప్రజలు నవ్వుకున్నారు. -
జగిత్యాలలో హై టెన్షన్.. బండి సంజయ్ అరెస్ట్
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఒక్కసారిగా పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నిర్మల్ వెళ్తుండగా జగిత్యాల జిల్లాలోని తాటిపల్లి వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందు పాదయాత్రకు అనుమతి ఇచ్చి లాస్ట్ మినెట్‌లో ఎందుకు నిరాకరించారని డిమాండ్ చేశారు. అయితే, రేపటి భైంసా పాదయాత్రకు పోలీసుల అనుమతి లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. శాంతి భద్రతల కారణంగా పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇక, బండి సంజయ్‌ను జగిత్యాల పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తట్టుకోలేక బీజేపీని ఇలా అడ్డుకుంటున్నారు. ఇది సూర్యుడికి చేయి అడ్డుపెట్టే విధంగానే భావించాల్సి వస్తుంది. బండి సంజయ్ యాత్ర ప్రజల కోసం చేస్తున్న యాత్ర. ఇది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపే యాత్ర అని అన్నారు. -
హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర
-
భారత్ జోడో యాత్ర.. 3,570 కిలోమీటర్లు.. 12 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ ఏడవ తేదీన శ్రీకారం చుట్టనున్న ‘భారత్ జోడో యాత్ర’ కన్యాకుమారిలో మొదలై కశ్మీర్లో పూర్తికానుంది. ఇందులోభాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఏకంగా 3,570 కిలోమీటర్ల పొడవునా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగనుంది. ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్.. జుడే వతన్)’ నినాదంతో సుదీర్ఘంగా ఐదు నెలలపాటు ఈ ప్రజాఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఏకధృవ సామాజిక పోకడ, దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, విద్వేషాలను రూపుమాపేందుకు కాంగ్రెస్ నడుంబిగించింది. కులమతాలకతీతంగా దేశ ప్రజానీకం పాదయాత్రలో కదంతొక్కనున్నారు. పాదయాత్రగా కొనసాగే ఈ కార్యక్రమాన్ని స్వాతంత్య్రభారతంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. తర్వాత తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూరు, బళ్లారి, రాయచూర్ మీదుగా యాత్రను కొనసాగిస్తారు. షెడ్యూల్లో భాగంగా తెలంగాణలోని వికారాబాద్లోనూ యాత్ర ఉంటుంది. మహారాష్ట్రలోని నాందేడ్, తర్వాత జల్గావ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్తాన్‌లోని కోటా పట్టణం.. తర్వాత డౌసా, అల్వార్‌లో పాదయాత్ర ముందుకు వెళ్లనుంది. ఉత్తరభారతం విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లోని బులందర్ షహర్, తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, అంబాలా(హరియాణా)లనూ పాదయాత్ర పలకరించనుంది. జమ్మూ పట్టణం, ఆ తర్వాత చివరిగా శ్రీనగర్‌లో పాదయాత్ర పూర్తికానుంది. భౌగోళికంగా నదీజలాలు, కొండలు, అటవీప్రాంతం.. పాదయాత్ర మార్గానికి ఆటంకం కలగకూడదని అవి లేని మార్గాల్లో పాదయాత్ర రూట్‌మ్యాప్‌కు కాంగ్రెస్ నాయకులు తుదిరూపునిచ్చారు. 100 మంది ‘భారత యాత్రికులు’ పాదయాత్రలో యాత్ర తొలి నుంచి తుదికంటా 100 మంది మాత్రం కచ్చితంగా పాలుపంచుకోనున్నారు. వీరిని ‘భారత యాత్రికులు’గా పిలవనున్నారు. ఏ రాష్ట్రం గుండా అయితే భారత్ జోడో యాత్ర మార్గం లేదో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరో 100 మంది ‘అతిథి యాత్ర’లు చేస్తారు. పాదయాత్ర ఉన్న రాష్ట్రాల నుంచి మరో 100 మంది ‘ప్రదేశ్ యాత్రికులు’ జతకూడుతారు. అంటే ప్రతిసారి 300 మంది పాదయాత్రికులు కచ్చితంగా ఉంటారు. రోజూ దాదాపు పాతిక కిలోమీటర్ల దూరం యాత్ర ముందుకెళ్తుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల -
కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో భారత్ జోడో యాత్ర లోగో, వెబ్‌సైట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, యాత్ర నిర్వాహక కమిటీ దిగ్విజయ్ సింగ్ మీడియా సమావేశంలో ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం(మిలే కదమ్.. జుడే వతన్)’అనే నినాదంతో కూడిన జోడో యాత్ర నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర వెబ్‌సైట్‌ను ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. యాత్రలో పాల్గొనదలిచిన వారు వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాల్గొనే ప్రధాన యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని 5 నెలలపాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగి కశ్మీర్లో ముగియనుందన్నారు. ఇదీ చదవండి: రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ -
బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. రాళ్లు విసిరిన కార్యకర్తలు
సాక్షి, జనగామ: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జనగామలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర సందర్భంగా దేవరుప్పుల టీఆర్ఎస్ నాయకులు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం.. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం నెలకొంది. రాళ్ల దాడిలో కొందరు నేతలు తలలు పగిలిపోయాయి. రక్తం కారడంతో అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్.. విధుల్లో ఉన్న సీపీ ఏం చేస్తున్నాడంటూ సీరియస్ అయ్యారు. ఇది కూడా చదవండి: ఎందరో వీరుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం: సీఎం కేసీఆర్ -
BJP Amaravati Padayatra: బీజేపీ నేతల్ని దొంగలన్న రైతు
తాడేపల్లి రూరల్: అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ‘మనం–మన అమరావతి’ పేరుతో వారం రోజులపాటు బీజేపీ తలపెట్టిన పాదయాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ప్రారంభించారు. ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఉండవల్లి మీదుగా పెనుమాకకు చేరుకుంది. పెనుమాకలో సోము వీర్రాజుకు తారసపడిన ఓ రైతు ‘మీరు దొంగలు’ అంటూ నిందించాడు. ‘మీ వల్లే రాజధాని రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు’ అని మండి పడటంతో సోము వీర్రాజు కొంత అసహనానికి గురయ్యారు. మరో రైతు కలగజేసుకుని అమరావతి విషయంపై ప్రశ్నించారు. అతడికి సోము వీర్రాజు బదులిస్తూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి సూత్రధారి చంద్రబాబేనని, కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు సరిగా ఖర్చుపెట్టి ఉంటే రైతులకు ఈ ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. బీజేపీ ఒకే రాజధానికి కట్టుబడి ఉందని, రాజధాని నిర్మాణానికి రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించడంతో పాటు అమరావతి స్మా›ర్ట్ సిటీ ఏర్పాటుకు రూ.2,500 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలోనే రైతులకు ప్లాట్లు కేటాయించి రాజధానిని అభివృద్ధి చేస్తామని వీర్రాజు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్‌కు వార్నింగ్ -
టీఆర్ఎస్ అంటే తాగుబోతుల పార్టీ: షర్మిల
వైరా: టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తాగుబోతులు, రేపిస్టుల సమితి అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షరి్మల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 88వ రోజు బుధవారం ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా మండలంలోని గరికపాడులో స్థానికులతో ‘మాట ముచ్చట’కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షరి్మల మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గమంటూ లేదన్నారు. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ ఉచితమని ఎన్నికల వేళ ప్రకటించిన ఆయన, ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. పనుల కోసం పోతే మహిళల మానప్రాణాలు అడుగుతున్నారని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని విమర్శించారు. నిస్వార్థంగా, ప్రజాసమస్యలపై పోరాడేందుకు తాను పార్టీ పెట్టినట్లు షరి్మల వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే దివంగత వైఎస్సార్ మాదిరిగా సంక్షేమ పాలన తీసుకొస్తానని ప్రకటించారు. ‘మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీతోనే వస్తారా’అని స్థానికులు ప్రశ్నించగా.. ‘మంచివాళ్లు మంచి పారీ్టలోనే ఉంటారు. మీ నాయకుడు టీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన మంచి వాడేనా’అని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా పొలంలో పనిచేస్తున్న రైతులతో మాట్లాడిన షరి్మల కాసేపు ట్రాక్టర్ నడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, సత్యవతి, సంజీవ, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్కిటెక్చర్ విద్యార్థులకు గీతాబోధ
తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే.. పనిచేస్తోన్న రంగంలో మూలాల వరకు ఉన్న లోటుపాట్లు, అవకాశాలను వ్యక్తిగతంగా శోధించి తెలుసుకుని, వాటిని సరిచేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా కార్యరూపం దాల్చుతారు. ఈ కోవకు చెందిన వారే 53 ఏళ్ల ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్. కోల్‌కతాకు చెందిన గీతా బాలకృష్ణన్.. ఢిల్లీలోని స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో బీఆర్క్ చదివింది. కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంది. తరువాత వివిధ ఆర్టిటెక్ట్ల దగ్గర ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు అక్కడ చేసే పని సంతృప్తినివ్వలేదు. దీంతో ‘నిర్మాణ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు’ పై కోర్సు చేసింది. ఈ కోర్సు చేసేసమయంలో ప్రొఫెసర్ కేఎస్ జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మార్గదర్శకంలో సాంప్రదాయేతర ఆర్కిటెక్ట్ డిజైన్లపై గీతకు మక్కువ ఏర్పడింది. దీంతో పర్యావరణానికి హాని కలగని డిజైన్లు చేస్తూనే..బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఆవాస్ (అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అండ్ సర్వీసెస్) పరిచయంతో ఎన్జీవో తరపున సేవాకార్యక్రమాలు నిర్వహించేది. ఇలా చేస్తూనే పట్టణాల్లో నివసిస్తోన్న నిరుపేదలకు ఆవాసం కల్పిస్తున్న మరో సంస్థతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈవిధంగా సామాజిక సేవచేస్తూనే మరోపక్క ఎంతోమంది కలల ఇంటినిర్మాణాలకు ప్లాన్లు రూపొందించేది. ఇథోస్ అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన తరువాత ఆర్కిటెక్చర్ విద్యార్థులకు, నిర్మాణ రంగంలో ఉన్న ఇంజినీరింగ్ వృత్తి నిపుణులకు మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించింది గీత. ఈ గ్యాప్‌కు ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘ఇథోస్’ సంస్థను స్థాపించి విద్యార్థులకు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులకు మధ్య వారధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరువందల కాలేజీల్లోని మూడువేలకుపైగా విద్యార్థులను వివిధ ఆర్టిటెక్ట్ సెమినార్లు నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేసేలా, ఇంజినీరింగ్ పట్ల వృత్తిపరమైన అవగాహన కల్పించేలా వృత్తినిపుణులకు, విద్యార్థులను ముఖాముఖి పరిచయ కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ డిగ్రీ అయిన వెంటనే వారి ఆసక్తికి తగిన ఉద్యోగం సులభంగా దొరికే సదుపాయం కల్పిస్తోంది ఇథోస్. 2018లో ఇథోస్.. ఏసీఈడీజీఈ పేరిట ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ డిజైనింగ్‌లో ఆన్లైన్ మాడ్యూల్స్‌ను అందిస్తోంది. ఆరు రాష్ట్రాలు..1700 కిలోమీటర్లు మానవుని జీవన శైలిపై అతను నివసించే భవన నిర్మాణ ప్రభావం కూడా ఉంటుందని గీత గట్టిగా నమ్ముతోంది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందించాలని ఆమె చెబుతోంది. అలా చెప్పడం దగ్గరే ఆగిపోకుండా తన ఇథోస్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా నుంచి ఢిల్లీవరకు అర్కాజ్ పేరిట 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో పర్యటించింది. కాలినడకనే ఆరు రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, భవన నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న కొంతమందితో మాట్లాడి వారి ఇంటి నిర్మాణం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో అడిగి తెలుసుకుంది. ఇంటి నిర్మాణానికి మంచి ప్లానింగ్ ఉంటే జీవితం మరింత సుఖమయమవుతుందని పాదయాత్రలో అనేకమందికి అవగాహన కల్పించింది. వందల కిలోమీటర్ల ప్రయాణంలో తాను తెలుసుకున్న అనేక విషయాలను యువ ఆర్కిటెక్ట్‌లకు తెలియ జెబుతోంది. బాగా స్థిరపడిన వారు వృద్ధాప్యం లో తమ సొంత గ్రామాల్లో జీవించేందుకు వసతి సదుపాయాల డిజైన్లు, నిరుపేదలు కనీస వసతి సదుపాయాల కోసం ఏం కోరుకుంటున్నారో దగ్గరగా చూసిన గీత వారికి తగిన డిజైన్లు ఎలా రూపొందించాలి? ఆ డిజైన్లు నిరుపేదల జీవన శైలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కాబోయే ఆర్కిటెక్ట్‌లకు వివరిస్తోంది. చేస్తోన్న పనిలోని లోటుపాట్లు్ల, అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ తరాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోన్న గీత లాంటి వాళ్లు మరింత మంది ఉంటే నాణ్యమైన వృత్తి నిపుణులుగా మరెందరో ఎదుగుతారు. -
అమరావతి పాదయాత్ర కు ఆ పేరు పెట్టుంటే బాగుండేది
-
8వ రోజు వైఎస్ షర్మిల పాదయాత్ర
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర
-
కుటుంబ పాలన అంతమొందించాలి: బండి
మొయినాబాద్ (చేవెళ్ల): ‘‘తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో 1,400 మంది అమరులైతే.. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం గుర్తించింది 600 మందినే. అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పాటైన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అధికారం అనుభవిస్తూ జల్సాలు చేస్తోంది. ఆ అమరవీరుల సాక్షిగానే కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం మొయినాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితున్ని సీఎం చేస్తానని, వారికి 3 ఎకరాల భూమి ఇస్తానని దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్, ఇప్పుడు కొత్తగా దళిత జపం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లకోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు నిధులిస్తే, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడం లేదని ఆరోపించారు. 111 జీవోను సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా? ఎన్నో సంవత్సరాలుగా చేవెళ్ల ప్రాంతంలో 111 జీవో సమస్యగా మారిందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం 111 జీవోను సమర్ధిస్తుందో వ్యతిరేకిస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. సీఎం కేసీఆర్‌కు, ఆయన కూతురు, కొడుకు, అల్లుడికి ఈ ప్రాంతంలో ఫాంహౌస్‌లు ఉన్నాయని.. వాటిని కాపాడుకోవడం కోసం జీవోను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు. రోడ్లు, బియ్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు, హరితహారం అన్నింటికీ కేంద్రం నిధులిస్తుందని.. కానీ రాష్ట్రమే ఇస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో, ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సందీప్ పాత్ర, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈటల రాజేందర్‌కు అస్వస్థత: నిమ్స్‌కు తరలింపు
-
150 కి.మీ. పాదయాత్ర చేయాలి
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిలను పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీలందరూ అక్టోబర్ 2 నుంచి 31 వరకు వారి వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని అన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ప్రధాని మోదీ కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. అలాగే పార్టీ బలహీనంగా నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు పర్యటించాలని మోదీ సూచించారు. మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2, వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31లను పురస్కరించుకుని బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా ఈ పాదయాత్ర నిర్వహించాలని మోదీ తెలిపారు. పాదయాత్రలో ముఖ్యంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం పట్ల అభిప్రాయాన్ని ఎంపీలు తెలుసుకోవాలని, అలాగే ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో అడగాలని అన్నారు. యాత్రలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. -
రాహుల్ పాదయాత్ర.. ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక
135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. గత నెలరోజులుగా నిస్తేజంగా మారిన పార్టీ శ్రేణుల్లో పార్టీ భవితవ్యంపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగనని తేల్చి చెప్పేయడం, ఆయన స్థానంలో ఎవరు వస్తారోనన్న గందరగోళం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పదవులకు సీనియర్ నేతల మూకుమ్మడి రాజీనామాలు ఇవన్నీ ఓ రకమైన సంక్షోభానికి దారి తీస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు దశలవారీగా పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వీరి ముందు ఇప్పుడు మూడు ఎజెండాలే ఉన్నాయి. అవే కాంగ్రెస్ జెండాని తిరిగి ఎగురవేస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. రాహుల్ పాదయాత్ర ఏసీ గదుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎన్నాళ్లు మేధోమథనం జరిపినా ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. జనంలోకి వెళ్లిన వాడే నాయకుడిగా అవతరిస్తాడని, ప్రజా సమస్యలు కళ్లారా చూసినప్పుడే రాజకీయ వ్యూహాలు సరిగ్గా అమలు చేయగలరని చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అందుకే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే బాగుంటుందని ప్రతిపాదనలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రాహుల్ ఎంతవరకు జయప్రకాశ్ నారాయణ, వీపీ సింగ్, చంద్రశేఖర్ మాదిరిగా అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలరా అన్న అనుమానాలూ ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇక రాహుల్ గాంధీ స్థానంలో అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నిక చేయాలన్నది అతి పెద్ద సమస్య. ఇప్పుడు అందరి కళ్లు రాజస్థాన్పైనే ఉన్నాయి. ఇన్నాళూ అశోక్ గహ్లోత్æ కాంగ్రెస్ పార్టీ కాబోయే అధ్యక్షుడని ప్రచారం సాగింది. ఇప్పుడు హఠాత్తుగా సచిన్ పైలెట్ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో ఎవరికీ అప్పగించినా పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఎన్ని అసమ్మతి జ్వాలలు రేగుతాయన్న ఆందోళనలు ఉన్నాయి. పార్టీ పగ్గాలను అనుభవజ్ఞుడికి అప్పగించాలా, యువతరం చేతుల్లో పెట్టాలా అనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి తగాదాను రాహుల్ ఎంతవరకు సమర్థవంతగా ఎదుర్కోగలరో చెప్పలేని స్థితి. తమిళ కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ ఫార్ములా తరహాలో రాహుల్ గాంధీ మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని తలపోసినా అది కూడా సరిగ్గా నడిచేటట్టుగా అనిపించడం లేదు. మే 25న రాహుల్ తన పదవికి రాజీనామా చేసినా అయిదు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందుకు సిద్ధంగాలేరు. అందుకే అధ్యక్షుడి విషయంలో పార్టీ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. 2024 ప్రధాని ఫేస్‌గా ప్రియాంక ఇక ఆఖరి అంకం అంటే కాంగ్రెస్‌లో ఎప్పుడూ ప్రియాంకమే. 2024 ఎన్నికల్ని రాహుల్ పెద్ద దిక్కుగా ఉండి నడిపించి, ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఉంది. ఈ అంశంలో ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోంది. అయితే పెద్ద దిక్కుగా రాహుల్, కొత్త అధ్యక్షుడి పనితీరు, ప్రియాంక ఎలా జనాన్ని మెప్పించగలరు అన్న అంశాలపైనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ప్రతిపాదనలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీపై సానుభూతి, విశ్వాసం పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పరాజయం కంటే ఈ నిస్తేజ పరిస్థితులే పార్టీకి ఎక్కువ చేటు కలిగిస్తాయని సీనియర్లతోపాటు అన్ని స్థాయిల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితికి సోనియా, రాహుల్లదే బాధ్యతని, వారి అంగీకారం లేకుండా ప్రత్యామ్నాయ నాయకత్వ ఏర్పాటు సాధ్యం కాదని అంటున్నారు. లోలోపల ఏదో కుట్ర, డ్రామా నడుస్తోందని నేతల అనుమానం. సిసలైన నాయకుడెవరూ కూడా సంక్షోభ సమయంలో బాధ్యతల నుంచి తప్పుకోరని తెలుగు రాజ్యసభ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్ ముందుగా సీడబ్ల్యూసీతోపాటు రాష్ట్ర శాఖలు, ఏఐసీసీ విభాగాలను రద్దు చేసి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్నారు. భవిష్యత్తుపై చర్చించేందుకు ముందుగా ఏఐసీసీ సమావేవం ఏర్పాటు చేసి రానున్న రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని అన్నారు. ఇలా ఉండగా, రాహుల్ గాంధీయే చీఫ్‌గా కొనసాగాలని పార్టీ కోరుకుంటోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. రాహుల్ వైదొలుగుతున్నట్లు ప్రకటించినందుకు నిరసనగానే పార్టీ నేతలంతా రాజీనామాలు చేస్తున్నారన్నారు. రాహుల్ పార్టీ చీఫ్‌గా కొనసాగాలని ఇప్పటికే సీడబ్ల్యూసీ తీర్మానించిందని గుర్తు చేశారు. -
జగనే..ప్రభంజనమై
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): గతేడాది జూన్ 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్డు కమ్ రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా జననేతకు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. లక్షలాది మంది తరలివచ్చి ‘తూర్పు’లోకి జననేతను తోడ్కొని వచ్చారు. అక్కడి నుంచి ఏకధాటిగా అలుపెరగని విధంగా పాదయాత్రగా ఆయన ముందుకు సాగారు. కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అరుదైన మైలురాళ్లు అధిగమించారు. 2,400, 2,500, 2,600, 2,700 కిలోమీటర్ల మైలురాళ్లను దాటి చరిత్ర సృష్టించారు. 200వ రోజు కూడా ఇక్కడే పూర్తి చేసుకున్నారు. ఇది జిల్లా చరిత్రలో అరుదైన ఘట్టంగా లిఖితమైంది. జిల్లాలోని 17 నియోజకవర్గాల పరిధిలోని 32 మండలాల్లో ఉన్న 232 గ్రామాల్లో పాదయాత్ర సాగించిన జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. 412 కిలోమీటర్ల మేర నడిచి జిల్లాలో చరిత్ర సృష్టించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 15 బహిరంగ సభల్లో పాల్గొని జిల్లాలోని అనేక వర్గాల వారికి పలు హామీలిచ్చారు. అడుగడుగునా పూల వర్షం అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ...నుదుట తిలకం దిద్ది మంగళహారతులిస్తూ...దిష్టి తీస్తూ ఎక్కడికక్కడ మహిళలు జననేతకు ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డను చూసేందుకు వృద్ధులు సైతం ఓపిక తెచ్చుకుని రోడ్లపైకి వచ్చారు. యువకుల సందడి, విద్యార్థినుల హడావుడి... రాఖీలు కట్టిన అక్కా చెల్లెమ్మల ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ఓ వైపు ఘన స్వాగతం పలికిన జనం...మరోవైపు సమస్యలు వినే నాయకుడు వచ్చాడంటూ తరలివచ్చిన బాధిత ప్రజలు... ఇలా ఎక్కడికొచ్చినా జన కోలాహలమే. సమస్యలతో సతమతమవుతున్న వారందరూ జగన్‌కు తమ బాధలను చెప్పుకున్నారు. అందరి సమస్యలూ ఓపిగ్గా విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మనందరి ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా మేలు చేస్తానని, నవరత్నాలతో అందర్ని ఆదుకుంటానని , రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి వారికి భరోసా ఇచ్చారు. అధికారం అండతో పేట్రేగిపోతున్న పాలకుల దుర్మార్గాలను, అవినీతిని, నిర్లక్ష్య పాలనను నడిరోడ్డుపై జగన్ నిగ్గ దీసినప్పుడు జనం పెద్ద ఎత్తున ఈలలు వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు...మంత్రులు,..ముఖ్య నేతల వరకు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో చెప్పినప్పుడు ఔనంటూ నినదించారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయిన బాధితులు అన్నొడొచ్చాడు...అండగా ఉంటానని హామీ ఇచ్చారని ఊరట చెందారు. ఇసుక వేస్తే రాలనంతగా బహిరంగ సభలకు జనం పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా జననేతకు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర పొడవునా ప్రజలు బారులు తీరడంతో రహదారులు జన గోదారులయ్యాయి. గోదారమ్మలా జనాభిమానం పొంగి పొర్లింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లిన ప్రతిచోటా జనసంద్రమయ్యింది. ప్రజలతో మమేకమై....ప్రజా సమస్యలు తెలుసుకుని....వారికి భరోసా ఇచ్చి....ముందుకు సాగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఒక ప్రభంజనంలా సాగింది. పాదయాత్ర ఆద్యంతం మహిళలు, రైతులు, విద్యార్థు«లు, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు పాదయాత్రలో జననేతను కలిసి తమ బాధలు చెప్పుకుని భరోసా పొందారు. మండుటెండలను లెక్కచేయలేదు. జోరున వర్షం కురిసినా వెనక్కి తగ్గలేదు. పాదయాత్రను ఏకధాటిగా కొనసాగించారు. జిల్లాలో అనేక వారధులను దాటుకుని పాదయాత్రను సాగించారు. జిల్లాలో పాదయాత్ర సాగిన కిలోమీటర్లు 412 నియోజకవర్గాలు 17 మండలాలు 32 గ్రామాలు 232 మున్సిపాలిటీలు 8 కార్పొరేషన్లు 2 బహిరంగ సభలు 15 ఆత్మీయ సమావేశాలు 2 పాదయాత్ర జరిగిన రోజులు 50 అధికారమిచ్చారు సుదీర్ఘ యాత్రలో వైఎస్ జగన్ వెంట వేలాదిగా కదిలారు. అడుగులో అడుగేసి నడిచారు. ‘మీ వెంటే ఉం టామని’ చెప్పారు. ‘మాకు అండగా ఉంటున్న మీకు మద్దతిస్తామంటూ’ అభి మానం చూపారు. మాట ఇస్తే మడమ తిప్పని వంశం నుంచి వచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయ చేస్తారని అప్పుడే భావించారు. ఎన్నికలెప్పుడు వస్తాయా? ఎప్పుడు ఓటేసి గెలుపిద్దామా? అని నాడే శపథం పూనారు. అన్నట్టుగానే సార్వత్రిక ఎన్నికల్లో కసిగా ఓటేశారు. మాట మీద నిలబడే నేత కోసం అర్ధరాత్రి వరకు బారులు తీరి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జననేతను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. 14 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను గెలిపించి పాదయాత్ర చేసిన వైఎస్ జగన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.ఆ రోజులు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఆ అడుగుల సవ్వడి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆ జన ప్రవాహం కళ్లల్లో కదులుతూనే ఉంది. పరవళ్లు తొక్కే గోదారమ్మలా సాగిన యాత్ర....జనదారులుగా మారిన రహదారులు... నేల ఈనిందా...ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్టుగా జరిగిన సభలు ఇంకా కళ్లెదుటే కదలాడుతున్నాయి. ఆ మహత్తర ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో అడుగు పెట్టి అప్పుడే ఏడాదైంది. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర గతేడాది జూన్ 12న జిల్లాలో అడుగుపెట్టింది. ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో ఎన్నో సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందులను కళ్లారా చూశారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. బాధలను విన్నారు. అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను నెరవేరుస్తున్నారు. మాట ఇస్తే మడమ తిప్పనని చేసిన వ్యాఖ్యలను కార్యరూపంలో పెట్టారు. ఊహకందని విధంగా ‘సంక్షేమ’ సంతకాలు చేస్తున్నారు. నెరవేర్చుతున్న హామీలు పాదయాత్రలో ప్రజలు తమ కష్టాలను చెప్పుకొన్నారు. వ్యక్తిగత ఇబ్బందులు తెలియజేశారు. బాధలు చెప్పుకుని ఉపశమనం పొందారు. అన్నీ వింటూ నేనున్నానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కన్నీళ్లు తుడిచి అధికారంలోకి వసే తానేం చేస్తానో చెప్పి ఊరట కల్పించారు. అక్కడికక్కడే అనేక హామీలిచ్చారు. ► ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ స్థలమిచ్చి, ఇళ్ల నిర్మాణం చేపడుతామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు నిన్న జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ► సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూడా కార్యరూపంలోకి తెచ్చారు. ► దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నిషేధం అమలుకు అడుగులు వేశారు. ► గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతానని చెప్పిన జగన్ కార్యాచరణ ప్రారంభించారు. గ్రామ వలంటీర్ల నియామకానికి ఆయన ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. ► యానిమేటర్లకు ప్రతి నెలా రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అధికారిక ప్రకటన చేశారు. ► నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన పథకాలన్నింటినీ అమల్లోకి తెస్తున్నారు. -
ఆ రోజు యాత్ర షురూ
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత వైయస్సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వ్యక్తి ఆయన. ప్రస్తుతం వైయస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఆయన జీవితంలోని కీలక ఘట్టమైన పాదయాత్ర అప్పుడు జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ‘యాత్ర’. వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్, మొదటి సాంగ్‌తో ఈ చిత్రంలోని హై ఇంటెన్సిటీ చూపించారు. ‘ఆనందో బ్రహ్మ’ చిత్రంతో చక్కని విజయాన్ని సొంతం చేసుకున్న మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన 70 యమ్.యమ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ మేక సమర్పిస్తున్నారు. చిత్రనిర్మాతలు విజయ్, శశి మాట్లాడుతూ– ‘‘ఆ మహా నేత పాదయాత్ర చేశారని తెలుగు వారందరికి తెలుసు కానీ, ఆ పాద యాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఎంత కీలకమో కొద్దిమందికి మాత్రమే తెలుసు. పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరకెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవడానికి నడుం కట్టారు వైయస్ఆర్. పేదవారు దేనికోసం ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాక ఆయన మనసు చలించి పోయింది. ఈ యాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు ఉన్న ఘట్టాన్ని తీసుకుని సినిమా చేశాం. ఆద్యంతం భావోద్వేగ సంఘటనలతో వైయస్సార్ మడమ తిప్పని నైజంతో పాటు, నిరుపేదలంటే ఆయనకు ఎంత ప్రాణమో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాం. ఆయన చేసిన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. మమ్ముట్టి గారు వైయస్సార్‌గారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అన్నట్లు నటిస్తున్నారు. టీజర్‌కు, ఫస్ట్ సింగిల్‌కు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. మా బ్యానర్లో ‘యాత్ర’ చిత్రం హ్యాట్రిక్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘యాత్ర’ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
366 రోజుల పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా : 366 రోజుల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి గుడి, మసీదు, చర్చిలను సందర్శిస్తానని తెలిపారు. 1001 మంది ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటానని వెల్లడించారు. 150 పల్లెల్లో నిద్ర చేస్తానని వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
3300 కి.మీ. పాదయాత్ర చేసిన డిగ్గీ రాజా
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేపట్టిన ‘నర్మదా యాత్ర’ సోమవారంతో ముగిసింది. దేశంలో పురాతన నదిగా పేరొందిన నర్మదా నది తీరంలో ఇసుక మాఫియా చేస్తున్న దురాగతాల వల్ల నది కలుషితమవుతుందంటూ డిగ్గీ రాజా ఆరు నెలల క్రితం నర్మదా యాత్ర చేపట్టారు. గతేడాది సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ పాదయాత్ర 3300 కిలోమీటర్ల మేర సాగింది. బర్మన్ ఘాట్‌కి చేరుకున్న దిగ్విజయ్, ఆయన భార్య అమృత కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఆయన భార్య అమృత, మాజీ ఎంపీలు రామేశ్వర్ నీఖ్రా, నారాయణ్ సింగ్, ఆయన అనుచరగణం కూడా పాల్గొన్నారు. కాగా ఆద్యంతం మతపరమైన, సాంస్కృతిక యాత్రగా సాగిన ఈ పాదయాత్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతి చిట్టాను బయటపెట్టేందుకు సాక్ష్యాలు సేకరించడానికి దోహదపడిందని, ఆ వివరాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
కదంతొక్కిన రైతన్న
ముంబై: అన్నదాతలు ఆదివారం ముంబై నగరాన్ని ముంచెత్తారు. డిమాండ్ల సాధన కోసం దాదాపు 50 వేల మంది మహారాష్ట్ర రైతులు ముంబైలో అడుగుపెట్టారు. వారంతా సోమవారం అసెంబ్లీని ముట్టడించనున్నారు. రైతు సమస్యలు తీర్చాలంటూ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది కర్షకులు పాదయాత్రగా వచ్చారు. ఎండలు మండిపోతున్నా, అరికాళ్లు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయకుండా దీక్షతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచిన వారంతా ముంబైలోని కేజే సోమయ మైదానానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు అర్ధరాత్రి ఆజాద్ మైదానానికి బయల్దేరారు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ వీరికి ముంబై శివార్లలో స్వాగతం పలికారు. మంగళవారం నాసిక్‌లో యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా రైతు రుణాలను మాఫీ చేయడం, పెట్టుబడికి అయిన ఖర్చు కన్నా కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండేలా చూడడం, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం, అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన వారిని ఆదుకోవడం, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను వారి పేర్లన రిజిస్టర్ చేయడం తదితరాలు రైతుల డిమాండ్లలో ప్రధానమైనవి. రైతు సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామనీ, ఆ సంఘం రైతులతో చర్చలు జరుపుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. కమ్యూనిస్టుల అనుబంధ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) రైతుల పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా, శాంతియుతంగా తాము నిరసన తెలుపుతామని ఏఐకేఎస్ తెలిపింది. -
‘మహా’ మార్చ్
ముంబై: చరిత్రలో రైతు ఉద్యమాలు ఎన్నో చూశాం. కానీ రికార్డు స్థాయిలో వేలాది మంది అన్నదాతలు 180 కి.మీ మేర పాదయాత్ర చేపట్టడం బహుశా ఇదే తొలిసారేమో! ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతోంది ఇదే. రుణ మాఫీ అమలు సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని సుమారు 30 వేల మంది రైతులు మార్చి 6న నాసిక్ నుంచి ముంబైకి మహా యాత్రగా బయల్దేరారు. మార్గ మధ్యలో వారికి థానె, పాల్ఘడ్ తదితర జిల్లాల రైతులు జతకలిశారు. 12న ర్యాలీ ముంబై చేరుకునే సరికి రైతుల సంఖ్య 70 వేలకు పెరగొచ్చు. అదే రోజు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించే వీలుంది. భారతీయ కిసాన్ సభ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ముంబై–ఆగ్రా జాతీయ రహదారి మీదుగా మార్చ్ కొనసాగుతోంది. రైతులు భోజనాలు, నిద్ర లాంటి అవసరాలను రోడ్లపైనే తీర్చుకుంటున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్లకు పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. అసంతృప్తిని రగిల్చిన పంట నష్టం.. ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. పింక్ బాల్ వార్మ్ చీడ పత్తి పంటను దెబ్బతీసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్ల వానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ రూ. 34 వేల కోట్ల రుణాల మాఫీకి హామీ ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాలేదు. దీంతో అన్నదాతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుని ఉద్యమానికి దారి తీసింది. ఆగని ఆత్మహత్యలు.. రుణ మాఫీ పథకం అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు, రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు రూ. 13, 782 కోట్లు విడుదల చేశామని తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి రూ. 2,400 కోట్ల ఆర్థిక సాయం కోరగా కేంద్రం నుంచి స్పందన రాలేదు. రైతుల డిమాండ్లు ఇవీ.. ► ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి ► విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి ళీ స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి ► కనీస మద్దతు ధరతో రైతులకు ఒరిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. ► అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి ► బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి.