జగన్‌కు మద్దతుగా జంగా పాదయాత్ర | Janga Krishnamurthy Padayathra in support of jagan | Sakshi
Sakshi News home page

జగన్‌కు మద్దతుగా జంగా పాదయాత్ర

Published Sun, Sep 1 2013 2:02 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Janga Krishnamurthy Padayathra in support of jagan

పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ :రాష్ర్ట విభజనపై అడ్డగోలు నిర్ణయానికి నిరసనగా సమన్యాయం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆ పార్టీ కేంద్రపాలక మండలిసభ్యుడు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి శనివారం పాదయత్ర చేపట్టారు. పట్టణంలోని మహనేత వైఎస్సార్ విగ్రహనికి క్షీరాభిషేకం చేసిన అనంతరం పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిలు పార్టీ జెండాను ఊపి జంగా పాదయాత్రను ప్రారంభించారు. మహిళలు జంగా నుదుట బొట్టుపెట్టి హారతి ఇచ్చారు. మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డితోపాటు పార్టీ నేతలు అంబటి రాంబాబు, రావి వెంకటరమణ, మందపాటి శేషగిరిరావు, శిఖా బెనర్జీ తదితరులు జంగా వెంట కొద్దిదూరం నడిచారు. 
 
కార్యకర్తలు వైఎస్ జగన్ చిత్రంతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ జై జగన్...జోహర్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. జోరువానలో ప్రారంభమైన పాదయాత్ర పోలీస్‌స్టేషన్ మీదుగా ఐలాండ్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ పలువురు మహిళలు జంగాను కలిసి అభినందనలు చేశారు. మార్గంమధ్యలో గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మాచర్ల బస్టాండ్ సెంటర్ మీదుగా బ్రహ్మణపల్లి చేరుకున్న జంగాను రైతులు, వ్యవసాయ కూలీలు కలిసి జగన్‌ను సీఎం చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. అక్కడి నుంచి తుమ్మలచెరువు చెట్టువద్దకు చేరుకున్న జంగాకు పార్టీ కార్యకర్తలు నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. అనంతరం పాదయాత్ర వీరాపురం, శాంతినగర్ గ్రామాల మీదుగా దాచేపల్లి మండలంలోకి ప్రవేశించింది.
 
జంగాకు స్వాగతం పలికిన విద్యార్థులు
పాదయాత్రగా వెళ్తున్న జంగాకు విద్యార్థుల నుంచి విశేషస్పందన లభించింది. పట్టణంలోని జిల్లా పరిషత్ విద్యార్థులు జంగాకు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక స్కాలర్స్ జూనియర్ కళశాల విద్యార్థులు జగనన్న నాయకత్వం వర్ధిలాల్లి అంటూ నినాదాలు చేశారు. బ్రాహ్మణపల్లి ప్రభుత్వ పాఠశాల, జిల్లాపరిషత్ హైస్కూల్ విద్యార్థులు జంగాపై పూలవర్షం కురిపించారు. ఆయనతో కరచాలనం చేశారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ చింతా వెంకటరామారావు, మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, 
 
నాయకులు కుందుర్తి గురవాచారి, కె.వాసుదేవరెడ్డి, షేక్ సైదావలి, షేక్ జానిబాబు, కె.మాణిక్యరావు, జి.పవన్‌రెడ్డి, కొమ్ము ముక్కంటి, కట్టా వెంకటేశ్వరరెడ్డి, అల్లు పిచ్చిరెడ్డి, వెన్నా రంగారెడ్డి, జంగిటి రామకోటేశ్వరరావు, సత్తార్ సీతారామిరెడ్డి, గండికోట కోటేశ్వరరావు, గుర్రం అప్పిరెడ్డి, కొక్కెర కొండలు, దొండేటి వెంకటరెడ్డి, మైలా వెంకట్రామిరెడ్డి, వుగ్గు నాగేశ్వరరావు, షేక్ మాషాబీ, వీరభద్రుని రామిరెడ్డి, యర్రంరెడ్డి చంద్రారెడ్డి, బండి పద్మావతి, అంజిరెడ్డి, శెట్టుపల్లి పూర్ణ, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement