ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డితోపాటు పాదయాత్ర చేస్తున్న మేరిగ మురళీధర్
గూడూరు: వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర చేపట్టినట్లు నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆయన పాదయాత్ర సోమవారం 10వ రోజు మనుబోలు నుంచి తిరిగి ప్రారభమైంది. వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసులురెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ మనుబోలు నుంచి చిల్లకూరు వరకు ఆయనతోపాటు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు.
రాక్షస పాలన అంతమై దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అందించిన సువర్ణపాలన మళ్లీ రావాలంటే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం రావాలన్నారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వారిలో సీఈసీ, సీజీసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, గూడూరు పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, గూడూరు, చిల్లకూరు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు మల్లు విజయకుమార్‌రెడ్డి, అన్నంరెడ్డి పరంధామిరెడ్డి, సన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, కౌన్సిలర్ నాశిన నాగులు, గిరిబాబు, బిక్కుసాహెబ్, దయాకర్, ఉన్నారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి స్వాగతం
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాదయాత్ర సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా సోమవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాయకులు జరుగుమల్లి బాబురెడ్డి, ముమ్మారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు రవీంద్రరాజు, ప్రభాకర్‌రాజు, రమణయ్య, సుబ్బరాయులు, రాజసులోచనమ్మ, దొరై, కళత్తూరు శేఖర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, రవిరెడ్డి, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment