srinivasulu reddy
-
నెల్లూరు రూరల్ YSRCP అభ్యర్థి
-
పద్ధతిగా తండ్రీకొడుకులను పక్కకు పెట్టిన చంద్రబాబు
కోవూరు: నియోజకవర్గంలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దినేష్‌రెడ్డి ఆధిపత్యానికి టీడీపీ అధిష్టానం క్రమంగా కత్తెరేస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ పయనమెటో తేల్చుకోలేక అగమ్యగోచర స్థితిలో వీరు కొట్టుమిట్టాడుతున్నారు. వాస్తవానికి కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వీరు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడొచ్చారు. ఇది జరిగిన రెండు రోజులకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అనే పదవిని దినేష్‌రెడ్డికి కట్టబెట్టారు. 24 గంటల్లోనే మరో ఝలక్ ఇది జరిగి 24 గంటలు కాక ముందే కోవూరు టీడీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతలను నియోజకవర్గంతో సంబంధంలేని వ్యక్తికి అప్పజెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో ఇటీవలే చేరిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్‌కు ఈ బాధ్యతను అప్పగించి తండ్రీకొడుకులను పద్ధతిగా పక్కనబెట్టారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రూప్‌కుమార్‌యాదవ్‌ను వీరు ఇక సంప్రదించక తప్పదు. తండ్రీకొడుకులపై నమ్మకం లేకే టీడీపీ ఈ నిర్ణయానికి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలంరెడ్డి పయనమెటో..? ప్రస్తుత పరిణామాలతో పోలంరెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా వేమిరెడ్డి బలపడితే ఇక తమకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదని, ఈ తరుణంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పోలంరెడ్డిపై అనుచరులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కేడర్ ఒత్తిడితో పాటు అధిష్టాన వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అనుచరులతో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. -
కౌలుకు తీసుకుని కబ్జా
కోవూరు: టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములను సైతం కబ్జా చేస్తున్నారు. కౌలు పేరిట తీసుకుని భూ యజమానులను బెదిరించి స్వాహా చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి నిర్వాకానికి పాల్పడ్డాడు. రూ.1.25 కోట్ల విలువైన ఐదెకరాలను కౌలుకు తీసుకుని ఆక్రమించాడు. బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో సదరు నేత కబ్జా పర్వం వెలుగులోకి వచ్చింది. వివరాలు..బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన కాకుమాను కృష్ణకుమారి, కాకుమాను మాధురిదేవికు వవ్వేరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లలో 1023–ఏ,బీ, 1024–ఏ,బీ, 512–1బీ,బీలో ఐదెకరాల భూమి ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి కౌలుకు ఇచ్చారు. పొలం యజమానులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇదే అదనుగా నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా భూమిని సొంతం చేసుకోవాలని భావించాడు. రెవెన్యూ అధికారులను బ్లాక్మెయిల్ చేసి రెవెన్యూ రికార్డుల్లో తన తల్లి నెల్లూరు మీనాక్షమ్మ పేరుపై భూమిని నమోదు చేయించుకున్నాడు. గత మూడేళ్లుగా కౌలు చెల్లించలేదు. భూమిని సైతం అప్పగించలేదు. దీంతో భూయజమానులు గట్టిగా నిలదీయగా పొలం తనదని, మీకు కౌలు చెల్లించాల్సిన అవసరం లేదని బెదిరించాడు. దీంతో భూయజమానులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా మీనాక్షమ్మ పేరుపై భూములు నమోదై ఉన్నాయి. దీంతో తహసీల్దార్ ఈ నెల 16న భూ హక్కు పత్రాలతో విచారణకు హాజరుకావాలని నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుచ్చిఎస్సై వీరప్రతాప్ చీటింగ్ కేసు నమోదు చేశారు. -
75.లక్షల విలవైన భూమి కబ్జా
కోవూరు/బుచ్చిరెడ్డిపాళెం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి ఆక్రమణలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇద్దరు మహిళలకు వంశపారంపర్యంగా వచ్చిన రూ.75 లక్షల విలువైన మూడెకరాల భూమిని లీజుకు తీసుకుని ఆక్రమించాడు. బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాలు..బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన కాకుమాను కృష్ణకుమారి, కాకుమాను మాధురిదేవికు సర్వే నంబర్ 1023–ఏ,బీ, 1024–ఏ,బీ, 512–1బీ,బీ సర్వే నంబర్లలో మూడెకరాల భూమి ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి కౌలుకు ఇచ్చారు. గత కొన్నేళ్లుగా పొలం యజమానులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కౌలు చెల్లించలేదు. భూమిని అప్పగించాలని కోరిన భూ యజమానులను బెదిరింపులకు గురిచేయసాగాడు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి అనుచరుడిగా చెలామణి అవుతూ రెవెన్యూ అధికారులను బ్లాక్మెయిల్ చేసి రెవెన్యూ రికార్డు ల్లో సైతం తన తల్లి నెల్లూరు మీనాక్షమ్మ పేరును నమోదు చేయించుకున్నారు. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన బాధితులను బెదిరించ డంతో బాధితులు ఇటీవల రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దీంతో బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి శనివారం నోటీసులు జారీ చేశారు. అలాగే బాధితుల ిఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై వీరప్రతాప్ సైతం చీటింగ్ కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వలంటీరు మృతి
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో వలంటీరు మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి(29) మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, ముత్తరాశిపాళెంకు చెందిన మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి 4వ వార్డు సచివాలయ పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్నారు. బుధవారం సొంత పనుల నిమిత్తం తన స్నేహితుడు సురేష్‌ను వెంటబెట్టుకుని బసవయ్యపాళెంకు బయలుదేరాడు. తెట్టు కూడలి వద్ద వీరి ద్విచక్ర వాహనం అదుపుతప్పి గంగమ్మ హద్దురాయి మండపాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులురెడ్డి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసులురెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో కోటంరెడ్డి రాద్ధాంతం
నెల్లూరు(క్రైమ్): అన్నదమ్ములపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని వెంటనే తనతో పంపాలని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం అర్ధరా త్రి నెల్లూరు సంతపేట పోలీస్‌స్టేషన్‌లో రాద్ధాంతం చేశారు. పోలీసుల కథనం మేరకు.. గాంధీ గిరిజన కాలనీకి చెందిన దేవరకొండ వెంకట్, అతడి అన్న సుసేంద్ర, అదే ప్రాంతానికి చెందిన హరికృష్ణ మరికొందరు ప్రభుత్వ ఐటీఐ వద్ద ఆదివారం క్రికెట్ ఆడుతుండగా సుసేంద్ర, హరికృష్ణ మధ్య వివాదం జరిగింది. కొద్దిసేపటికి సద్దుమణగడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. హరికృష్ణ అదేరోజు సాయంత్రం సుసేంద్రకు ఫోన్ చేసి తిట్టాడు. కొద్దిసేపటి తర్వాత గొడవను సర్దుబాటు చేసుకుందామని సుసేంద్రకు ఫోన్ చేశాడు. దీంతో అతను తన సోదరుడు వెంకట్‌తో కలిసి ఐటీఐ కళాశాల వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ హరికృష్ణ, అతని బంధువులైన చంద్రమౌళి, స్నేహితుడు నవీన్, రవీంద్ర తదితరులున్నారు. ఉదయం జరిగిన గొడవను మనసులో పెట్టుకుని వారు ఇనుపరాడ్లు, కర్రలతో వెంకట్, సుసేంద్రపై దాడి చేశారు. సుసేంద్ర కేకలు వేస్తూ పరుగులు తీయగా బ్రిడ్జి వద్ద నున్న కిశోర్, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి జరిగింది. ఇంతలో గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన వెంకట్, సుసేంద్రను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేరి్పంచారు. బాధితులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రాత్రి కేసు నమోదు చేశారు. నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారు టీడీపీకి చెందిన వారు కావడంతో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వెంటనే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేత అయిన నవీన్‌ను అక్రమంగా ఇరికించారని, వెంటనే తనతో పంపాలని లేకపోతే స్టేషన్లోనే పడుకుంటానని నానా రాద్ధాంతం చేశారు. స్థానిక పోలీస్ అధికారులతోపాటు నగర డీఎస్పీపై ఒత్తిడి తెచ్చాడు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. -
కవిత కూడా అనుమానితురాలే..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు అరుణ్ పిళ్లైని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. సౌత్ గ్రూపులోని ఇతర వ్యక్తులతో కలిపి పిళ్లైని విచారించాల్సి ఉందని, అందువల్ల కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతి ఏమిటి? బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైలను కలిపి విచారించడం పూర్తయిందా? కవిత విచారణకు హాజరయ్యారా? అని న్యాయమూర్తి పలు ప్రశ్నలు వేశారు. దీనికి ఈడీ న్యాయవాదులు బదులిస్తూ.. బుచ్చిబాబును శుక్రవారం విచారించనున్నామని తెలిపారు. సౌత్ గ్రూపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులతో కలిపి పిళ్లైను విచారించాల్సి ఉందని చెప్పారు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అనుమానితురాలేనని, పిళ్లైతో కలిపి ఆమెను విచారించాల్సి ఉందని వివరించారు. తాను మహిళను కాబట్టి ఇంటి వద్దే విచారించేలా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన అంశాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. ఆమెను ఈ నెల 11న విచారించామని.. మళ్లీ ఈ నెల 20న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశామని చెప్పారు. పలు అంశాలపై పిళ్లైతో కలిపి కవితను విచారించాల్సి ఉందన్నారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. పిళ్లైకు ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఎంపీ మాగుంటకు ఈడీ సమన్లు ఇక ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ నెల 18న విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి ఈడీ అధికారులు వివరించారు. -
నెల్లూరు బ్యారేజ్‌కు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు
జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజు దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను శాసించిన ధీరశాలి ఆయన. తన రాజకీయ వ్యూహంతో కేంద్రంలో కాంగ్రెస్ హైకమాండ్‌కే ముచ్చెమటలు పట్టించిన ఘనాపాటి. జిల్లా రైతాంగం కోసం ఆయన చేసిన కృషికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీర్తి కిరీటం ధరింప చేశారు. నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును చరితార్థం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. ఇప్పటికీ ఆ కుటుంబానికి విధేయులుగా నడుచుకునే అభిమానులు, రాజకీయ నాయకులు ఉన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వింటేనే రాష్ట్రంలో ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది నెల్లూరు. రైతుల కష్టాలు ఎరిగిన శ్రీనివాసులురెడ్డి వారికి అండగా నిలిచారు. తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను జిల్లాకు తీసుకురావడంతో పాటు, దానిని ఎనీ్టఆర్, ఎంజీఆర్‌లతో కలిసి రైతాంగానికి అంకితమిచ్చారు. సోమశిల నీటి సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి సేవలు చిరస్మరణీయం. జిల్లాలో ఎక్కువగా డెల్టా ప్రాంతంలోని రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని రెండు పంటల సాగుకు నీరందించే విధంగా చర్యలు తీసుకున్నారు. తెలుగు గంగ కాలువ ప్రారంభంలో ఎనీ్టఆర్, ఎమ్జీఆర్తో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి (ఫైల్) రైతుల గుండెల్లో అజరామరం నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డిని జిల్లాలోని ప్రతి రైతు తమ గుండ్లెలో నింపుకున్నారు. రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను గుర్తించిన నల్లపరెడ్డి ప్రాజెక్ట్‌ల సాధన కోసం నిత్యం పోరాటాలు చేసి రైతుల పాలిట పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్రను వేసుకున్న నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రైతు బాంధువుడిగా నిలిచిచారు. ప్రస్తుత పెన్నాడెల్టా ఆధునికీకరణకు 1987లో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన భౌతికంగా లేకపోయినా.. రైతులు గుండెల్లో అజరామరుడిగా నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిలిచిపోయారు. నల్లపరెడ్డి పేరు శాశ్వతం గతేడాది అక్టోబరు 27వ తేదీ నెల్లూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు నామకరణం చేయబోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కేబినెట్ నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరును పెడుతూ తీర్మానాన్ని ఆమోదించింది. జిల్లా రైతుల కోసం కష్టపడిన దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి బ్యారేజీ ఉన్నంత వరకు.. చరిత్ర చెరిగిపోని వరకు బతికే ఉంటారు. నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెట్టడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు, నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీనివాసులురెడ్డి రాజకీయ ప్రయాణం ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం గ్రామానికి చెందిన నల్లపరెడ్డి వీరరాఘవరెడ్డి కుమారుడు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి. 1933 ఏప్రిల్ 30న జని్మంచారు. విశాఖపట్నంలో బీఎల్ పూర్తిచేసే సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. 1961వ సంవత్సరంలో కోట సమితి అధ్యక్షుడిగా తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1972లో జనరల్ స్థానంగా ఉన్న గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1978లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి కోవూరు నియోజకవర్గాన్ని తన స్థానంగా శాశ్వతం చేసుకున్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి 1983, 1985లో టీడీపీ తరఫున, 1989లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విధంగా జిల్లా అంతటా నల్లపరెడ్డి వర్గాన్ని సృష్టించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముఖ్యమంత్రులు టి.అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు కేబినెట్లో మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రజలు మన్ననలు అందుకున్నారు. రాజీ పడని రాజకీయ నేతగా.. ఎమ్మెల్యేగా ఒక్క రోజు కూడా గైర్హాజరు కాకుండా అసెంబ్లీ టైగర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది నెల్లూరు బ్యారేజీకి తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతూ కేబినెట్‌తో ఆమోదింప చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవిత కాలం రుణపడి ఉంటాం. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లా ప్రజలకు, రైతులకు చేసిన సేవలకు ఇన్నాళ్లకు గుర్తింపు లభించింది. మా తండ్రి భౌతికంగా లేకపోయినా.. బ్యారేజీ పేరుతో రైతుల గుండెల్లో గుర్తిండిపోతారు. ఇది జీవితంలో మరచిపోలేని రోజు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే -
పచ్చ బినామీ
-
తెలుగు భాషకు వన్నె తెస్తా
సాక్షి, చిత్తూరు : తెలుగుభాషకు వన్నె తెస్తానని రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన తెలుగు అకాడమికి తొలి డైరెక్టర్‌గా నియమితులైన ఎస్వీయూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. సంయుక్త రాష్ట్రంలో 1968లో తెలుగు అకాడమిని ఏర్పాటు చేశారు. తెలుగుభాషాభివృద్ధి, వ్యాప్తికి తెలుగు మాధ్యమంలో పుస్తకాలు ముద్రించేందుకు తెలుగు అకాడమిని ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలి డైరెక్టర్‌గా నియమితులై 6 సంవత్సరాలుపాటు సేవలు అందజేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక తెలుగు అకాడమి తెలంగాణాలో ఉండిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఏపీలో తెలుగు అకాడమి ఏర్పాటుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత ఏపీలో తెలుగు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తెలుగు అకాడమీ చైర్మన్‌గా లక్ష్మీపార్వతిని గత నెల 16న నియమించారు. తాజాగా ఈ సంస్థ డైరెక్టర్‌గా ఎస్వీయూ ప్రొఫెసర్ పేట శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : మీ కుటుంబ నేపథ్యం? జవాబు : మాది తిరుపతిని బండ్ల వీధి. మా నాన్న పేట నారాయణరెడ్డి. ఆంధ్రాబ్యాంక్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అమ్మ చెంగమ్మ. బాల్యం అంతా తిరుపతిలోనే గడిచింది. ప్రశ్న : బీకాం చదివి తెలుగు ఎందుకు ఎంచుకున్నారు? జవాబు : నేను పదవ తరగతి చదివే సమయంలో ఎస్వీయూ తెలుగు ప్రొఫెసర్ జీఎన్ రెడ్డి రచించిన తెలుగు నిఘంటువు బాగా ఆకర్షించింది. దాన్ని చూసి తెలుగు పట్ల ఆసక్తి పెంచుకున్నాను. డిగ్రీలో ఒక సందర్భంలో ఆయన తెలుగుపై మా కళాశాలలో ప్రసంగించారు. దీంతో తెలుగుపట్ల ఆకర్షితుడినై బీకాం అనంతరం ఎంఏ తెలుగు చేశాను. ప్రశ్న : మీ ఉద్యోగ జీవితం? జవాబు : ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖలో పీహెచ్డీ చేశాను. 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి 2007లో ప్రొఫెసర్ అయ్యాను. డీన్‌గా విభాగాధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశాను. ప్రశ్న : ఇప్పటి వరకు ఎన్ని రచనలు చేశారు ? జవాబు : ఇప్పటి వరకు 20 పుస్తకాలు రచించాను. తిరుపతి కథలు, కొండకథలు, గంగజాతర పుస్తకాలు ఎంతో పేరు తెచ్చాయి. ఆంధ్రప్రభ, వీక్లీలో తిరుపతి కథలు ప్రచురితం అయ్యాయి. దానిపై పుస్తకం తెస్తున్నాను. అలాగే తిరువీధులు పుస్తకం ద్వారా తిరుపతి నగరాన్ని గురించి వివరిస్తూ రచన చేశాను. ప్రశ్న : ఎన్ని అవార్డులు అందుకున్నారు? జవాబు : నేను ఇప్పటి వరకు 17 అవార్డులను పొందాను. 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ టీచర్ అవార్డు, 2014లో తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం ముఖ్యమైనవి. అలాగే పలు అకడమిక్ సంస్థల్లో సభ్యుడిగా ఉన్నాను. 23 పీహెచ్డీ డిగ్రీలకు మార్గదర్శనం చేశాను. ప్రశ్న : తెలుగు అకాడమికి ఎలాంటి సేవ చేస్తారు? జవాబు : తెలుగు అకాడమి డైరెక్టర్‌గా నియమితులు కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అకాడమికి చైర్మన్‌గా ఉన్న లక్ష్మీపార్వతి కూడా ఎంఏ పీహెచ్డీ తెలుగులో చేశారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమిని పట్టించుకోలేదు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు అకాడమి ఏర్పాటు చేయడం తెలుగు భాషాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధి అవగతమౌతుంది. తెలుగుభాష వ్యాప్తికి, చిత్తశుద్ధితో పనిచేస్తాను. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు అకాడమిని విభజించి ఏపీలో తెలుగు అకాడమిని సుస్థిర పరుస్తాను. తెలుగుకు సంబంధించిన పుస్తకాలను మంచి రచయితలతో రచనలు చేయించి అందుబాటులోకి తెస్తాను. అందరికీ తెలుగు పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాను. ప్రశ్న : ఇంగ్లిష్ మీడియం ప్రభావంతెలుగుపై ఉంటుందా? జవాబు : రాష్ట్రంలో తెలుగు ప్రొఫెసర్లు అంతా ఆంగ్లమాధ్యమంలోనే చదువుతున్నారు. ఏపీ సీఎం తెలుగుమీడియం స్థానంలో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టి మంచినిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పేదలకు ఆంగ్లంలో చదువుకునే అవకాశం వచ్చింది. ఇంగ్లిష్ మీడియం పెట్టినంత మాత్రాన తెలుగు నిర్లక్ష్యానికి గురికాదు. బయోడేటా పేరు: పేట శ్రీనివాసరెడ్డి హోదా: ఎస్వీయూ ప్రొఫెసర్ విద్యాభ్యాసం: ఎంఏ, పీహెచ్డీ రచనలు: 20 పేరుతెచ్చినవి: కొండ కథలు, తిరువీధులు, గంగజాతర, తిరుపతి కథలు అందుకున్న అవార్డులు: 20 -
కోవూరు టీడీపీ అభ్యర్ధికి చుక్కెదురు
-
భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి
సాక్షి, కడప : కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమీర్ బాబు భోరున విలపించారు. పార్టీ కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తన దగ్గరున్నదంతా ఊడ్చిపెట్టానని, ఒక్కపైసా కూడా ఎవరూ సాయం చేసింది లేదని ఆయన కార్యకర్తల సాక్షిగా కంటతడిపెట్టారు. ఇకనైనా కార్యకర్తలను పట్టించుకోవాలని అమీర్ బాబు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అమీర్ బాబు అధిష్టాన పెద్దల చిన్నచూపుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన ...మరోవైపు భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేకపోక భోరుమన్నారు. పార్టీలో దోచుకున్నవాళ్లు దోచుకుంటున్నారని, జెండా మోసేవాళ్లు ఇంకా మోస్తూనే ఉన్నారని అమీర్‌బాబు అన్నారు. కార్యకర్తల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై తిగురుబావుటా ఎగురవేసిన ఆయన మీ అనుచరులకే తప్ప..కడపలో జెండా మోసిన నిజాయతీ గల కార్యకర్తకు మీరేమైనా చేశారా అంటూ అమీర్‌బాబు మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోని నాయకులు ఎందుకని ప్రశ్నించిన అమీర్‌బాబు...ఇన్నాళ్లుగా అధిష్టానం తననూ ఏమీ పట్టించుకోలేదంటూ భోరున ఏడ్చేశారు. మరోవైపు ఎంపీ ఆదినారాయణరెడ్డిపైనా అమీర్ బాబు ఇంతెత్తున లేచారు. మాకేం చేశారని మీకు మద్దతు ఇవ్వాలంటూ మంత్రి ఆదిని సూటిగా ప్రశ్నించారు. -
టీడీపీ నేతల ఆందోళన
వైఎస్సార్ జిల్లా: టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కార్యాలయం ఎదుట 15వ డివిజన్ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉంటే తమను కాదని పార్టీకి సంబంధం లేని వారికి పనులు ఎలా కేటాయిస్తారంటూ శ్రీనివాసులు రెడ్డిని నిలదీశారు. మర్యాదగా బయటకు వెళ్లాలని, ఏమి చేయాలో తనకు తెలుసునని ఆందోళన చేస్తున్న వారిపై శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారిమని తమను పక్కన పెడుతున్నారంటూ టీడీపీ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అణాగారిన కులాలను పక్కన పెట్టి కబ్జాదారులకు, రౌడీలకు టీడీపీ జిల్లా నాయకులు పనులు అప్పజెప్పుతున్నారని మండిపడ్డారు. చేసేదేమీ లేక అక్కడి నుంచి కాసేపయిన తర్వాత వెళ్లిపోయారు. -
జగన్మోహన్రెడ్డి సీఎం కావాలనే పాదయాత్ర
గూడూరు: వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర చేపట్టినట్లు నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆయన పాదయాత్ర సోమవారం 10వ రోజు మనుబోలు నుంచి తిరిగి ప్రారభమైంది. వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసులురెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ మనుబోలు నుంచి చిల్లకూరు వరకు ఆయనతోపాటు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రాక్షస పాలన అంతమై దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అందించిన సువర్ణపాలన మళ్లీ రావాలంటే వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం రావాలన్నారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వారిలో సీఈసీ, సీజీసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, గూడూరు పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, గూడూరు, చిల్లకూరు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు మల్లు విజయకుమార్‌రెడ్డి, అన్నంరెడ్డి పరంధామిరెడ్డి, సన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, కౌన్సిలర్ నాశిన నాగులు, గిరిబాబు, బిక్కుసాహెబ్, దయాకర్, ఉన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి స్వాగతం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాదయాత్ర సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా సోమవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాయకులు జరుగుమల్లి బాబురెడ్డి, ముమ్మారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు రవీంద్రరాజు, ప్రభాకర్‌రాజు, రమణయ్య, సుబ్బరాయులు, రాజసులోచనమ్మ, దొరై, కళత్తూరు శేఖర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, రవిరెడ్డి, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
ఆస్తి కోసం... సోదరుడే.. కాలయముడై..
►కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి... ►ముసుగు ధరించి హత్య చేసిన దుండగులు ఆస్తి కోసం తమ్ముడే కాలయముడయ్యాడు... అన్నను వేటాడి వెంటాడి నరికి చంపాడు... వదిన, సోదరుడి పిల్లల శోకానికి కారకుడయ్యాడు... చివరకు అతను కూడా జైలు పాలయ్యాడు. ప్రొద్దుటూరు క్రైం: పెద్దలు సంపాదించిన ఆస్తి అన్నదమ్ముల మధ్య వైరాన్ని పెంచి.. ప్రాణం మీదికి తెచ్చింది. మండల పరిధిలోని కానపల్లె రహదారిలో సోమవారం ఆకుల శ్రీనివాసులరెడ్డి (40)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైకులో వెళ్తున్న అతన్ని కారుతో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండారెడ్డిపల్లెకు చెందిన ఆకుల శ్రీనివాసులరెడ్డికి వెంకటసుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారికి బెంగళూరుతోపాటు స్వగ్రామంలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం అతనికి ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వనతేజతో వివాహం అయింది. వారికి అజయ్, మనోజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వనతేజ తల్లి చనిపోవడంతో కానపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న ఆరవేటి «థియేటర్ కాంప్లెక్స్‌లో మీ సేవా కేంద్రాన్ని నిర్వహించే వాడు. కృష్ణారెడ్డి కూడా కానపల్లెలోని వనతేజ చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడు. అతను కూడా ఉదయగిరిలో మీ సేవా కేంద్రాన్ని నిర్వహించే వాడు. ఆస్తి కోసం తరుచూ గొడవలు: ఆస్తి కోసం తరుచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. శ్రీనివాసులరెడ్డి తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను మృతి చెందాక కృష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి మధ్య ఆస్తి తగాదాలు మరింత పెరిగాయి. ఘర్షణలకు సంబంధించి నెల్లూరులోని వరికుంటపాడు పోలీస్‌స్టేషన్‌లో నాలు గు కేసులు ఉన్నాయి. తరుచూ గొడవలు జరుగుతుండటంతో శ్రీనివాసులరెడ్డి కానపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు. 8 నెలల క్రితం కృష్ణారెడ్డిపై దాడి 8 నెలల క్రితం కృష్ణారెడ్డిపై అన్న దాడి చేశాడు. పడుకొని ఉన్న అతన్ని వాహనంలో తీసుకొని వెళ్లి విచక్షణా రహితంగా కొట్టి, తీవ్రంగా గాయ పరచినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి అతను మీ సేవా కేంద్రాన్ని మూసివేసి శ్రీనివాసులరెడ్డిని చంపడానికి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కిరాయి హంతకులతో కలసి అతను పలుమార్లు ప్రొద్దుటూరుకు వచ్చి శ్రీనివాసులరెడ్డి నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రం, అతను ఇంటికి వెళ్లే రూట్లను గుర్తించినట్లు సమాచారం. కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి.. మీసేవా కేంద్రం నుంచి శ్రీనివాసులరెడ్డి సోమవారం మధ్యాహ్నం భోజనానికి బైక్‌లో కానపల్లె గ్రామానికి బయలుదేరాడు. అతని కోసం కాపు కాచిన నలుగురు దుండగులు ఏపీ26 ఎన్ 7007 అనే నంబరు కలిగిన ఇండికా కారులో వెంబడించారు. మైదుకూరు రోడ్డులో వెళ్తున్న శ్రీనివాసులరెడ్డి కొత్తపల్లె చెక్‌పోస్టు వద్ద నుంచి కానపల్లె మార్గం మీదుగా వెళ్లాడు. కానపల్లె సమీపంలోని దర్గా వద్దకు వెళ్లగానే వెనుక వైపున వస్తున్న కారుతో ఢీ కొట్టడంతో అతను కింద పడిపోయాడు. అయితే ప్రమాదం జరిగిందేమోనని అతనికి సాయపడేందుకు పొలంలో పని చేస్తున్న కూలీలు పరుగెత్తుకుంటూ రోడ్డు వైపు వచ్చారు. ఈ లోపే ముసుగులు ధరించిన నలుగురు దుండగులు కారులోంచి దిగి కింద పడిపోయిన శ్రీనివాసురెడ్డిని వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వారు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించే లోపే అతను మృతి చెందాడు. విషయం తెలియడంతో భార్య వనతేజ ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించసాగింది. తండ్రి మరణించడంతో కుమారులు రోదిస్తున్నారు. రూరల్ సీఐ ఓబులేసు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, స్థానికులను విచారణ చేశారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసుల అదపులో నిందితులు శ్రీనివాసులరెడ్డిని హత్య చేసిన నిందితులు మైదుకూరు వైపు పారిపోయారని సమాచారం తెలియడంతో పోలీసులు అన్ని మార్గాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట సమీపంలోని బోయినపల్లె వద్ద ము గ్గురు నిందితులను రాజంపేట డీఎస్పీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారు ప్రయాణిస్తున్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. -
తల వాసుపోతోంది
♦ ఒకవైపు వర్గపోరు..మరోవైపు నిలదీతలు ♦ తగ్గుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడి ప్రభ ♦ అందరినీ సమన్వయ పర్చలేకపోతున్నారనే ఆరోపణలు ♦ రాయచోటి..ప్రొద్దుటూరు.. బద్వేల్.. జమ్మలమడుగు ♦ క్రమంతప్పకుండా ఆరోపణలు చేస్తున్న నేతలు ♦ జిల్లా నేతనే టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు సాక్షి ప్రతినిధి, కడప: ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరి మూడేళ్లే.. అయినా పార్టీ క్రియాశీలక రాజకీయాలకు కేంద్రబిందువు అయ్యారు. రాజకీయాల్లో చాలామందికి జూనియర్ అయినప్పటీకీ అధిష్టానం అండదండలతో జిల్లా పీఠం చేజిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మిగతా నేతలతో పాటు పార్టీశ్రేణులతో సమన్వయం కొరవడింది. క్రమంతప్పకుండా ఏదో ఒక ప్రాంతంలో తమ్ముళ్లకు ఆయన టార్గెట్ అవుతున్నారు. ఈక్రమంలో తీవ్ర పదజాలాన్ని తెలుగుతమ్ముళ్లు ప్రయోగిస్తున్నారు. అధికారం ఉంది అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదని మొదట్లో పరిశీలకులు భావించారు. అయితే నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, పనుల వివాదాలను తీర్చలేక అధ్యక్షుడికి తలబొప్పి కడుతోందని పలువురు పేర్కొంటున్నారు. నేతలను సమన్వయపర్చడంలో శ్రీనివాసులురెడ్డి (వాసు) విఫలం కావడంతో అధికార పార్టీలో పెద్దఎత్తున దుమారం రేగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని ఏకతాటిపై నడిపించడం అధ్యక్షుడికి శిరోభారంగా మారింది. వర్గపోరూ....అనుభవలేమి... టీడీపీ జిల్లా అధ్యక్షుడికి ఓవైపు అనుభవలేమి వెంటాడుతుండగా మరోవైపు వర్గపోరు పట్టిపీడిస్తున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సొంత నియోజకవర్గం రాయచోటి నుంచే కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గీయులను మహానాడుకు ముందస్తు ఆహ్వానం లేకుండా చేయడమే అందుకు కారణం. టీడీపీ కుటుంబ పెద్దగా అందరినీ కలుపుకొని పోవాల్సింది పోయి, సొంత నియోజకవర్గంలోనే వర్గాలను ప్రోత్సహించారనే ఆరోపణలు భుజానకెత్తుకున్నారు. ఈవ్యవహారం అటుండగానే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి తీవ్ర పదజాలంతో అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. ఇష్టారాజ్యంగా పార్టీని నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు తాజాగా బద్వేల్ టీడీపీ అభ్యర్థి విజయజ్యోతి ఏకంగా శ్రీనివాసులరెడ్డిని ప్రొద్దుటూరులో నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు సమన్యాయం ఎందుకు చేయరని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన జయరాములులకు నీరు-చెట్టు పనుల్లో ప్రాధాన్యత ఇచ్చారని వాపోయారు. తాను ప్రాతిపాదించిన పనులకు అడ్డంకులు ఎందుకు అంటూ నిలదీశారు. మీ శైలిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆమె స్పష్టం చేశారు. వీటితోపాటు జమ్మలమడుగులో వర్గపోరూ తీవ్రరూపం దాల్చింది. జిల్లా అధ్యక్షుడిగా గాడిలో పెట్టాల్సిన ఆయన అటువైపు చూసేందుకే జంకుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కడప పరిధిలో వివిధ కాంట్రాక్టులు కేటాయింపుల్లో ఒక సామాజికవర్గానికి మినహా, ఇతరులకు అవకాశం కల్పించలేదని ఫిర్యాదుల పరంపర అధిష్టానానికి చేరాయని సమాచారం. అధికంగా ఉన్న ముస్లీం, కాపు సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు వెళ్లినట్లు తెలుస్తోంది. పనిచేయని లోకేష్ ఆదేశాలు టీడీపీలో వర్గపోరు ఉండకూడదు.. కేడర్ కలిసికట్టుగా పనిచేయాలని రెండు నెలల క్రితం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లాలో పర్యటించి దిశ నిర్దేశం చేశారు. అప్పట్లో నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టి మార్గదర్శకాలు జారీచేశారు. అయినప్పటీకీ పార్టీలో ఏమాత్రం మార్పులేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు టీడీపీ నేతల పరిస్థితి ఉండిపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నేతృత్వంలో ఓవర్గం, వైరివర్గంగా మరికొందరు ఉండిపోయారని పలువురు పేర్కొంటున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. మొత్తానికీ జిల్లా టీడీపీ పీఠం బాధ్యతలు శిరోభారంగా తయారైయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మద్యం దుకాణం యజమానిపై దాడి
రాయచోటి(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో ఒక మద్యం దుకాణం యజమాని మరో దుకాణం యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని వరదా వైన్స్ యజమాని కోకిల వైన్స్ యజమాని శ్రీనివాసులురెడ్డిపై శనివారం రాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులురెడ్డిని వెంటనే కడపకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అప్పులబాధతో వ్యాపారి ఆత్మహత్యాయత్నం
అప్పుల బాధతో శ్రీనివాసులు రెడ్డి(36) అనే వ్యాపారస్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మదనపల్లి మండలం రామిరెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువవటంతో ఇంట్లో పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆ భవనం ఎవరికి? విద్యకా.. వైద్యానికా..
ఒకవైపు తిరుపతిలో మొట్టమొదటి మహిళా వైద్య కళాశాల.. మరో వైపు వేలాది మంది పేదలు వచ్చే మెటర్నిటీ ఆస్పత్రి.. ఇటు కళాశాల నిర్వహణకు సరైన భవనం లేదు.. అటు గర్భవతులు, బాలింతలు పడుకునేందుకు బెడ్లు లేవు.. ఈ నేపథ్యంలో మెటర్నిటీ ఆస్పత్రి కోసం నిర్మిస్తున్న 300 పడకల భవనంపై స్విమ్స్ మెడికల్ కళాశాల కన్నుపడింది. దీనికోసం రెండు సంస్థలూ పోరాడుతున్నాయి. చివరికి ఈ భవనం ఎవరికి దక్కుతుందో.. తిరుపతి కార్పొరేషన్: రాయలసీమకే తలమానికంగా ఏర్పాటు చేస్తున్న మూడు వందల పడకల మెటర్నిటీ భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అయితే ఈ భవనాన్ని ఎవరికి కేటాయించాలన్నది వివాదాస్పదంగా మారుతోంది. ప్రస్తుతం మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా రూ.72 కోట్లతో 300 పడకలతో అత్యాధునిక వసతులతో భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ భవనాన్ని స్విమ్స్‌కు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ఉన్నతాధికారి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు బహిరంగంగా ఆరోపిస్తున్నాయి. అయితే ఆ నూతన భవనం తమకే కేటాయించాలని ఎస్వీ మెడికల్ కళాశాల (మెటర్నిటీ ఆస్పత్రి) అధికారులు పట్టుబడుతున్నారు. దీనికి తోడు సంబంధిత మంత్రి తిరుపతికి వచ్చిన ప్రతిసారీ నూతన భవనం కేటాయింపుపై పొంతనలేని ప్రకటనలు చేస్తుండడంతో గందరగోళానికి వేదికగా మారింది. ఇటీవల తిరుపతికి వచ్చిన వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు ఈ భవనాన్ని స్విమ్స్‌కు ఇస్తున్నట్టు వైద్యాధికారులతో చెప్పారు. పైగా మొదటి సారి శ్రీపద్మావతి మెడికల్ కళాశాల తిరుపతికి వచ్చిందని, అందులో వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ భవనాన్ని తాత్కాలిక పద్ధతిలో కేటాయిస్తున్నామని, మీరు సహకరించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి వ్యతిరేకిస్తూ, అలాంటి ప్రయత్నంచేస్తే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మంత్రికి చెప్పారు. అయినా సరే స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీపద్మావతి మెడికల్ కళాశాల విద్యార్థులకు భవ నం కేటాయించేందుకు చకచకా ఏర్పా ట్లు పూర్తవుతున్నాయి. ఈ ప్రతిపాదనను సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌకర్యాల లేమితో ఇబ్బందులు... ప్రస్తుతం ఉన్న మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అలుపెరగకుండా విధులు నిర్వహిస్తున్నా సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన రోగులకు తగ్గట్టుగా వైద్య సౌకర్యాలు పెరగకపోవడంతో ప్రసవానికి వస్తున్న గర్భిణులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మెటర్నిటీలో 150 బెడ్లు ఉన్నాయి. గతంలో రోజుకు 30 నుంచి 35 ప్రసవాలు జరుగుతుండగా, అందుకు తగ్గట్టుగానే పీఎన్ వార్డులో 40 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రసవాల సంఖ్య 50 నుంచి 60కి పెరగడంతో బెడ్ల కొరత పీడిస్తోంది. ఈనెల 7న ఓకే రోజు రికార్డు స్థాయిలో 66 ప్రసవాలు జరిగాయి. దీంతో ఉన్న 40 బెడ్లలో వీరిని పడుకోబెట్టడం కష్టంగా మారింది. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉండాల్సి వచ్చింది. పిల్లలను పక్కలో పడుకోబెట్టుకునేందుకు స్థలం లేకపోవడంతో నేల పైన పడుకోబెట్టాల్సి వస్తోంది. నూతన భవనం కేటాయిస్తే మెరుగైన సేవలు ఈ సమస్య పరిష్కారం కోసం మెట ర్నిటీ సమీపంలోనే మూడు వందల పడకలతో అధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం ప్రారంభించారు. మొత్తం 72 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఆస్పత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు మొదటి దశలో కేవలం 80 బెడ్లతో కూడిన విభాగం మాత్రమే సిద్ధమైంది. రెండవ దశలో 37.5 కోట్లతో ప్రతిపాదనలు పంపిం చామని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పనులు త్వరగా పూర్తయితే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని, తమ కల నెరవేరుతుందని వైద్యులు అంటున్నారు. దీనికి తోడు గర్భిణులు సైతం వెయ్యి కళ్లతో నూతన ఆస్పత్రి భవనం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ భవనాన్ని ఎవరికి కేటాయిస్తుందో ఇంతవరకు తేల్చలేదు. -
ఎందుకొచ్చారు..!
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఏ అర్హత ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన వరదరాజులరెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చారు.. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటూ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిలను కార్యకర్తలు నిలదీశారు. ఆదివారం ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే లింగారెడ్డి స్వగృహానికి వచ్చారు. ఎమ్మెల్యే దంపతులతో చాలా సేపు చర్చలు జరిపారు. ఇంతలో ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీలు ఎందుకు వచ్చారు.. వెంటనే బయటకు వెళ్లిపోవాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడిని కాదని, కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వ్యక్తికి 15 రోజుల్లోనే టికెట్ ఇచ్చినా ఏ ఒక్క టీడీపీ నాయకుడు ఖండించిన పాపాన పోలేదని మండి పడ్డారు. గది తలుపులను తడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకానొక దశలో గన్మెన్లు కార్యకర్తలను అదుపుచేసేందుకు చాలా ప్రయత్నించారు. గది నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే లింగారెడ్డి శాంతించాలని చెప్పడంతో ... అలా ఉన్నందునే ఇలా జరిగిందని కార్యకర్తలు అన్నారు. అనంతరం ఒక్క సారిగా కార్యకర్తలు గదిలోకి వచ్చి ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థుల ఎదుట తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఏనాడూ టీడీపీ జెండా మోయని వ్యక్తికి టికెట్ ఇచ్చి.. 20 ఏళ్ల పాటు జెండా మోసిన వ్యక్తిని పార్టీకి దూరం చేయడంలో దళారులుగా ఎంపీ రమేష్‌నాయుడు, సురేష్‌నాయుడు వ్యవహరించారన్నారు. టికెట్‌ను రూ.కోట్లకు అమ్ముకుని తమ ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు. లింగారెడ్డికి జరిగిన అన్యాయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనిస్తున్నారని టీడీపీ అభ్యర్థులలో ఏ ఒక్కరూ గెలిచే అవకాశం లేదని తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ నాయకుడు కూడా ఈ విషయంపై ప్రశ్నించడం కానీ, ఖండించడం కానీ చేయలేదన్నారు. పని చేయించుకుని వదిలివేయడమేనా చంద్రబాబు నాయుడికి తెలిసిన న్యాయం అని ప్రశ్నించారు. కార్యకర్తల మాటలకు ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి సమాధానం చెప్పలేక పోయారు. ఎమ్మెల్యే లింగారెడ్డి కార్యకర్తలను సముదాయించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ కార్యకర్తల భూముల్లో అలైన్మెంట్ మార్చిన వరద కూందు-పెన్నా వరదకాలువ విషయంలో వరదరాజులరెడ్డి టీడీపీ నాయకుల భూముల్లోకి అలైన్మెంట్ మార్చి నాశనం చేశాడు. అలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వడం దారుణం. మేము ఏవిధంగా అతనికి మద్దతు ఇవ్వాలి. 25 ఏళ్ల వరదతో వైరం 20 రోజుల్లో పోతుందా. గ్రామాల్లో ఘర్షణలు జరిగి కాళ్లు, కళ్లు పోగొట్టుకున్నాం.. ఇది చంద్రబాబుకు తెలియదా...లింగారెడ్డికి తీరని అన్యాయం చేశారు. - అంకాల్‌రెడ్డి, టీడీపీ నాయకుడు, పర్లపాడు కార్యకర్తలే బుద్ధి చెబుతారు జిల్లాలో టీడీపీని నిలబెట్టిన ఏకైక నాయకుడు లింగారెడ్డి. అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వరదరాజులరెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారు. టికెట్‌ను పోట్లదుర్తి నాయకులు అమ్ముకుని తీవ్ర అన్యాయం చేశారు. ఇంత దారుణంగా వ్యవహరించిన వారికి కార్యకర్తలే తగిన బుద్ధి చెబుతారు. -ప్రభాకర్‌రెడ్డి, పొట్టిపాడు -
‘దేశం’లోకి పోలంరెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సొంత గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధమైంది. ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు పలువురు నాయకులతో చర్చించి ముహూర్తం నిర్ణయించనున్నారు. ఈయన ఆదివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ఈ భేటీలో ముహూర్తం ఖరారు కాలేదని పోలంరెడ్డి అనుచరులు చెబుతున్నారు. దీంతో కోవూరు టీడీపీతో పాటు జిల్లాలోని ఆ పార్టీలోనూ రసవత్తర రాజకీయానికి అంకురార్పణ జరగనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల ముందు నుంచి పోలంరెడ్డి సొంతగూటికి చేరుకుంటారనే ప్రచారం విసృ్తతంగా సాగింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేశారు. ఎన్నికల అనంతరం పోలంరెడ్డి ‘దేశం’లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో తనకు టికెట్ ఖాయంగా ఇస్తానంటేనే పార్టీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే షరతు విధించారు. అప్పటికే తన వ్యాపార భాగస్వామి అయిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి టికెట్ ఇప్పిస్తానని చంద్రమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు పెళ్లకూరును కోవూరు నియోజకవర్గంలో సోమిరెడ్డి తిప్పుతున్నారు. ఈ విషయం పసిగట్టిన పోలంరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు వెనకడుగు వేశారు. దీంతో టీడీపీ అభ్యర్థిత్వం సందేహంలో పండింది. ఒక దఫా పార్టీలో చేరేందుకు నిర్ణయించిన ముహూర్తానికి కూడా పోలంరెడ్డి వెళ్లకుండా తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా జరిగిన పరిణామాల్లో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబుతో ఆదివారం సాయంత్రం భేటీ కావడం పార్టీ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహన్రావు పోలంరెడ్డిని వెంటపెట్టుకుని చంద్రబాబును ఆయన నివాసంలో కలిసినట్లు సమాచారం. ఈ సమావేశం సమయానికి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర అందుబాటులో లేకపోవడంతో పోలంరెడ్డిని ఎప్పుడు పార్టీలో చేర్చుకోవాలనే తేదీ ఖరారు కాలేదు. సుమారు అర్ధగంటపాటు చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే మంతనాలు జరిపారు. ఏది ఏమైనా ఈ భేటీ తరువాత పోలంరెడ్డి టీడీపీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు భేటీ విషయాన్ని పోలంరెడ్డి అనుచరులు ధ్రువీకరించారు. దీంతో ఇప్పటికే కోవూరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పెళ్లుకూరు శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో పాటు వారి అనుచరులు ఆందోళనలో పడ్డారు.