శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో వలంటీరు మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి(29) మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, ముత్తరాశిపాళెంకు చెందిన మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి 4వ వార్డు సచివాలయ పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్నారు.
బుధవారం సొంత పనుల నిమిత్తం తన స్నేహితుడు సురేష్‌ను వెంటబెట్టుకుని బసవయ్యపాళెంకు బయలుదేరాడు. తెట్టు కూడలి వద్ద వీరి ద్విచక్ర వాహనం అదుపుతప్పి గంగమ్మ హద్దురాయి మండపాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులురెడ్డి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే శ్రీనివాసులురెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment