Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy with local body YSRCP Party representatives1
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్‌! : వైఎస్‌ జగన్‌

స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి.. ఎవరినైనా నేను భయపెడతా.. కొడతా.. చంపుతా.. ప్రలోభపెడతా..! అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేలా ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. అవి మోసాలుగా మిగిలాయి మీ జగన్‌ పాలనలో ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ప్రజల్లోకి వెళ్లలేడు. తన కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: ‘మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రాజకీయాలలో ఎప్పుడూ విలు­వ­లు, విశ్వసనీయత ఉండాలని నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటా.. పార్టీ కూడా అలా­గే ఉండాలని మొట్టమొదటి నుంచి ఆశించా. కష్టకాలంలో మీ అందరూ చూపించిన తెగువ, స్ఫూ­ర్తి­కి హ్యాట్సాఫ్‌..’ అని స్థానిక సంస్థల వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రజాప్రతినిధులను పార్టీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలో­భా­లకు లొంగకుండా.. బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులకు వెరవకుండా పార్టీ కోసం గట్టిగా నిల­బడిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతి­నిధులను అభినందించారు. బుధవారం తాడేపల్లి­లోని పార్టీ కేంద్ర కార్యా­లయంలో వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా­ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమ­య్యా­రు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని వ్యాఖ్యానించారు. ‘రాబోయే రోజులు మనవే.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపో­తా­యి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజా­ర్టీతో అధికా­రంలోకి వస్తుంది. జగన్‌ 1.0 పాలనలో కోవిడ్‌ వల్ల కార్యకర్తలకు చేయాల్సినంత చేయకపోయి ఉండ­వచ్చు. కానీ.. జగన్‌ 2.0లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్‌ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్‌ చేసి చూపిస్తాడు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకూడదుమొన్న జెడ్పీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్‌ సభ్యు­లు, ఉప సర్పంచ్‌ స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఏడు చోట్ల అధి­కార పార్టీ గెలిచే పరిస్థితి లేకపో­వడంతో ఎన్ని­కలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల వాయి­దా వేసే పరిస్థితి లేకపోవడంతో అని­వా­ర్యంగా ఎన్ని­క­లు జరిపారు. అలా ఎన్నికలు నిర్వహించిన 50 స్థానా­­లకు గానూ 39 చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విష­యం ఏమిటంటే.. అసలు టీడీపీకి ఎక్కడా కనీ­సం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అయినా సరే.. మ­భ్య­­పెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టి.. ఏకంగా పోలీ­సు­లను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వ­హించారు. ఇన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పు­కునే చంద్ర­బాబుకు నిజంగా బుద్ధీ, జ్ఞానం రెండూ లేవు! సూపర్‌ సిక్స్‌లు.. మోసాలుగా మిగిలాయిఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి, ప్రతి ఇంటికి వారి కార్యకర్తలను పంపించి పాంప్లెట్లు పంచాయి. చంద్ర­బాబు బాండ్లు పంపించారని ప్రతి ఒక్కరికీ చెప్పి ఎన్నికల్లో గెలిచాయి. చంద్రబాబు పాలన చేపట్టి దాదాపు 11 నెలలు అవుతుంది. మరి ఆయన చెప్పిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్లు ఏమయ్యాయని ఎవ­రైనా అడగడానికి ధైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతు­న్నా­రు. ఆ హామీలను నెరవేర్చాలనిగానీ, ప్రజల­కి­చ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగానీ చంద్రబా­బులో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం.. పాలనలో అబద్ధాలే కనిపిస్తున్నాయి. సూపర్‌ సిక్స్‌లు, సెవెన్లు గాలికెగిరిపోయి మోసా­లుగా కనిపిస్తున్నాయి. మాట మీద నిలబడే పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు..సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఎందుకు అమలు చేయ­డం లేదు అని అడుగుతుంటే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభు­త్వం దిగిపోయే నాటికి, ఆయన చేసిన అప్పులే అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజు­లు పోతే రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అని చెబు­తాడు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీ­లను ఎగ్గొట్ట­డానికే ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెబు­తు­న్నారు. ఇలాంటి దిక్కు­మాలిన అబద్ధాలు, మోసా­లతో రాష్ట్రంలో పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మళ్లీ మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను పరిష్క­రి­ంచాలని తపించే గుండె ఉండే మంచి పాలన రావా­లని ప్రజలందరూ ఇవాళ మన­స్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఉన్నదల్లా రెడ్‌బుక్‌ రాజ్యాంగమే..మరోవైపు ఇవాళ వలంటీర్‌ వ్యవస్థ లేదు. పార­దర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్‌ బుక్‌ రాజ్యాంగమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దారుణ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం..⇒ తిరుపతి కార్పొరేషన్‌లో మనం 48 స్థానాలు గెలిస్తే వాళ్లు కేవలం ఒక్కటే గెలిచారు. అక్కడ ఇటీవల డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సందర్భంగా మన కా­ర్పొ­­రేటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుగుతున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వ­ర్యంలోనే కిడ్నాప్‌ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. ⇒ విశాఖ కార్పొరేషన్‌లో 98 స్థానాలకు వైఎస్సార్‌­సీపీ 56 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ప్రజా­స్వామ్యయుతంగా వైఎస్సార్‌సీపీ మేయర్‌ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొ­రేటర్లు క్యాంపుల్లో ఉంటే.. పోలీసులు వారి ఇళ్ల వద్దకు వచ్చి మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, లేదంటే మిమ్మల్ని స్టేషన్‌కి తరలిస్తామని బెదిరిస్తు­న్నారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా?⇒ అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్థానాలు మనవే. వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే ఉప ఎన్నికలో మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్‌ఐ పోలీసు ప్రొటెక్షన్‌ ఇచ్చినట్లు నమ్మించి తొమ్మిది మంది మన ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేశాడు. వీడియో కాల్‌లో లోకల్‌ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. అయినా సరే మన ఎంపీటీసీలు మాట వినక­పోవడంతో మండల కేంద్రంలో నిర్బంధించి బైండోవర్‌ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ మండ­లంలో భయం రావాలట..! అందుకోసం లింగమయ్య అనే బీసీ నాయకుడిని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం?⇒ స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి మొత్తం 16 ఎంపీటీసీలను మనం గెలిచాం. ఆరుగురిని ప్రలోభ­పెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మన­వాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులతో అడ్డుకుని కౌంటింగ్‌ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించారు. అక్కడ కోరమ్‌ లేకపో­యినా.. ఆరుగురే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్‌ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. ఎంపీపీ స్థానంలో బలం లేకపోయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇదీ.⇒ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోప­వరంలో ఉప సర్పంచ్‌ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మన­వాళ్లు 15 మందిని పోలీ­సులు బందోబస్తు కల్పి­స్తా­మని చెప్పి తీసుకెళ్లి టీడీపీ సభ్యులున్న చోట విడి­చిపెట్టారు. అంటే టీడీపీ వాళ్లను దౌర్జన్యం చే­య­మని వదిలేశారు. కౌంటింగ్‌ హాల్‌­లోకి మన­వాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను మాత్రం పంపి­స్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికా­రికి చెబితే ఎన్ని­క వాయిదా వేశారు. మళ్లీ రెండో రోజు.. ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయి­దా వే­శారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తు­న్నారు. ⇒ ఇక తుని మున్సిపాల్టీలో 30కి 30 కౌన్సిలర్లు మనమే గెలిచాం. వాళ్ల దగ్గర ఏమాత్రం సంఖ్యా బలం లేదు. అయినాకూడా వైస్‌ చైర్మన్‌ పోస్టు దక్కించుకునేందుకు కావాలని ఎన్నికలకు అడ్డంకులు సృష్టించి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్‌ చైర్మన్‌ మహిళను బెదిరించి రాజీనామా చేయించారు.⇒ అత్తిలిలో 20 స్థానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్‌ క్వాలిఫై కాగా మన బలం 15 ఉంది. అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి. వాళ్లకు సంఖ్యా బలం లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది!!⇒ ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య.. మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగు­తున్నా.. మీరంతా గట్టిగా నిలబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. దీన్ని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో... చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది.సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తల కోసం ఎంత గట్టిగా నిలబడతానో చూపిస్తా..‘కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈసారి కచ్చితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్‌ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్‌ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. కోవిడ్‌ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్‌ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సి­నంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్‌ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్‌ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్‌ చేసి చూపిస్తాడు’ – వైఎస్‌ జగన్‌విద్య, వైద్యం, వ్యవసాయం అధోగతి..ఇవాళ స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు ృ నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్‌ తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలు గాలికెగిరి­పోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆగిపోయింది.మరోవైపు వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈ రోజు వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్‌ పీఎం కిసాన్‌తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు... మేం వస్తే పీఏం కిసాన్‌ కాకుండా సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ ఇచ్చిన అమౌంట్‌ లేదు... బాబు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది.పీ4 పేరుతో బాబు కొత్త మోసం..చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈమధ్య పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం ద్వారా సమాజంలో 20 శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్‌ (తెల్ల) రేషన్‌ కార్డులున్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్‌ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి.. 1.48 కోట్ల తెల్ల రేషన్‌ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. పేదలు కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది కూడా ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. జనం నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారు. అయినాసరే నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు.

USA Donald Trump Announces Tariff Over All Countries2
ట్రంప్‌ మార్క్‌ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్‌ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్‌ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్‌ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్‌.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్‌ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్‌ బుధవారం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్‌, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్‌ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్‌: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్‌: 10 శాతంసింగపూర్‌: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్‌: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్‌: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్‌: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్‌: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్‌: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్‌: 36 శాతంబంగ్లాదేశ్‌ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్‌ సభ్యులతో పాటు స్టీల్‌, ఆటోమొబైల్‌ కార్మికులను ట్రంప్‌ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్‌ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025

YS Jagan Attends Marriage Function At Kurnool3
నేడు కర్నూలుకు వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి/కర్నూలు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నేడు కర్నూలుకు వెళ్లనున్నారు. కర్నూలులోకి జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో కుడా మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.పర్యటన ఇలా..వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలులోని జొహరాపురం రోడ్డులో ఉన్న మైపర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో కుడా మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో మాజీ సీఎం పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించి వైఎస్సార్‌సీపీ నాయకులతో మాట్లాడిన అనంతరం ఆయన తిరిగి 12.50 గంటలకు తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్‌ పనులను వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి, పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సతీష్‌లు పరిశీలించారు. ఏర్పాట్లపై కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌తో చర్చించారు.

ICC T20 Rankings: Hardik Pandya Retains No 1 Rank Varun Slips To 34
‘టాప్‌’లోనే హార్దిక్‌ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌ బుధవారం విడుదలయ్యాయి. తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) ఆల్‌రౌండర్ల విభాగంలో తన నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హార్దిక్‌ 252 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.బౌలింగ్‌ విభాగంలో భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) తన రెండో ర్యాంక్‌ను కోల్పోయాడు. వరుణ్‌ ఒక స్థానం పడిపోయి 706 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన న్యూజిలాండ్‌ పేసర్‌ జేకబ్‌ డఫీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు.క్రితంసారి వరకు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న అకీల్‌ హోసీన్‌ (వెస్టిండీస్‌) రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు అభిషేక్‌ శర్మ రెండో స్థానంలో, తిలక్‌ వర్మ నాలుగో స్థానంలో, సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదో స్థానంలో ఉన్నారు.రాజస్తాన్‌ రాయల్స్‌ సారథిగా సామ్సన్‌బెంగళూరు: గాయం కారణంగా సారథిగా కాకుండా కేవలం ప్లేయర్‌గా మాత్రమే ఐపీఎల్‌ ఆడుతున్న సంజూ సామ్సన్‌కు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి అనుమతి లభించింది. వేలి గాయం పూర్తిగా మానడంతో కీపింగ్‌ చేయొచ్చని బీసీసీఐ వెల్లడించింది.తాజా సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో సామ్సన్‌ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దిగగా... అతడి స్థానంలో రియాన్‌ పరాగ్‌ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా ఆర్చర్‌ బౌలింగ్‌లో సామ్సన్‌... కుడిచేయి బొటనవేలికి గాయం కాగా... శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దిగ్వేశ్‌కు జరిమానాలక్నో: లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ దిగ్వేశ్‌ సింగ్‌ రాఠిపై జరిమానా పడింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా... వికెట్‌ తీసిన అనంతరం అతిగా సంబరాలు చేసుకున్నందుకు గానూ దిగ్వేశ్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు. దిగ్వేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ చివరి బంతికి పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య ఔటయ్యాడు.ఆ సమయంలో బ్యాటర్‌ దగ్గరకు వెళ్లిన దిగ్వేశ్‌... అతడి వికెట్‌ తన ఖాతాలో పడినట్లు పుస్తకంలో రాస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. అదే సమయంలో ఫీల్డ్‌ అంపైర్లు దిగ్వేశ్‌ను వారించగా... నిబంధనలను అతిక్రమించినందుకు రిఫరీ అతడిపై జరిమానా వేయడంతో పాటు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ కేటాయించారు.‘దిగ్వేశ్‌ లెవల్‌–1 తప్పిదానికి పాల్పడ్డాడు. నియమావళిలోని 2.5 ఆర్టికల్‌ ప్రకారం అతడికి జరిమానా విధించాం’ అని ఐపీఎల్‌ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో వెస్టిండీస్‌ పేసర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌ ఈ తరహా సంబరాలతో ‘ఫేమస్‌’ అయ్యాడు.టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌ సందర్భంగా వికెట్‌ తీసిన అనంతరం ‘నోట్‌బుక్‌’లో ఏదో రాస్తున్నట్లు సైగలు చేస్తూ సంబరాలు చేసుకోగా... దానికి భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన దూకుడైన ఆటతో దీటుగా బదులిచ్చి అచ్చం అదే తరహాలో సంబరాలు చేసుకున్నాడు. కాగా... లక్నో, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Chhattisgarh Vijay Sharma key comments Maoists Peace Talks5
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

రాయ్‌పూర్‌: మావోయిస్టులతో చర్చలకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ. ఈ క్రమంలో షరతులు లేకుండా చర్చలు తమ ప్రభుత్వ్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. స్పష్టమైన ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకు రావాలని సూచించారు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల లేఖపై డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ సందర్బంగా విజయ్‌ శర్మ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. షరతులు లేకుండా అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.మావోయిస్టులు నిజంగా తిరిగి రావాలనుకుంటే వారు తమ ప్రతినిధులను, చర్చల నిబంధనలను స్పష్టం చేయాలి. ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలను అంగీకరించాలి. గతంలో మావోయిస్టుల కంచుకోటలుగా పేరొందిన 40 గ్రామాల్లో ఏడాదిన్నర కాలంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. మావోయిస్టులు చర్చల పట్ల సీరియస్‌గా ఉంటే చర్చల కోసం వారే స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాను. స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి’ అని తెలిపారు.

US announced 26 percent reciprocal tariff on imports from India6
టారిఫ్‌లపై కంట్రోల్‌ రూమ్‌..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి.ప్రస్తుతం భారత్‌లో అమెరికా దిగుమతులపై సగటున టారిఫ్‌లు 7.7%గా ఉండగా, ఆ దేశానికి మన ఎగుమతులపై సగటున సుమారు 2.8 శాతమే. ప్రస్తుతం 190 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలనేది ఇరు దేశాల లక్ష్యం. ఈ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణభారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్‌ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్‌ ప్రకటించారు.

Jaguar Fighter Jet Crashes In Gujarat Pilot Dies7
గుజరాత్‌లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం

గాంధీ నగర్: గుజరాత్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఓ పైలట్‌ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్‌ మృతిచెందారు. ప్రమాదం అనంతరం యుద్ధ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్‌ మృతి చెందినట్టు వెల్లడించారు. పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లోని సువర్ద సమీపంలో బుధవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‎కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ తప్పిపోయాడు. శిక్షణలో ఉన్న విమానం కూలగానే మంటలు అంటుకున్నాయని, ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ ప్రేమ్‌సుఖ్‌ దేలూ తెలిపారు. గాయపడిన పైలట్‌ను జామ్‌నగర్‌లోని జీజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఇక, విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.#BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025ఇదిలా ఉండగా.. మార్చి నెలలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంతికేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన విమానం అంబాలా ఎయిర్‌బేస్ నుంచి శిక్షణాలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే.. మరో జాగ్వార్ యుద్ధ విమానం క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.Tragic news tonight. Trainee IAF fighter pilot killed in Jaguar crash near Jamnagar. The other pilot managed to eject, being treated in hospital.Deepest condolences to the family of the deceased pilot. 💔 pic.twitter.com/bQy6bG1918— Shiv Aroor (@ShivAroor) April 2, 2025 An IAF Jaguar two seater aircraft airborne from Jamnagar Airfield crashed during a night mission. The pilots faced a technical malfunction and initiated ejection, avoiding harm to airfield and local population. Unfortunately, one pilot succumbed to his injuries, while the other…— Indian Air Force (@IAF_MCC) April 3, 2025

Telangana High Court orders Congress govt on Kancha Gachibowli lands8
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనిపై గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్‌ సుజోయ్‌ పాల్, జస్టిస్‌ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎక రాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్‌) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్‌ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్‌ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్‌ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు.పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి..పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఎల్‌.రవిచందర్‌ వాదిస్తూ ‘ఆ 400 ఎకరాలు అటవీభూమి. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలి. 40కిపైగా జేసీబీలతో చెట్లు కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నెలపాటు అధ్యయనం చేయాలి. ఈ అడవిలో బఫెలో, పీకాక్, ఎస్‌ఆర్‌ ప్రధాన సరస్సులు, ‘పుట్టగొడుగుల శిల’ వంటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలున్నాయి. ఇది 237 జాతుల పక్షులు, నెమళ్లు, చుక్కల జింకలు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్‌ రాక్‌ పైథాన్, బోయాస్‌ వంటి వివిధ పాము జాతులకు పర్యావరణ నివాసం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ‘అడవి’ అనే పదాన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన నోటిఫికేషన్లకే పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీసే విధ్వంసాన్ని నిరోధించాలి’ అని నివేదించారు.ఆదాయం కోసం ఆరాటమే తప్ప..‘150 ఎకరాలకు మించి అటవీ ప్రాంతాన్ని చదును చేసేందుకు పర్యావరణ అధ్యయనం అవసరం. మీటర్‌ కంటే ఎక్కువ ఎత్తు కాండం పెరిగిన చెట్లును కొట్టాలంటే వాల్టా చట్ట ప్రకారం అనుమతి పొందాలి. లేకుంటే చట్టప్రకారం శిక్షార్హం. కానీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు. ఆదాయం కోసం ఆరాటమే తప్ప పర్యావరణ విధ్వంసం గురించి పట్టించుకోలేదు. హైదరాబాద్‌ నడిబొడ్డున 400 ఎకరాల్లో దశాబ్దాలకుపైగా ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. పక్కనే కాంక్రీట్‌ జంగిల్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు ఊపిరి కూడా అందడం కష్టమవుతుంది. భవిష్యత్‌ తరాలు ఆక్సిజన్‌కు అవస్థ పడాల్సి వస్తుంది. ఒకపక్క కేసు హైకోర్టులో విచారణ సాగుతుండగానే అధికారులు రాత్రీపగలు చెట్ల నరికివేత చేపడుతున్నారు. ఈ పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.క్రీడల పేరిట రూ. వేల కోట్ల భూములకు చంద్రబాబు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్‌ భారత ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఎంజీబీపీఎల్‌) ఏర్పాటైంది. ఆగస్టు 9న ఐఎంజీ భారతతో నాటి చంద్రబాబు ప్రభుత్వం (తాత్కాలిక ప్రభుత్వం) క్రీడల్లో ఇక్కడి యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దే పేరుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్పోర్ట్స్‌ అకాడమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసమంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లోని 400 ఎకరాలను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం మామిడిపల్లి సర్వే నంబర్‌ 99/1లోని మరో 450 ఎకరాలను అప్పగిస్తామని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. ఐఎంజీ భారత అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి బంజారాహిల్స్‌ నుంచి మాదాపూర్‌ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. 2004 ఫ్రిబవరిలో రూ. వేల కోట్ల విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే రూ. 2 కోట్లకు ఐఎంజీ భారతకు సేల్‌డీడ్‌ చేసింది. ఏమాత్రం అర్హతలేని, భూములు కొట్టేయడం కోసమే ఏర్పడిన కంపెనీ నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం 2006లో నాటి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐఎంజీ భారతకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన సేల్‌డీడ్‌తోపాటు ఎంఓయూ కూడా రద్దయ్యింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని సమర్థించాయి. నాడు వైఎస్సార్‌ రక్షించిన ఆ 400 ఎకరాలు ఇండస్ట్రియల్‌ భూములే. నాడు పిల్‌ దాఖలు చేసిన వారు అర్హతలేని కంపెనీ, తక్కువ ధరనే సవాల్‌ చేశారు. హెచ్‌సీయూ భూములనిగానీ, పర్యావరణం దెబ్బతింటుందని కానీ ఎక్కడా పేర్కొనలేదు. నాడు ఒక దొంగ నుంచి మేము ఈ భూములను రక్షించినప్పుడు ఈ పిల్‌ దాఖలు చేసిన వారెవరూ కలసి రాలేదు. ఇప్పుడు పిల్‌లు దాఖలు చేసి ప్రశ్నిస్తున్నారు’ అని ఏజీ పేర్కొన్నారు.గూగుల్‌ ఫొటోలే ఆధారామా?‘గూగుల్‌ ఫోటోల ఆధారంగా అక్కడ ఫారెస్ట్‌ ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. రెవెన్యూ, ఇతర ఏ రికార్డుల్లోనూ అది అటవీ భూమిగా లేదు. గూగుల్‌ చిత్రాలు వానాకాలం ఒకలా, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. గూగుల్‌ చిత్రాలు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. నా స్నేహితుడొకరు సభ్యుడిగా ఉన్న ఓ గోల్ఫ్‌ క్లబ్‌లోనూ నెమళ్లు, జింకలు, పాములు ఉన్నాయి. దాన్ని కూడా అటవీ ప్రాంతంగా డిక్లేర్‌ చేస్తారా? ఈ లెక్కన హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు. గత పదేళ్లలో నాటి ప్రభుత్వం వేలాది ఎకరాలు విక్రయించినా నోరుమెదపని వారు ఇప్పుడు రూ.75 కోట్లకు ఎకరం విక్రయిస్తుంటే ప్రశ్నిస్తున్నారు. ఈ పిల్‌లు ప్రజాప్రయోజనం ఆశించి వేసినవి కావు. నిజాం కాలం నుంచి ఈ 400 ఎకరాలు గడ్డి భూములు. ఈ భూములకు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ స్థలంలో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్‌లు కూడా ఉన్నాయి’ అని ఏజీ చెప్పారు. కాగా, ఇది ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ అని సర్కార్‌ వద్ద రికార్డులున్నాయా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సమయం ముగియడంతో తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.

Rasi Phalalu: Daily Horoscope On 03-04-2025 In Telugu9
ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.షష్ఠి రా.3.27 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: రోహిణి ప.12.25 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: సా.5.45 నుండి 7.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.02 నుండి 10.51 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: ఉ.9.24 నుండి 10.55 వరకు.సూర్యోదయం : 5.58సూర్యాస్తమయం : 6.09రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.మిథునం.... బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.సింహం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.కన్య.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.తుల..... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృశ్చికం... చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.ధనుస్సు... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.మకరం.... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.కుంభం... కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.... పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

Haleem sales up 20 percent this Ramadan compared to last year10
హలీమ్‌ @ రూ.వెయ్యి కోట్లు!

సాక్షి, సిటీబ్యూరో: రంజాన్‌ వచ్చిoదంటే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీమే. ఈ మాసంలో ప్రత్యేకంగా లభించే హలీమ్‌ కోసం మాంసప్రియులు తహతహలాడతారు. ఈసారి రికార్డు స్థాయిలో జరిగిన హలీమ్‌ అమ్మకాలే దానికి నిదర్శనం. ఏకంగా రూ.వేయి కోట్ల మేర హలీమ్‌ వ్యాపారం జరిగిందని అంచనా. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో హలీమ్‌ విక్రయాలు సాగాయని వ్యాపారులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన రుచికరమైన హలీమ్‌ కేంద్రాలు, హోటళ్లు రంజాన్‌ నెలంతా కిటకిటలాడాయి. ప్రతి హోటల్‌ ముందు ప్రత్యేక బట్టీలు, కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగాయి. ఈ సీజన్‌లో దాదాపు 50 లక్షల ప్లేట్ల హలీమ్‌ అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్‌ హోటళ్ల సంఘం చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం అధికంగా హలీమ్‌ అమ్మకాలు సాగాయని అంటోంది. కేవలం హోటళ్లలోనే కాదు ఫుడ్‌ డెలివరీ యాప్‌లలోనూ హలీమ్‌కే ఆహారప్రియులు ఓటేశారు. టేక్‌ ఆవేలు, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌లతో హలీం అమ్మకాలు ఒక రేంజ్‌లో సాగాయి. ఆరువేల విక్రయ కేంద్రాలు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 6 వేల చిన్నా, చితక హలీమ్‌ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రెస్టారెంట్లు వీటికి అదనం. చిన్న, మధ్య తరగతి రెస్టారెంట్లే కాదు స్టార్‌ హోటళ్లలోనూ రంజాన్‌ సీజన్‌ మెనూలో హలీం డిష్‌ను తప్పనిసరి చేశారు. హైదరాబాదీ బిర్యానీని హలీం ఓవర్‌ టేక్‌ చేసి మెనూలో టాప్‌లో నిలిచింది. చిన్న హలీం కేంద్రాల్లో రోజుకు దాదాపు వంద పేట్ల చొప్పున అమ్మకాలు జరిగితే, పేరున్న హోటళ్లు, కేంద్రాల్లో సుమారు 500–600 ప్లేట్ల హలీం విక్రయించారని అంచనా. వీకెండ్‌లలో 25 శాతం అధికం..హలీమ్‌ ప్లేట్‌ ధర రూ.100 నుంచి 320 వరకు పలికింది. ఎక్కువ శాతం మటన్‌ హలీమ్‌ సెంటర్లు ఉండగా, పలు ప్రాంతాల్లో చికెన్, బీఫ్‌ కేంద్రాలు కూడా వెలిశాయి. వీటిలో అత్యధికంగా 70 శాతం మేర పాతబస్తీలోనే ఉన్నాయి. సగటున రోజుకు దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. సాధారణ రోజుల కంటే వీకెండ్‌లలో 25 శాతం అధికంగా విక్రయాలు జరిగాయని జహంగీర్‌ అనే హలీం కేంద్ర నిర్వాహకుడు తెలిపారు. పాతబస్తీతో పోలిస్తే సైబరాబాద్‌లో హలీం జోష్‌ ఎక్కువగా ఉందని, పేరొందిన ఫుడ్‌ బ్లాగర్స్‌ కూడా హలీంను ప్రమోట్‌ చేసేలా వార్తలు ఇవ్వడం అమ్మకాలకు కలిసొచ్చిందని షెరటన్‌ హోటల్‌ మేనేజర్‌ నాసర్‌ చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement