Tirupati District News
-
కూరగాయలు @ రూ.30
వెంకటగిరి పట్టణంలో కొందరు తక్కువ ధరకే తాజా కూరగాయలను విక్రయిస్తున్నారు. మదనపల్లె, పీలేరు, కడప తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. ఏ కూరగాయలైనా కిలో రూ.20 నుంచి రూ.30 లెక్కన విక్రయిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇందులో క్యారెట్, బీట్రూట్, దొండ, బెండ, చిక్కుడు, ముల్లంగి, ఆలూ రూ.20 చొప్పున.. బీన్స్, వంకాయలు, అల్లం, మామిడి కిలో రూ.30 లెక్కన విక్రయిస్తున్నారు. టమాటాలు రూ.100కి 5 కిలోలు, ఎర్రగడ్డలు రూ.100కి 3 కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలు కూరగాయాలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. – వెకంటగిరి రూరల్ -
దరఖాస్తుల ఆహ్వానం
బుచ్చినాయుడుకండ్రిగ:కనమనంబేడు గ్రామంలోని ఏకలవ్య ఎస్టీ గురుకుల పాఠశాలలో 6వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ ధర్మేంద్రసింగ్ తెలిపారు. గురుకులంలో సీబీఎస్సీ సిలబస్ చదువు చెబుతున్నామని, 6వ తరగతిలో చేరడానికి ఎస్టీ కులానికి చెందిన 30 మంది బాలికలు, 30 మంది బాలురు అవసరమని పేర్కొన్నారు. గత నెల 22 నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఆన్లైన్ గురుకుల వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రాత పరీక్ష ఈనెల 25వ తేదీన ఉంటుందని, వివరాలకు గురుకులం వెబ్సైట్లో పరిశీలించాలని కోరారు. కుంభమేళాకు ప్రత్యేక బస్సు తిరుపతి అర్బన్: కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం 11000 సర్వీస్ నంబర్‌తో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డీసీటీఎం విశ్వనాథం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు ఈ నెల 7వ తేదీ అలాగే 14వ తేదీ రాత్రి 9 గంటలకు తిరుపతి బస్టాండ్ నుంచి బయలుదేరుతుందని వెల్లడించారు. పది రోజులు టూర్ ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కో వ్యక్తి రూ.10 వేలు టికెట్ ఉంటుందని చెప్పారు. ప్రయాగ్‌రాజ్ (కుంభమేళా)తోపాటు వారణాసి, గయా, కోణార్క్ ప్రాంతాలను సందర్శించవచ్చని తెలిపారు. ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే 30 మంది భక్తులు వచ్చి కుంభమేళాకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
● అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న వైనం ● ఆర్సీ పురం అడ్డాగా సాగుతున్న మట్టి అక్రమ రవాణా ● రోజుకి 500 ట్రిప్పుల చొప్పున తరలింపు ● మట్టి అక్రమార్కులకు అండగా నియోజకవర్గ ముఖ్యనేత
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్రోజూ 50 టిప్పర్లు.. 500 ట్రిప్పులు కొండలు, గుట్టలు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల్లో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంతగా మట్టి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. రాత్రి పూట అక్రమంగా మట్టి తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. రామచంద్రాపురం మండలంలోని నెన్నూ రు, రామాపురం, రాయలచెరువు, పీవీపురం, నెత్తకుప్పం, అనుపల్లి, బొప్పరాజుపల్లి ప్రాంతాల్లో నిత్యం మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రోజుకు 50 టిప్పర్ల చొప్పున.. అందులో ఒక్కొక్క టిప్పర్ పది ట్రిప్పుల వంతున మట్టి తరలిస్తున్నాయి. ఆ లెక్కన 500 ట్రిప్పుల మట్టి బయటకు తరలుతోంది. ఈ మొత్తం మట్టి మాఫియాకు నియోజకవర్గ ముఖ్యనేత అండ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకు రోజుకు 50 టిప్పర్ల నుంచి రూ.7.5 లక్షల వరకు అవినీతి ఖాతాలోకి జమచేస్తున్నట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పచ్చదనాన్ని హరించి వేస్తూ కొండలు, గుట్టలను కొల్లగొడుతున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. రామచంద్రాపురాన్ని అడ్డాగా చేసుకుని మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాపై ఏ అధికారీ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ఇంత దుర్మార్గమా బాబూ!
నిరసన వ్యక్తం చేస్తున్న భూమన అభినయ్‌రెడ్డి, మేయర్ శిరీష, కార్యకర్తలుకూటమి ప్రభుత్వం బరితెగించింది. నిబంధనలను తుంగలో తొక్కింది. తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ పదవి కోసం విధ్వంసానికి పాల్పడింది. బలం లేకపోయినా బరిలో నిలిచేందుకు కుయుక్తులు పన్నింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసింది. ఆస్తులను ధ్వంసం చేస్తూ తమవైపు తిప్పుకునేందుకు పన్నాగం పన్నింది. నగర ప్రథమ పౌరురాలిపై అమానవీయంగా ప్రవర్తించి అగౌరపరిచింది. ఇంత జరుగుతున్నా అధికారయంత్రాంగం చూస్తూ ఉండిపోవడం.. కూటమి నేతలకే వత్తాసు పలకడం విస్మయానికి గురిచేసింది. ప్రజాస్వామ్యం అపహాస్యంవైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తుల విధ్వంసం ● నోటీసులు ఇవ్వకుండా అక్రమం అంటూ కూల్చివేతలు ● సాక్షాత్తు నగర ప్రథమ పౌరురాలు చెబుతున్నా వినకుండా దౌర్జన్యం ● కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించిన వారి గొంతు నొక్కిన అధికారులు ● మహిళలను అడ్డుకునేందుకు మహిళా పోలీసులు లేరా? ● ఆధ్యాత్మిక నగరంలో డెప్యూటీ మేయర్ కోసం అధికార అరాచకం సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకానికి అడ్డేలేకుండా పోతోంది. బలం లేకపోయినా బరితెగింపునకు దిగింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయపెట్టి డెప్యూటీ మేయర్ పీఠాన్ని కై వశం చేసుకునేందుకు ఆస్తుల విధ్వంసానికి తెరదీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. అధికారులు అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోవడం.. మేయర్ డాక్టర్ శిరీష చెబుతున్నా వినకుండా ఆమె పట్ల అమానవీయంగా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. బలం లేకపోయినా.. తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ఈనెల 3న జరగనుంది. ఈ ఎన్నిక కోసం వైఎస్సార్సీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డిని బరిలోకి దింపారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లలో 48 వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందినా.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నేతలు కొందరు కార్పొరేటర్లను భయపెట్టి లాక్కున్నారు. అలా 9 మంది కార్పొరేటర్లు వారివైపు ఉన్నా.. మిగిలిన 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వారే. ఏ రకంగా చూసినా తిరిగి డెప్యూటీ మేయర్ పదవి వైఎస్సార్సీపీకే దక్కాలి. భూమన అభినయ్‌రెడ్డిని తీసుకెళ్తున్న పోలీసులు తిరుపతి మంగళం: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కూటమి ప్రభుత్వంలోని పాలకులు అరాచకం సృష్టించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎలాగైనా గెలవడానికి అనైతికంగా అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఇంత దుర్మార్గమా..? ప్రభుత్వ అధికారులు కూటమి ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన శేఖర్‌రెడ్డిని, అతని కుటుంబాన్ని భయపెట్టి లొంగదీసుకోవడం సిగ్గుచేటన్నారు. తమ పార్టీ నాయకులు గఫూర్, లక్ష్మణ్ ఇళ్లను కూడా కూల్చివేశారన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తాం నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలను తిరుపతి మున్సిపల్ అధికారులు బేఖాతర్ చేశారని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు స్థలాలను ఆక్రమించి ఉంటే, ఆ కట్టడాలను పడగొట్టేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కార్పొరేషన్ అధికారులు పాటించలేదని, దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. డెప్యూటీ మేయర్ అభ్యర్థిగా లడ్డూ భాస్కర్‌రెడ్డి శేఖర్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటే తిరుపతి 47వ డివిజన్ కార్పొరేటర్ లడ్డూ భాస్కర్ రెడ్డిని డెప్యూటీ మేయర్ అభ్యర్థిగా తాము నిలబెడుతున్నామని ప్రకటించారు. సమావేశంలో మేయర్ డాక్టర్ శిరీష, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, కార్పొరేటర్లు లడ్డూ భాస్కర్‌రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, తమ్ముడు గణేష్ పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధం టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మేయర్ డాక్టర్ ఆర్.శిరీష అన్నారు. అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆమె తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. భూమన అభినయ్‌రెడ్డితో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కూల్చివేతలపై న్యాయపోరాటం చేస్తామని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దోషులుగా కోర్టు ముందు నిలబెడతామని హెచ్చరించారు. కుట్రలు..ఒత్తిళ్లు ఒకే ఒక్క డివిజన్‌ని గెలుసుకున్న టీడీపీ మరికొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో డెప్యూటీ మేయర్ పదవిని లాక్కునేందుకు అరాచకాలకు దిగింది. శేఖర్‌రెడ్డిని పోటీ నుంచి తప్పుకోవాలని, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేశారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కూటమి నేతలు పోలీసులు, కార్పొరేషన్, రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తుల విధ్వంసానికి తెరదీశారు. కూటమి నేతలు అధికారాన్నంతా ఉపయోగించి వైఎస్సార్సీపీ డెప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని శనివారం రాత్రి తమవైపు తిప్పుకున్నారు. ఈడ్చిపడేశారు నగర ప్రథమ పౌరురాలు డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మహిళా నాయకురాళ్లుని ఈడ్చిపడేశారు. పత్రికలో రాయలేని పదాలతో తిట్ల పురాణం అందుకున్నారు. పోలీసులు చుట్టుముట్టి నెట్టుకుంటూ భూమన అభినయ్‌రెడ్డిని బయటకు లాగి పడేశారు. పోలీసులు విచక్షణ కోల్పోయి వ్యవహిరించిన తీరు విస్మయానికి గురిచేసింది. మహిళ పట్ల మగ పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అరెస్టులు అప్రజాస్వామికం
ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరదీసింది. కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ మున్సిపల్ అధికారులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు. తిరుపతి నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా అప్రజాస్వామ్య పద్ధతిలో మా అభ్యర్థి గెలుపును అడ్డుకోవడానికి కుట్రలు చేయడం విడ్డూరంగా ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. – ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
పింఛన్ల పంపిణీకి సర్వర్ కష్టాలు
పింఛన్ల పంపిణీకి సర్వర్ కష్టాలు వెంటాడాయి. శనివారం ఉదయం సుమారు రెండు గంటల పాటు పనిచేయలేదు. – IIలోకూటమి దౌర్జన్య కాండ అక్రమ కట్టడాలను పడగొట్టేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు. నగరంలోని శాంతినగర్‌లోని భవనం కూల్చేస్తామని ముందుగా పుకార్లు పుట్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో శ్రీనివాసం సముదాయం వెనుక డీబీఆర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనం కూల్చే పనులు చేపట్టారు. విషయం తెలుసుకుని నాయకులు అక్కడికి చేరుకునే లోపు రెండు గదుల గోడలను కూల్చేశారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకుని నిరసనకు దిగారు. – IIలో -
No Headline
తిరుపతి తుడా: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేషన్లో కనీస బలం లేని చోట గెలవాలని చూడడం అప్రజాస్వామికమన్నారు. డెప్యూటీ మేయర్ పోటీదారుడ్ని భయభ్రాంతులకు గురిచేసి, ఆయన ఆస్తులను ధ్వంసం చేసి లొంగదీసుకునే ప్రయత్నం సిగ్గుచేటన్నారు. అలానే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగడం దుర్మార్గమన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా, చట్టాలను అతిక్రమించి భవనాలను కూల్చడం అన్యాయమన్నారు. భవన నిర్మాణానికి అనుమతులు లేకుంటే నోటీసులు ఇచ్చి పనులను ఆపాలే తప్ప కూల్చే అధికారం ఎవరికీ ఉండదన్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉన్న స్థానంలో పోటీ చేస్తున్నమే తప్ప పిరాయింపులను ప్రోత్సహించడం లేదని ఆయన చెప్పారు. ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా భవనంపైకి ఏ అధికారంతో వచ్చారని నిలదీశారు.48 మంది అరెస్ట్ అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు వెళ్లిన నగర మేయర్ డాక్టర్ ఆర్.శిరీష, వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డితోపాటు పార్టీ ముఖ్య నేతలు, ఇతర నాయకులు 48 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో 25 మంది, వెస్ట్ పోలీస్ స్టేషన్లో 23 మందిని అరెస్టు చేసి ఆపై విడుదల చేశారు. అరెస్టు చేశాక పోలీసు ప్రొటెక్షన్ కోరిన టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు అడుగడుగున తప్పటడుగులు వేశారు. ఉదయం నిరసన కార్యక్రమం అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించాక టౌన్ ప్లానింగ్ అధికారులు అప్పటికప్పుడు పోలీసు ప్రొటెక్షన్ కోరుతూ కాపీలను సిద్ధం చేశారు. -
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ సారాంశం. ఇందులో సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు ఆశించిన రీతిలో కేటాయింపులు లేవు. జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి అంతే. పోలవరానికి పూర్తి ఖర్చు భరిసామన్న ప్రస్తవన లేదు. నిర్వాసితుల పరిస్థితి పట్టించుకోలేదు. కేవలం మరో రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం దారుణం. రాయలసీమ జిల్లాల అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన, నిధుల కేటాయింపు జరగలేదు. – పురుషోత్తంరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త, తిరుపతి -
నిధులు రాబట్టడంలో విఫలం
ప్రస్తుత బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. కూటమి ఎంపీల బలంతో కేంద్ర ప్ర భుత్వం నడుస్తోందని గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోయింది. బీహార్ రాష్ట్రానికి కేటాయించిన మేర కూడా రాష్ట్రానికి నిధులు సాధించ లేక పోయింది. ఏపీకి ఒరిగిందేమీ లేదు. – ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి రైతులకు భరోసా ఏదీ? రైతులకు తూతూమంత్రంగానే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. కనీసం పెట్టుబడులు, మద్దత్తు ధరపైనా కచ్చితమైన ప్రకటన లేదు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగానికి ప్రాముఖ్యత అంటూ అంకెల గారడీని తలపించేలా బడ్జెట్ ఉంది. గత బడ్జెట్లోనూ ఇలాంటి మాయమాటలే చెప్పారు. ఈ ఏడాది రైతులకు ఒరిగిందేమీ లేదు. – కే.రమణమ్మ, వ్యవసాయశాఖ విశ్రాంత ఉద్యోగి, తిరుపతి● -
నేడు సీనియర్ బాలికల హాకీ జిల్లా జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు సీనియర్ బాలికల హాకీ జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ మేరకు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి బీ.ఆదిత్య, కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌కృష్ణ, కోచ్ అశోక్‌రెడ్డి ఓ సంయుక్త ప్రకటనలో విడుదల చేశారు. ఈ పోటీలకు 01–01–1996 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టు ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరులో నిర్వహించనున్న 14వ రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారిణీలు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77028 65721, 70131 77413 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. ఏనుగుల దాడులు భాకరాపేట : అటవీ సరిహద్దు పంట పొలాలపై ఏనుగులు గుంపు స్వైర విహారం చేసింది. శనివారం తెల్లవారు జామున ఏనుగులు గుంపు ఎర్రావారిపాళెం మండలం, కొటకాడపల్లె పంచాయతీ, అయ్యగారిపల్లె గ్రామ అటవీ సరిహద్దు పొలాల్లోకి వచ్చి వరి పైరును తొక్కి ధ్వంసం చేసింది. ఏనుగుల ఘీకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. దీంతో రైతులు అటు వైపు వెళ్లడానికి సాహసం చేయలేక పోయారు. వారం క్రితం చంద్రగిరి మండలం సీఎం ఇంటి ముందు ఉన్న పంట పొలాల్లో ఏనుగులు గుంపు తిష్టవేసిన విషయం తెల్సిందే. వాటిని తరమడానికి వెళ్లిన ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు మృతిచెందాడు. అయినా సంబంధిత అధికారులు స్పందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
విధ్వంసం
ఇసుక రీచ్ కోసం ● వరి పైర్లు ధ్వంసం ● అధికారుల తీరుపై మండిపడ్డ రైతులు పెళ్లకూరు: ఇసుక రీచ్ కోసం అధికారులే విధ్వంసానికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరి పైర్లను సైతం లెక్కచేయక యంత్రాలతో ధ్వంసం చేయడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. మండలంలోని కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో ఇసుక రీచ్ కోసం నదీ తీరంలో ఉన్న వరి పైర్లను శనివారం అధికారులు యంత్రాలతో ధ్వంసం చేశారు. స్వర్ణముఖినదిలో ఇసుక రీచ్ కోసం నాలుగు నెలల కిందట డివిజన్ స్థాయి రెవెన్యూ యంత్రాంగం కలవకూరు, పుల్లూరు, తాళ్వాయిపాడు, పాలచ్చూరు తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. కానీ ఇసుక రీచ్‌కు స్వర్ణముఖినదిలో ఏ ప్రాంతం వద్ద కేటాయిస్తారు అనే విషయమై స్పష్టత లేదు. అయితే గత ఏడాది నవంబర్ నుంచి కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహం అధికంగా ఉంది. అందువల్ల రీచ్ ఏర్పాటును అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల వరద ఉధృతి తగ్గడం, ఇసుక రీచ్ కోసం అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి బిడ్ కేటాయించడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. రెండు రోజుల కిందట సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి కలవకూరు వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు కోసం మరోమారు పరిశీలించారు. వెనువెంటనే నదీ తీరంలో ఉన్న పచ్చని వరి పైర్లను యంత్రాలతో ధ్వంసం చేయించి రీచ్ కోసం రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా అధికార పార్టీ పెద్దల కోసం పచ్చని పరిపైర్లు యంత్రాలతో ధ్వంసం చేయడంపై పలువురు ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ స్పందించి కలవకూరు వద్ద ఇసుక రీచ్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అన్యాయం రైతులు స్వర్ణ ముఖి నదీ తీరంలో సుమారు వందేళ్లుగా 150 ఎకరాల అనాధీనం భూములు సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడు వరి పైర్లు నాటారు. కలవకూరు, పుల్లూరు గ్రామాల్లో వేల ఎకరాలకు స్వర్ణముఖినది జీవనాధారం. అధికార పార్టీ నేతకు రీచ్ ఏర్పాటు చేయడం కోసం రేపోమాపో చేతికందే వరి పంటను యంత్రాలతో తొక్కించి ధ్వంసం చేయడం అన్యాయం. – చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు -
సీతకన్ను!
● నిర్మలమ్మ పద్దులో జిల్లాకు రిక్తహస్తమే! ● మాటల గారడీ... ఊహల పల్లకీగా కేంద్ర బడ్జెట్ ● ఊసేలేని జాతీయ రహదారుల ప్రస్తావన ● కొత్త రైల్వే లైన్లు, విద్యారంగానికి ఉత్తి చేతులే ● పెదవి విరుస్తున్న మేధావులు తిరుపతి సిటీ: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమైంది. విభజన చట్టాల జోలికి వెళ్లకుండా కేంద్రం అంకెల గారడీని చూపించే ప్రతయత్నం చేసింది. వెనుబడిన రాయలసీమకు చెందిన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు, కేంద్ర విద్యాసంస్థలకు, వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపులలో నిరాశే మిగిలింది. జిల్లాలోని జాతీయ రహదారులు, రైల్వేలైన్లు, బ్రిడ్జిలు, స్టేషన్ల అభివృద్ధి, విమానాశ్రయాల అభివృద్ధి ప్రస్తావనే బడ్జెట్లో లేకపోవడంపై మేధావులు పెదవి విరుస్తున్నారు. -
నిర్లక్ష్యం జాతర.. ల్యాబ్‌లకు పాతర!
జిల్లాలో కూటమి ప్రభుత్వం ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ల్యాబ్‌లను నిర్లక్ష్యంగా వదిలేసింది. మార్కెట్లోకి నకిలీ మద్యం! కూలీలు, పేదలు కొనుగోలు చేసే బ్రాండ్లే లక్ష్యంగా నకిలీ మద్యం తయారు చేసినట్టు తేటతెల్లమైంది. శుక్రవారం దామినేడులో 23 క్యాన్లలోని 805 లీటర్ల స్పిరిట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 6,600 ఖాళీ మద్యం సీసాలు, పెద్ద ఎత్తున నకిలీ లేబుళ్లు, ఖాళీ మద్యం సీసీ మూతలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు లభ్యమయ్యే మద్యాన్నే పేదలు కొనుగోలు చేస్తుండడం గ్రహించి వాటి పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. – 8లో -
రిజిస్ట్రేషన్ల సందడి
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సందడి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌పై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 10–20 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించడంతో 31వ తేదీ శుక్రవారం క్రయవిక్రయదారులు బారులు తీరారు. రాత్రి 8 గంటలవుతున్నా కార్యాలయంలో ఏ మాత్రం ఖాళీ లేకుండా నిండిపోయారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొందరు లాబీయింగ్ చేస్తుండగా మరికొందరు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా చేయడం గమనార్హం. -
బెల్టు దుకాణాలకు కల్తీ మద్యం!
కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ప్రియులను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా విక్రయాలు పెంచింది. తక్కువ ధరకే మద్యం అని చెప్పి చీప్ లిక్కర్ని విక్రయించడానికి శ్రీకారం చుట్టింది. విక్రయాలను భారీగా పెంచేందుకు బెల్టు దుకాణాలను తీసుకొచ్చింది. కూటమి నేతల కనుసన్నల్లో గ్రామ గ్రామాన, వీధి వీధిన ఈ బెల్టు దుకాణాలు వెలిశాయి. ఈ దుకాణాలు నిర్వహించే వారు పది రూపాయలు ఆదాయం కోసం ఏ బ్రాండ్ తక్కువ ధరకు వస్తే.. ఆ బ్రాండ్‌నే కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. బెల్టు దుకాణాలపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారికి అడ్డే లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో కల్తీ మద్యం ఎక్కువగా బెల్టు దుకాణాలకే చేరినట్టు తెలుస్తోంది. -
మహాశివరాత్రి ఉత్సవాలపై నేడు సమీక్ష
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెలలో జరగననున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తే రూ.5వేలు తిరుపతి మంగళం : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించే ప్రక్రియలో సహాయపడే వారికి ప్రోత్సాహకంగా రూ.5వేలు నగదు బహుమతిగా ఇవ్వడంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్విమ్స్ ఆస్పత్రి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్షతగాత్రుని తరలించే అంశంలో సహాయపడిన వ్యక్తికి పోలీస్ నుంచి న్యాయస్థానం వరకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుందని మోటార్ వాహనాల తనిఖీ అధికారి అతికానాజ్ తెలిపారు. అంతకుముందు పాత మెటర్నిటీ ఆస్పత్రి నుంచి సిమ్స్ హాస్పిటల్ వరకు జిల్లా ప్రధాన వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సిబ్బందితో ప్రచార ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏర్పాట్ల పరిశీలన తిరుపతి సిటీ: తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఈనెల 3వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కోసం ఎస్వీయూ సెనేట్ హాల్‌ను జేసి, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల ప్రక్రియ పూర్తి వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. సంబంధిత పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్‌కి ఫిబ్రవరి రెండో తేదీ ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల్లోపు అందజేయాలని చెప్పారు. 3వ తేదీ 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఎస్వీయూలోని సెనేట్ హాల్‌కు హాజరు కావాలన్నా రు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అమరయ్య, డీడీ బాలకొండయ్య పాల్గొన్నారు. -
No Headline
ఎన్నికల ముందు నుంచి మద్యం ప్రియులనే టీడీపీ టార్గెట్ చేసింది. భారీగా ధరలు తగ్గిస్తామని ఊదరగొట్టింది. తీరా అధికారం చేపట్టాక కూటమి ప్రభుత్వం రూ.100కే మద్యం అంటూ జబ్బలు చరిచింది. ఏడాది కూడా గడవక ముందే కల్తీ మద్యానికి బాటలు వేసింది. ఇదే అదునుగా నకిలీ ముఠా రెచ్చిపోయింది. పేదల బ్రాండ్లుగా గుర్తింపు పొందిన రూ.100, రూ.130 మద్యాన్ని కల్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. చంద్రగిరి దామినేడులో పట్టుబడిన కల్తీ మద్యం ముఠాను చూస్తే ఇదే అర్థమవుతోంది. తాము సేవించే మద్యాన్ని కల్తీ చేస్తున్నారేమోనని మద్యం ప్రియుల్లో భయాందోళన మొదలైంది. -
అనితర సాధ్యం!
● టీడీపీలో డెప్యూటీ మేయర్ దుమారం ● డబ్బు బలంతో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన అనిత ● ఆది నుంచి పార్టీనే నమ్ముకున్న ఆర్సీ మునిక్రిష్ణకు రిక్తహస్తం ● డబ్బులుంటేనే డెప్యూటీ మేయర్ ఇవ్వాలని పార్టీ కీలక నిర్ణయం ● మంత్రి మాటలతో అలిగి వెళ్లిన పార్టీ విధేయుడు సాక్షి, టాస్క్ ఫోర్స్: ‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎన్నిక కూటమిలో చిచ్చురేపింది. డెప్యూటీ మేయర్ పదవికి సరిపడా బలం లేకున్నా అధికారం, ఆర్థిక బలంతో ఆ సీటు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. అధికార పార్టీ కావడంతో కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎలాగైనా తమ పార్టీ తరఫున బరిలో నిలిచే డెప్యూటీ మేయర్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచించింది. ఇందులో భాగంగానే జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం తిరుపతి నగరానికి చేరుకుని స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సమాచారం లేదట. అనుచరుల ద్వారా విషయం తెలుసుకొని ఆయన మంత్రికి ఫోన్ చేసినట్లు తెలిసింది. దీంతో మంత్రి సమావేశినికి ఆహ్వానించినట్లు తెలిసింది. అనంతరం సమావేశానికి వెళ్లాక అక్కడ జరిగిన చర్చల్లో జనసేనకు విలువ ఇవ్వడం లేదని ఆరణి సమావేశంలోనే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆరణిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారని దాంతో ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయారని జనసేన వర్గీయులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా సమావేశంలో ముందుగా టీడీపీ తరఫున డెప్యూటీ మేయర్ పదవికి పోటీ పడుతున్న వారితో మాట్లాడి ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం. ఆశలు ఆవిరేనా? నిన్న, మొన్నటి వరకు టీడీపీ డెప్యూటీ మేయర్ అభ్యర్థిగా తనకే అవకాశం వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన కార్పొరేటర్ ఆర్సీ.మునిక్రిష్ణకు ఆ సమావేశంలో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత అన్నా రామచంద్రయాదవ్ కుమార్తె అనిత డెప్యూటీ మేయర్ పదవికి ఆస్తకి చూపడంతో అనూహ్యంగా ఆమె పేరు తెరమీదకు వచ్చింది. టీడీపీ నుంచి ఆర్సీ మునిక్రిష్ణ, అనితల మధ్య పోటీ రావడంతో ఆ పంచాయితీ మంత్రి అనగాని వద్దకు చేరింది. నిజానికి డెప్యూటీ మేయర్ అవడానికి కావలసిన బలం టీడీపీకి లేనందున అక్కడ గెలవాలంటే కార్పొరేటర్లను ప్రలోభ పెట్టాల్సి ఉంటుంది. ఆ మేరకు అవసరమైన డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వారికే ఆ పదవిని కట్టబెట్టాలన్న నిర్ణయానికి సమావేశంలో మంత్రి తీర్మానించినట్టు సమాచారం. దీంతో పార్టీనే నమ్ముకున్న ఆర్సీ మునిక్రిష్ణ అనగాని వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి అలిగి వెళ్లినట్లు సమాచారం. పార్టీలో పైసలే ముఖ్యం! మంత్రి అనగాని సత్యప్రసాద్ డబ్బున్న వారికే డెప్యూటీ మేయర్‌గా అవకాశం ఇస్తామని చెప్పడం పార్టీలో దుమారం రేపింది. అందులోనూ గత ప్రభుత్వంలో నిర్వహించిన తిరుపతి మేయర్ ఎన్నికల్లో టీడీపీ బీఫాం మీద గెలిచిన ఒకే ఒకవ్యక్తి ఆర్సీ మునిక్రిష్ణ. ఆయన డెప్యూటీ మేయర్ పదవి కావాలని కోరుకోవడంలో తప్పులేదు. వైఎస్సార్సీపీ బీఫాం మీద గెలిచి, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించిన అనితకు ఆ పదవిని కట్టబెట్టాలని చూడడంలో అర్థం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు బలం లేని చోట డెప్యూటీ మేయర్ స్థానానికి పోటీలో నిలవడమే తప్పుగా భావిస్తున్న తరుణంలో పార్టీనే నమ్ముకున్న వ్యక్తిని కాదని, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశం ఇస్తుండడం పట్ల పలువురు తెలుగు తమ్ముళ్లు భగ్గు మంటున్నారు. కార్పొరేటర్లపై పోలీసుల నిఘా! తిరుపతి తుడా: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు సమీపిస్తుండడంతో కార్పొరేటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు టీడీపీ వేగవంతం చేసింది. ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు అనుకున్నంత సులువు కాకపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులను రంగంలోకి దించింది. తమకు అనుకూలంగా రాని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టాలని, ఆ వివరాలు తమకు తెలియజేయాలని ఆదేశాలు రావడంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కొంతమంది పోలీసులు ఏకంగా కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ఎక్కడ ఉన్నారు, మీరు ఇబ్బందులు పడకూడదు అనుకుంటే టీడీపీకి అనుకూలంగా మనసు మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక కార్పొరేటర్లకు సంబంధించి ఏదైనా భూ వివాదాలు ఉన్నట్లయితే వాటిని బూచీగా చూపించి రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బలం లేకున్నా అడ్డదారిన గెలవడానికి వ్యూహాలు రచిస్తున్న టీడీపీకి కార్పొరేటర్ల ఓటు కీలకం కావడంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కదలికలపై నిఘా పెట్టింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
చంద్రగిరి: కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు గాయాలపాలైన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి తొండవాడ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులోని బనశంకరికి చెందిన వసుధ తన కుటుంబ సభ్యులతో కలసి కారులో తిరుమలకు బయల్దేరారు. తొండవాడ వద్ద వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవరు మనుతో పాటు వసుధకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. తెల్లరాయి నిల్వలపై దాడులు సైదాపురం: మండలంలోని ఓరుపల్లి సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన తెల్లరాయిని శుక్రవారం జిల్లా మైనింగ్ అధిరులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 120 టన్నులకు పైగా మూడు లారీల ఖనిజాన్ని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వివరాలు.. పొదలకూరు మండలంలోని డేగపూడి వద్ద ఉన్న మైన్‌లో దొంగతనంగా తెల్లరాయిని తీసుకుని ఓరుపల్లి వద్ద నిల్వ ఉంచారంటూ జోగిపల్లి గ్రామానికి చెందిన శివకృష్ణ జనవరి 27న పోలీసులకు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైనింగ్ ఆర్ఐ స్వాతి తన సిబ్బందితో కలిసి ఓరుపల్లి గ్రామంలో నిల్వ ఉన్న ప్రాంతానికి చేరుకుని తెల్లరాయిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 3 కంపార్ట్మెంట్లు నిండాయి. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.14 కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. టీటీడీ దాతల పేరుతో..తిరుమల: టీటీడీ దాతల పేరుతో నకిలీ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను విక్రయించి మోసగించిన దళారీపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఆ వివరాలను శుక్రవారం పోలీసులు వెల్లడించారు. తిరుమల వన్‌టౌన్ ఎస్ఐ రమేష్‌బాబు కథనం.. హైదరాబాద్‌కు చెందిన ఎం.ఉపేందర్ కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకునేందుకు సహకరించాలని హైదరాబాద్‌కు చెందిన నళినీకాంత్‌ను సంప్రదించా డు. అతను తనకు తెలిసిన సతీష్ అనే దళారీని వారికి పరిచయం చేశాడు. సదరు సతీష్ ముగ్గురు భక్తులకు గత నెల 20వ తేదీకి టీటీడీ రూ.10లక్షల దాతల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్‌ను ఇప్పిస్తానని అందుకు రూ.2,100 అవుతుందని తెలిపాడు. దీంతో భక్తుడు నగదును ఫోన్ పే ద్వారా పంపపాడు. అనంతరం దళారీ దాతలకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ అని తెలిపి.. వారికి దర్శన టికెట్‌ను పంపాడు. ఆ టికెట్‌తో జనవరి 29న భక్తుడు వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లో దర్శనానికి వెళ్లాడు. ఆ టికెట్‌ను స్కానింగ్ చేయగా నకిలీదిగా తేలింది. -
తిరుపతి జిల్లా వివరాలు
ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 01ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 21ప్రైవేటు జూనియర్ కళాశాలలు 118జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రాలు 124ఒకేషనల్ ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రాలు 23ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే జనరల్ విద్యార్థులు 23,793పరీక్షకు హాజరయ్యే ఒకేషనల్ విద్యార్థులు 2,261 -
వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాలు
తిరుపతి అర్బన్: ఎస్సీ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ముందుంటానని ఆ విభాగం జిల్లా అధికారి విక్రమకుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న చెన్నయ్య చిత్తూరు జిల్లాకు బదిలీ అవగా..విజయవాడ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న విక్రమకుమార్‌రెడ్డి తిరుపతి జిల్లాకు విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం కలెక్టరేట్లోని తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ఎస్సీ వసతి గృహాల్లోని సమస్యలను పూర్తిగా తెలుసుకుంటామని, అనంతరం వాటికి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని వెల్లడించారు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అంగన్వాడీ పాఠశాలల్లో బాలింతలు, గర్భిణులకు క్రమంతప్పకుండా పౌష్టికాహారాన్ని అందిస్తామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వసంతాబాయ్ పేర్కొన్నారు. జిల్లాలో పీడీగా పనిచేస్తున్న జయలక్ష్మి పదోన్నతిపై నాలుగు రోజుల క్రితం ఒంగోలు ఆర్జేడీగా బదిలీపై వెళ్లారు. ఈ క్రమంలో కడపలో పనిచేస్తున్న వసంతాబాయ్ తిరుపతికి బదిలీపై వచ్చారు. ఆ మేరకు ఆమె శుక్రవారం కలెక్టరేట్లోని తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తర్వాత ఆమె మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ స్కూల్స్ నుంచి క్రమం తప్పకుండా బాలింతలు, గర్భవతులకు పౌష్టికఆహారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. -
28 నుంచి సదర్వ ఈవెంట్–2025
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 నుంచి రెండు రోజులు సదర్వ ఈవెంట్–2025 నిర్వహించనున్నట్టు వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. ఆమె శుక్రవారం ఈవెంట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సదర్వ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో విద్యార్థులకు పోస్టర్, పేపర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో, వర్క్ షాప్‌తో పాటు టెక్నికల్ గేమ్స్ నిర్వహిస్తామన్నారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొననున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్ రజిని, ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ మల్లికార్జున, అధ్యాపకులు బి.మాధవి, శ్రీనివాస పద్మజ, డాక్టర్ రామకృష్ణ, స్టూడెంట్ కన్వీనర్ ఇందుశ్రీ, స్టూడెంట్ కో–కన్వీనర్ భాను ప్రశాంతి పాల్గొన్నారు. -
● దామినేడులో భారీగా కల్తీ మద్యం స్వాధీనం ● రూ.100, రూ.130 మద్యం సీసాల్లో కల్తీ జరిగినట్టు అనుమానం! ● పేదల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ● తక్కువ ధర అని చెప్పి కల్తీ మద్యాన్ని అంటగడుతున్నారా? ● విచ్చలవిడి మద్యం వెనుక అనుమానాలెన్నో? ● ముఠా గుట్టురట్టు క
సాక్షి టాస్క్‌ఫోర్స్: కల్తీ మద్యం వెలుగు చూడడంతో మద్యం ప్రియులు షాక్‌కు గురయ్యారు. విచ్చలవిడి మద్యం వెనుక కల్తీ ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధర అని చెప్పి కల్తీ మద్యాన్ని అంటగడుతున్నారా..?అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి పరిధిలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం కల్తీ మద్యం ముఠా గుట్టురట్టు కావడంతో భయంతో వణికిపోతున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందోనని..? పలువురు ఆరా తీసే పనిలో పడిపోయారు. మద్యం దుకాణాల్లో కూడానా? నకిలీ మద్యం కేవలం బెల్టు షాపులకే సరఫరా చేస్తున్నారా? లేక మద్యం దుకాణాలకూ పంపిణీ చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. పోటీపడి టెండర్లు దక్కించుకున్న కొందరు మద్యం వ్యాపారులు పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి నకిలీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నకిలీ మద్యాన్ని ఒకరిద్దరే కొనుగోలు చేస్తున్నారా? ఎక్కువ మంది తీసుకెళ్తున్నారా? అనేదానిపై విచారణ చేపట్టాల్సి ఉంది. ఇంకా ఎక్కడెక్కడున్నాయో? కూటమి ప్రభుత్వం వచ్చాకే ఈ నకిలీ మద్యం తయారీ ముఠా తెరపైకి వచ్చింది. అంతకుముందు ఇటువంటి ఘటనలు లేవని అధికారులు చెబుతున్నారు. ఈ నకిలీ ముఠా కేవలం దామినేడు వద్దే కాకుండా.. మరిన్ని చోట్ల తయారు చేస్తున్నట్టు ఎకై ్సజ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం దామినేడు వద్దే భారీ ఎత్తున నకిలీ మద్యం దొరికితే.. మిగిలిన చోట్ల ఇంకెంత నకిలీ మద్యం లభ్యవుతుందోనని మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. నకిలీ మద్యం ఇస్తారా? దామినేడు వద్ద దొరికిన నకిలీ మద్యం విషయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దావాణంలో వ్యాపించింది. ఎన్నికలకు ముందు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరపరా చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు.. నకిలీ మద్యాన్ని తక్కువ ధరకు ఇచ్చి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? అంటూ మద్యం ప్రియులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఎవరి ప్రమేయం ఉంది? ఇందుకు సహకరించిన వారెవరు? ఈ నకిలీ మద్యాన్ని ఎప్పటి నుంచి ఎక్కడెక్కడికి సరఫరా చేశారు? అనే విషయాలు వెల్లడించాలని మద్యం ప్రియాలు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ మద్యం బాటిళ్ల తయారీకి ఉపయో గించిన పరికరాలుఆ బ్రాండ్లే టార్గెట్ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారిస్తోంది. ఎక్కడ చూసినా బెల్టుషాపులు, అనధికారిక దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తోంది. ఇందులో పేదలు అధికంగా సేవించే రూ.100, రూ.130 రకాల బ్రాండ్లు ఒకరోజు ఉన్న టేస్ట్ మరో రోజు లేదని మద్యం ప్రియులు చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం దామినేడులో పట్టుబడిన కల్తీ మద్యంలో ఎక్కువగా పేదలు తాగే బ్రాండ్లే ఉండడం దీనికి మరింత బలం చేకూరుతోంది. స్వాధీనం చేసుకున్న లేబుళ్లన్నీ రాయల్ క్యాన్ విస్కీ, ట్రాపికానా బ్రాందీ, హనీబీ బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా, నైసీ హార్స్, సెలబ్రిటీ చాయిస్ కంపెనీలకు చెందినవే ఉండడం గమనార్హం. -
కొట్లాట ఖనిజం!
● మైన్స్ కోసం పోటీపడుతున్న ప్రజాప్రతినిధులు ● తల పట్టుకుంటున్న లీజు పొందిన స్థల యజమాని సాక్షి టాస్క్‌ఫోర్స్ : అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు తెల్లరాయి మైన్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెల్లరాయిని ఒక్కరే చేజిక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటే.. తమ ప్రాంతంలోని మైన్లపై మరొకరి పెత్తనం ఏంటి..? అని గూడూరుకు చెందిన ప్రజాప్రతినిధి అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన పరిధిలోని మైన్లు తమకే ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లీజు పొందిన యజమాని తన 10 ఎకరాల పట్టా భూమిలోని మైన్‌ను ఎవరికి ఇవ్వాలనే మీమాంసలో పడిపోయారు. ఇది గూడూరు రూరల్ ప్రాంతంలోని ఓ తెల్లరాయి మైన్ కథ. నువ్వా..నేనా? గూడూరు రూరల్ ప్రాంతంలోని తన సొంత పట్టా భూమిలో తెల్లరాయి ఉందని తెలుకున్న యజమాని రెవెన్యూ, గనుల శాఖాధికారుల నుంచి 10 ఎకరాలలో తవ్వకాలు చేపట్టేలా అనుమతులు పొందాడు. తవ్వకాలకు పూర్తిగా అనుమతులు మంజూరు చేసిన తరువాత సొంతగా వ్యాపారం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే దీనిపై కన్నెసిన స్థానిక ప్రజాప్రతినిధి మైన్ యజమానితో మంతనాలు జరిపారు. మైన్‌ను తనకు అప్పగించేలా ఒప్పందం చేసేకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే ఉమ్మడి జిల్లాలోని సైదాపురం ప్రాంతంలో ఉన్న తెల్లరాయి మైన్లను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధికి అప్పగించేలా ప్రభుత్వంలోని పెద్దలు సన్నాహాలు చేస్తుండగా గూడూరు ప్రాంతంలోని మైన్లను కూడా ఆయనకే కట్టబెట్టాలని నిశ్చయించారు. ఆ ప్రజాప్రతినిధి ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో సహాయ సహకారాలు అందించి ఉండవచ్చుగానీ ఎన్నికల అనంతరం కూడా ఈ ప్రాంతంలోని సహజ సంపదపై పట్టు సాధించాలనుకుంటే పార్టీని నమ్ముకుని ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తల మాట ఏంటని స్థానిక ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక మైన్ విషయంలో నువ్వా– నేనా అన్నట్టు కూటమి ప్రభుత్వంలోని ఇద్దరి ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ముదిరింది. దీంతో లీజు పొందిన మైన్ యజమాని ఎటూ తెల్చుకోలేక సతమతమవుతున్నట్టు సమాచారం. వ్యాపారాలు చేసుకునే వారిని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబని తన సన్నిహితుల వద్ద ఆయన వాయిపోయినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే పెద్దలు అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారని గగ్గోలు పెట్టి నేడు మాత్రం ఇలా మైన్ల యజమానులను భయపెట్టి, బుజ్జగించి వారి వద్ద నుంచి తీసుకోవడం, కాకుంటే భాగస్వామ్యం ఇవ్వాలని పట్టుబట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెల్లరాయి తరలింపు పూర్తి అనుమతులు వస్తే అధికార కూటమి ప్రభుత్వంలో ఎవరికి వారు యమునా తీరే అనేలా నడుచకుంటారా, ప్రభుత్వంలోని పెద్దలు అప్పగించిన వారికే కట్టబెట్టి వారు ఇచ్చింది తీసుకుంటారో..? వేచి చూడాలి. -
మెరుగైన సౌకర్యాలే లక్ష్యం
తిరుపతి అర్బన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన తిరుపతి రైల్వే స్టేషన్‌కు పడమర వైపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కల్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. ఇటీవల కొందరు అధికార పార్టీ నేతలు ఆ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు జోక్యం చేసుకుని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన రూ.315 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. వచ్చే ఏప్రిల్ నాటికి దక్షిణం వైపు పనులు పూర్తికావాలన్నారు. ఉత్తరం వైపు నిర్మాణాలు అదే నెలలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేసినప్పటికీ ప్రయాణికులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదో చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం తిరుపతి నగరంలోని రశ్రీదేవి కాంప్లెక్స్ సమీప ప్రాంతంలో నివాసం ఉంటున్న కృష్ణయ్య అనే వైద్యులు తిరుపతి రైల్వే స్టేషన్‌కు రెండు వీల్చైర్స్తోపాటు స్ట్రెచర్‌ను విరాళంగా జీఎం చేతుల మీదుగా అందించారు. వారితోపాటు గుంతకల్లు డివిజన్ రైల్వే అధికారి చంద్రశేఖర్ గుప్తా, తిరుపతి స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, స్టేషన్ మాస్టర్ చిన్నరెడ్డెప్ప, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.తిరుచానూరు రైల్వే స్టేషన్ పరిశీలన శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట) : సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. అనంతరం రేణిగుంట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయనకు రైల్వే లైసెన్స్ కూలీ పోర్టర్లు స్వాగతం పలికారు. సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, స్టేషన్ మేనేజర్ శేషగిరినాథరెడ్డి, గుంతకల్లు, సికింద్రాబాద్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జనరల్ మేనేజర్ ఇన్స్పెక్షన్ స్పెషల్ ట్రైన్లో గుంతకల్లుకు బయలుదేరి వెళ్లారు.