వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో ఒక మద్యం దుకాణం యజమాని మరో దుకాణం యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
రాయచోటి(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో ఒక మద్యం దుకాణం యజమాని మరో దుకాణం యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని వరదా వైన్స్ యజమాని కోకిల వైన్స్ యజమాని శ్రీనివాసులురెడ్డిపై శనివారం రాత్రి కత్తితో దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులురెడ్డిని వెంటనే కడపకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.