సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పచ్చబ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో దౌర్జన్యానికి దిగారు. మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. లేపాక్షి మద్యం షాపును లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను.. లాటరీ ఫలితం వచ్చిన వెంటనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రంగనాథ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు టెండర్ వేసే ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు.. వారి పీఏలు, అనుచరుల కనుసన్నల్లోనే జరిగింది. ప్రతి దుకాణం తమకు, తమ అనుచరులు చెప్పిన వారికే దక్కే విధంగా టీడీపీ నేతలు ముందస్తు ప్లాన్ చేశారు. దీంతో ఆరంభం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్‌లో దరఖాస్తులు ఉండటం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా 87 షాపులకు 1,460 దరఖాస్తులు అందాయి. మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం టీడీపీ వర్గీయులకు సంబంధించినవే. మిగతా 20 శాతం మంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బరిలో దిగారు. అయితే వారందరికీ ఇప్పటికే వార్నింగ్‌లు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ లాటరీలో దుకాణం దక్కించుకున్నా వదిలి వెళ్లాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ నేతలు బెదిరింపులు మొదలుపెట్టారు. ఎవరు దరఖాస్తు చేసిన ఖబడ్దార్ అంటూ ఫోన్లలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలామంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు. కాగా ఆన్‌లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేశారు.
ఇదీ చదవండి: అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా బాబూ?: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment