liquor shop
-
హోమ్ మంత్రి అనిత నియోజకవర్గంలో బెల్ట్ షాపుల దందా!
-
కొత్త ఏడాదికి ముందే మరిన్ని మద్యం దుకాణాలు
న్యూఢిల్లీ: రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరానికి ముందే ప్రీమియం మద్యం షాపులను తెరవాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం నూతనంగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలు 500 చదరపు మీటర్ల కంటే అధిక విస్తీర్ణంలో ఉండనున్నాయి. వినియోగదారులు దుకాణంలోని షెల్ఫ్ నుండి తమకు ఇష్టమైన బ్రాండ్‌ను ఎంచుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ నూతన ప్రీమియం స్టోర్లు.. మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఏర్పాటుకానున్నాయి. ఢిల్లీలోని నాలుగు కార్పొరేషన్లు ఈ దుకాణాలను ఏర్పాటు చేయనున్నాయి.నూతనంగా ఈ ప్రీమియం దుకాణాలను తెరవడం వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై సుంకం ద్వారా రూ.3,047 కోట్లు ఆర్జించగా, గత ఏడాది ఇదే కాలంలో రూ.2,849 కోట్లు ఆర్జించింది.ఇది కూడా చదవండి: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై లిచ్ట్‌మన్ జోస్యం వైరల్ -
వీళ్ళ దోపిడీకి నిదర్శనం.. లిక్కర్ టెండర్లపై వైఎస్ జగన్ సంచలన నిజాలు
-
తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మద్యం షాపును మహిళలు అడ్డుకున్నారు. ఆశ్రమం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు, స్థానికుల నినాదాలు చేశారు.విజయవాడ: కూటమి లిక్కర్ టెండర్లపై వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి నేతల జేబులు నింపడానికే చంద్రబాబు లిక్కటర్ టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిని కూటమి నేతలు బెదిరిస్తున్నారని.. కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తున్నారన్నారు. మరికొందరు బరితెగించి టెండర్ దక్కించుకున్న వారిని కిడ్నాప్ చేస్తున్నారన్నారు.పేద మహిళల కళ్లలో ఆనందం చూడటమే అప్పటి జగన్ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు కుటీల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అవినాష్ అన్నారు.ప్రకాశం జిల్లా: ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడం చేతకాని ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటని ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి.పద్మ మండిపడ్డారు. అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన మద్యం టెండర్ల లాటరీని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి.మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మద్యం వ్యాపారాన్ని చేస్తుందని మండిపడ్డారు. -
అన్ని దుకాణాలు మావే!
-
పచ్చబ్యాచ్ ఆగడాలు.. లిక్కర్ షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పచ్చబ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో దౌర్జన్యానికి దిగారు. మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. లేపాక్షి మద్యం షాపును లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను.. లాటరీ ఫలితం వచ్చిన వెంటనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రంగనాథ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు టెండర్ వేసే ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు.. వారి పీఏలు, అనుచరుల కనుసన్నల్లోనే జరిగింది. ప్రతి దుకాణం తమకు, తమ అనుచరులు చెప్పిన వారికే దక్కే విధంగా టీడీపీ నేతలు ముందస్తు ప్లాన్ చేశారు. దీంతో ఆరంభం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్లో దరఖాస్తులు ఉండటం గమనార్హం.జిల్లా వ్యాప్తంగా 87 షాపులకు 1,460 దరఖాస్తులు అందాయి. మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం టీడీపీ వర్గీయులకు సంబంధించినవే. మిగతా 20 శాతం మంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బరిలో దిగారు. అయితే వారందరికీ ఇప్పటికే వార్నింగ్‌లు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ లాటరీలో దుకాణం దక్కించుకున్నా వదిలి వెళ్లాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ నేతలు బెదిరింపులు మొదలుపెట్టారు. ఎవరు దరఖాస్తు చేసిన ఖబడ్దార్ అంటూ ఫోన్లలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలామంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు. కాగా ఆన్లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేశారు.ఇదీ చదవండి: అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా బాబూ?: వైఎస్ జగన్ -
మద్యం షాపులన్నీ నాకే కావాలి..!
సాక్షి టాస్‌్కఫోర్స్, సాక్షి, రాజమహేంద్రవరం : ‘రేయ్..! ఇతరులు ఎవరైనా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నారో జాగ్రత్త..! ఊరుకునే ప్రసక్తే లేదు. అన్నీ నాకే కావాలి. నా మాట కాదని ఎవరన్నా దరఖాస్తు చేశారో వారి అంతు చూడండి..!’ అనుచర గణానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలివీ!! ఆయన కనుసైగ చేయడమే ఆలస్యం.. తాడిపత్రి నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఓ వైఎస్సార్ సీపీ నేతను టీడీపీ శ్రేణులు కిడ్నాప్ చేయగా మరో నేత ఇంటిపై దాడికి తెగబడి బెదిరింపులకు దిగాయి. ఒకపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు పోలీసుల ద్వారా సామ, దాన, దండోపాయాలను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ‘‘అసలు మీరు ఈ టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు? సరే టెండర్లు దక్కించుకున్నారే అనుకోండి. టీడీపీ నేతలను కాదని అసలు మద్యం దుకాణాలను మీరు నిర్వహించగలరా? అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మీపై కేసులు నమోదవుతాయి. ఎక్సైజ్ దాడులూ జరుగుతాయి. ఏదో ఒక కేసు బుక్ చేసి మిమ్మల్ని మూసి వేయడం ఖాయం. ఇదంతా ఎందుకొచి్చన గొడవ? మద్యం టెండర్ల నుంచి మీకు మీరే మర్యాదగా తప్పుకోండి..!’’ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇతర పార్టీల నేతలకు స్థానిక ఎస్సై, సీఐల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ఇదీ!! వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్ తాడిపత్రిలో 9 మద్యం షాపులు, రూరల్ పరిధిలో 3, యాడికిలో 4, పెద్దవడుగూరులో 3, పెద్దపప్పూరులో ఒక షాపు కలిసి మొత్తం 20 మద్యం దుకాణాలు తమ ఆదీనంలో ఉండాలని జేసీ ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన ఓ నేత 20 దుకాణాలకు దరఖాస్తు వేసేందుకు ప్రయత్నించగా ఆయన్ను విరమించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన ఇతర నేతలపై జేసీ వర్గం దౌర్జన్యాలకు తెగబడింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను స్కారి్పయోలో కిడ్నాప్ చేసి తరలించారు. ఎంపీపీ ఉమాదేవి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తేవడంతో యాడికి సీఐ ఈరన్న టీడీపీ శ్రేణుల నుంచి రామ్మోహన్‌ను విడిపించి తీసుకొచ్చారు. యాడికిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను టీడీపీ మూకలు గురువారం పగులగొట్టి బెదిరింపులకు దిగాయి. వైఎస్సార్ సీపీకి చెందిన మరో నాయకుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి దరఖాస్తు చేయవద్దని బెదిరించారు. దరఖాస్తుకు నేడే చివరి రోజు రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం నాటికి 65,424 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,396 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం చివరి రోజు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు 70 వేలు దాటవచ్చని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12, 13వ తేదీల్లో దరఖాస్తులను పరిశీలించి 14న లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. దరఖాస్తులకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టీడీపీ సిండికేట్ బెదిరింపులు తీవ్రమయ్యాయి. టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న వ్యాపారులను టార్గెట్ చేసి నయాపైసా పెట్టుబడి పెట్టకుండా వాటా, గుడ్ విల్ ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. తమను కాదంటే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. » రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు తట్టుకోలేక దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. రూరల్ నియోజకవర్గంలో 11 షాపులకు గానూ బుధవారం వరకు 150 దరఖాస్తులే అందాయి. సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇతరులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి సంఘం నేతలను సైతం రంగంలోకి దించారు. నియోజకవర్గంలో 28 షాపులు ఉండగా బుధవారానికి 250 దరఖాస్తులు మాత్రమే అందాయి.» నిడదవోలులో గతంలో మద్యం వ్యాపారం చేసిన టీడీపీ సీనియర్ నేత తన అనుచరులతో టెండర్లు వేయిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు తమకూ షాపులు ఇవ్వాలంటున్నారు. మంత్రి కందుల దుర్గేష్ అనుచరులు 20 శాతం వాటా ఇవ్వాలని టెండర్లు వేసిన వ్యాపారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. â రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులతో నియోజకవర్గంలో 13 దుకాణాలకు 206 టెండర్లు దాఖలు కాగా వీరంతా దాదాపుగా కూటమి నేతలే కావడం గమనార్హం. » కొవ్వూరులో టీడీపీ సీనియర్ నేత అనుమతిస్తేనే టెండర్లు దాఖలవుతున్నాయి.మద్యంపై ‘రౌండ్ ఫిగర్’ బాదుడుఅదనపు ప్రివిలేజ్ ఫీజు పేరిట భారీ దోపిడీకి సిద్ధం» ‘‘మొత్తం రూ.3,850 అయింది. రౌండ్ ఫిగర్ చేస్తే రూ.5 వేలు అవుతుంది..!’’ ఖలేజా సినిమాలో హీరో డైలాగ్!! » ‘‘అదేంటీ.. రౌండ్ ఫిగర్ రూ.4 వేలు కదా..?’’ హీరోయిన్ సందేహం!! » ‘‘రూ.5 వేలులో ఎక్కువ సున్నాలున్నాయి కదా..! అందుకు..’’ హీరో సమర్థన !! అదే రౌండ్ ఫిగర్ సూత్రాన్ని సీఎం చంద్రబాబు సర్కారు తన విధానంగా చేసుకుంది. ఇప్పటికే టీడీపీ సిండికేట్ ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాలతో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. మద్యం బాటిళ్ల ధరలను సమీపంలోని పదుల సంఖ్యకు చేరుస్తూ రౌండ్ ఫిగర్ చేయాలని నిర్ణయించింది. రూ.100 కంటే అధికంగా ఉన్న మద్యం బాటిళ్ల ధరలను తరువాత వచ్చే దశాంశ మానానికి మార్చి రౌండ్ ఫిగర్ చేసి ధర నిర్ణయిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు ఉదాహరణను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓ మద్యం బాటిల్ ధర రూ.150.50గా ఉంటే... ఆ బాటిల్ ధరను రూ.160గా నిర్ణయిస్తారు. బాటిల్ ధర రూ.272గా ఉంటే... దాన్ని రూ.280 చేస్తారు. ఈ దందాకు ‘అదనపు ప్రివిలేజ్ ఫీజు’ అని నామకరణం చేస్తూ ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిలక్కొట్టుడు కాదు.. భారీ బాదుడే ఇదేదో చిల్లర సమస్య లేకుండా చేసే చిలక్కొట్టుడు వ్యవహారం కానే కాదు! అదనపు ప్రివిలేజ్ ఫీజు ముసుగులో భారీ దోపిడీకి టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కాగా స్కెచ్ వేసింది. టీడీపీ హయాంలో 2018 నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే.. ఆ ఏడాది 3.84 కోట్ల లిక్కర్ కేసులు, 2.77 కోట్ల బీరు కేసులు విక్రయించారు. కేసుకు 48 లిక్కర్ బాటిళ్ల చొప్పున మొత్తం 184.32 కోట్ల లిక్కర్ బాటిళ్లు... కేసుకు 12 బీరు బాటిళ్ల చొప్పున మొత్తం రూ.33.24 కోట్ల బీరు బాటిళ్లు విక్రయించారు.వాటిలో 90 శాతం బాటిళ్ల ధర రూ.100 కంటే అధికంగానే విక్రయించారు. ప్రస్తుతం 180 ఎంఎల్ చీప్ లిక్కర్‌ను రూ.99కి విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒక్క కేటగిరీ మినహా మిగిలిన అన్ని బ్రాండ్ల ధర రూ.వంద కంటే అధికంగానే ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో బాటిల్‌పై రూ.2 నుంచి రూ.9 వరకు అదనంగా దోపిడీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుతంత్రం పన్నింది. ఆ లెక్కన ఏడాదికి ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడతారన్నది అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వమా.. మజాకానా! -
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పెంపు
-
మా పొట్ట కొట్టొద్దు
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్‌మెన్, నైట్ వాచ్మెన్, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్‌మెన్, సూపర్వైజర్లు, నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించండి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
అది సీఎం ఆఫీస్.. లిక్కర్ షాపు కాదు.. బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
ఢిల్లీ: జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల వివరాలను మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించగా మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. ‘ఆప్ మంత్రి అతిషి విలేకరుల సమావేశం ద్వారా జారీ చేసిన లేఖ నకిలీది. ఆమె ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అది సీఎం కార్యాలయం.. మద్యం షాపు కాదని మంత్రి అతిషీకి, ఆ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కోర్టు అనుమతి ఇచ్చే వరకు ఎటువంటి ఉత్తర్వును జారీ చేయలేడు’ అని సిర్సా వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేని సమయంలో సీఎం కార్యాలయాన్ని ఎవరు ఉపయోగించారు? అధికారిక లేఖను ఎవరు రూపొందించారు.. జారీ చేశారు? ఈ విషయాలు నేరపూరిత కుట్రలో భాగమని, దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను కోరుతున్నాను’ అన్నారు. #WATCH | Delhi: As Delhi CM Arvind Kejriwal issues first order from ED custody on water shortage during summer in National Capital, BJP National Secretary Manjinder Singh Sirsa says, "The letter that has been issued by AAP Minister Atishi through a press conference is… pic.twitter.com/HtrbVkxQdI — ANI (@ANI) March 24, 2024 -
మందుబాబులకు కోపం వస్తే ఇలా ఉంటుంది..
-
కావాల్సిన బ్రాండ్ లేదన్నందుకు మద్యం దుకాణానికి నిప్పు
విశాఖపట్నం: తనకు కావాల్సిన బ్రాండ్ మద్యం లేదన్నందుకు ఆగ్రహించి మద్యం షాపునకు నిప్పుపెట్టాడు ఓ మందుబాబు. మద్యం సీసాలు ధ్వంసంగా కాగా మొత్తం రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ సాయిరాంకాలనీకి చెందిన జి.మధు(53) ఈ నెల 11వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో కొమ్మాదిలో గల మద్యం షాపునకు వెళ్లాడు. ఓ బ్రాండ్ మద్యం ఇవ్వాల్సిందిగా కౌంటర్లో అడిగాడు. ఆ బ్రాండ్ మద్యం తమ షాపులో లేదని చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. షాపు మూసేసిన సమయంలో గొడవకు దిగవద్దని వారించినా.. పట్టించుకోకుండా షాపు తగలెట్టేస్తానని చెబుతూ మరింత రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా ఓ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి షాపు కౌంటర్‌పై కుమ్మరించి నిప్పు అంటించాడు. మంటలు చెలరేగడంతో మద్యం షాపు సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు అప్రమత్తమై నిందితుడు మధును పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో రూ.72,660 విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం కాగా.. కంప్యూటర్, లాగ్ బాక్స్, సీసీ కెమెరా, క్యాష్ మెషీన్, పేటీఎం మెషీన్ కాలి బూడిదయ్యాయి. మొత్తం వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉండవచ్చని సీఐ తెలిపారు. మద్యం షాపు ప్రతినిధి గండిబోయిన నరసింహులు ఫిర్యాదు మేరకు మధుపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎకై ్సజ్ సీఐ మురళీధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
-
Hyderabad: 10 రోజులు రూ.12 కోట్ల
హైదరాబాద్: మద్యం షాపులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండడంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు సోమవారం క్యూకట్టారు. సరూర్‌నగర్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 134 షాపులు ఉండగా, వీటిలో ఇప్పటి వరకు 2,700పైగా దరఖాస్తులు వచ్చాయి.శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో వంద షాపులు ఉండగా, 3,300 వచ్చాయి. ఇన్నర్రింగ్రోడ్డుకు అటు ఇటుగా ఉన్న ఒక్కో షాపునకు సగటున 25 దరఖాస్తులు రావడం విశేషం. ఎలాగైనా షాపులను దక్కించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా మారి.. బినామీ పేర్లతో ఒకే షాపుపై టెండర్లు దాఖలు చేస్తున్నారు. ఒకరు టెండరు వేసిన చోట మరొకరు వేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు కేవలం ఈ దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి సుమారు రూ.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 18తో దరఖాస్తుకు గడువు ముగియనుంది. వచ్చే చివరి మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శేకిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాపులకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈ ఒక్క స్టేషన్ పరిధిలోనే 1,700 పైగా రావడం గమనార్హం. 21న లక్కీడ్రా మద్యం షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ నుంచి కొత్త లైసెన్సుల విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అంతకు ముందే సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 4న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షలుగా(నాన్ రిఫండబుల్) నిర్ణయించింది. ఈ పది రోజుల్లోనే 234 షాపులకు 6,000 దరఖాస్తుల అందడం విశేషం. గతంలో మాదిరే ఈసారి కూడా గౌడ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసింది. ఈ మేరకు లాటరీ ద్వారా ఆయా కులాలకు కేటాయించే షాపుల సంఖ్యను నిర్ధారించింది. ఈ నెల 21న శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో లక్కీడ్రా నిర్వహించనుంది. ఈ డ్రా ద్వారా దరఖాస్తుదారులకు షాపులను కేటాయించి, ఆయా షాపులకు 30న కొత్త సరుకును అందజేయనుంది. -
తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ
-
దొంగలించేందుకు వచ్చి కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యారు! వీడియో వైరల్
చెన్నై: ఇద్దరు దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకు మద్యం షాపుకి వెళ్లి పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువెల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకని లిక్కర్ షాపుకి డ్రిల్లింగ్ మిషన్‌తో రంధ్రం చేశారు. ఐతే ఆ దొంగలు షాపులోకి వెళ్లిన తర్వాత ఆ మద్యం బాటిళ్లను చూసి టెంప్ట్ అయ్యి ప్లాన్ మార్చుకున్నారు. కాసేపు ఆ షాపులోనే ఉండి తాగి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా ప్లాన్ కూడా అమలు చేశారు. ఆ దొంగలు వక్రబుద్దే వారిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాలే చేసింది. పోలీసులు వారు ఏ విధంగా లిక్కర్ షాపుకి రంధ్రం చేసి వెళ్లారు అలానే వారిని బయటకు రప్పించి మరీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పోలీసులు సదరు షాపు యజమానితో ఓపెన్ చేయించి మరీ పోలీసులను అదుపులోకి తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా వారు ఎలా షాపుకి ఎంట్రీ ఇచ్చారో అలానే అదుపులో తీసుకోవడం గ్రేట్ అంటూ పోలీసుల పని తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
లిక్కర్ బాటిల్స్ దొంగిలిద్దామని వెళ్లారు.. కానీ!
-
రూపాయి తెచ్చిన పంచాయితీ !
నల్గొండ (కోదాడరూరల్) : వాటర్ ప్యాకెట్ రేటుపై మద్యం దుకాణ నిర్వాహకుడికి మందుబాబులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అనంతగిరి మండలం గోల్తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగేందుకు పట్టణంలోని ప్రమీలటవర్ సమీపంలోని ఓ వైన్స్ వద్దకు వచ్చారు. మద్యంతో పాటు వాటర్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు. అయితే వైన్స్ నిర్వాహకుడు వాటర్ ప్యాకెట్‌కు రూ.3 తీసుకున్నాడు. దీంతో వారు వాటర్ ప్యాకెట్ రేటు రూ.2 కదా రూ.3 ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ నెలకొంది. మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి వైన్స్ కౌంటర్లో ఉన్న వ్యక్తిని బయటకు లాగి గొడవకు దిగాడు. కౌంటర్ బల్లాపై ఉన్న మద్యం సీసాలను పగలకొట్టాడు. దీంతో కౌంటర్‌నుంచి బయటకు వచ్చిన వైన్స్ నిర్వాహకుడు కోపంతో బీరుసీసా తెచ్చి తలపైకొట్టడంతో అతని తల పగిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. -
జనావాసాల్లో మద్యం దుకాణాలొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నివాస ప్రాంతాల్లో, ఆస్పత్రులు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు, పర్మిట్ రూంలు, బార్లు ఉండటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పర్మిట్ రూంలు, బార్లలో మినహా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తెలంగాణ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్) నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు రెండు నెలల్లో ఆడిట్ నిర్వహించాలని, నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉంటే వాటిని రెండు నెలల్లోగా తొలగించాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలతోపాటు పర్మిట్ రూంలకు అనుమతి ఇస్తున్నారని, దీంతో చిన్నారులు, మహిళలు వేధింపులకు గురవుతున్నారంటూ న్యాయవాది మహేందర్‌రాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణ చేసింది. -
మూడు పువ్వులు ఆరు కాయలుగా నా వ్యాపారం వృద్ధి చెందాలి
Comedian Raghu Entered Into Liquor Business: కమెడియన్ రఘు ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై బాగా ఫేమస్ అయిన వ్యక్తి. సినిమాల్లో నవ్వులు పూయించే కామెడీ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్న రఘు ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అతడికి ఆఫర్లు రావడం లేదా? సినిమాలు కాకుండా రఘు ఇప్పుడేం చేస్తున్నాడు? అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం.. కమెడియన్ రఘుకు అడపాదడపా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో అప్పుడప్పుడూ షూటింగులకు వెళ్తున్నాడు. కానీ మిగతా సమయంలో ఖాళీగా ఎందుకుండటం అని వ్యాపారం మీద దృష్టి పెట్టాడు. కొత్తగా లిక్కర్ బిజినెస్‌లో అడుగుపెట్టాడు. నాలుగు దుకాణాల కోసం టెండర్లు వేస్తే రెండు రఘుకే వచ్చాయట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చాడు. దుకాణంలో కౌంటర్ మీద కూర్చున్న రఘు తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు. రెండు మద్యం దుకాణాలకు ఓనర్ అంటే రఘు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా ఉండదన్నమాటే! మొత్తానికి అటు సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ రఘు దూసుకుపోతున్నాడు. -
24 గంటలూ కిక్కు
తాడిపత్రి అర్బన్: తాడిపత్రిలో పొద్దు పొద్దున్నే పాల ప్యాకెట్లయినా సరిగా దొరుకుతాయో లేదో కానీ మద్యం మాత్రం అన్ని వేళలా దొరుకుతోంది. సమయం ఏదైనా సరే తలుపు తట్టడమే ఆలస్యం అడిగిన మొత్తం చెల్లిస్తే ఏ బ్రాండ్ మద్యం కావాలన్నా చేతికందిస్తారు. సామాన్యుల వ్యసనాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేస్తూ తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకోవడమే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. నిబంధనలకు తూట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు మద్యం దుకాణాలకు పూర్తి ఎత్తివేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే అది కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల మధ్యలోనే మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. బార్ల సమయాలను కూడా కుదించేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్యం బాటిళ్లను పార్శిల్ విధానం ద్వారా బయటకు ఇవ్వకూడదు. అయితే తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలారు. అడిగినంత ఇస్తే చాలు మద్యం ఎప్పుడు కావాలన్నా సరే ఇచ్చేస్తున్నారు. కార్మికులే లక్ష్యంగా.... తాడిపత్రి చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థల్లో పనిచేసే కారి్మకులు కూడా అధికంగానే ఉంటారు. ముఖ్యంగా కారి్మకులనే లక్ష్యంగా చేసుకొని బార్ల నిర్వాహకులు తమ దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవని సమయాల్లో ఒక్కో క్వాటర్ బాటిల్ పై రూ.50 నుంచి రూ.70 దాకా అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తుల్లో ఎక్సైజ్ అధికారులు తాడిపత్రిలోని అన్ని బార్లలో ఎప్పుడు కావాలన్నా మద్యం సిద్ధంగా ఉంటుంది. ఉదయం, రాత్రి అన్న తేడా లేకుండా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నా ఎక్సైజ్ పోలీసులతో పాటు పట్టణ పోలీసులు కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తున్నారు. పత్రికల్లోనో, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బార్ల నిర్వాహకుల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తుండటంతోనే పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చా... బార్ నిర్వాహకుల దందాపై ఎక్సైజ్ ఎస్ఐ స్వామినాథన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ ఈ సర్కిల్‌కి కొత్తగా వచ్చా... మీకు వివరణ కావాలంటే సీఐని అడగండి’ అని సమాధానమిచ్చారు. తాడిపత్రి సర్కిల్ ఎక్సైజ్ సీఐని ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
కేసీఆర్ చిత్రపటానికి మందుబాబుల పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 45 రోజులు తర్వాత, బుధవారం దుకాణాలు తెరుచుకోవటంతో మద్యం ప్రియుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత ‘చుక్క’ దొరకబోతుందన్న సంతోషంతో మందుబాబులు ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. ఎండను కూడా లెక్కచేయలేదు. మద్యం దొరికే వరకు ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెబుతూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక్కో వైన్ షాపు వద్ద రెండు, మూడు క్యూలైన్లు దర్శమించాయి. (చదవండి : హైదరాబాద్‌లో వైన్స్ ముందు మహిళల క్యూ..) ఇక చాలా రోజుల తర్వాత చుక్క దొరకడంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పలు చోట్లు మద్యం బాటిళ్లు పట్టుకొని ఆనందంతో చిందులేశారు. పలు వైన్స్ షాపులకు పూల మాల వేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఇక ఒక చోట అయితే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. కనకదుర్గ వైన్స్ దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూల మాలవేసి పాలాభిషేకం చేశారు. అనంతరం జై కేసీఆర్ అంటూ మందుబాబు నినాదాలు చేశారు. అయితే ఇది తెలంగాణలోని ఏ ప్రాంతంలో జరిగిందో వివరాలు తెలియరాలేదు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. ధరలు పెంచినా అమ్మకాల్లో మాత్రం తేడా కనిపించలేదు. పైగా మళ్లీ వైన్ షాపులు మూసివేస్తారోనని ఎక్కువగానే మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్‌సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్వేర్ యువతులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. -
‘అయ్యన్న భాష చూస్తుంటే అసహ్యం వేస్తుంది’
సాక్షి, తాడేపల్లి : మద్యం దుకాణాలపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబుకు మద్యం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుద్ హుద్ తుపాన్ పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు సేకరించిన నిధులకు ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల నిధులు సేకరించి మింగేశారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే హుద్ హుద్ విరాళాలపై విచారణకు రావాలని సవాల్ విసిరారు. పేదల పేరుతో వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. (చదవండి : ‘ఆ విషయంలో పచ్చ బ్యాచ్ ఎందుకు స్పందించలేదు?’) మద్యం షాపులపై అయన్న పాత్రుడు మాట్లాడే భాష చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాప్ లు పెట్టినప్పుడు అయ్యన్నపాత్రుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారినప్పుడు ఎందుకు అయ్యన్న ప్రశ్నించలేదని నిలదీశారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 43వేల బెల్టు షాపులు తొలగించారని గుర్తుచేశారు. ఏపీలో బెల్టు షాపులు లేకుండా చేశామన్నారు. ప్రజలు మద్యానికి దూరమవుతారనే ధరలు పెంచామన్నారు. మద్యం రేట్లు పెంచితే తప్పేంటని ప్రశ్నించారు. -
వైన్స్ షాపుల వద్ద ప్రత్యేక మార్క్‌లు
సాక్షి, హైదరాబాద్ : వైన్స్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించారు. నారాయణగూడ శాంతి థియేటర్ దగ్గర ఉన్న ఓ మద్యం దుకాణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు హైదరాబాద్‌లో 178 మద్యం షాపులు తెరిచారని చెప్పారు. ప్రతి వైన్స్ షాపు వద్ద భౌతిక దూరం పాటించలే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించండం కోసం ప్రత్యే క మార్క్‌లు వేయించామని తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాలలో పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. భౌతిక దూరంతోనే కరోనాను నివారించవచ్చని, దీనికి ప్రజలు సహకరించాలని అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. -
మద్యంబాబులకు షాక్.. షాప్స్ క్లోజ్
ముంబై : లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ముంబైలో తెరుచుకున్న లిక్కర్ షాపులు మరోసారి మూతపడ్డాయి. ఓవైపు కరోనా వ్యాధి విస్తరిస్తుండటం, మరోవైపు భౌతిక దూరాన్ని పాటించకుండా మద్యం ప్రియులు అత్యుత్సాహం చూపించడంతో ముంబై మున్సిపల్ అధికారులు చేసేదేమీ లేక మద్యం దుకాణాలపై మరోసారి నిషేధం విధించారు. దీంతో బుధవారం నుంచి ముంబైలో మద్యం దుకాణాలతోపాటూ నిత్యావసరాలుకాని దుకాణాలు కూడా మూసివేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. (వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) లాక్డౌన్ సడలింపులతో మద్యం ప్రియులు లిక్కర్ షాపుల ఎదుట భారీగా చేరుకుంటుండంతో, భౌతిక దూరాన్ని పాటించేలా చేయడం ఇబ్బందికరంగా మారిందని పోలీసులు, అధికారుల నుంచి సమాచారం వచ్చిందని ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ తెలిపారు. నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు మాత్రం తెరుచుకునే ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు ముంబై మహానగరం వైరస్ కోరల్లో విలవిలలాడుతోంది. ముంబైలో 510 తాజా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 9000 దాటిపోయింది. ఇక మహారాష్ట్రలో వ్యాప్తంగా 841 తాజా కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 34 మంది మరణించారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 15,525కు చేరగా మరణాల సంఖ్య 617కు ఎగబాకింది. (మహమ్మారి విజృంభణతో ముంబై విలవిల)