న్యూఢిల్లీ : మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ మందుబాబులపై ఓ వ్యక్తి పూల వర్షం కురిపించాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అంటూ న్యూఢిల్లీలో చందేర్ నగర్‌లోని ఓ వైన్ షాప్ ఎదుట భారీ లైన్‌లో నిల్చున్న మందుబాబులపై పూలు చల్లాడు. మరోవైపు భారీ లైన్లలో లిక్కర్ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై మిర్జాపూర్‌లో ఓ లిక్కర్ షాప్ యజమాని పూలు చల్లాడు. (‘బారు’లు తీరిన మందుబాబులు)
కాగా, లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. (వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర)
Comments
Please login to add a commentAdd a comment