wine sales
-
వైన్ నిల్వలు వదిలించుకొనేందుకు రూ. 1,700 కోట్లు
పారిస్: ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడడానికి ఎవరైనా మద్యం అమ్మకాలు పెంచుతారు. కానీ ఫ్రాన్స్ మద్యానికి డిమాండ్ లేకపోవడంతో ఆ నిల్వలను వదిలించుకోవడానికి దాదాపు రూ.1,700 కోట్లు (20 కోట్ల యూరోలు) ఖర్చు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ సంక్షోభం, ఆ వెంటనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు వైన్ వంటి వాటికి ఖర్చు చెయ్యడం బాగా తగ్గించేశారు. తక్కువ ధరకు లభించే బీర్‌కు అలవాటు పడిపోయారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల్లో ఇటీవల కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కబోత భరించలేని ప్రజలు వైన్ బదులుగా బీర్ ఎక్కువగా తాగుతున్నారు. చాలా మంది ఆల్కహాల్ ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్(1996 నుంచి 2010 మధ్య పుట్టినవారు) మద్యం తాగడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా వైన్‌కి డిమాండ్ పడిపోయింది. మరోవైపు వైన్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బోర్డాక్స్ ప్రాంతంలో వైన్ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వమే ఆ వైన్‌ను కొనుగోలు చేసేందుకు 20 కోట్ల యూరోలు కేటాయించింది. అదనంగా ఉన్న వైన్‌ను కొనుగోలు చేసి దానిలోని ఆల్కాహాల్‌ను శానిటైజర్లు, శుభ్రతా ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటి తయారీలో వినియోగించనుంది. ఇలా చేయడం ద్వారా మళ్లీ వైన్‌కు డిమాండ్ పెరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. వైన్ వినియోగం యూరప్ దేశాలైన ఇటలీలో ఏడు శాతం, స్పెయిన్‌లో 10 శాతం, ఫ్రాన్స్‌లో 15 శాతం, జర్మనీలో 22 శాతం, పోర్చుగల్‌లో 34 శాతం మేర తగ్గిపోయింది. -
ఒక్కరోజులో రూ.172 కోట్ల ఆదాయం
చెన్నై: తమిళనాడులో తొలి రోజు మద్యం అమ్మకాలు జోరుగా ముగిశాయి. లాక్డౌన్ అనంతరం తెరుచుకున్నమొదటి రోజే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్క రోజే తమిళనాడు ప్రభుత్వం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిపినట్లు తేలింది. లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలను తమిళనాడు ప్రభుత్వం మే 7(గురువారం)నుంచి తిరిగి ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం లాక్డౌన్ సడలింపుల ఇవ్వడంతో కంటైన్మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోనూ లిక్కర్ సేల్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే చెన్నైలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల గ్రేటర్ చెన్నై ప్రాంతంలో మాత్రం మద్యం అమ్మకాలను నిషేధించింది. (మద్యం అమ్మకాలు; మండిపడ్డ మహిళలు) కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 44 రోజులపాటు మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోడంతో మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దొరికిందే అదునుగా భావించి తెగ తాగుతూ రికార్డు సృష్టిస్తున్నారు. ఏ మద్యం దుకాణం ముందు చూసినా కిలోమీటర్లమేర మందుబాబులు బారులు తీరుతున్నారు. ఒక్క సీసా దొరికినా చాలు అంటూ దుకాణాల ముందు ఎగబడుతున్నారు. అయితే మద్యం దుకాణాల ముందు సామాజిక దూరం పాటించని, మాస్కులు లేని వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక తమిళనాడులో కొత్తగా 580 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,409కి చేరింది. (ఒక్క రోజే పలు పారిశ్రామిక ప్రమాదాలు ) తమిళనాడులో కరోనా విలయతాండవం -
మీరే దేశాన్ని కాపాడేది.. మందుబాబులపై పూల వర్షం
న్యూఢిల్లీ : మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ మందుబాబులపై ఓ వ్యక్తి పూల వర్షం కురిపించాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అంటూ న్యూఢిల్లీలో చందేర్ నగర్‌లోని ఓ వైన్ షాప్ ఎదుట భారీ లైన్లో నిల్చున్న మందుబాబులపై పూలు చల్లాడు. మరోవైపు భారీ లైన్లలో లిక్కర్ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై మిర్జాపూర్‌లో ఓ లిక్కర్ షాప్ యజమాని పూలు చల్లాడు. (‘బారు’లు తీరిన మందుబాబులు) కాగా, లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. (వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) -
వామ్మో.. ఇంత పేద్ద ‘బారా’
న్యూఢిల్లీ: దాదాపు నెలన్నర రోజులుగా ‘మందు’కు మొహం వాచిన మద్యపాన ప్రియులు నేడు వైన్ షాపులు తెరవడంతో వెల్లువలా తరలివచ్చారు. తమ ‘దాహం’ తీర్చుకోవడానికి మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు. దేశ రాజధాని ఢిల్లీలో మందు బాబులు రెట్టించిన ఉత్సాహంతో ‘చుక్క’ కోసం షాపుల ముందు పడిగాపులు కాశారు. దేశబంధు గుప్తా రోడ్డులోని లిక్కర్ షాపు ముందు కిలోమీటర్ల వరకు ఓపిగ్గా నిలబడి రికార్డు సృష్టించారు. కశ్మీర్ గేట్ ప్రాంతంలో ఉన్న మందు దుకాణం ముందు నిలుచున్న మందుబాబులకు పోలీసులు బడితపూజ చేశారు. భౌతిక దూరం పాటించనందుకు లాఠీలతో బాది వారిని చెదరగొట్టారు. (మందు బాబుల బారులు.. 30 శాతం ధరల పెంపు) కాగా, లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. 45 రోజులుగా నోరు కట్టేసినట్టు అవడంతో ఆబగా మద్యాన్ని అందుకునేందుకు గబగబ వైన్ షాపులకు పరుగులు తీశారు. ఫలితంగా మద్యం దుకాణాలు ముందు తండోప తండాలుగా మనుషుల ‘బారు’లు దర్శనమిచ్చాయి. ముఖానికి మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మందు కోసం పోటీ పడ్డారు. దీంతో అక్కడక్కడ పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక మందుబాబుల విన్యాసాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. (వైన్‌షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) -
పండుగ పూట.. మద్యం ధరలు ప్రియం
సాక్షి, సిరిసిల్ల: మందుబాబులకు దసరాకు ధరల కిక్కు ఎక్కుతోంది. పండుగ పూట మద్యం ధరలు ప్రియమయ్యాయి. ఇవి సర్కారు పెంచిన ధరలు అనుకుంటే పొరపాటే.. జిల్లాలోని వైన్స్ యజమానులు సొంతంగా ఇష్టారీతిన ధరలు పెంచుకుని మద్యం అమ్ముతున్నారు. ఇదేందని అడిగితే.. ‘అంతా మా ఇష్టం’ అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. వైన్స్‌ల్లోనే కాదు బార్లలోనూ రేట్లు పెంచి మద్యంప్రియుల ను నిలువుదోపిడీ చేస్తున్నారు. బీరుకు రూ.10.. క్వార్టర్‌కు రూ.10.. ఫుల్‌బాటిల్‌కు రూ.50 చొప్పున అధికంగా వసూలు చేస్తూ.. మద్యం వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. బీరుపై రూ. 10.. ఫుల్‌పై రూ. 50 జిల్లాలోని 75శాతం మద్యం దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదేందని మద్యం ప్రియులు అడిగితే.. ‘ప్రభుత్వం వద్దనంగా నెల రోజుల పాటు మద్యం దుకాణాలు నడపాలని ముక్కుపిండి ఫీజులు కట్టించింది. చెల్లించిన పైసలు చేతికి రావాలంటే ఇక ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు పదో పరకో వేసి అమ్మకాలు జరిపితే నెల గడుస్తుంది’ అంటూ వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. అందుకే మద్యం దుకాణదారులు ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీలపై రేట్లు పెంచి అమ్మడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇలా బీ రుపై పది రూపాయలు ఫుల్ బాటిల్‌పై యాబై రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి అమ్మకాలు వెన్స్‌లోనే కాదు బార్ అండ్ రెస్టారెంట్స్‌లో జరుగుతుండడం గమనార్హం. బార్‌లోని మద్యాన్ని బయటకు అమ్మడానికి వీలులేకున్నా.. అడ్డదారిలో అమ్మకాలు జరుపుతున్న వారిపై అబ్కారీ అధికారులు నిఘా వేయడం విఫలమవుతున్నట్లు విమర్శలున్నాయి. దసరాపై దండిగా ఆశలు దసరా పండక్కు మన ప్రాంతంలో మద్యం ఎక్కువగా అమ్ముడు పోతుంది.ఇదే అవకాశంగా అనధికార పెంపును అమలు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేజిక్కించుకో వడానికి కాస్త రేట్ల పెంచుకున్నట్లు తెలుస్తోంది. బెల్టుషాపుల్లో మరింత అదనం జిల్లాలో ప్రభుత్వం అనుమతితో 42వైన్ షాపులు, ఆరు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా అనధికారికంగా జిల్లాలో దాదాపు వెయ్యి వరకు బెల్ట్‌షాపుల నిర్వహణ జరుగుతోంది. వీటిలో ఎమ్మార్పీకన్నా కనిష్టంగా రూ.10నుంచి గరిష్టంగా రూ.50 అధికం తీసుకుని మద్యాన్ని గ్రామాల్లో అమ్మకాలు జరుçపుతున్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం వైన్స్‌షాపుల్లోనే అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఇక బెల్టుషాపుల్లో మద్యంప్రియుల జేబులకు చిల్లుపడినట్లే అని పలువురు భావిస్తున్నారు. అకున్ సబర్వాల్‌కు ఫిర్యాదు అకున్ సబర్వాల్‌కు ఫిర్యాదు చేసినపోస్టు రుద్రంగి(వేములవాడ): మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తున్నారని రుద్రంగి మండలకేంద్రానికి చెందిన దేశవేని వినోద్‌కుమార్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అకున్‌సబర్వాల్‌కు శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఎక్సైజ్ డిపార్టుమెంటు వారికి తగు చర్యల నిమిత్తం ఈ పోస్టును శనివారం ఫార్వర్డ్ చేశారు. అయితే ఆదివారం కూడా రుద్రంగిలోని మద్యం దుకాణంలో అధిక ధరలకే మద్యం విక్రయించడంతో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రేట్లు పెరగలేదు.. మద్యం ఎమ్మార్పీ రేట్లకు అమ్మాలి. ప్రస్తుతం రేట్లు పెంచారన్న దానిలో వాస్తవం లేదు. బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మకాలు గురించి తెలియదు. బార్లో సేవించేందుకు మద్యం అమ్మకాలు జరపాలన్న నిబంధన ఉంది. బయటకు బాటిల్స్ అమ్మకాలు జరగవు. పండుగలున్నాయని నిబంధనలను పాటించకుంటే అలాంటి వారిపై వచ్చిన ఫిర్యాదుపై చట్టపరిధిలో చర్యలకు వెళ్తాం. – చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ, ఎల్లారెడ్డిపేట -
తాగినోళ్లకు తాగినంత
– మద్యం వ్యాపారంతో ప్రభుత్వ ఖజానా గలగల – ఏటా పెరుగుతున్న మద్యం విక్రయాలు – నూతన బార్ పాలసీ విధానంతో మరింత ఆదాయం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. తాగినోళ్లకు తాగినంత పోసేస్తున్నారు. ప్రతి ఏటా మద్యం విక్రయాలు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. మద్యం వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గలగలమంటోంది. నూతన బార్ పాలసీ విధానంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. - అనంతపురం సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం వ్యాపారం కీలక ఆదాయ వనరుగా మారుతోంది. దీంతో జిల్లాలో మద్యం వ్యాపారానికి ఆంక్షలు పూర్తిగా సడలించారు. తెల్లవారుజాము నుంచి అర్దరాత్రి వరకూ విక్రయించుకున్నా అడిగేవారు. కాకా హోటల్ నుంచి డాబాల వరకూ ఎక్కడైనా మద్యం లభిస్తోంది. దీంతో మద్యపాన ప్రియులు తాగుడుకు పూర్తిగా బానిసలవుతుంటో.. మరో వైపు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో 240 మద్యం దుకాణాలు, 8 బార్ల ద్వారా (బెల్టుషాపులు కలుపుకొని) ప్రతి ఏడాది సగటున రూ.800 కోట్ల పైచిలుకు మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. బెల్టుషాపులు ఎత్తేస్తామని.. అధికారంలోకి వస్తే బెల్టుషాపులను ఎత్తేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలలో బెల్టుషాపులు నిర్మూలన అంశం కూడా ఉంది. దీంతో ఇక రాష్ట్రంలో బెల్టుషాపులుండవని అందరూ భావించారు. కానీ సర్కార్ మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడంతో ఊరు, వాడా బెల్టుషాపులు వెలిశాయి. జిల్లాలో బెల్టుషాపులు లేని గ్రామాలే లేవంటే అతిశయోక్తి కాదు. ఒక్కో గ్రామంలో రెండు, మూడేసి చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. వీటి వలన మద్యం వ్యాపారం గణనీయంగా పెరిగి ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. జిల్లా నుంచే ప్రతి ఏడాది రూ.800 కోట్లుకు పైగా విక్రయాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా మరేస్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందో అర్థం చేసుకోవచ్చు. నూతన బార్ పాలసీ విధానంతో : ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ విధానంతో మద్యం వ్యాపారం రెట్టింపుస్థాయిలో సాగనుంది. ఇప్పటి వరకూ జిల్లాలో కేవలం 8 మాత్రమే బార్లు ఉండేవి. నూతన పాలసీతో ఆ సంఖ్య 32కు చేరుకుంటోంది. ఈ మేరకు అనంతపురం నగరంలో 8, తాడిపత్రిలో 3, గుంతకల్లులో 4, రాయదుర్గంలో 2, గుత్తిలో 1, పామిడిలో 1, ధర్మవరంలో 4, హిందూపురంలో 5, కదిరిలో 2, కళ్యాణదుర్గంలో 1, మడకశిరలో 1 చొప్పున జూలై ఒకటో తేదీ నుంచి బార్లు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం మినహా ఇప్పటి వరకు మిగిలిన ప్రాంతాల్లో బార్లు లేవు. సుప్రీంకోర్టు మొట్టికాయ వేసేంత వరకు.. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు వీటి వలన జరుగుతున్న అనర్థాలపై అధికారులు దృష్టి సారించలేదు. జిల్లాలో 240 మద్యం దుకాణాలు ఉంటే 200 పైబడి దుకాణాలు రహదారులపైనే ఉండడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే గత కొన్నేళ్లుగా మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని హైవేలపైనే విస్తరించుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాల రావడంతో ప్రస్తుతం 500 మీటర్ల దూరానికి జరుపుకుంటున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి హైవేలపై ఉండకూడదని ఆదేశాలు అందాయి. దీంతో మద్యం దుకాణాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో మద్యం విక్రయాలు ఇలా ...: సంవత్సరం మద్యం విక్రయాలు 2013–14 రూ. 555 కోట్లు 2014–15 రూ. 631 కోట్లు 2015–16 రూ. 688 కోట్లు 2016–17 రూ. 816 కోట్లు -
తెల్లవార్లూ మద్యం అమ్మకాలు
మద్యం సిండికేట్లు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం విక్రయాలు రహస్యంగా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేసిన సందర్భాలలో జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన మంత్రులను బూచీగా చూపిస్తున్నారు. రాత్రిళ్లు షాపులో బయట తాళాలు వేసినా షట్టర్‌కు చేసిన రంధ్రం ద్వారా తెల్లవార్లు మద్యం విక్రయిస్తున్నారు. రాత్రిళ్లు బాటిల్‌ను నిర్ణీత మొత్తం కంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : జిల్లాలో 545 మద్యం షాపులు ఉండగా రెండు నెలల క్రితం లాటరీ పద్ధతిలో 521 షాపులకు కేటాయింపులు చేశారు. మరో 24 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై నుంచి కొత్త లైసెన్సులు అమలులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్లు ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారు. మంచినీళ్లు దొరకని ప్రాంతాల్లో కూడా మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఈ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అమ్మకాలు సాగించాలి. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో తెల్లవార్లూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో అప్సరా థియేటర్ వద్ద షాపులో ఉదయం 5 గంటల సమయంలో అమ్మకాలు సాగిస్తున్నందుకు ఏజీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలమూరులో కూడా రెండు షాపులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చక్రం తిప్పుతున్న సిండికేట్లు మద్యం సిండికేట్లే మద్యం రేట్లు నిర్ణయిస్తున్నారు. మద్యం కంపెనీలు రేట్లు పెంచినందున లాభాలు రావడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుకొని అమ్ముకుంటామని మద్యం వ్యాపారులు గతంలో ప్రభుత్వానికి అనుమతిని కోరుతూ లేఖ రాశారు. అయితే ప్రభుత్వం విధానం ఇంకా ప్రకటించకుండానే వ్యాపారులు రేట్లు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తుంటే.. ఆ రేట్లకు మించి ఒక్కో బాటిల్‌పై కనీసం రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా రేటు నిర్ణయించారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న షాపులు మూసి వేయాలనే విధానంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండడంతో పాత షాపులనే కొనసాగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకే ఎక్కువ షాపులు.. ఎక్సైజ్ అధికారులు ఇటీవల జిల్లాలో నిర్వహించిన లాటరీలో తెలుగు తమ్ముళ్లే ఎక్కువ షాపులను దక్కించుకున్నారు. అధికారులును ప్రలోభాలకు గురి చేసి షాపులకు ఎవరూ అడ్డు రాకుండా చేసుకోగలిగారు. కొన్ని చోట్ల 20 ఏళ్లుగా షాపు నిర్వహిస్తున్న వ్యక్తికే తిరిగి షాపు దక్కేలా పావులు కదిపారు. ఎవరైనా ఆ షాపు కోసం దరఖాస్తు చేస్తే మొదటిలోనే అడ్డుకొని దరఖాస్తు చేసిన వారిపై దౌర్జన్యం చేసి భయపెట్టిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ లాటరీ పద్ధతిపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోలేకపోతున్న అధికారులు ప్రతి షాపులో ఎమ్మార్పీకే విక్రయాంచాలన్న నిబంధన అమలుపై ఎక్సైజ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు అందినప్పటికీ షాపు యజమానులపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండడంతో వారి ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. చర్యలు చేపడతాం మద్యం షాపుల అమ్మకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. షాపుల కేటాయింపు పారదర్శకంగా జరిగింది. జూ¯ŒS 30తో పాత షాపులు గడువు ముగుస్తుంది. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్టు దృష్టికి వస్తే షాపుల యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – బత్తుల అరుణరావు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ -
అమ్మితే రూ.25 వేలు.. తాగితే రూ.10 వేలు
నవాబుపేట: మద్యం క్రయవిక్రయాలను ఆ గ్రామస్తులు నిషేధించారు. అతిక్రమించి ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా జరిమానా చెల్లించక తప్పదని ఏకగ్రీవంగా తీర్మానించారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం మాదారం గ్రామం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని కిరాణం దుకాణాల్లో విచ్చలవిడిగా మందు తాగి కొందరు గొడవలకు దిగుతున్నారు. ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులంతా ఏకమై మద్యపానాన్ని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చారు. మంగళవారం గ్రామ పంచాయతీ సభ్యులు, మహిళలు, యువజన సంఘాలు, గ్రామ పెద్దలు, సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలో మద్యం అమ్మరాదని నిర్ణయించారు. అందుకు అందరూ సమ్మతించారు. సహకరిస్తామని చెప్పారు. ఇకపై ఎవరైనా మద్యం అమ్మితే రూ.25000, కొనుగోలు చేసే రూ.10000 జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ఆ మేరకు తయారైన తీర్మానంపై గ్రామస్తులు, కిరాణ షాపుల యజమానులు సంతకాలు చేశారు. -
మద్యం అలవాటును ప్రోత్సహిస్తున్న సర్కారు