హైదరాబాద్‌లో వైన్స్‌ షాపుల వద్ద ప్రత్యేక మార్క్‌లు | Social Distance Must Follow at Wine Shops, Says Hyderabad CP Anjani Kumar - Sakshi
Sakshi News home page

వైన్స్‌ షాపుల వద్ద ప్రత్యేక మార్క్‌లు 

Published Wed, May 6 2020 2:24 PM | Last Updated on Wed, May 6 2020 5:37 PM

Hyderabad CP anjani kumar says Social Distance Must Follow In Wine Shops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైన్స్‌ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించారు. నారాయణగూడ శాంతి థియేటర్‌ దగ్గర ఉన్న ఓ మద్యం దుకాణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు హైదరాబాద్‌లో 178 మద్యం షాపులు తెరిచారని చెప్పారు.

ప్రతి వైన్స్‌ షాపు వద్ద భౌతిక దూరం పాటించలే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించండం కోసం ప్రత్యే క మార్క్‌లు వేయించామని తెలిపారు. కంటైన్మెంట్‌ ప్రాంతాలలో పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. భౌతిక దూరంతోనే కరోనాను నివారించవచ్చని, దీనికి ప్రజలు సహకరించాలని అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement