ఢిల్లీ: జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల వివరాలను మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించగా మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు.
‘ఆప్ మంత్రి అతిషి విలేకరుల సమావేశం ద్వారా జారీ చేసిన లేఖ నకిలీది. ఆమె ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అది సీఎం కార్యాలయం.. మద్యం షాపు కాదని మంత్రి అతిషీకి, ఆ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కోర్టు అనుమతి ఇచ్చే వరకు ఎటువంటి ఉత్తర్వును జారీ చేయలేడు’ అని సిర్సా వ్యాఖ్యానించారు.
‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేని సమయంలో సీఎం కార్యాలయాన్ని ఎవరు ఉపయోగించారు? అధికారిక లేఖను ఎవరు రూపొందించారు.. జారీ చేశారు? ఈ విషయాలు నేరపూరిత కుట్రలో భాగమని, దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను కోరుతున్నాను’ అన్నారు.
#WATCH | Delhi: As Delhi CM Arvind Kejriwal issues first order from ED custody on water shortage during summer in National Capital, BJP National Secretary Manjinder Singh Sirsa says, "The letter that has been issued by AAP Minister Atishi through a press conference is… pic.twitter.com/HtrbVkxQdI
— ANI (@ANI) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment