CM office
-
సీఎం సామాన్లనే బయటపడేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం వేదికగా ఆప్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి అధికార ఆధిపత్యపోరు కనిపించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకు రాలు అతిశికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడం ఈ వివాదానికి ఆజ్యంపోసింది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిశి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిశికి సంబంధించిన సామగ్రిని బయట పడేశా రని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మీడి యా సమావేశంలో మాట్లాడారు. ‘‘ సీఎం అతిశికి అధికారిక బంగ్లాను కేటాయించలేదు. అందుకే ఇ న్నాళ్లూ సీఎంగా ఉన్నపుడు వినియోగించి, కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకే అతిశి మారారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా ఆ బంగ్లాను బీజేపీ అగ్రనేతకు కేటాయించాలని కుట్ర పన్నింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను అడ్డుపెట్టుకుని అతిశికి చెందిన సామగ్రిని బయట పడేశారు. అంతకుముందు అదే బంగ్లాలోని క్యాంప్ ఆఫీస్‌లో అతిశి ఒక సమావేశం కూనిర్వహించారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన బీజేపీ ఇలా చవకబారు బంగ్లా రాజకీయాలు చేస్తోంది’’ అని సంజయ్ వివరించారు.బంగ్లాకు సీలు వేయాల్సిందే: బీజేపీవివాదంపై బీజేపీ దీటుగా స్పందించింది. ఢిల్లీ శాసనసభలో విపక్షనేత, బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ‘‘ గత ఏడాది కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి అతిశి చేరినప్పుడే కేబినెట్ మంత్రి హోదాలో ఆమెకు మథుర రోడ్డులోని ఏబీ–17 బంగ్లాను ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) గతంలోనే కేటాయించింది. ఆ బంగ్లా ఉండగా ఈ బంగ్లాతో సీఎంకు పనేంటి?. కేజ్రీవాల్ వెళ్లిపోయినా సీఎం బంగ్లా తాళాలు పీడబ్ల్యూడీకి అప్పజెప్పలేదు. ఇప్పుడు అతిశి అక్రమంగా ప్రవేశించిన ఈ బంగ్లాకు సీలు వేయాల్సిందే’’ అని గుప్తా డిమాండ్‌చేశారు.అక్రమంగా తరలించారు: సీఎం కార్యాలయం‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాలను శిరసావహిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. అతిశి వస్తువులను బయట పడేయించారు. బీజేపీ బడా నేతకు ఈ బంగ్లాను కేటాయించాలను ఎల్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని అందుకోలేని బీజేపీ ఇప్పుడు సీఎం బంగ్లాను ఆక్రమించాలని చూస్తోంది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.అది అధికారిక బంగ్లా కాదు: ఎల్జీ వర్గాలుసీఎంఓ ప్రకటన తర్వాత ఎల్జీ కార్యాలయం వర్గాలు స్పందించాయి. ‘‘ సీఎం హోదాలో అతిశికి ఆ బంగ్లాను కేటాయించలేదు. అనుమతి లేకుండా అతిశి ఆమె సామగ్రిని బంగ్లాలోకి తరలించారు. తర్వాత ఆమెనే వాటిని బయటకు తరలించారు. ప్రస్తుతా నికి ఆ బంగ్లా పీడబ్ల్యూడీ అధీనంలోనే ఉంటుంది. గతంలో సమకూర్చిన వస్తువులను సరిచూసు కున్నాకే కేటాయిస్తారు’’ అని ఎల్జీ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. -
Bihar: సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
బీహార్‌లోని పట్నాలో గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. ఈ నేపధ్యంలో సీఎం కార్యాలయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.తీవ్రవాద సంస్థ అల్ ఖైదా పేరుతో సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీనిపై సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత ఏటీఎస్ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. కాగా గతంలో పట్నా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ముమ్మర తనిఖీల తర్వాత బాంబులాంటిదేమీ లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.జూలైలో పట్నాలోని ఓ ఇంట్లో బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 35 లైవ్ కాట్రిడ్జ్‌లు, పొటాషియం నైట్రేట్ బాక్స్, ట్రీ ఫిల్ లిక్విడ్ బాక్స్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పవన్ మహతో అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తెలంగాణ సెక్రటేరియట్.. సీఎం పీఆర్వో గది మార్పు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనం ఆరవ అంతస్తులో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆరవ అంతస్తులోని సీఎం పౌర సంబంధాల కార్యాలయాన్ని తాజాగా మార్చారు. శుక్రవారం(జులై 19) వరకు ఆరవ అంతస్తు లోని 7వ గదిలో పీఆర్వో ఆఫీసు కార్యకలాపాలు నడిచాయి. శనివారం నుంచి పీఆర్వో ఆఫీసును అయిదవ అంతస్తుకు షిఫ్ట్ చేశారు.ఇక నుంచి ఐదవ అంతస్తులోని ఐదవ నెంబర్ గదిలో ఇక మీదట సీఎం సీపీఆర్ఓ, పీఆర్వోలు పనిచేయనున్నారు. గతంలో ఉన్న లాంజ్‌ను వీఐపీల కోసం కేటాయించారు. -
Assam govt: తల్లిదండ్రులతో గడిపేందుకు సెలవు
గువాహటి: అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో గడిపేందుకు రెండు రోజులు సెలవులిస్తున్నట్లు సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది. తల్లిదండ్రులు, అత్తమామలు లేని వారు స్పెషల్ కాజువల్ లీవ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. నవంబర్ 6, 8వ తేదీల్లో స్పెషల్ కాజువల్ లీవ్ తీసుకునే వారు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకే కేటాయించాలని వివరించింది. వయోవృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలను జాగ్రత్త చూసుకునేందుకు వారికి గౌరవం, మర్యాద ఇచ్చేందుకు ఈ లీవ్ ప్రత్యేక సందర్భమని వెల్లడించింది. నవంబర్ 7న ఛాత్ పూజ, నవంబర్ 9న రెండో శనివారం, నవంబర్ 10న ఆదివారంతో పాటు ఈ రెండు రోజుల సెలవును ఉపయోగించుకోవచ్చని సీఎంఓ తెలిపింది. -
అది సీఎం ఆఫీస్.. లిక్కర్ షాపు కాదు.. బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
ఢిల్లీ: జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల వివరాలను మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించగా మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. ‘ఆప్ మంత్రి అతిషి విలేకరుల సమావేశం ద్వారా జారీ చేసిన లేఖ నకిలీది. ఆమె ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అది సీఎం కార్యాలయం.. మద్యం షాపు కాదని మంత్రి అతిషీకి, ఆ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కోర్టు అనుమతి ఇచ్చే వరకు ఎటువంటి ఉత్తర్వును జారీ చేయలేడు’ అని సిర్సా వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేని సమయంలో సీఎం కార్యాలయాన్ని ఎవరు ఉపయోగించారు? అధికారిక లేఖను ఎవరు రూపొందించారు.. జారీ చేశారు? ఈ విషయాలు నేరపూరిత కుట్రలో భాగమని, దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను కోరుతున్నాను’ అన్నారు. #WATCH | Delhi: As Delhi CM Arvind Kejriwal issues first order from ED custody on water shortage during summer in National Capital, BJP National Secretary Manjinder Singh Sirsa says, "The letter that has been issued by AAP Minister Atishi through a press conference is… pic.twitter.com/HtrbVkxQdI — ANI (@ANI) March 24, 2024 -
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం(నేడు) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన ఢిల్లీలోనే ఉంటారు. గురువారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ 1 జన్‌పథ్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించింది. -
సినీ రంగానికి తీరని లోటు
సాక్షి, అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మహాభినిష్క్రమణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ దర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడని కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తెచ్చాయని చెప్పారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్ చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ పేరుపై రాష్ట్ర ప్రభుత్వం లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డును విశ్వనాథ్‌కి ఇచ్చిన అంశాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
సాక్షి, అమరావతి: సీఎం కార్యాలయం(సీఎంవో)లో పనిచేసే అధికారులకు శాఖలను కేటాయిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. కేఎస్ జవహర్‌రెడ్డి(స్పెషల్ సీఎస్): జీఏడీ, హోం శాఖ, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య శాఖ, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్మెంట్, రాష్ట్ర విభజన సమస్యలు సాల్మన్ ఆరోఖ్యరాజ్(కార్యదర్శి): పౌర సరఫరాలు, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు ధనుంజయ్‌రెడ్డి(కార్యదర్శి): ఆర్థిక, ప్రణాళిక శాఖ, జల వనరులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, మునిసిపల్ పరిపాలన, ఇంధన శాఖ, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు ముత్యాలరాజు(అదనపు కార్యదర్శి): ప్రజాప్రతినిధుల వినతులు, రెవెన్యూ(ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్), గృహ నిర్మాణం, రవాణా, రోడ్లు, భవనాల శాఖలు, కార్మిక, నైపుణ్యాభివృద్ధి శాఖలు -
సీఎం ఆఫీసులో కరోనా కలకలం
యశవంతపుర(బెంగళూరు): సీఎం బొమ్మై కార్యాలయంలో ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్‌గా బయట పడింది. దీంతో ఆఫీసులో క్రిమిసంహారకాన్ని పిచికారి చేశారు. అధికార నివాసం కృష్ణాలో 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఇద్దరు సిబ్బందికి కరోనాగా వెల్లడైంది. వివిధ పనుల నిమిత్తం విధానసౌధకు తిరగడంతో అక్కడి సిబ్బందికి కూడా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విధానసౌధలోని సీఎం ఆఫీసును కూడా శానిటైజ్ చేశారు. మరో ఘటనలో.. రాజకాలువలపై కబ్జాలు ఉండరాదు: సీఎం బనశంకరి: బెంగళూరులో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం బొమ్మై బీబీఎంపీ అధికారులను ఆదేశించారు. బుధవారం బీబీఎంపీ కార్యాలయంలో మంత్రులు, పాలికె అధికారులతో సీఎం సమావేశం జరిపారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేకంగా ఉత్తర, తూర్పు బెంగళూరు ప్రాంతాల్లో వర్షంనీరు చొరబడి జన జీవనం అస్తవ్యస్తమైంది. రాజ కాలువలపై కబ్జాలను తొలగించి విస్తరించాలని ఆదేశించా. కాలువలపై ఇళ్లు ఉన్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం కల్పిస్తాం. హెబ్బాల వ్యాలీ నీరు సజావుగా ప్రవహించేలా చర్యలను చేపట్టాలి. మురుగు కాలువలు పూడిపోరాదు అని చెప్పారు. మంత్రులు అశ్వత్నారాయణ, ఎస్టీ సోమశేఖర్, వీ సోమణ్న పాల్గొన్నారు. చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ? -
కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎంవో కార్యాలయంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు దామోదరన్ కరోనా వైరస్‌తో బుధవారం మృతి చెందారు. దీంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కాగా.. మంగళవారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా, మరణాలు అమాంతంగా పెరగడం కలవరాన్ని రేపింది. ఈ ఒక్కరోజే 49 మంది మరణించారు. ఉత్తర చెన్నైలో మృత్యువాత పడ్డవారు ఇందులో మరీ ఎక్కువగా ఉన్నారు. నివారణ చర్యల్లో భాగంగా మంత్రులు ఉరుకులు, పరుగులు తీసేపనిలో పడ్డారు. లాక్ కఠినం కానున్న నేపథ్యంలో సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీ నుంచి పదిహేను వందల నుంచి రెండు వేలకు సమీపంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో చెన్నై కేసులు 90 శాతం మేరకు ఉంటున్నాయి. మంగళవారం చెన్నైలో కేసుల సంఖ్య తగ్గింది. 919 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కాగా మరణాల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. మూడు రోజులుగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మూడు రోజులుగా ఈ సంఖ్య 30, 38, 44గా ఉంది. తాజాగా ఒక్క రోజులో 49 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 35 మంది ఉత్తర చెన్నై పరిధిలో ఉన్నారు. రాయపురం, తండయార్‌పేట మండలాలు డెంజర్ను మించిన జోన్లుగా మారాయి. కోడంబాక్కం, తేనాంపేట, అన్నానగర్ మండలాలు ఆ రెండు మండలాలతో పోటీ పడుతున్నాయి. అక్కడి ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. మరణాల పరంగా రోజురోజుకీ రికార్డు సృష్టించే విధంగా సంఖ్య పెరుగుతుండడం, ఈ సంఖ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరీ ఎక్కువగా ఉండడంతో మున్ముందు కరోనా మృత్యు పంజా వేగం ఏ మేరకు పెరగనుందో అన్న ఆందోళన తప్పడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 లక్షల 48 వేల 244 మందికి కరోనా పరీక్ష నిర్వహించగా ఇందులో పాజిటివ్ కేసుల సంఖ్య 48 వేలు దాటింది. మరో ఒకటి రెండు రోజుల్లో 50 వేలకు పైగా కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ సంఖ్యలో రెండో స్థానాన్ని రాష్ట్రం పదిలం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: లాక్డౌన్ ప్రకటనతో.. కిక్కు కోసం క్యూ మంత్రుల ఉరకులు చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలో పాటు కడలూరు, దిండుగల్, మదురై, నాగపట్నం, రామనాథపురం, రాణిపేట, తెన్కాశి, తిరువణ్ణామలై, తిరుచ్చి, వేలూరు, విల్లుపురం, తిరునల్వేలి జిల్లాల్లో రెండు అంకెల మేరకు కేసులు పెరుగుతుండడంతో అక్కడి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. చెన్నై, శివార్ల నుంచి చడీచప్పుడు కాకుండా వచ్చిన వారి రూపంలోనే కేసులు పెరిగినట్టు గుర్తించారు. ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, అధికారులు సమష్టిగా ఉరుకులు పరుగులు తీసే పనిలో పడ్డారు. చెన్నై, శివార్ల నుంచి వచ్చిన వాళ్లు ఎవరైనా ఉంటే, సమాచారం ఇవ్వాలని, పరిశోధనలు చేసుకోవాలని గ్రామ గ్రామానా ప్రజలకు పిలుపునిచ్చే పనిలో పడ్డారు. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాల్ని, గ్రామాల్ని పూర్తిగా మూసి వేసి వైద్య పరిశోధన, చికిత్స వలయంలోకి తెచ్చే పనిలో పడ్డారు. చెన్నైలో అయితే మంత్రులు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్, అన్భళగన్ మండలాల పరిధిలోని వార్డుల్లో తిరుగుతూ, శిబిరాల్లో సాగుతున్న వైద్య పరిశోధనలు, చికిత్సల మీద దృష్టిపెట్టారు. సరిహద్దులో చెక్ పోస్టులు.. క్వారంటైన్లకు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోని సరిహద్దుల్లో పలు చోట్ల అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెన్నైలోకి వచ్చేందుకు, వెళ్లేందుకు అనేక చిన్న మార్గాలు ఎక్కువే. ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలిసి వచ్చే మార్గంగా మారింది. ఆయా చిన్న మార్గాలు, ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని పోలీసులు నిఘా వలయంలోకి తెచ్చారు. చెన్నైలోకి బయటి వ్యక్తులు, కొత్త వాళ్లు రాకుండా అడ్డుకునే పనిలో పడ్డారు. చెన్నై నుంచి ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్లాంటే, ఈ పాస్ తప్పని సరిచేశారు. ఇది ఉంటే వాహనాలను బయటకు పంపుతున్నారు. కొందరు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునే యత్నం చేసినా, జాతీయ రహదారిలోని అన్ని టోల్ గేట్లు, ఆ రహదారికి అనుసంధానంగా ఉన్న అనేక మార్గాల్ని ఆయా జిల్లాలు, ప్రాంతాల పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయటి వ్యక్తుల రూపంలో తమ ప్రాంతాల్లో కరోనా అన్నది వ్యాపించకుండా, అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. కొన్ని జిల్లాల్లో అయితే సరిహద్దుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేయడం, అవసరం కోరనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం గమనార్హం. తమ ప్రాంతాలకు కొత్తగా ఎవరు వచ్చినా నేరుగా క్వారంటైన్లకు తరలించేందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ దిశగా మంగళవారం వేకువ జామున సింగపూర్ నుంచి 175 మందితో చెన్నైకు వచ్చిన విమానంలోని ప్రయాణికుల్ని నేరుగా క్వారంటైన్లకు తరలించారు. 30 మంది మాత్రం తాము హోటల్స్‌లో ఉంటామని పేర్కొనడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారిని ఓ కళాశాలల ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంచారు. కత్తార్ నుంచి వచ్చిన మరో విమానంలోని 141 మంది రాగా, 137 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసినక్వారంటైన్లోకి వెళ్లారు. మిగిలిన వారు హోటల్స్‌లో గదుల్ని తీసుకున్నారు. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతటి వారు వచ్చినా, ఇక క్వారంటైన్లలోకే అని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, విదేశాల్లో తమిళులు ఎందరో చిక్కుకుని ఉన్నారని, వారందర్నీ ఇక్కడకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తౌఫిక్ జమాత్ నేతృత్వంలో వినూత్న రీతిలో వీడియో కాన్పరెన్స్ ద్వారా పలు చోట్ల నిరసనలు సాగడం గమనార్హం. చదవండి: చెన్నైలో మళ్లీ లాక్డౌన్ కేసుల నమోదు.. క్వారంటైన్ల నుంచి తప్పించుకుని బయట తిరుగున్న వారిపై కేసుల నమోదుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే హోం క్వారంటైన్లలో ఉన్న వాళ్లు పలువురు రోడ్లపై తిరుగుతున్నట్టు సమాచారం అందుకుని 40మందిపై గత వారం కేసులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో మరో 51 మందిపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. అలాగే, తప్పుడు చిరునామాలు ఇచ్చి ప్రైవేటు పరిశోధనా కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకుని పాజిటివ్ రాకతో పత్తా లేకుండా పోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆయా పరిశోధనా కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటి వరకు రెందు వందల మందిని గుర్తించారు. వీరికి తీవ్ర హెచ్చరికలు ఇవ్వడమే కాకుండా, హోం క్వారంటైన్లకు పరిమితం చేశారు. మరో వంద మందిని గుర్తించాల్సి ఉంది. హోంక్వారంటైన్లలో ఉన్న వారు 14 రోజులు ముగిసినా, వెంటనే బయటకు రాకూడదని, వైద్యులను సంప్రదించినానంతరం వారు ఇచ్చే సూచనలు, సలహాల మేరకు నడుచుకోవాలని వైద్య వర్గాలు సూచించాయి. -
కేటీఆర్ పర్సనల్ సెక్రెటరీని.. చెప్పిన పని ఏమైంది?
నేరేడ్మెట్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్)గా చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నేరెడ్మెట్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.1.75లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు, సీఎం కార్యాలయం పేరుతో రూపొందించిన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి, గీతానగర్‌కు చెందిన కార్తికేయ చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేసేవాడు. తార్నాక, కార్తికేయనగర్‌కు చెందిన మోకానికల్ ఇంజినీర్ ఫ్రెడరిక్ అతడికి స్నేహిడు. గతంలో పలు ప్రైవేట్ కంపెనీల్లో పని చేసిన కార్తికేయ ప్రభుత్వ అనుమతులు, బిజినెస్ ప్రతిపాదనలు, ప్రాజెక్టు నివేదికలు, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. ఇందులో భాగంగా తరచు తన స్నేహితుడు ఫ్రెడరిక్‌తో సచివాలయానికి వెళ్లి ఉన్నతాధికారులను కలిసేవాడు. ఈ నేపథ్యంలో అతను మంత్రి కేటీఆర్ పేషీలో వ్యక్తిగత కార్యదర్శుల వివరాలు సేకరించాడు. కేటీఆర్ పీఎస్‌గా చెప్పుకుని.. అనంతరం మంత్రి కేటీఆర్ పీఎస్‌గా అవతారమెత్తిన కార్తికేయ పలువురు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్‌గా పరిచయం చేసుకునేవాడు. మంత్రి చెప్పారని అవసరమైన పని చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చేవాడు. ఇందులో భాగంగా మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ మహిళా కాలేజీ ఏఓ శ్రీరాములు రాజుకు ఫోన్ చేసిన అతను మంత్రి స్నేహితుడు కార్తికేయ అనే వ్యక్తి వచ్చి కలుస్తాడని, అతనికి అవసరమైన సహాయం చేయాలని చెప్పాడు. అనంతరం తానే కాలేజీకి వెళ్లి ఏఓను కలిసి తన స్నేహితుడి కుమార్తెకు అడ్మిషన్ ఇప్పించాడు. ఇందుకుగాను వారి నుంచి రూ.90వేలు వసూలు చేశాడు. నకిలీ లెటర్ఆఫ్ క్రెడిట్‌తో.. తన కుమారుడి ఆరోగ్యం క్షిణించడంతో శ్రీరాములు రాజు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం మంత్రి పీఎస్‌గా చెప్పుకున్న కార్తికేయకు ఫోన్ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.2లక్షల ఆర్థిక సహాయం(లెటర్ ఆఫ్ క్రెడిట్) ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం ఫ్రెడరిక్‌తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జారీ అయిన ఎల్ఓసీ పత్రాలను ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసి నకిలీ ఎల్ఓసీ పత్రాలను రూపొందించి శ్రీరాములురాజుకు అందజేశారు. ఈ లెటర్ ఆధారంగా శ్రీరాములురాజు తన కుమారుడిని శ్రీకర్ ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం చేయించాడు. అనంతరం ఆసుపత్రి అధికారులు బిల్లు క్లెయిమ్ చేసే ప్రక్రియలో శ్రీరాములురాజు ఇచ్చిన ఎల్ఓసీ నకిలీదని గుర్తించి అతడికి సమాచారం అందించారు. దీంతో అతను కార్తికేయ, ఫ్రెడరిక్లకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ చేసినట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన శ్రీరాములు రాజు ఈనెల 6న ఘట్కేసర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు విచారణ చేపట్టగా నిందితులు మంత్రి కేటీఆర్ పేరు చెప్పుకుని పలు ప్రభుత్వ, ప్రైవేట్ అధికారులకు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. మోసాల చిట్టా ఇదీ.. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ పేరుతో జీడిమెట్లకు చెందిన సురేష్ నుంచి రూ.లక్ష వసూలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయించినందుకుగాను ముంబైకి చెందిన సమీర్, రాకేష్ నుంచి రూ.7లక్షలు వసూలు చేశారు. పట్టాపాస్ పుస్తకాల జారీ కోసం దుండిగల్ తహసీల్దార్‌కు ఫోన్లు చేసినట్లు వెల్లడైంది. నల్గొండ జిల్లాలోనూ కేసు... నల్గొండ జిల్లా, వేంపల్లి మండలం రావులపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల(బాలికలు) ప్రధానోపాధ్యాయురాలు మానవతా మంగళ ఓపెన్ స్కూల్ సమన్వయకర్తగా పని చేసేది. ఆమె మరో ప్రాంతానికి బదిలీ కావడంతో నిందితులు నకిలీ ఆర్డర్లను తయారు చేసి ఆమె బదిలీని రద్దు చేసి, యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కమిషనర్‌కు సిఫారసు చేశారు. ఈ పత్రాలు నకిలీవని రుజువు కావడంతో నల్గొండ వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. నిందితుడిపై కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పీఎస్‌లో నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. మంత్రి కేటీఆర్ పీఎస్‌గా చెప్పుకుని ఎవరెవరికీ ఫోన్లు చేశారు, ఎంత మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేరాలు అంగీకరించడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ రక్షిత కె.మూర్తి తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ ఏసీపీ నర్సింహ్మారెడ్డి, ఘట్కేసర్ సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్ఓటీ సీఐ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసును త్వరగా చేధించిన ఘట్కేసర్, ఎస్ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు. -
చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి భరోసా
సాక్షి, అమరావతి: కళ్లకు క్యాన్సర్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి హేమ (4) ఉదంతంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ఆయన వెంటనే హేమకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి వైద్యం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన చిన్నారి హేమ వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం తెలిపారు. ఇలాంటి నిరుపేదలను పూర్తి స్థాయిలో ఆదుకోవడానికే ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు తెరతీశామని పేర్కొన్నారు. గతంలోలా కాకుండా క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని విడతలైనా చికిత్స అందించాలన్నారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈలోగా అత్యవసర కేసులు ఉంటే క్యాన్సర్ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సూచించారు. -
సీఎం ఆదేశాలు తక్షణమే అమలు
సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజనార్థం ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి/సీఎం కార్యాలయం (సీఎంవో) పంపించే ఆదేశాలపై ఉత్తర్వుల(జీవో) జారీకి నిర్ధిష్ట గడువు (టైమ్‌లైన్) విధించింది. ముఖ్యమంత్రి/సీఎంవో ఈ–ఆఫీసు రూపంలో పంపించే ఫైలు సంబంధిత శాఖలకు చేరిన తర్వాత నిర్ధిష్ట గడువులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర్వులు జారీ కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం ఆదేశాల తక్షణ అమలే లక్ష్యంగా ఉత్తర్వుల జారీ కోసం బిజినెస్ రూల్స్‌ను సవరించింది. దీనిప్రకారం ముఖ్యమంత్రి/సీఎంవో అధికారులు ఎండార్స్మెంట్ చేసిన ఫైళ్లను ఔట్టుడే, మోస్ట్ ఇమ్మీడియట్ (అత్యంత తక్షణం), ఇమ్మీడియట్ (తక్షణం) అనే విభాగాల్లో ఈ–ఆఫీసు ద్వారా సంబంధిత శాఖల కార్యదర్శులకు పంపుతారు. ఇవి సంబంధిత విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శికి చేరిన తర్వాత ఒక్క రోజులోనే ఉత్తర్వులు జారీ చేయాలి. మోస్ట్ ఇమ్మీడియట్ కేటగిరీ కింద వచ్చిన ఫైళ్లకు సంబంధించిన జీవోలను 5 రోజుల్లో జారీ చేయాలి. ఇమ్మీడియట్ కేటగిరీ కింద వచ్చే ఫైళ్లకు సంబంధించిన జీఓలను 15 రోజుల్లో జారీ చేయాలి. ఇలా నిర్ధిష్ట సమయంలో సంబంధిత శాఖల అధికారులు (ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు) జీఓలు జారీ చేయడంతోపాటు చర్యల నివేదికను కూడా సీఎం/సీఎంఓకు తెలియజేయాలి. ఈ టైమ్‌లైన్ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు జారీచేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ రూల్స్‌లోని సెక్షన్ 4, రూల్ 20కి సవరణలు చేసినట్లు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం జీవో జారీ చేశారు. గడువు ఉల్లంఘిస్తే.. జీఓల జారీలో ఎవరైనా నిర్ధిష్ట గడువు పాటించకుండా ఉల్లంఘిస్తే సీఎం సంబంధిత ఫైలును వెనక్కు తెప్పించుకుని, జాప్యానికి కారణాలు పరిశీలించి, సంబంధిత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తారు. తదుపరి ముఖ్యమంత్రి ఈ జీఓ జారీ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి గానీ, ఇతర ఏ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శికి గానీ అప్పగించవచ్చు. సీఎం అప్పగించిన బాధ్యతల ప్రకారం వారు ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం జీఓ జారీ చేస్తారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తుందని భావించే జీఓలు, అంతర్గత ఆదేశాలు (మెమో) జారీ చేయాలంటే ముందుగా ముఖ్యమంత్రి/ముఖ్య కార్యాలయ అధికారులకు పంపించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
సీఎం కార్యాలయంలో నలుగురికి పదవులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాలయంలో నలుగురికి పదవులు కేటాయిస్తూ జీవో విడుదలైంది. ఈ జీవో మేరకు.. కృష్ణ దువ్వూరు స్పెషల్ సెక్రటరీగా, డాక్టర్ ముక్తపురం హరికృష్ణ స్పెషల్ ఆఫీసర్‌గా, అవినాష్ ఇరగవరపు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, తలసీల రఘురాం సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌గా నియమింపబడ్డారు. -
ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా అజయ్ కల్లం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని కార్యదర్శులకు నేతృత్వం వహిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఇతర సలహాదారులకు ఆయన బాధ్యులుగా ఉంటారని జీవోలో పేర్కొంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పేషీకి 10 మంది సిబ్బందిని సమకూరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఎం, సీఎంవో కనుసన్నల్లో...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా సీఎం చంద్రబాబు, ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తోంది. సీఎం, ఆయన కార్యాలయ ఉన్నతాధికారుల కనుసన్నల్లో నగదు లావాదేవీల్ని నిర్వహిస్తోంది. ఓట్లు రాల్చని బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టేయాలని, కేవలం ఓట్లు రాల్చే పథకాలకోసం నిధులను అందుబాటులో ఉంచాలని స్వయంగా సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ మేరకు రెగ్యులర్ బిల్లులను పెండింగ్‌లో పెట్టాలన్న ఆయన ఆదేశాల్ని ఆర్థిక శాఖ తూచా తప్పక పాటిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రకాలకు చెందిన రూ.25,600 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టేసింది. అదే సమయంలో సీఎంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు సూచించిన వాటికే బిల్లులు చెల్లిస్తోంది. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఒకఉన్నతాధికారి ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో కమీషన్లు సైతం కాజేస్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఓట్లు రాల్చే పథకాలకు ఇచ్చేందుకు వీలుగా అప్పులు తీసుకోవాలని, ఎక్కువ వడ్డీకైనా వెనుకాడవద్దని సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో ఆర్థికశాఖ ప్రభుత్వరంగ సంస్థలన్నింటికీ 9 శాతానికిపైగా అప్పులు తెచ్చుకోవడానికి అనుమతిస్తూ రహస్య జీవోను జారీ చేసింది. అంతా పెండింగ్.. సీఎం ఆదేశాల నేపథ్యంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను నెలల తరబడి చెల్లించకుండా ఆర్థికశాఖ పెండింగ్‌లో పెట్టేసింది. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్రం విడుదల చేసిన నిధులను దారిమళ్లించేసింది. కేంద్రం తనవాటా కింద నిధులను విడుదల చేయగా.. వాటికి రాష్ట్ర వాటాను జమ చేసి ఆయ శాఖలకు విడుదల చేయాల్సిన రాష్ట్ర సర్కారు కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన రూ.మూడు వేల కోట్లను ఇతర వినియోగానికి మళ్లించింది. - ఇటీవల పెద్దఎత్తున వివిధ రంగాల ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు చేశారు. అలా టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడానికి వీలుగా మిగతా రంగాలకు చెందిన బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టేశారు. కోటి రూపాయల బిల్లుకోసం మాజీ ఎమ్మెల్యే నెలరోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా బిల్లును పాస్ చేయకపోవడం దీనికి నిదర్శనం. మరోవైపు మున్సిపాలిటీల్లో రూ.50 లక్షల విలువగల చిన్న చిన్న పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకూ బిల్లులు నిలుపుదల చేశారు. ఆ కాంట్రాక్టర్లు సైతం సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండట్లేదు. - గ్రంథాలయ సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లో నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం లాగేసుకుంది. ఒక్కో జిల్లా గ్రంథాలయ సంస్థల పీడా ఖాతాల్లో ఉన్న రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు గల నిధులను వెనక్కు తీసేసుకుంది. దీంతో గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు 1,000 మందికి వేతనాలు డిసెంబర్ నుంచి రావట్లేదు. అలాగే పదవీ విరమణ చేసిన 1,500 మందికి పెన్షన్ రావట్లేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కోన దేవదాస్ మంగళవారం సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శిని కలసి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు జిల్లా గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న 283 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన వేతనాల్ని 2016 నుంచి ఇవ్వకుండా నిలుపుదల చేశారు. - ఎన్టీఆర్ వైద్యసేవలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 1,600 మందికి సైతం జనవరి నుంచి వేతనాలివ్వకుండా నిలుపుదల చేశారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడేసి నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. - సంక్షేమ గురుకులాల్లో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే ఔట్సోర్సింగ్ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. వారికి ఆరు నెలలనుంచి వేతనాల్ని నిలుపుదల చేశారు. ఇక విద్యాశాఖకు చెందిన ఆహార, రేషన్ బిల్లుల్నీ ప్రభుత్వం నిలిపేసింది. ఔట్‌సోర్సింగ్‌లో వివిధ ప్రభుత్వశాఖలకు వాహనాలను నడుపుతున్న స్వయం ఉపాధి వారికీ చెల్లింపులు ఆపేశారు. - సీఎం సహాయనిధి నుంచి పేదలు, మధ్యతరగతి రోగులకు వైద్యంకోసం మంజూరు చేసే నిధులనూ పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సీఎం లేదా ఆయన కార్యాలయ అధికారులు చెప్పే బిల్లులకే ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతోంది. ఇలా చేయడం వల్ల అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ ఏముంటుందని, ఆయా రంగాలకు కేటాయించిన నిధులను ఇతర రంగాలకివ్వడం అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ను అపహాస్యం చేయడమేనంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఔట్సోర్సింగ్ వారికి తక్షణం వేతనాలివ్వాలి.. అసలే తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలివ్వకుండా రాష్ట్రప్రభుత్వం ఇతర అవసరాలకు నిధులివ్వడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రాష్ట్ర సమాఖ్య తప్పుపట్టింది. సమాఖ్య ప్రతినిధులు వెంకటరామిరెడ్డి, అర్వాపాల్ మాట్లాడుతూ తక్షణం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయాలకు చెందిన నిధుల్ని వారి ఖాతాల్లోంచి ప్రభుత్వం లాగేసుకోవడం దారుణమన్నారు. వారి ఖాతాలకు తిరిగి వారి నిధులను ప్రభుత్వం తక్షణం జమ చేయాలని డిమాండ్ చేశారు. -
రూ.42.79 కోట్లను మళ్లించేసిన మంత్రి
-
యడ్యూరప్ప కార్యాలయానికి తాళం
జయనగర: విధాన సౌధలోని మూడో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయానికి తాళం పడింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విధాన సౌధ మూడవ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయం చేరుకున్నారు. యడ్యూరప్ప పూజలు నిర్వహించి సీఎం సీటులో ఆశీనులయ్యారు. కొన్ని గంటలపాటు అక్కడే గడిపారు. కార్యాలయం ముందు సిద్దరామయ్య బోర్డు తొలగించి యడ్యూరప్ప నామఫలకం కూడా తగిలించారు. అయితే శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం పడింది. బలపరీక్ష నెగ్గేవరకు పాలనాపరమైన ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విధానసౌధ అధికారులు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళంవేశారు. -
సీఎం కార్యాలయానికి రైతు ఫోన్
మహాదేవపూర్ వరంగల్ రూరల్ : రైతు బంధు పథకంలోని చెక్కులు, పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లుతున్నాయి. తండ్రి పేరు, సర్వే నంబర్లు, భూముల వివరాలు సరిగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెక్కులో పేరు తప్పు రావడంతో ఓ రైతు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మçహాదేవపూర్ మండల కేంద్రం శివారులోని సర్వేనంబర్ 101/ఎలో ఆరేందుల సత్యనారాయణకు 3.29 భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి సత్యనారాయణకు బదులు పెద్దింటి చంద్రయ్య పేరుతో చెక్కు వచ్చింది. దీంతో రైతు సత్యనారాయణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశాడు. జిల్లా కలెక్టర్‌ను ఆదేశించి తగిన న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని సత్యనారాయణ తెలిపారు. మీ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని సత్యనారాయణ మొబైల్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మెస్సేజ్ కూడా వచ్చింది. -
కోస్తాంధ్రకు తుపాను తాకిడి
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తీవ్ర వాయుగుండం మూడు రోజుల పాటు ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్రపై ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కార్యాలయం (సీఎంఓ) అధికారులకు సూచించింది. -
రాజ్యాంగేతర శక్తిగా సీఎం కార్యాలయం
పారదర్శకత, బాధ్యత లేకుండా పనిచేస్తోంది ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ - అంతులేని రాజకీయ అధికార కేంద్రంగా మారిపోయింది - సంస్కరణలు చేపట్టాలని చంద్రబాబుకు లేఖ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) రాజ్యాంగేతర శక్తిగా, అంతులేని రాజకీయ అధికార కేంద్రంగా మారిందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. సీఎంఓ ఏమాత్రం పారదర్శకత, బాధ్యత లేకుండా నడుస్తుండటం వల్ల పరిపాలనపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఓ బాధ్యతాయుతంగా పనిచేసేలా పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సమాంతర సచివాలయంగా మారిన సీఎంఓ ఎలాంటి ఫైళ్లు నిర్వహించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అలాంటి కార్యాలయం ఏపీ సీఎంఓ ఒక్కటే ‘‘ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ప్రధానికి సలహాలు ఇచ్చిన, నోట్ రాసిన వారి సంతకాలు ఉంటాయి. గవర్నర్ కార్యాలయంలో గవర్నర్‌కు సలహా ఇచ్చిన వారి సంతకం ఉంటుంది. ఎలాంటి రికార్డులు, బాధ్యత, జవాబుదారీతనం లేకుండా పనిచేస్తున్న ఏకైక కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కటే. పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం లేవనడానికి ఇవే నిదర్శనం’’ అని ఐవైఆర్ కృష్ణారావు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి ఆయన రాసిన లేఖలోని ముఖ్యమైన అంశాలు... ‘‘ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, అదనపు కార్యదర్శి ఉన్నారు. అందరూ ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు తీసుకుంటున్నారు. అందువల్ల వారు నిర్వర్తించే విధులన్నీ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అయితే, ప్రస్తుతం సీఎంఓ అధికారులు రికార్డులు నిర్వహించకుండా తమకు అనుకూలంగా కొన్ని అనధికారిక నోట్స్ నిర్వహిస్తూ పనులు పూర్తికాగానే వాటిని చించివేస్తున్నారు. దీన్నిబట్టి సీఎంఓ ఎలాంటి మాన్యువల్స్ (రికార్డులు) నిర్వహించడం లేదని, జవాబుదారీతనంతో పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. ప్రజా ప్రయోజనాలకు విఘాతం ఎలాంటి నియంత్రణ లేని ఈ తరహా సీఎంఓ పనితీరు వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. సచివాలయంలో కార్యదర్శులు, ఇతర అధికారుల్లాగే సీఎంఓ అధికారులు కూడా సర్వీస్ రూల్స్ ప్రకారం రికార్డులు నిర్వహించాలి. సీఎంఓ అధికారులు ఏయే ఫైళ్లు తెప్పించుకున్నారు? ముఖ్యమంత్రికి ఏయే సలహాలు ఇచ్చారు? ఏయే విభాగాలకు ఏమేం రాసి పంపించారు? అనే వివరాలను భద్రపరిచే విధానం ఉంటే ఫైళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ జవాబుదారీతనం లేకపోవడం వల్లే సీఎంఓ అధికారులు రాజ్యాంగేతర శక్తులుగా మారి ప్రోటోకాల్‌ను కాలరాస్తున్నారు. ఉన్నతాధికారులను పక్కన పెట్టి కిందిస్థాయి వారి నుంచి నేరుగా తమకు కావాల్సిన రీతిలో ఫైళ్లు తెప్పించుకుంటున్నారు. తమ సంతకాలు లేనందున భవిష్యత్తులో వివాదాల్లో ఇరుక్కోమనే ధైర్యంతో సీఎంఓ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పుటప్ కోసమే అయితే సెక్షన్ ఆఫీసర్లు చాలు ముఖ్యమంత్రి పరిశీలన కోసం ఫైల్ పంపండి (పుటప్ ఫైల్) అని రాయడానికే సీఎంఓ అధికారులు ఉన్నట్లయితే ఇందుకు ఐఏఎస్ అధికారులు అవసరం లేదు. ఎలాంటి బాధ్యత, జవాబుదారీతనం లేకుండా కేవలం ఫైల్ పుటప్ అని రాసి విభాగాలకు పంపించడం ద్వారా సీఎంకు సహాయపడటానికే అయితే సెక్షన్ ఆఫీసర్లు సరిపోతారు. సీఎంఓలో తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. సీఎంఓ పారదర్శకంగా పనిచేసేలా, ప్రతి రికార్డునూ భద్రపరిచేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సంస్కరణలు అమల్లోకి తీసుకురావాలి. నా లేఖపై తీసుకున్న చర్యలను నాకు తెలియజేయాలి’’ అని సీఎంకు రాసిన లేఖలో ఐవైఆర్ పేర్కొన్నారు. -
జాగ్రత్త పడకపోతే మునిగిపోతాం
సాక్షి, అమరావతి: పార్టీలో కార్యకర్తలు, నాయకుల మధ్య అంతరం పెరిగిపోతోందని, ఈ సమస్యను అధిగమించకపోతే నిట్టనిలువునా ముగినిపోతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని, సంతృప్తస్థాయి ఎక్కువగా ఉందని చెప్పారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఉండాల్సిన సత్సంబంధాలు ప్రస్తుతం లేవని, వారి మధ్య అంతరం పెరుగుతోందని, ఇది మరింత పెరిగితే పార్టీకి ప్రమాదమని చెప్పారు.బాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ, మంత్రివర్గ సమావేశం గురువారం వెలగపూడిలోని సచివాలయంలోని సీఎం కార్యాలయంలో తొలిసారి జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్న వారు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి... హా ‘రాష్ట్రంలోని 21 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగా లేదు. ఇపుడు నియోజకవర్గ ఇన్ఛార్జిలుగా ఉన్న వారు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారు వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులుగా ఉంటామని భావించవద్దు. సర్వేల్లో నేతల పట్ల సానుకూలత లేదంటే మార్పులు ఖాయం.’ అని బాబు చెప్పారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే అసంతృప్తితో ప్రజలున్నారు. ఇపుడు పెద్ద నోట్ల రద్దు, బంగారం నిల్వలపై ఆంక్షల వల్ల అది మరింత పెరుగుతోంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయాల్లో మన పాత్ర ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు విశ్వసించటం లేదు. ఆ పార్టీతో పొత్తు వల్ల వారు తీసుకునే నిర్ణయాల ప్రభావం మనపై పడుతోంది. బంగారంపై కేంద్రం పెట్టే ఏ షరతైనా మహిళల్లో వ్యతిరేకత పెంచుతుంది. తాజా గా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ గా మీరే ఉన్నారు. బంగారం నిల్వలపై ఆంక్షలు వాపసు తీసుకునేలా చూడండి’ అని నేతలు బాబుకు సూచించారు. ఆయన కేంద్ర మంత్రి వెంకయ్య తో మాట్లాడారు. ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నాయని, తాము కూడా ఓ వివరణ ఇస్తామని వెంకయ్య చెప్పినట్లు సమాచారం. నగదు కోసం ఎదురు చూడకండి నగదు రహిత లావాదేవీల అధ్యయన కమిటీ కన్వీనర్‌గా ఉన్న సీఎం చంద్రబాబు గురువారం కమిటీ సభ్యులు, బ్యాంకు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స జరిపారు. భౌతిక నగదుకోసం ఎదురు చూడకుండా ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లాలని ప్రజలకు సూచించారు. -
తరలింపు ఆగస్టుకు పూర్తి
జూన్, ఆగస్టు నెలాఖరుల్లో వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగుల అంగీకారం ♦ తొలుత శాఖాధిపతుల కార్యాలయ సిబ్బంది 1,400 మంది తరలింపు ♦ సచివాలయానికి అన్ని సౌకర్యాలతో 3.5 లక్షల చ. అడుగుల వసతి ♦ ముఖ్యమంత్రి కార్యాలయానికి 50 వేల చదరపు అడుగులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆగస్టు నెలాఖరుకు వెలగపూడికి తరలిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ నెలాఖరు, ఆగస్టు నెలాఖరుకు రెండు విడతలుగా వెలగపూడికి వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అంగీకరించిందని పేర్కొంది. తొలి దశలో శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచే సే ఉద్యోగుల్లో 1,400 మందిని మాత్రమే రాజధానికి తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులోనే సచివాలయంతో పాటు అసెంబ్లీ, శాసనమండలి, శాఖాధిపతుల కార్యాలయాలకు వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయానికి అన్ని సౌకర్యాలతో కలిపి 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం అవుతుందని అంచనాకు వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి 50 వేల చదరపు అడుగుల వసతి కావాలని తేల్చారు. వెలగపూడిలో ప్రస్తుతం ఆరు భవనాల కాంప్లెక్స్‌ల నిర్మాణం కొనసాగుతోంది. వీటిలో రెండేసి అంతస్తుల చొప్పున ఒక్కో అంతస్తుకు 50 వేల చదరపు అడుగులతో అన్ని సదుపాయాలతో ఆరు లక్షల చదరపు అడుగులు జూన్ నెలాఖరుకు పూర్తవుతాయని సీఎస్ సమీక్షలో నిర్ధారణకు వచ్చారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు వేర్వేరుగా... శాఖాధిపతుల కార్యాలయాలను, సచివాలయ కార్యాలయాలను ఒకే బ్లాకులో ఉంచవద్దని, సెక్యూరిటీ పరంగా సమస్యలు వస్తాయని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తొలుత నిర్మాణంలో ఉన్న 1 నుంచి 3 భవనాల్లోని రెండేసి అంతస్తుల్లో సచివాలయ కార్యాలయాలకు కేటాయిస్తారు. అనంతరం ఈ బ్లాకుల్లోనే మరో రెండు, మూడు అంతస్తుల నిర్మాణం చేపట్టిన తరువాత సచివాలయ కార్యాలయాలను 1, 2 బ్లాకుల్లోని మొత్తం అంతస్తుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మూడో బ్లాకును పూర్తిగా శాఖాధిపతుల కార్యాలయాలకు కేటాయిస్తారు. ఆరో బ్లాకులో కింద రెండు అంతస్తులను అసెంబ్లీ, మండలికి కేటాయించినప్పటికీ పైన నిర్మించే మూడు నుంచి ఐదో అంతస్తు వరకు శాఖాధిపతులకు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తం శాఖాధిపతుల కార్యాలయాలకు తొమ్మిది లక్షల చదరపు అడుగులు అవసరమని తేల్చారు. అయితే వెలగపూడిలో నిర్మించే భవనాల్లో సచివాలయం, అసెంబ్లీ, మండలి, సీఎం కార్యాలయం పోను శాఖాధిపతులకు ఏడు లక్షల చదరపు అడుగుల వసతి మాత్రమే అందుబాటులో ఉంటుం దని అంచనా వేశారు. అంటే మరో రెండు లక్షల చదరపు అడుగుల వసతిని శాఖాధిపతులు బయట చూసుకోవాల్సి ఉంటుందని నిర్ణయించారు. వాణిజ్య పన్నులు, రహదారులు, రాష్ట్ర ఆడిట్, వర్క్స్ అండ్ అకౌంట్స్, భాషా సాంస్కృతిక, కార్మిక సంక్షేమ విభాగాలు ఇప్పటికే బయట వసతిని సమకూర్చుకున్నాయి. -
విజయవాడలో టీడీపీపీ నేతల భేటీ
విజయవాడ : నగరంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కార్యాలయంలో ఆదివారం టీడీపీపీ నేతలు భేటీ అయ్యారు. పార్లమెంట్లో బడ్జెట్ అంశంపై వ్యవహరించాల్సిన తీరుపై ఈ సందర్భంగా వారు చర్చిస్తున్నారు. అలాగే ఏపీ లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంపై టీడీపీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సభకు తెలిసేలా ఈ సమావేశాల్లో వ్యవహారించాలని వారు భావిస్తున్నారు. అలాగే కొత్త ప్రాజెక్టుల సాధనకు కలసికట్టుగా కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాటం సాగించాలని టీడీపీపీ నేతలు ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ భేటీకి రాష్ట్రంలోని టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. -
టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది?
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటో వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అమలు చేయడం లేదంటూ న్యాయవాది జె.కె.రాజు 2013లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సంబంధిత అంశాల్లో నిజానిజాలను తేల్చాలంటూ ఒక పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యయనం జరిపి మౌలిక సదుపాయాలు లేని మాట వాస్తవమేనని, అయితే అంతకంటే ముందు పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరని సుప్రీంకోర్టుకు నివే దించింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేకపోతే ఎలా అంటూ సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలను గత అక్టోబర్‌లో ప్రశ్నించింది. వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. టీచర్ల భర్తీ తీరుతెన్నులపై అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. తాజాగా సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణలో టీచర్ల భర్తీని జూన్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది పాల్వాయి వెంకటరెడ్డి కోర్టుకు విన్నవించారు. భర్తీకి తీసుకున్న చర్యలేంటో సమగ్ర నివేదికతో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, ఫలితాలు కూడా వెలువడ్డాయని, మరికొన్ని పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆ రాష్ట్రం తరపున హాజరైన న్యాయవాది గుంటూరు ప్రభాకర్ విన్నవించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 14కు వాయిదా వేసింది. జవాబుదారీతనం ఎక్కడ? ఇదే కేసులో తమ వాదనలు కూడా వినాలంటూ తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఫెడరేషన్ అధ్యక్షుడు జె.సాగర్‌రావు తరపున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో 28,707 ప్రభుత్వ పాఠశాలల్లో 1,11,877 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించేందుకు వీల్లేదు. కానీ ఉపాధ్యాయులు శాసన సభ్యులకు వ్యక్తిగత సహాయకులుగా, ప్రత్యేక విధులు నిర్వర్తించే అధికారులు(ఓఎస్డీ)గా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యాయులు సీఎం కార్యాలయంలో, మంత్రుల కార్యాలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యాయుల వేతనాలపై నెలకు రూ.558.29 కోట్లు వెచ్చిస్తోంది. ఉపాధ్యాయుల వేతనాలు రూ.26 వేల నుంచి రూ.1.10 లక్షల వరకూ ఉన్నాయి. సగటున ఒక్కో ఉపాధ్యాయుడిపై రూ.50 వేలు ఖర్చు చేస్తోంది. 90 శాతం ఉపాధ్యాయులు తమకు కేటాయించిన గ్రామాల్లో నివాసం ఉండడం లేదు. అందువల్ల పాఠశాలలు సక్రమంగా నడవడం లేదు. యూనియన్ నేతలు ఆన్ డ్యూటీ పేరుతో వేతనాలు అందుకుంటున్నారు. కానీ తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా జవాబుదారీతనం లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవడం లేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. మరోవైపు ఫీజుల భారం భరించలేక రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో జవాబుదారీతనం ఉండేలా చూడాలి’’ అని పిటిషన్లో విన్నవించారు. -
సీఎంఆర్ఎఫ్ లేఖ ఫోర్జరీ
వరంగల్ జిల్లాలో బయటపడ్డ మోసం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి సీఎం సంతకంతో జారీ చేసే సహాయ మంజూరు పత్రం ఫోర్జరీకి గురైన ఉదంతం బయటపడింది. వరంగల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లుగా అందిన దరఖాస్తుకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఇటీవల రూ. లక్ష ఆర్థికసాయం మంజూరవగా దరఖాస్తుదారు దాన్ని రూ.4 లక్షలుగా మార్చి ఆస్పత్రికి సమర్పిం చాడు. ఆ లేఖ ఆధారంగా ఆస్పత్రి యాజమాన్యం కొద్ది రోజుల తర్వాత సీఎం ఆర్‌ఎఫ్‌ను సంప్రదించగా అధికారులు అది ఫోర్జరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై సీఎం కార్యాలయం ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు ఈ తరహా మోసం జరగటం ఇదే మొదటిసారా లేక ఇప్పటికే మరిన్ని నిధులు పక్కదారి పట్టాయా? అనే దానిపై సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నారు. బోగస్ బిల్లులు, తప్పుడు క్లెయిమ్‌లతో జరిగిన అక్రమాలపై ఇప్పటికే సీఎం కార్యాలయం సీఐడీతో దర్యాప్తు చేయించగా 2014 జూన్ 2 నుంచి సీఎంఆర్ఎఫ్కు వచ్చిన 9,200 దరఖాస్తుల్లో 68 కేసుల్లో బోగస్ బిల్లులున్నట్లు తేలింది. దాదాపు రూ. 36 లక్షలకుపైగా నిధులు పక్కదారి పట్టినట్లు గుర్తించింది. అప్పట్నుంచీ సీఎంఆర్ఎఫ్ చెల్లింపులపై సర్కారు మరింత అప్రమత్తమైంది. -
సెక్రటేరియట్లో పెయింటర్‌కి గాయాలు
-
సెక్రటేరియట్లో పెయింటర్‌కి గాయాలు
హైదరాబాద్: సెక్రటేరియట్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ఉన్న ఎల్ బ్లాక్‌లో జరుగుతున్న మరమ్మతుల్లో గురువారం చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్‌లో రంగులు వేస్తున్న పెయింటర్ ముఖేశ్ ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి సెక్రటేరియట్‌లోని వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం ముఖేశ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. -
8 మంది డీసీలకు త్వరలో పోస్టింగ్‌లు
సీఎం ఆఫీస్‌లో ఫైల్ పెండింగ్ సాక్షి, హైదరాబాద్: వాణిజ్యపన్నుల శాఖలో ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ శాఖలో రాష్ట్రస్థాయి కేడర్‌లో పనిచేస్తున్న అధికారుల విభజన ప్రక్రియ ఇటీవల దాదాపుగా పూర్తయింది. ఏపీకి చెందిన 35 మంది అధికారులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, సీటీవోల భర్తీ ప్రక్రియ వేగం అందుకుంది. ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను వివిధ డివిజన్లలో భర్తీ చేసేందుకు కమిషనర్ వి. అనిల్ కుమార్ ఫైలు తయారు చేసి ఇటీవలే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపించారు. ఈ మేరకు ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఫైలుపై సంతకాలు చేస్తే ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిప్యూటీ కమిషనర్లుగా ఆదిలాబాద్‌కు ఆనంద్ రావు, కరీంనగర్ కు ద్వారకానాథ్ రెడ్డి, హైదరాబాద్ రూరల్- కాశీ విశ్వనాథ్ రెడ్డి, పంజాగుట్ట- లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్- కె. హరిత, బేగంపేట- సాయి కిషోర్, వరంగల్ - లావణ్య, నల్లగొండ- గీతలను నియమించనున్నారు. వీరి భర్తీ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అసిస్టెంట్ కమిషనర్ల ఖాళీలను భర్తీ చేస్తారు. వీటితో సీటీవోల భర్తీకి డీపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. పదోన్నతుల కోసం ఏర్పాటు చేసే ఈ కమిటీ సీనియారిటీ ఆధారంగా సీటీవోలకు అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తుంది. అలాగే డీసీటీవోలు సీనియారిటీ ఆధారంగా సీటీవోలు కానున్నారు. దీనికి సంబంధించి కమిషనర్ స్థాయిలో కసర త్తు సాగుతున్నా, వివిధ కారణాల వల్ల ఓ కొలిక్కి రాలేదు. డీసీల నియామకం పూర్తయిన వెంటనే ఈ ఫైలు కూడా కదులుతుందని ఓ అధికారి తెలిపారు. -
'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి'
-
'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కార్యాలయం పేర్కొంది. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సాయంత్రంలోగా విధుల్లోకి హాజరుకావాలని వెల్లడించింది. కాంట్రాక్టు కార్మికులు మొండిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని గతంలోనే హామీ ఇచ్చినట్టుఏ సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొంతమంది కార్మిక సంఘాల నేతల ఉచ్చులో పడి సమ్మెకు దిగారని పేర్కొంది. రంజాన్, బోనాలు సమీపిస్తున్న సమయంలో కార్మికులు సమ్మెకు దిగడం సరికాదని తెలియజేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్మీని, పోలీసులను రంగంలోకి దింపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సీఎం కార్యాలయం వెల్లడించింది. -
ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్ష!
⇒ పారదర్శకత కోసం టీఎస్ పీఎస్సీ యత్నం ⇒ అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరిస్తున్న సీఎం కార్యాలయం సాక్షి ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న దాదాపు 2 వేల వరకు అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) వంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్ష విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ విధానం అమలుపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏఈ, ఏఈఈ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండే అవకాశం ఉన్నందున ఆన్లైన్ పరీక్ష విధానం ప్రవేశ పెడితే బాగుంటుందన్న యోచన చేస్తున్నట్లు తెలిసింది. వివిధ పోటీ పరీక్షల నిర్వహణ విధానాలపై ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ), ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పరీక్ష విధానాలపై అధ్యయనం చేసిన టీఎస్ పీఎస్సీ.. ఐఐటీ వంటి పరీక్షల్లో అనుసరిస్తున్న ఆన్లైన్ పరీక్ష విధానంపైనా అధ్యయనం చేసింది. దీంతో ఆన్లైన్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే బాగుంటుందని, పారదర్శకతతో పాటు అభ్యర్థికి త్వరగా ఫలితాలు ఇవ్వడం సాధ్యం అవుతుందని భావిస్తోంది. ఒకవేళ ఆన్లైన్ విధానం అమలు సాధ్యం కాకపోతే రాత పరీక్షల (ఆఫ్‌లైన్)ను నిర్వహించే వీలుంది. మరోవైపు ఇతర పరీక్షలతో పాటు, డిస్క్రిప్టివ్ విధానం ఉండే పోటీ పరీక్షల్లో మాత్రం ఆన్లైన్ విధానం కాకుండా రాత పరీక్ష విధానాన్నే అనుసరించనుంది. వారం రోజుల్లో అనుమతులు.. పోటీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వివిధ అనుమతులు రావాల్సి ఉంది. మంగళవారం సీఎం కేసీఆర్ ప్రకటనతో అనుమతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం (సెల్) ఇప్పటికే శాఖల నుంచి ఖాళీల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించే పనిలో పడింది. మరోవైపు అనుమతులపై కూడా దృష్టి పెట్టింది. పోటీ పరీక్షల విధానం (స్కీం), పోటీ పరీక్షల్లో పెట్టాల్సిన సిలబస్, 371(డి) కొనసాగింపు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తుందా? కొత్త రోస్టర్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెడుతుందా? అన్న విషయంలో స్పష్టత, గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు పెంపు వంటి అంశాలపై ఉత్తర్వులు అన్నీ వారం రోజుల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో వెనువెంటనే నోటిఫికేషన్లను టీఎస్ పీఎస్సీ ద్వారా జారీ చేయించే అవకాశం ఉంది. వన్ టైం రిజిస్ట్రేషన్‌కు భారీ స్పందన... టీఎస్ పీఎస్సీ ప్రవేశపెట్టిన వన్ టైం రిజిస్ట్రేషన్‌కు భారీ స్పందన లభిస్తోంది. మే చివరి నాటికి 80 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన మంగళవారం నాడు అనేక మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ల సమాచారం ఎస్ఎంఎస్ల్లో అభ్యర్థి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతని విద్యార్హతలను బట్టి ఫలానా నోటిఫికేషన్ జారీ అయిందన్న సమాచారం అభ్యర్థికి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. అంతేకాకుండా ఈ-మెయిల్ ద్వారా కూడా ఈ సమాచారం వస్తుంది. దీంతో అభ్యర్థి పరీక్ష ఫీజు చెల్లిస్తే చాలు. మళ్లీ మళ్లీ దరఖాస్తు ఫారాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. -
సీఎం ఆఫీసు ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
విధుల నుంచి తొలగించారని విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగి మనస్తాపం సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని సీఎం కార్యాలయం (సమతాబ్లాక్) ఎదుట శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో చండూరి చంద్రశేఖర్ అనే విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని సమీపంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ వెంట వచ్చిన అతని మిత్రుడు సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో చంద్రశేఖర్, సతీష్‌లు 2012 నుంచి 2014 డిసెంబర్ వరకు ఔట్సోర్సింగ్ కింద షిప్ట్ ఆపరేటర్లుగా పనిచేశారు. తర్వాత ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ స్థానంలో కొత్త కాంట్రాక్టర్ ను నియమించగా అతను వీళ్ల స్థానంలోకి వేరే వారిని నియమించాడు. ఈ విషయమై స్థానిక డీఈని కలవగా తనకు సంబంధం లేదని, కాంట్రాక్టర్‌ను కలవాలని సూచించాడు. ఇదే విషయాన్ని సీఎంకు చెప్పుకోవడానికి సచివాలయానికి వచ్చామని, చంద్రశేఖర్ పురుగుల మందు తెచ్చుకున్న సంగతి తనకు తెలియదని సతీష్ చెప్పాడు. కాగా, ఇది పెద్ద డ్రామా అని, చంద్రశేఖర్ ముందుగానే బాటిల్లో మందుకు బదులు నీళ్లు కలుపుకొని వచ్చాడని, అది తాగకుండా మీద పోసుకున్నాడని పోలీసులు చెప్పారు. -
ఎర్రగడ్డకు సచివాలయం?
వేగంగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ టీబీ ఆసుపత్రిని అనంతగిరికి తరలిస్తూ ఉత్తర్వులు ⇒ ఖాళీ అయిన స్థలంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి యోచన ⇒ నిర్మాణ డిజైన్లపై అధికారులతో సీఎం సమీక్ష ⇒ ఎనిమిది బ్లాక్‌లతో అధునాతన భవనాలు నిర్మించాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం నెరవేరుతుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ క్షయ (టీబీ), ఛాతీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి క్షయ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం రూ.7.70 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇదేరోజున సచివాలయం తరలింపుపై ఆర్అండ్బీ అధికారులతో సీఎం సమీక్ష జరపటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రస్తుత సచివాలయం దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఎర్రగడ్డ టీబీ ఆసుపత్రి 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయ సముదాయాన్ని ఎర్రగడ్డలో ఖాళీ చేయనున్న టీబీ ఆసుపత్రికి తరలించేందుకు గల సాధ్యాసాధ్యాలను ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎలా ఉండాలి.. అందులో ఎన్ని బ్లాక్‌లుండాలి.. ఎన్ని అంతస్తులుండాలి అనే వివరాలను సైతం సీఎం చర్చించినట్లు సమాచారం. సీఎం ఆఫీసుకు ప్రత్యేక బ్లాక్... తాజా ప్రతిపాదనల ప్రకారం కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయిస్తారు. ఏడు నుంచి ఎనిమిది అంతస్థుల భవనంలో సీఎం బ్లాక్ ఉంటుంది. మంత్రులకు సంబంధించి ఆరు నుంచి ఎనిమిది బ్లాక్‌లు నిర్మిస్తారు. ఒక్కో మంత్రికి రెండు అంతస్థులు కేటాయించాలనేది ప్రతిపాదన. మంత్రి కార్యాలయంతో పాటు ఆ విభాగపు కార్యదర్శి, ఉన్నతాధికారులు, విభాగపు సిబ్బంది అందులో ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మంది మంత్రులున్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మంత్రుల సంఖ్య దాదాపు 22 వరకు పెరగనుంది. వీరికి తోడు ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి రెండు అంతస్తుల చొప్పున మొత్తం 56 అంతస్తులు నిర్మించాల్సి ఉంటుంది. అందుకే ఏడు లేదా ఎనిమిది బ్లాక్‌లుగా బహుళ అంతస్తుల సముదాయం నిర్మించాలనేది తాజా ప్రతిపాదన. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను 1888లో ఆరో నిజాం కాలంలో నిర్మించారు. సైఫాబాద్ ప్యాలెస్‌గా అప్పట్లో ప్రసిద్ధి పొందిన ఈ భవనాలను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునర్నిర్మించారు. ఈ ప్రాంతం ‘హార్ట్ ఆఫ్ ది ట్విన్ సిటీస్’గా పేరొందిన నేపథ్యంలో ఇది అత్యంత ఖరీదైన స్థలం అనడంలో సందేహం లేదు. తొలి బడ్జెట్లోనే భూముల అమ్మకం ద్వారా దాదాపు రూ.6500 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలి ప్రయత్నంగా సెక్రటేరియట్‌ను తరలించేందుకు పావులు కదుపుతోంది. బఫర్ జోన్ ఆంక్షల నేపథ్యంలో... హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించి.. గ్రేటర్ సిటీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెరువులు, కుంటల చుట్టూ బఫర్ జోన్లో పక్కా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. హుస్సేన్‌సాగర్ చుట్టూ నిర్మాణాలకు సైతం ఇవే ఆంక్షలు వర్తించనున్నాయి. అందుకే బఫర్ జోన్‌కు అవతల ఉన్న సచివాలయ స్థలాలను విక్రయిస్తే, అక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
సాక్షి కథనంపై సీఎం కేసీఆర్ స్పందన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైళ్ల పెండింగ్ అంశానికి సంబంధించి సాక్షి కథనంపై సీఎం కే చంద్రశేఖర రావు స్పందించారు. ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడం కోసం సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు శాఖలను కేటాయించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావుకు సాధారణపరిపాలన, హోం, ఫైనాన్స్.. స్పెషల్ సెక్రటరీ రాజశేఖరరెడ్డికి ఆరోగ్యం, విద్య, రవాణా, సీఎం రిలీఫ్‌ఫండ్, న్యాయశాఖ.. స్మితా సభర్వాల్‌కు హరితహారం, అటవీశాఖ, స్త్రీ శిశు సంక్షేమం, గృహనిర్మాణశాఖ.. భూపాల్‌రెడ్డికి అన్ని సంక్షేమశాఖలు, దేవాదాయశాఖ, పౌరసరఫరాలు, కార్మికశాఖ కేటాయించారు. సాక్షి దినపత్రికలో 'కదలని ఫైలు!' అనే శీర్షికతో సోమవారం వార్త ప్రచురితమైంది. తెలంగాణ సీఎం వద్ద ఫైళ్లు భారీగా పేరుకుపోయాయని, దాదాపు వెయ్యి వరకు ఉన్నాయని వార్తలో వెల్లడించారు. ఈ కథనానికి కేసీఆర్ స్పందించి ఫైళ్ల పరిష్కార బాధ్యతలను అధికారులకు అప్పగించారు. -
బేగంపేట కార్యాలయమే బెటర్
-
బేగంపేట కార్యాలయమే బెటర్
క్యాంప్ ఆఫీస్‌పై మనసు మార్చుకున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: బేగంపేటలో ఉన్న పాత క్యాంప్ కార్యాలయంవైపే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొగ్గు చూపుతున్నారు. ఈ భవనానికి వాస్తుదోషాలు ఉన్నాయని వ్యక్తిగత వాస్తు పండితులు చెప్పడంతో ఇక్కడ ఉండటానికి మొదట్లో ఆయన నిరాకరించారు. దీంతో కుందన్‌బాగ్‌లోని మూడు క్వార్టర్లను కలిపి సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆ క్వార్టర్లలో అప్పటిదాకా ఉన్న ఉన్నతాధికారులను ఆఘమేఘాల మీద ఖాళీ చేయించారు. క్వార్టర్లకు మరమ్మత్తులు కూడా ప్రారంభించారు. అయితే తాజాగా వీటిని పరిశీలించిన సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సందుగొందుల్లో ఉన్న ఆ క్వార్టర్లలో ఎలా ఉంటామంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వెళ్లి బేగంపేటలోని పాత క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. ఇదే బాగుందని అభిప్రాయపడ్డారు. ముందు భాగంలో చిన్న చిన్న వాస్తు లోపాలున్నా.. నివాస ప్రాంతమంతా బాగానే ఉందని అధికారులకు కేసీఆర్ చెప్పారు. బేగంపేట క్యాంపు కార్యాలయానికే మారుతాన న్నారు. అక్కడ కొన్ని మార్పులను సూచించి, వెంటనే పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ మంగళవారం ఆదేశించారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలోని పోచమ్మ గుడిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్న ఆయన నేరుగా అక్కడి గుడికి వెళ్లి పూజలు చేశారు. -
కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఆరుగురి పేర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూయేతర కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఆరుగురి పేర్లను ఖరారు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ జాబితాలో ఎన్.సత్యనారాయణ, సి.శ్రీధర్, ఇంతియాజ్, ఎస్.కోటేశ్వరరావు, అరవింద్‌సింగ్, ఎం.ప్రశాంతి ఉన్నారు. మొత్తం ఆరు రెవెన్యూయేతర పోస్టులకుగాను రాష్ట్రం నుంచి మొత్తం 30 మందికిపైగా అధికారులు పోటీపడ్డారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డిసహా పలువురు మంత్రుల పేషీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు కన్ఫర్డ్ ఐఏఎస్కోసం పోటీ పడినవారిలో ఉన్నారు. సీఎం కార్యాలయంలో సీఎమ్మార్‌ఎఫ్ విభాగంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సురేందర్ తరపున కిరణ్‌కుమార్‌రెడ్డి, రవాణా శాఖలో పనిచేస్తున్న కృష్ణమూర్తి తరపున బొత్స, రెవెన్యూ మంత్రి పేషీలో ఓఎస్డీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తరపున రఘువీరారెడ్డి సిఫారసు చేసినా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పట్టించుకోలేదు. పైన పేర్కొన్న ఆరుగురి పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ పంపిన జాబితాకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ జాబితాలో గవర్నర్ కార్యాలయంలో పనిచేస్తున్న కోటేశ్వరరావుకు చోటు దక్కడం గమనార్హం. -
నగదుకు టీచర్ల బదిలీ!
* సీఎంఓలో పైరవీల జోరు! * పరీక్షల ముందు... నిబంధనలకు విరుద్ధంగా... * గత నెలలో వంద, తాజాగా మరో 366 మందికి ఆర్డర్లు?.. ఫైళ్లపై నేడో రేపో సీఎం సంతకం * చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికం సాక్షి, హైదరాబాద్: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి పైరవీల చెద పట్టింది.దొడ్డిదారిన బదిలీలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెరతీశారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఇప్పుడు టీచర్ల బదిలీల్లో పైరవీలకే ఆయన మొగ్గుచూపుతున్నారు. పరీక్షల ముందు బదిలీలు చేయడం నిబంధనలకు పూర్తి విరుద్ధమైనా అవేవీ పట్టించుకునే స్థితిలో ఆయన లేరు. పైరవీకారుల ఒత్తిడికి ముఖ్యమంత్రి లొంగిపోయారని సచివాలయ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక్కొక్క బదిలీ వెనుక రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పైరవీకారులు వసూలు చేసినట్టు సమాచారం. దొడ్డిదారిన బదిలీలకు సంబంధించిన ఫైళ్లు అడ్డగోలుగా సిద్దమయ్యాయి. గత నెలలో కూడా ఇదేరకంగా వందమంది టీచర్లను బదిలీ చేశారు. ఇప్పుడు మరో 366 మంది టీచర్ల బదిలీలకు ఫైళ్లు సిద్ధమై ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. నేడో రేపో ముఖ్యమంత్రి సంతకాలు చేస్తారని, ఇందులో జాప్యం జరగదని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ బదిలీల్లో సింహభాగం ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు, ఆర్థిక మంత్రి సొంత జిల్లా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విద్యా మంత్రి సొంత జిల్లా కృష్ణాల్లోనే ఉండడం గమనార్హం. ఈ బదిలీలకు ఫైళ్లు తయారీ కూడా ఒక పద్ధతి లేకుండా కేవలం కాగితంపై దరఖాస్తు చేసుకుంటేనే జరిగిపోతున్నాయి.అసలు విద్యా సంవత్సరం మధ్యలో టీచర్ల బదిలీలకు గతంలో ఏ ముఖ్యమంత్రులు అంగీకరించలేదు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో ఒకటో రెండో తప్ప ఇంత పెద్దఎత్తున బదిలీలు అనుమతించలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా పాఠశాల వేసవి సెలవుల్లో బదిలీలపై నిషేధం సడలించిన సమయంలో కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే టీచర్ల బదిలీలను చేపడతారు. ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా మరో మూడు నెలల్లో పరీక్షలుండగా, పైరవీ కారులు అడిగిందే తడవుగా బదిలీలకు సీఎం, మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బదిలీకి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత జిల్లా విద్యా అధికారి నుంచి అక్కడ ఖాళీ ఉందా లేదా అనే రిమార్క్‌ను కోరతారు. అందుకు అనుగుణంగా విద్యా శాఖ డెరైక్టరేట్ నుంచి ఫైలు తయారై విద్యా శాఖ కార్యదర్శికి వస్తుంది. అక్కడి నుంచి విద్యా శాఖ మంత్రికి ఆ తరువాత ఆర్థిక కార్యదర్శి, అనంతరం ఆర్థిక మంత్రి, ఆఖరుగా ముఖ్యమంత్రికి ఫైలు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు సిద్ధమైన 366 టీచర్ల బదిలీలకు ఇలాంటి నిబంధనలేమీ పాటించకుండానే సీఎం, మంత్రుల ఫేషీల్లో బదిలీల జాబితాలను సిద్ధం చేసి, విద్యా, ఆర్థిక మంత్రుల ఆమోదంతో ముఖమంత్రి ఆమోదానికి ఫైళ్లు పంపించేశారు. ఈ తంతు చూసి సచివాలయ అధికారులు విస్మయ్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఒక లక్ష..ఒక సిఫార్సు!
సాక్షి, హైదరాబాద్: కోరుకున్న చోటికి బదిలీ కావాలా? సాధారణ బదిలీకి అర్హత లేకున్నా, నిషేధం అమల్లో ఉన్నా సరే!? అందుబాటును బట్టి, అవసరాన్ని బట్టి రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఇవ్వగలిగితే చాలు..!? మీ ప్రాంతంలోని ప్రజాప్రతినిధితోనో, మంత్రితోనో సిఫార్సు చేయించుకోగలిగితే చాలు! మీకు కావలసిన చోటుకు వెళ్లిపోవచ్చు!? రాష్ట్రంలో దొడ్డిదారిన జరుగుతున్న అడ్డగోలు బదిలీల వ్యవహారమిది.. సాక్షాత్తూ సీఎం కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలతో మొదలైన ఈ వ్యవహారం.. మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోల బదిలీల వరకూ వస్తోంది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లో ఉన్నా, ఆ ప్రతిపాదనలను ఆర్థికశాఖ అధికారులు తిరస్కరిస్తున్నా.. చకచకా ఫైళ్లు సిద్ధమైపోతున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి..! ‘ప్రత్యేక’ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారమంతా సాక్షాత్తూ అమాత్యుల నివాసాల్లోనే జరుగుతుండడం గమనార్హం. త్వరలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అందినకాడికి దండుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారే రాష్ట్రంలో గత మేలోనే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే.. కోరుకున్న చోటు దొరకకపోవడం, బదిలీకి తగిన అర్హత లేకపోవడంతో పాటు.. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా పనిచేసే ఉద్యోగులను తమకు అవసరమైన చోట్ల నియమించుకోవడానికి ప్రయత్నించడం వంటి కారణాలతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ‘దొడ్డిదారి’ బదిలీల కోసం ప్రయత్నిస్తున్నారు. సాధారణ బదిలీలపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో.. కేవలం సీఎం కార్యాలయం నుంచి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఉద్యోగులను బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులతోపాటు మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోల బదిలీలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. సీఎం పేషీతో పాటు మంత్రుల పేషీలు కూడా ఈ బదిలీల పనిలో నిమగ్నమయ్యాయి. అసలు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన జాబితాలనైతే ఏకంగా మంత్రుల నివాసాల్లోనే రూపొందిస్తున్నారు. బదిలీలు కోరుతున్న ఉపాధ్యాయులను పిలిపించి ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 50 వేల నుంచి లక్ష వరకు మంత్రుల పేషీల్లోని సిబ్బంది వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది మేలోనే నిషేధాన్ని సడలించి బదిలీలు చేపట్టిన నేపథ్యంలో.. ప్రస్తుతం బదిలీ కోరుతూ వస్తున్న ఫైళ్లను ఆర్థిక శాఖ అధికారులు తిరస్కరిస్తున్నారు. కానీ, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదంతో బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. తొలుత ఈ తరహాలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెరతీశారు. చిత్తూరు జిల్లాకు చెందిన 55 మంది టీచర్ల బదిలీలకు ఆయన ఆమోదం తెలిపారు. దాంతో మంత్రులు కూడా తమ జిల్లాల్లో ఉపాధ్యాయులతో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోల బదిలీలపై దృష్టి సారించారు. ఈ బదిలీలకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధుల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక ఒక జిల్లాకు చెందిన మంత్రి నివాసంలో అయితే సిబ్బంది గత రెండు రోజులుగా వంద మంది టీచర్ల బదిలీలకు సంబంధించిన పనిలోనే ఉన్నారు. ఆ జిల్లాలో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వంద మంది టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి దరఖాస్తులను జాబితా రూపంలో సిద్ధం చేయాలని మంత్రి తన వ్యక్తిగత సహాయకులను ఆదేశించారు. వారు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి సహాయంతో బదిలీలు కోరుతున్న ఉపాధ్యాయుల నుంచి రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఇతర జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులతో సుమారు 500 మంది టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇప్పటికే దాదాపు 80 మంది టీచర్ల బదిలీలకు సీఎం ఆమోదం తెలిపారు. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు సరికాదని, అయినా నిషేధం అమల్లో ఉందని ఆర్థిక శాఖ అధికారులు మొత్తుకుంటున్నా... విద్యాశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, సీఎం ఆమోదంతో బదిలీల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. కాగా.. గతంలో విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి సిఫార్సు బదిలీలు ఇంతగా జరిగేవికాదని, విద్యా సంవత్సరం ముగిసిన తరువాత సెలవుల్లోనే కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేసేవారమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కానీ, ఇప్పుడు అడ్డదారిలో బదిలీలు జరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే మంత్రుల సిఫార్సుల మేరకు మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు కూడా బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటుండడం గమనార్హం.