యశవంతపుర(బెంగళూరు): సీఎం బొమ్మై కార్యాలయంలో ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్‌గా బయట పడింది. దీంతో ఆఫీసులో క్రిమిసంహారకాన్ని పిచికారి చేశారు. అధికార నివాసం కృష్ణాలో 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఇద్దరు సిబ్బందికి కరోనాగా వెల్లడైంది. వివిధ పనుల నిమిత్తం విధానసౌధకు తిరగడంతో అక్కడి సిబ్బందికి కూడా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విధానసౌధలోని సీఎం ఆఫీసును కూడా శానిటైజ్ చేశారు.
మరో ఘటనలో..
రాజకాలువలపై కబ్జాలు ఉండరాదు: సీఎం
బనశంకరి: బెంగళూరులో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం బొమ్మై బీబీఎంపీ అధికారులను ఆదేశించారు. బుధవారం బీబీఎంపీ కార్యాలయంలో మంత్రులు, పాలికె అధికారులతో సీఎం సమావేశం జరిపారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేకంగా ఉత్తర, తూర్పు బెంగళూరు ప్రాంతాల్లో వర్షంనీరు చొరబడి జన జీవనం అస్తవ్యస్తమైంది. రాజ కాలువలపై కబ్జాలను తొలగించి విస్తరించాలని ఆదేశించా. కాలువలపై ఇళ్లు ఉన్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం కల్పిస్తాం. హెబ్బాల వ్యాలీ నీరు సజావుగా ప్రవహించేలా చర్యలను చేపట్టాలి. మురుగు కాలువలు పూడిపోరాదు అని చెప్పారు. మంత్రులు అశ్వత్‌నారాయణ, ఎస్‌టీ సోమశేఖర్, వీ సోమణ్న పాల్గొన్నారు.
చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ?
Comments
Please login to add a commentAdd a comment