
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తీవ్ర వాయుగుండం మూడు రోజుల పాటు ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్రపై ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కార్యాలయం (సీఎంఓ) అధికారులకు సూచించింది.