సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మరింత ఆలస్యమవుతున్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 13న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది.
ఇది క్రమంగా ఒడిశా వైపుగా పయనించి.. 15వ తేదీన మరింత బలపడే సూచనలున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగానూ.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు రుతుపవన ద్రోణి రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు.
నేడు, రేపు తేలికపాటి వానలు
Published Tue, Oct 12 2021 3:42 AM | Last Updated on Tue, Oct 12 2021 3:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment