సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని కార్యదర్శులకు నేతృత్వం వహిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఇతర సలహాదారులకు ఆయన బాధ్యులుగా ఉంటారని జీవోలో పేర్కొంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పేషీకి 10 మంది సిబ్బందిని సమకూరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment