
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనం ఆరవ అంతస్తులో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆరవ అంతస్తులోని సీఎం పౌర సంబంధాల కార్యాలయాన్ని తాజాగా మార్చారు.
శుక్రవారం(జులై 19) వరకు ఆరవ అంతస్తు లోని 7వ గదిలో పీఆర్వో ఆఫీసు కార్యకలాపాలు నడిచాయి. శనివారం నుంచి పీఆర్వో ఆఫీసును అయిదవ అంతస్తుకు షిఫ్ట్ చేశారు.
ఇక నుంచి ఐదవ అంతస్తులోని ఐదవ నెంబర్ గదిలో ఇక మీదట సీఎం సీపీఆర్ఓ, పీఆర్వోలు పనిచేయనున్నారు. గతంలో ఉన్న లాంజ్‌ను వీఐపీల కోసం కేటాయించారు.