విజయవాడలో టీడీపీపీ నేతల భేటీ | TDPP Leaders meeting in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో టీడీపీపీ నేతల భేటీ

Published Sun, Feb 28 2016 10:11 AM | Last Updated on Fri, Aug 10 2018 9:36 PM

TDPP Leaders meeting in vijayawada

విజయవాడ :  నగరంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కార్యాలయంలో ఆదివారం టీడీపీపీ నేతలు భేటీ అయ్యారు.  పార్లమెంట్లో బడ్జెట్ అంశంపై వ్యవహరించాల్సిన తీరుపై ఈ సందర్భంగా వారు చర్చిస్తున్నారు. అలాగే ఏపీ లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంపై టీడీపీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు.

రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సభకు తెలిసేలా ఈ సమావేశాల్లో వ్యవహారించాలని వారు భావిస్తున్నారు. అలాగే కొత్త ప్రాజెక్టుల సాధనకు కలసికట్టుగా కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాటం సాగించాలని టీడీపీపీ నేతలు ఈ భేటీలో చర్చిస్తున్నారు.  ఈ భేటీకి రాష్ట్రంలోని టీడీపీ ఎంపీలు హాజరయ్యారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement