
జయనగర: విధాన సౌధలోని మూడో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయానికి తాళం పడింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విధాన సౌధ మూడవ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయం చేరుకున్నారు. యడ్యూరప్ప పూజలు నిర్వహించి సీఎం సీటులో ఆశీనులయ్యారు. కొన్ని గంటలపాటు అక్కడే గడిపారు. కార్యాలయం ముందు సిద్దరామయ్య బోర్డు తొలగించి యడ్యూరప్ప నామఫలకం కూడా తగిలించారు. అయితే శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం పడింది. బలపరీక్ష నెగ్గేవరకు పాలనాపరమైన ఎలాంటి నిర్ణయాలను తీసుకోరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విధానసౌధ అధికారులు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయానికి తాళంవేశారు.
Comments
Please login to add a commentAdd a comment