![S.R. Patil resigns as KPCC working president - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/4/KPCC.jpg.webp?itok=wsBUEdjz)
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్‌ఆర్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉత్తర (బాంబే) కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నా రాజీనామా లేఖను పంపించాను. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించనందుకు నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. ఉత్తర కర్ణాటకలో మా పార్టీ మరికొన్ని సీట్లు గెలిచుంటే.. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేవాళ్లం’ అని పాటిల్ ఆదివారం బెంగళూరులో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment