Resigns from the post
-
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం శుక్రవారం రాజీనామా చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాజీనామా పత్రాలను సమరించారు. సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్‌లు హాజరయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుపొంది రికార్డులు తిరగరాసింది. భూపేందర్ పటేల్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఎన్నికలకు ముందే ప్రకటించింది బీజేపీ. ఫలితాలు వెలువడిన క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఫార్మాలిటీ కోసం రాజీనామాలు చేశారు. మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పటేల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గాంధీనగర్‌లోని కమలం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. మధ్యాహ్నానికి పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై గవర్నర్‌కు తెలియజేస్తాం. గవర్నర్ సూచనల మేరకు సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.’ అని తెలిపారు పార్టీ చీఫ్ విఫ్ పంకజ్ దేశాయ్. మరోవైపు.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గాంధీనగర్‌లోని హెలిపాడ్ గ్రౌండ్లో సోమవారం ఉంటుందని పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు హాజరవుతారని చెప్పారు. ఇదీ చదవండి: Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికిపాలిటీ సభ్యుడి నుంచి సీఎంగా -
స్వీడన్‌కు తొలి మహిళా ప్రధాని.. గంటల వ్యవధిలోనే రాజీనామా
కోపెన్హగెన్: స్వీడన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎంపికై చరిత్ర సృష్టించిన 54 ఏళ్ల మాగ్డలినా అండర్సన్ గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్లమెంట్లో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ విఫలం కావడంతోపాటు రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నుంచి గ్రీన్స్ పార్టీ బయటకు వెళ్లిపోవడమే ఇందుకు కారణం. అంతకుముందు నూతన ప్రధానిగా మాగ్డలినా ఎంపికకు స్వీడన్ పార్లమెంట్ ‘రిక్స్‌డాగ్’ ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తున్న మాగ్డలినా ఇటీవలే సోషల్ డెమొక్రటిక్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. స్వీడన్ ప్రధానిగా, పార్టీ అధినేతగా వ్యవహరించిన స్టెఫాన్ లవ్ఫెన్ కొన్ని రోజుల క్రితం రెండు పదవుల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలోకి మాగ్డలినా వచ్చేందుకు రంగం సిద్ధం కాగా, ఆర్థిక మంత్రిగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం లభించలేదు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు గ్రీన్స్ పార్టీ తేల్చిచెప్పింది. దీంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాగ్డలినా ప్రకటించారు. రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్‌కు పంపించారు. స్వీడన్ పార్లమెంట్లో 349 మంది సభ్యులున్నారు. వీరిలో 117 మంది మాగ్డలినాకు అనుకూలంగా, 174 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 57 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకరు గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకా రం పార్లమెంట్లో సగం మంది.. అంటే 175 మంది వ్యతిరేకించనంత కాలం ప్రధానమంత్రి తన పదవిలో కొనసాగవచ్చు. స్వీడన్లో తదుపరి సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్నాయి. -
కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగాను. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, బిల్లులకు వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేశాను. ఒక సోదరిగా, బిడ్డగా రైతుల పక్షం నిలబడినందుకు గర్వంగా ఉంది’ అని సంబంధిత బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందేందుకు కొన్ని గంటల ముందు ఆమె ట్వీట్ చేశారు. అంతకుముందు, ఆ బిల్లులను ఎస్ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్‌లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు. భారత్ ఆహార రంగంలో స్వావలంబన సాధించడంలో పంజాబ్ రైతుల పాత్రను మరచిపోకూడదన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కేబినెట్లో తమ పార్టీ ప్రతినిధి అయిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ తాను, తమ పార్టీ పదేపదే చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన తన రాజీనామా లేఖలో కౌర్ ఆరోపించారు. తమ పార్టీలోని ప్రతి సభ్యుడు రైతేనని, రైతు సంక్షేమం ధ్యేయంగా తమ పార్టీ నడుస్తోందని పేర్కొన్నారు. రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదన్నారు. కౌర్ రాజీనామాను ప్రధాని మోదీ ఆమోదించారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. ఎన్డీఏలో శిరోమణి అకాలీదళ్ బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన పార్టీ. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లులను ఎస్ఏడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పంజాబ్‌లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. తమ మద్దతుదారుల్లో అత్యధికులు రైతులే కావడంతో, బిల్లులను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎస్ఏడీకి నెలకొన్నది. ఎన్డీఏలో ఎస్ఏడీ కొనసాగేది, లేదని త్వరలో నిర్ణయిస్తామని సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. రైతుల కోసం ఏ త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని పార్లమెంట్ వెలుపల మీడియాతో స్పష్టం చేశారు. రెండు బిల్లుల ఆమోదం ఎస్ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘ద ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, డీఎంకే, ఆర్ఎస్పీలు వాకౌట్ చేశాయి. వ్యవసాయ రంగానికే చెందిన మరో బిల్లు ‘ఎసెన్షియల్ కమాడిటీస్(అమెండ్మెంట్)’ మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఇవి ఇంకా రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. రైతులకు మధ్యవర్తుల బెడద తొలగుతుందన్నారు. ఈ బిల్లుల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ కొనుగోలు విధానాలు కొనసాగుతాయని రైతులకు హామీ ఇచ్చారు. -
కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ఆర్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉత్తర (బాంబే) కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నా రాజీనామా లేఖను పంపించాను. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించనందుకు నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. ఉత్తర కర్ణాటకలో మా పార్టీ మరికొన్ని సీట్లు గెలిచుంటే.. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేవాళ్లం’ అని పాటిల్ ఆదివారం బెంగళూరులో తెలిపారు. -
నాణయ్య రాజీనామా!
బెంగళూరు : అత్యాచారాల నిరోధానికి అవసరమైన సలహాలు, సూచనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ‘అత్యాచార నిరోధక కమిటీ’కి అధ్యక్షుడైన ఎం.సి.నాణయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా రాష్ట్ర హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్‌కు పంపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా అందులో విన్నవించారు.