Bhupendra Patel Resigns As Gujarat Chief Minister, Set For 2nd Term - Sakshi
Sakshi News home page

గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం

Published Fri, Dec 9 2022 3:48 PM | Last Updated on Fri, Dec 9 2022 4:26 PM

Bhupendra Patel Resigns As Gujarat Chief Minister Set For 2nd Term - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, ఆయన మంత్రివర్గం శుక్రవారం రాజీనామా చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా పత్రాలను సమరించారు. సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు గుజరాత్‌ బీజేపీ చీఫ్‌ సీఆర్‌ పాటిల్‌, పార్టీ చీఫ్‌ విప్‌ పంకజ్‌ దేశాయ్‌లు హాజరయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుపొంది రికార్డులు తిరగరాసింది. 

భూపేందర్‌ పటేల్‌ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఎన్నికలకు ముందే ప్రకటించింది బీజేపీ. ఫలితాలు వెలువడిన క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఫార్మాలిటీ కోసం రాజీనామాలు చేశారు. మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 12న ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

‘ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పటేల్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గాంధీనగర్‌లోని కమలం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. మధ్యాహ్నానికి పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై గవర్నర్‌కు తెలియజేస్తాం. గవర్నర్‌ సూచనల మేరకు సీఎం, కేబినెట్‌ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.’  అని తెలిపారు పార్టీ  చీఫ్‌ విఫ్‌ పంకజ్‌ దేశాయ్‌. 

మరోవైపు.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గాంధీనగర్‌లోని హెలిపాడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ఉంటుందని పార్టీ చీఫ్‌ సీఆర్‌ పాటిల్‌ ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు హాజరవుతారని చెప్పారు.

ఇదీ చదవండి: Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికిపాలిటీ సభ్యుడి నుంచి సీఎంగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement