Gujarat Election 2022
-
‘మనం ఎద్దు నుంచి పాలు పితకగలిగాం!’
సాక్షి, న్యూఢిల్లీ: అత్యధిక స్థానాలు తమవేనంటూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటనలు ఇచ్చుకున్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఓటమి తర్వాత చల్లబడి పోయారు. ఈ క్రమంలో.. గుజరాత్ ఓటమిపై కేజ్రీవాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఐదు సీట్లను గెల్చుకోవడం కూడా అతి కష్టమేనన్న రీతిలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, ఎద్దు నుంచి పితకగలరా? గుజరాత్లో మనం గెలుపు కోసం చేసిన యత్నం దాదాపు అలాంటిదే అని వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలోనే పంజాబ్‌లో అధికారం దక్కించుకున్నాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్నాం. గోవాలో రెండు ఎమ్మెల్యే స్థానాలు, గుజరాత్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలతో 14 శాతం ఓట్ షేర్ సాధించాం. గుజరాత్ పరిణామం ఓ వ్యక్తి మాట్లాడుతూ.. అది ఎద్దు నుంచి పాలు పితకడం లాంటిదని అన్నాడు. అది అక్షరాల సత్యం. ఆవు నుంచి ఎవరైనా పాలు పితకగలరు. కానీ, మనం ఏకంగా ఎద్దు నుంచే పాలు పితికాం అని చెప్పారాయన. గుజరాత్లో ఈ దఫా కాకపోయినా.. 2027 అధికారం ఆప్‌దేనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరతామని ప్రకటించారు కేజ్రీవాల్. ఇక గుజరాత్ ఎన్నికల ఓట్ షేర్‌తో.. ఆప్‌కు జాతీయ హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జరిగిన కౌన్సిల్ సమావేశం ఆసక్తికరంగా సాగింది. అంతేకాదు.. ఈ భేటీ నుంచి చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన. భారత జవాన్ల ప్రాణాలంటే మోదీ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని విమర్శించారు. -
Gujarat Election 2022: గుజరాత్ ఓటేసిందిలా...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దుమ్ము రేపి వరుసగా ఏడోసారి అధికారంలోకి రావడంపై పలు రాజకీయ వర్గాల్లో పలు కోణాల్లో విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో చాలా విషయాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అంతటి అసంతృప్తిని, అధికార వ్యతిరేకతను అధిగమిస్తూ ఏకంగా నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించిన వైనం రాష్ట్ర బీజేపీ ముఖ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి కనీసం గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ చివరికి ఘోర పరాజయం పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీని అడ్డుకోలేకపోగా, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా దాని జైత్రయాత్రకు పరోక్షంగా సహకరించినట్టయింది! దాంతో రాష్ట్రంలో ఎటు చూసినా కాషాయ రెపరెపలే కనిపించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ విహంగ వీక్షణం... – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా?
ఒక రాష్ట్రంలో మోదీ మేనియాతో ఊగిపోయే ప్రజలు, మరో రాష్ట్రంలో స్థానిక సమస్యలే ముఖ్యమని ఎలుగెత్తి చాటిన ఓటర్లు .. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో రెండు విభిన్నమైన తీర్పులు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ? ప్రధాని మోదీ బ్రాండ్ ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉంటుందా ? మోదీని ఢీ కొట్టే నాయకుడు కేజ్రీవాలా ? రాహులా ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు చెబుతున్నదేంటి ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న చర్చ మొదలైంది. విపక్షాలను నిరీ్వర్యం చేసి అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని, హిందుత్వ–జాతీయవాదాన్ని జనంలోకి బాగా తీసుకువెళ్లాలని, ఉచితాలకు బదులుగా అభివృద్ధి బాట పడితేనే దేశానికి మేలు జరుగుతుందన్న బీజేపీ ఎజెండాకు గుజరాత్ ఫలితాలు ఆమోద ముద్ర వేశాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా పని చేస్తుందన్న ధీమాను నింపాయి. అదే సమయంలో స్థానిక సమస్యలపై గట్టి పోరాటం చేస్తే బీజేపీని, మోదీ బ్రాండ్ ఇమేజ్ను ఎదుర్కోవడం కష్టం కాదన్న ఆశ కూడా ప్రతిపక్ష పారీ్టల్లో చిగురించింది. బ్రాండ్ మోదీ ప్రభావం మోదీ ఇమేజ్ చెక్కు చెదరకపోయినప్పటికీ బలమైన స్థానికాంశాలుంటే రాష్ట్రాల్లో గెలుపుకు విపక్షాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. హిమాచల్‌లో పాత పెన్షన్ పునరుద్ధరిస్తామన్న ఒకే ఒక్క హామీ కాంగ్రెస్‌ని అధికార పీఠానికి చేర్చింది. సోలన్ ప్రాంతంలో మోదీ ర్యాలీలకు జనం పోటెత్తినా అక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్కటీ నెగ్గలేకపోయింది! కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూత్వ, జాతీయవాదమే కీలకపాత్ర పోషించేలా కనిపిస్తున్నాయి. హిమాచల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో తేడా ఒక్క శాతమే! ‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టడం సులభం కాదు. హిమాచల్‌లో మాదిరిగా స్థానికాంశాలు లోక్‌సభ ఎన్నికల్లో పని చేయవు’’ అని జేఎన్‌యూ పొలిటికల్ సైన్స్ ప్రొఫసర్ మణీంద్రనాథ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. హిమాచల్ ఓటమితో ఇమేజ్‌కు వచి్చన ఢోకా ఏమీలేదన్నారు. కాంగ్రెస్ పక్కలో బల్లెం ఆప్ బీజేపీతో తలపడడానికి, హిందూత్వ ఎజెండాతో ఓటర్లను ఏకీకృతం చేస్తున్న కమలనాథుల కు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఆప్ రూపంలో కొత్త శత్రువు ఎదురైంది. గుజరాత్లో ఆప్ ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కొల్లగొట్టడంతో 17 స్థానాలకే పరిమితమవాల్సి వచి్చంది. కాంగ్రెస్ ఓట్లు 41% నుంచి 27శాతానికి పడిపోతే, ఆప్ 13% ఓట్లు సాధించిందంటే కాంగ్రెస్ ఓట్లకు గంటికొట్టినట్టయింది. ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు అసలు సిసలు శత్రువు ఆప్ అంటే అతిశయోక్తి కాదు. విపక్షాల మధ్య ఓట్లు చీలిపోతుంటే బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోంది. ఆప్‌ను ఎదుర్కొనే బలమైన వ్యూహాన్ని కాంగ్రెస్ తక్షణమే రచించాలి.’’ అని ఎన్నికల విశ్లేషకుడు ఠాకూర్ హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అది కాంగ్రెస్‌కి కలిసొచ్చింది. అదే ఆప్ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్ పని అయిపోయి ఉండేదని ఆ పార్టీ మాజీ నాయకుడు సంజయ్ ఝా అన్నారు. అయితే హిమాచల్‌లో విజయం సాధించడం వల్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడుకి చేరడంతో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచినట్టయింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెమీ ఫైనల్స్ ఫలితాలే కీలకం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఉందా లేదా అనేది వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాల్లో జరిగే సెమీఫైనల్స్ వంటి ఎన్నికల ఫలితాలే కీలకం కానున్నాయి. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ పార్టీ హోదా లభించిన ఉత్సాహంలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో కాంగ్రెస్ అటు బీజేపీ, ఇటు ఆప్‌ను సమర్థంగా ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే నాయకుడు కేజ్రివాలా? రాహులా? అన్నది తేలిపోతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇదీ చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు -
ఆడపడుచు ప్రత్యర్థి వైపు నిలిచినా.. కోడలు గెలిచింది! శభాష్ రివాబా
ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నారు. ఆ సందర్భం వేరు. ఇక్కడ కూడా ఇంటిలోని పోరే. ఈ సందర్భం వేరు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా గుజరాత్ ఎన్నికల్లో నిలబడింది. ఆడపడుచు నైనాబా ఆమెకు సింహస్వప్నంగా మారింది. వదిన ఓటమి కోసం ఆమె చేయని ప్రచారం ప్రయత్నం లేదు. కోడలికి మద్దతు ఇవ్వకుండా కూతురు పక్షం చేరారు మామగారు. భర్త రవీంద్రకు ఇరకాటం ఉన్నా భార్య పక్షాన నిలిచాడు. రివాబా 50 వేల భారీ మెజార్టీతో గెలిచింది. ఈ గెలుపులో ఎన్నో మలుపులు. టీవీ సీరియల్ వంటి మెరుపులు. ‘ఆడపడుచు అర్ధమొగుడు’ అనే మాట ఎవరు అన్నారోగాని మొన్నటి గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినన్నాళ్లు రివాబా జడేజా(33)కు ఆ మాట గుర్తుకొస్తూనే ఉండి ఉంటుంది. బాల్‌ను బ్యాట్‌తో పిచ్చిగా బాదుతాడనే పేరు గడించిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య అయిన రివాబా జడేజా ఏకంగా నరేంద్ర మోడి ఆశీస్సులతో బి.జె.పి అభ్యర్థిగా జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగింది. ఆమెకు కాంగ్రెస్, ఆప్ పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులు. కాని అసలు ప్రత్యర్థిగా మాత్రం ఆడపడుచు నైనాబా నిలిచింది. దానికి కారణం ఆమె కాంగ్రెస్ మద్దతుదారు. రవీంద్ర, నైనాల తండ్రి అనిరు«ద్ సింగ్ కూడా కాంగ్రెస్ మద్దతుదారుడే. అంటే ఇంట్లో ఆడపడుచు, మామగారు కాంగ్రెస్ పార్టీ. రివాబా బి.జె.పి. ఎలక్షన్ గెలవాలి... అలాగే ఇంటిలోని బంధాలు చెదిరిపోకుండా నెగ్గుకురావాలి. ఆ విధంగా రివాబాకు ఈ ఎన్నిక కత్తి మీద సాము అయ్యింది. నైనాబా వ్యతిరేకత నైనాబాకు బి.జె.పి అంటే అస్సలు గిట్టదు. బి.జె.పి పాలన వల్ల రాష్ట్రంలో అంతా నష్టమే జరుగుతోందని ఆమె అభిప్రాయం. అందుకే 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. తండ్రి కూడా చేరాడు. నైనాబా ఏ వేదిక దొరికినా దేశంలో ధరల పెరుగుదల గురించి, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడి బి.జె.పిని తూర్పార పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె సీట్ ఆశించింది కాని అది జరగలేదు. ఈలోపు ఏకంగా ఆమె వదిన, సోదరుడు రవీంద్ర భార్య అయిన రివాబాకు బి.జె.పి పిలిచి మరీ పార్టీ టికెట్ ఇచ్చింది. అందుకు తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ జడేజాను పక్కన పెట్టింది. వదిన బి.జె.పిలో చేరడం నైనాబాకు బొత్తిగా నచ్చలేదు. అలాగని ఇంటి వరకు ఆమెతో అనుబంధాన్ని వదలుకోదలుచుకోలేదు. దాంతో పాటు బి.జె.పి అభ్యర్థిగా వదిన గెలవడాన్ని సహించనూ లేదు. దాంతో ఇంటి బయటి యుద్ధానికి తెర లేపింది. అన్ని అస్త్రాలు రివాబా తన ఆడపడుచు గురించి జాగ్రత్తగానే ఉంది. పెద్దగా విమర్శలు సంధించలేదు. కాని నైనాబా మాత్రం నిర్దాక్షిణ్యంగా వదిన రివాబా మీద అస్త్రాలు సంధిస్తూనే వెళ్లింది. ‘మా వదినది రాజ్‌కోట్. ఆమె ఒక కోడలిగా జామ్‌నగర్ వచ్చింది. ఆమె ఈ ప్రాంతానికి కొత్త. నాన్ లోకల్. ఆమెను గెలిపించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు’ అని వీధి వీధి ప్రచారం మొదలెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి బిపెందర్ సింగ్‌కు ఓటేయమని కోరింది. అభ్యర్థిత్వం కోసం రివాబా సమర్పించిన అఫిటవిట్లో ఆమె పేరు ‘రివా సింగ్ సోలంకి’ అని ఉంది. దీనిని కూడా నైనా పట్టుకుంది. ‘చూశారా... మా వదినకు పెళ్లయ్యి ఆరేళ్లయినా తన ఇంటి పేరును అధికారికంగా మార్చుకోలేదు. అంత తీరిక లేదా ఆమెకు’ అని పబ్లిక్‌లో చర్చ పెట్టింది. రివాబా తన ప్రచారంలో ఐదేళ్ల కుమార్తెను ఒకటి– రెండుసార్లు తీసుకు వచ్చింది. దానికి కూడా అబ్జెక్షన్ చెప్పింది నైనా. ‘పిల్లల్ని చూపించి మా వదిన సెంటిమెంట్ పండించాలని అనుకుంటోంది. పిల్లల్ని ప్రచారానికి తీసుకు రాకూడదు. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది’ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే రివాబా మాత్రం ‘రాజకీయాలు వారి వారి వ్యక్తిగతమైనవి. కుటుంబంగా మేమంతా ఒకటి’ అని చెప్పింది. కాంగ్రెస్‌కు ఓటు వేయమని మామగారు వీడియో రిలీజ్ చేసినా ఆమె ఎదురు విమర్శలు చేయలేదు. భర్త తోడుగా ఇంట్లో తండ్రి, చెల్లెలు కాంగ్రెస్ పార్టీ కోసం బ్యాటింగ్ చేస్తుంటే రవీంద్ర తన భార్య కోసం ప్రచార బాధ్యత తీసుకున్నాడు. భార్యకు అన్ని విధాలా సపోర్ట్‌గా నిలిచాడు. ఆమె గెలుపు కోసం రోడ్ షోలు నిర్వహించాడు. దాదాపు 2 లక్షల పై చిలుకు ఓట్లు ఉన్న నియోజక వర్గం అది. రాజ్పుట్ల ప్రాబల్యం ఎక్కువ. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులు అదే సామాజిక వర్గానికి చెందిన వారు. అందువల్ల గెలుపు అంత సులువు కాదు. దానికి తోడు చెల్లెలి బెడద. అందుకే రవీంద్ర చెమట చిందించాడు. డిసెంబర్ ఒకటిన జామ్‌నగర్ నార్త్‌లో పోలింగ్ జరిగింది. 8వ తేదీ భారీ మెజార్టీతో రివాబా విజయం సాధించింది. ‘హలో ఎం.ఎల్.ఏ. నువ్వు ఈ విజయానికి నిజంగా తగినదానివి’ అని సంతోషంగా రవీంద్ర జడేజా భార్యను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. పార్టీ అభ్యర్థిగా రివా గెలిచింది. కోడలిగా ఆమె ఇంటిలోనూ అదే పని చేయాల్సి ఉంది. చదవండి -
గుజరాత్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు.. సీఎం ఎంపికపై దృష్టి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం గాంధీనగర్‌లో సమావేశమై, తమ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. సీఎల్పీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది. భూపేంద్ర పటేల్ రాజీనామా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన మంత్రివర్గం సైతం రాజీనామా సమర్పించింది. బీజేపీ నిర్ణయం ప్రకారం.. భూపేంద్ర పటేల్ ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం శుక్రవారం రాజీనామా చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాజీనామా పత్రాలను సమరించారు. సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్‌లు హాజరయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుపొంది రికార్డులు తిరగరాసింది. భూపేందర్ పటేల్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఎన్నికలకు ముందే ప్రకటించింది బీజేపీ. ఫలితాలు వెలువడిన క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఫార్మాలిటీ కోసం రాజీనామాలు చేశారు. మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పటేల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గాంధీనగర్‌లోని కమలం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. మధ్యాహ్నానికి పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై గవర్నర్‌కు తెలియజేస్తాం. గవర్నర్ సూచనల మేరకు సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.’ అని తెలిపారు పార్టీ చీఫ్ విఫ్ పంకజ్ దేశాయ్. మరోవైపు.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గాంధీనగర్‌లోని హెలిపాడ్ గ్రౌండ్లో సోమవారం ఉంటుందని పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు హాజరవుతారని చెప్పారు. ఇదీ చదవండి: Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికిపాలిటీ సభ్యుడి నుంచి సీఎంగా -
బిగ్ క్వశ్చన్ : గుజరాత్ మోడల్ పేపర్
-
గుజరాత్ ప్రజలు బీజేపీ వైపేనని నిరూపించారు : ప్రధాని మోదీ
-
గుజరాత్ లో బీజేపీ గెలుపుపై " సాక్షి విశ్లేషణ "
-
గుజరాత్ లో రికార్డులు బద్దలు కొట్టిన బీజేపీ
-
గుజరాత్ : రవీంద్ర జడేజా సతీమణి రివాబా గెలుపు
-
గుజరాత్లో పెద్దాయన లేనిలోటు స్పష్టం.. కాంగ్రెస్‌లో ఆ ఒక్కడు లేకపోతే అంతేనా?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. దీంతో వీటిపై కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే గుజరాత్‌ను వదిలేసి రాహుల్ ఇంకెక్కడో యాత్రలు చేశారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఖర్గే.. ఢిల్లీని వదలలేదు. ఫలితంగా గుజరాత్లో దశదిశ లేక బొక్కాబొర్లా పడింది హస్తం పార్టీ. హస్తానికి ఏమైంది? 2014 నుంచి ప్రతిపక్షంలో ఉంటోన్న కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేకత రావొచ్చని ముందుగా అంచనాలు వచ్చినా.. కాంగ్రెస్‌లో ఆ జోషే కనిపించడం లేదు. స్టార్ క్యాంపెయినర్లు అడ్రస్ లేరు. రాహుల్ ఒకరోజు అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. కొత్త అధ్యక్షుడు ఖర్గే నాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించారు. అహ్మద్ పటేల్ లేకుంటే అనాథే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీని దాదాపు ఓడించినంత పని చేసింది కాంగ్రెస్. 41.44 ఓట్ షేర్‌తో 77 సీట్లు గెలుచుకుంది. 1998 తర్వాత తొలిసారి బీజేపీని డబుల్ డిజిట్‌కు పరిమితం చేసింది. కానీ, ఇప్పుడు నీరుగారి పోయింది. సీనియర్ నేత అహ్మద్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అహ్మద్ పటేల్ లేని గుజరాత్ కాంగ్రెస్ అనాథలా మారింది. ఎలక్షనీరింగ్ లేదు.. ప్రచార వ్యూహాల్లేవు.. నేతల హంగామా అసలే లేదు.. అంతా మిస్సింగ్. అంతా చేయిచ్చారు! 2017 నుంచి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. పాటిదార్ నేత హార్దిక్ పటేల్ కూడా ఎన్నికల ముందు బీజేపీలో చేరిపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, హైకమాండ్ నిర్ణయరాహిత్యం కలిసి ఒక రకమైన నైరాశ్యంలో కూరుకుపోయింది గుజరాత్ కాంగ్రెస్. 27 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీపై పాటిదార్లు సహా అనేక వర్గాల్లో అసంతృప్తి ఉందని ప్రచారం జరిగినా.. దానిని ఓట్లుగా మార్చుకునే వ్యూహాలు మాత్రం కాంగ్రెస్ క్యాంప్‌లో కనిపించలేదు. రాజస్థాన్ మోడల్ అట్టర్ ఫ్లాప్ అహ్మద్ పటేల్ లేకపోవడంతో.. గుజరాత్ కాంగ్రెస్ ఎలక్షన్ బాధ్యతను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు అప్పగించింది అధిష్టానం. కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ అంటుంటే.. రాజస్థాన్ మోడల్ అన్నారు గెహ్లాట్. అధికారంలోకి వస్తే రాజస్థాన్ ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గుజరాత్‌లోనూ అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. అయినా కాంగ్రెస్ పరువు కాపాడుకోలేకపోయింది. ఈ లెక్కన రాజస్థాన్ మోడల్ హస్తానికి ఏ రకంగాను చెప్పుకోదగ్గ క్రెడిట్‌లోకి రాలేదు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Gujarat: కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ ప్రభంజనం ధాటికి.. ప్రభావం చూపెడుతుందనుకున్న ఆప్.. సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భారీ దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీకే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో.. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏకంగా 60 దాకా సిట్టింగ్ స్థానాలకు కోల్పోయింది ఆ పార్టీ. కాంగ్రెస్ ఓట్లను ఆప్, ఎంఐఎం పార్టీలు భారీగా చీల్చాయి. మరోవైపు ఆదివాసి ఓట్లు కూడా కోల్పోవడం కాంగ్రెస్‌కు మరో మైనస్‌గా మారాయి. 2017 ఎన్నికల్లో యూపీఏ కూటమికి 80 సీట్లు దక్కాయి. ఇందులో కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా పదహారు సీట్లు అధికంగా గెల్చుకోవడం గమనార్హం. తాజా ట్రెండ్స్ చూస్తుంటే పాతిక సీట్లు లోపే కాంగ్రెస్ పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. -
Gujarat Election Results: గుజరాత్ ప్రజలకు నమస్కరిస్తున్నా: మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. 07:00PM గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్లో బీజేపీ 156 చోట్ల విజయం కేతనం ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది. మోదీ- షా సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్లో సీపీఎం రికార్డును బీజేపీ సమం చేసింది. కాగా 1977 నుంచి 2011 వరకు 34 సంవత్సరాల పాటు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ పశ్చిమ బెంగాల్‌ను పాలించింది. 06:30PM గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ విజయం సాధించారు. వడ్గమ్ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి గెలుపొందారు. అనంతరం తనకు విజయాన్ని అందించినందుకు వడ్గాం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఇది సమాజంలోని పేద, అట్టడుగు వర్గాలను మరింత ముందుకు తీసుకొచ్చే బాధ్యతను కూడా తనకు అందిస్తుందని మేవానీ ట్వీట్ చేశారు. Thank you Gujarat. I am overcome with a lot of emotions seeing the phenomenal election results. People blessed politics of development and at the same time expressed a desire that they want this momentum to continue at a greater pace. I bow to Gujarat’s Jan Shakti. — Narendra Modi (@narendramodi) December 8, 2022 05:15PM గుజరాత్లో బీజేపీ ఘన విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. అద్భుతమైన ఎన్నికల ఫలితాలు చూసి భావోద్వేగాని లోనైనట్లు తెలిపారు. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.. ఇదే జోరును మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. గుజరాత్ ప్రజలకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ విజయం కోసం కష్టపడి పనిచేసిస గుజరాత్ బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ ఛాంపియన్స్. పార్టీకి నిజమైన బలం అయిన కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు.’ అని ట్వీట్ చేశారు. To all hardworking @BJP4Gujarat Karyakartas I want to say - each of you is a champion! This historic win would never be possible without the exceptional hardwork of our Karyakartas, who are the real strength of our Party. — Narendra Modi (@narendramodi) December 8, 2022 04:15PM అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూడటంతో గుజరాత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల కోత వెనుక ఆప్, అసదుద్దీన్ ఒవైసీ ఓ కారణమన్నది నిజమని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ జే ఠాకూర్ పేర్కొన్నారు. తమ లోటుపాట్లను విశ్లేషించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. 03:45PM గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గధ్వి పరాజయం పొందారు. ఖంభాలియా నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హర్దాస్‌భాయ్ బేరాపై 18వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 03:15PM గుజరాత్లో కాంగ్రెస్ ఓట్లకు చీల్చేందుకు బీజేపీ ఆప్‌కి నిధులు సమకూర్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ భారీగా డబ్బు వెదజల్లిందని విమర్శించారు. ఆప్ పోటీలోకి రావడంతో తాము వెనకబడిపోయామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 10 శాతం ఓట్లు రావడంతో కాంగ్రెస్ ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు. మోర్బి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి కాంతిలాల్ అమృతీయ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జయంతిలాల్ పటేల్‌పై 61,5000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 03:00PM గుజరాత్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ నాయకత్వంపై మరోసారి విశ్వాసం ప్రదర్శించారని రాఫ్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు దేశ వ్యతిరేక శక్తులను తిరస్కరించారని అన్నారు. ప్రజల అభిష్టాన్ని స్వీకరిస్తున్నామని, బీజేపీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రజాసేవకే కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.. 02:30PM గుజరాత్లో బీజేపీ ఘన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. బూటకపు వాగ్దానాలు చేసిన వారిని ప్రజలు తిరస్కరించారని.. ప్రధాని మోదీ అభివృద్ధి, పాలనపై నమ్మకంతో బీజేపీకి అపూర్వమైన విజయాన్ని అందించారని తెలిపారు. మహిళలు, యువకులు, రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాలూ బీజేపీ వెంటే ఉన్నాయనడానికి ఈ భారీ విజయం సాక్ష్యంగా నిలిచిందన్నారు. गुजरात ने हमेशा इतिहास रचने का काम किया है। पिछले दो दशक में मोदी जी के नेतृत्व में भाजपा ने गुजरात में विकास के सभी रिकॉर्ड तोड़े और आज गुजरात की जनता ने भाजपा को आशीर्वाद देकर जीत के सभी रिकॉर्ड तोड़ दिये। यह @narendramodi जी के विकास मॉडल में जनता के अटूट विश्वास की जीत है। — Amit Shah (@AmitShah) December 8, 2022 01:53PM ► గుజరాత్ జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా గెలుపొందారు. 61 వేలకుపైగా భారీ మెజార్టీ సాధించినట్లు తెలుస్తోంది. గెలుపుపై ఆమె స్పందిస్తూ.. ఇది అందరి విజయం అన్నారు. 12:45 PM ► గుజరాత్లో బీజేపీ ఘన విజయంతో సీఎంగా అధికారం చేపట్టనున్న భూపేంద్ర పటేల్. కాగా, డిసెంబర్ 10 లేదా 11వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. Gujarat CM Bhupendra Patel and state BJP chief CR Paatil have sweets in celebration as the party sweeps the #GujaratAssemblyPolls The Chief Minister is also leading from his constituency Ghatlodia by a margin of 1,07,960 votes. pic.twitter.com/9CAGPjMLsM — ANI (@ANI) December 8, 2022 ► గుజరాత్లో కాంగ్రెస్ ఓట్ షేర్.. 26శాతం, ఆప్ ఓట్ షేర్.. 12.7 శాతం 12:10 PM ► గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. గట్లోదియా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన పటేల్ ఘన భారీ విజయాన్ని అందుకున్నారు. 11:40 AM ► గుజరాత్లో భారీ విజయం నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. 11:18 A ► బీజేపీ ఘన విజయంతో గాంధీనగర్‌లో బీజేపీ శ్రేణులు డ్యాన్స్ చేస్తూ సంబురాలు జరుపుకుంటున్నాయి. #WATCH | Women BJP workers in Gandhinagar celebrate by dancing as the party heads towards a landslide victory in Gujarat BJP leading on 152 of the 182 seats, as per the official EC trends. pic.twitter.com/XlajLlNlYd— ANI (@ANI) December 8, 2022 #WATCH | Celebrations at Gandhinagar BJP office as the party sweeps Gujarat elections BJP leading on 149 seats of total 182 seats, as per ECI trends pic.twitter.com/rfuAusbO3z — ANI (@ANI) December 8, 2022 10:35 AM ► బీజేపీకి బంపర్ మోజార్టీ. బీజేపీ 54 శాతం ఓట్ షేర్ సాధించింది. వరుసుగా ఏడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్‌లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ మెజార్టీలో నిలిచింది. గుజరాత్లో అన్ని రికార్డులను బీజేపీ బ్రేక్ చేస్తోంది. ఇప్పటికి 153 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 9:52 AM ► గాంధీనగర్ సౌత్‌లో అల్పేష్ ఠాకూర్ ముందంజ. మోర్టీలో కూడా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. విరంగాం స్థానంలో పాటిదార్ నేత హార్ధిక్ పటేల్ లీడ్‌లో ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండటంతో కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. Gandhinagar, Gujarat | Bharatiya Janata Party workers celebrate as party crosses majority mark of 95 in early trends as per ECI. BJP is leading in 99 seats in the State pic.twitter.com/ylar3cPblB — ANI (@ANI) December 8, 2022 9:33 AM ► ఘాట్లోడియాలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ముందంజలో ఉన్నారు. In Gujarat, BJP -123; Congress-22; AAP-10 - in early trends as per ECI BJP has crossed the halfway mark of 92 in the State in early trends pic.twitter.com/VVmyA1SZUq — ANI (@ANI) December 8, 2022 9: 25 AM ► 130కి పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. సౌరాష్ట్రలోని కచ్ ప్రాంతంలో బీజేపీ భారీ సీట్లలో ఆధిక్యంలో ఉంది. 8:53 AM. మోర్బీలో బీజేపీ వెనుకంజ ► మోర్బీలో బీజేపీ వెనుకంజ. కాగా, మోర్బీలో ఇటీవలే తీగల వంతెన కూలిపోయి దాదాపు 135 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. దీంతో, ఎన్నికల ఫలితాలపై ఈ ఘటన ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. 8:47 AM ► జామ్‌నగర్ నార్త్‌లో లీడ్‌లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా. 8:30 AM ► పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీకి భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దక్కాయి. దీంతో, ముందంజలో కొనసాగుతోంది. ► మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. #GujaratElections2022 | Counting of votes begin, visuals from Government Commerce College in Gandhinagar. pic.twitter.com/PmcIXC1rS8 — ANI (@ANI) December 8, 2022 ► ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. బీజేపీ విజయంలో ఎలాంటి సందేహం లేదు. 20 ఏళ్లుగా గుజరాత్లో ఎలాంటి దాడులు, టెర్రరిస్టుల దాడుల జరగలేదు. గుజరాత్ ప్రజలకు బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. అందుకే మా పార్టీని గెలిపిస్తారు. 135-145 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది.- హర్దిక్ పటేల్ 135-145, we are definitely going to form the Govt. Do you have any doubts?: BJP candidate from Viramgam, Hardik Patel when asked how many seats will his party get #GujaratElection2022 pic.twitter.com/dfekGSJtBB — ANI (@ANI) December 8, 2022 ► ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారులు, పార్టీ నేతలు కౌంటింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. Ahmedabad, Gujarat | The counting of votes for the Gujarat Assembly elections will begin at 8 am. Outside visuals from counting centre at LD Engineering College pic.twitter.com/YPS7tIh2Jn — ANI (@ANI) December 8, 2022 ► గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గుజరాత్లో 182 శాసనసభ స్థానాలుండగా డిసెంబర్ 1న, డిసెంబర్ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయాయి. 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాషాయ పార్టీ తిరిగి ‘పవర్’పంచ్ విసరాలని తీవ్రంగా శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. ► అయితే, పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు గుజరాత్లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఆప్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధిస్తే రికార్డు స్థాయిలో ఏడోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేయనుంది. -
గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు
న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, అనూహ్య ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచిన వారంతా తమతోనే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, గుజరాత్, హిమచల్ ప్రదేశ్ ఎన్నికలు ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ ఢిల్లీని వరుసగా 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టి ఓడించారని సీఎం భగవంత్ మాన్ గుర్తు చేశారు. అలాగే 15 ఏళ్లుగా ఎంసీడీని ఏలుతున్న బీజేపీని ఇప్పుడు మట్టి కరిపించారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని బీజేపీ.. ఢిల్లీలో మొహరించిందని ఆరోపించారు. విద్వేష రాజకీయాలు వద్దు ఢిల్లీ ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ‘ఢిల్లీ వాసులు విద్వేష రాజకీయాలు ఇష్టపడటం లేదు. స్కూల్స్, ఆస్పత్రులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశార’ని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్‌గా మహిళ!) -
గుజరాత్ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 64.33 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2017 నాటి ఎన్నికలతో పోలిస్తే 4.08 శాతం తగ్గింది. రాష్ట్రంలో 2017 ఎన్నికల్లో 68.41 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ నెల 1న 89 స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 63.31 శాతం, 4న 93 స్థానాలకు జరిగిన రెండో దశ ఎన్నికల్లో 65.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో 4.91 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ ఎన్నికల్లో 3.16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా నర్మదా జిల్లాలో 78.42 శాతం, అతి తక్కువగా బోతాడ్ జిల్లాలో 57.59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. తాపీ జిల్లాలో 77.04 శాతం, బనస్కాంతా జిల్లాలో 72.49 శాతం, సబర్‌కాంతా జిల్లాలో 71.43 శాతం, నవసారి జిల్లాలో 71.06 శాతం, మోర్బీ జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు తేలింది. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: ఎగ్జిట్ పోల్స్: గుజరాత్ బీజేపీదే -
ఇక తెలంగాణపైనే ఫోకస్!
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగియడంతో తన తదుపరి ఫోకస్ అంతా తెలంగాణపైనే పెట్టనుంది. వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ వచ్చే ఏడాది జనవరి నుంచే తన కార్యాచరణ ప్రణాళికను అమల్లో పెట్టనుంది. ఈ మేరకు సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోనే జాతీయనేతలు మకాం వేసే అవకాశముంది. సోమవారం పార్టీ నిర్వహించిన పదాధికారుల సమావేశంలోనూ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన జాతీయ నేతలు, ఇక్కడ అధికారమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కమల వికాసమే లక్ష్యంగా రంగంలోకి... తెలంగాణలో పార్టీని అధికారంలో తేవడమే తమ లక్ష్యమని, ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూల సంకేతాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీసహా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే గడిచిన ఎనిమిది నెలలుగా ముగ్గురు కీలక నేతల పర్యటనలు సాగుతున్నాయి. ఏప్రిల్ తర్వత జేపీ నడ్డా తెలంగాణలోనే ఎనిమిది రోజులపాటు ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఐదు, ప్రధాని నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఉన్నారు. పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సభలు, జాతీయ కమిటీ సమావేశాలకు నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. వీరి ఆదేశాల మేరకే ఇతర పార్టీ నుంచి చేరికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలు ముగియడంతో బీజేపీకి దక్షాణాదిలోని కర్ణాటకలో తిరిగి అధికారం దక్కించుకోవడం, తెలంగాణలో పగ్గాలు చేపట్టడం బీజేపీ తదుపరి లక్ష్యంగా ఉంది. తెలంగాణలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అంతర్గతంగా ఓ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ రోడ్‌మ్యాప్ ఆధారంగా మూడు స్థాయిల్లో నేతలను సంక్రాంతి తర్వాత పార్టీ తెలంగాణలోకి దించనుంది. మొదట జాతీయ స్థాయి నేతలు తమకు కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ స్థానాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తారు. కిందిస్థాయి నేతలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తారు. రెండోస్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా ఉన్న కేంద్రమంత్రులు ప్రతి పదిహేను రోజుల్లో ఒకసారి ఆ లోక్‌సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ పరిధిలో రాత్రి నిద్ర చేయడం, పార్టీ కార్యక్రమాల అమలు, సమన్వయం బాధ్యతలను చూడనున్నారు. మూడోస్థాయిలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఇన్‌చార్జీలుగా ఉండే ఇతర నేతలు ప్రతి వారంలో ఒకరోజు రాత్రి నిద్ర చేయడం, ఈ సమయంలోనే పార్టీ బలహీనతలు, కారణాలు వెతుకుతూనే కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణను తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాల అమలును పర్యవేక్షించడంతోపాటు పార్టీ ఏర్పాటు చేసే సభల కోసం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మోదీ, నడ్డా, అమిత్‌షాలలో ఒకరి పర్యటనలు ఉండేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మరోపక్క పార్టీ సిద్ధాంతాలు, గత ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు పరిచయం చేయడానికి బూత్‌స్థాయిలో ప్రజలతో ముఖాముఖి వంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ఓటర్ల విశ్వాసాన్ని గెలుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచనలు అందాయి. వీటితోపాటే యువత, మహిళలను ఆకట్టుకునేలా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాల్సి ఉంటుంది. సోమవారం జరిగిన పదాధికారుల భేటీలోనే ఈ అంశాలపైనే తెలంగాణ, కర్ణాటక నేతలకు ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ తరఫున భేటీకి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేతలు మురళీధర్‌రావు, ప్రేమేందర్ రెడ్డి హాజరుకాగా, పార్టీ పటిష్టతపై వీరితో పలువురు జాతీయనేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామయాత్రకు సంబంధించి ఓ నివేదికను జాతీయ నేతలకు ప్రేమేందర్‌రెడ్డి అందజేశారు. -
గుజరాత్, హిమాచల్‌లో సంచలన సర్వే ఫలితాలు
-
Gujarat Exit Poll Results: ప్రధాని రాష్ట్రంలో విరబూసిన కమలం, ఆప్ పరిస్థితేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 182 శాసనసభ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 1న, డిసెంబర్ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయాయి. 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాషాయ పార్టీ తిరిగి ‘పవర్’పంచ్ విసరాలని తీవ్రంగా శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో మరింత శ్రద్ధ పెట్టారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఈసారి పరిస్థితులు ఎవరికి అనుకూలంగా మారుతాయో చెప్పలేని పరిస్థితి! ఈనేపథ్యంలో సోమవారం సాయత్రం విడుదలైన పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు గుజరాత్లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇక ప్రధాని సొంత రాష్ట్రంలో కీలక రాజకీయ మార్పులకు శ్రీకారం చుడతామని చెప్పుకున్న ఆప్ చతికిల పడింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గుజరాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2022 సంస్థ: రిపబ్లిక్ సంస్థ: జన్‌కీ బాత్ సర్వే సంస్థ: పీపుల్స్ పల్స్ -
సామాన్యుడిలా క్యూలో వెళ్లి ఓటేసిన మోదీ.. కాంగ్రెస్ విమర్శలు!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయమే గాంధీనగర్ రాజ్‌భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాణిప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఒక సామాన్యుడిలా క్యూ లైన్లో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్ షో అంటూ.. కాంగ్రెస్ విమర్శలు అహ్మదాబాద్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన ప్రధాని మోదీ.. పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలోనే కాన్వాయ్‌ని నిలిపేసి నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ప్రధానిని చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. వారికి అభివాదం చేసుకుంటూ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు మోదీ. ఓటు వేసి తిరిగి వెళ్లేప్పుడు సైతం అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రానికి ప్రధాని నడుచుకుంటూ వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మోదీ రోడ్ షో నిర్వహించారని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం విచారకరమని విమర్శించింది. మరోవైపు.. ప్రధాని మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పించారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఓటింగ్ సమయంలో రోడ్ షో లాంటి కార్యక్రమం చేపట్టడమేంటని ప్రశ్నించారు. వారు ప్రత్యేకమైన వ్యక్తులు అంటూ విమర్శించారు. ఎన్నికల రోజున రోడ్ షోలపై నిషేధం ఉంటుందని, కానీ వారు అందుకు మినహాయింపు అంటూ దుయ్యబట్టారు. PM #NarendraModi ji casted his vote,it's time for people of #Gujarat to caste thier vote for our bright future and coming generations!#GujaratElections2022 pic.twitter.com/pKyXMF2cc1 — Weisel🇮🇳 (@weiselaqua) December 5, 2022 ఇదీ చదవండి: Gujarat Assembly Elections 2022: మధ్యాహ్నం 3 గంటల వరకు 50శాతం ఓటింగ్ -
Gujarat Assembly Elections 2022: ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్
అప్డేట్స్ ముగిసిన రెండో దశ పోలింగ్.. 60శాతానికిపైగా ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుది విడతలో 60 శాతానికిపైగా ఓటింగ్ నమోదైనట్లు అంచనా. రెండు దశల్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. 04:00PM మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సబర్‌కాంతా జిల్లాలో అత్యధికంగా 57.24 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. ఓటేసిన ప్రధాని మోదీ తల్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 ఏళ్ల హీరాబెన్ గాంధీనగర్‌లోని రాయ్సన్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. Prime Minister Narendra Modi's mother Heeraben Modi casts her vote for the second phase of #GujaratAssemblyPolls in Raysan Primary School, Gandhinagar pic.twitter.com/ZfWcBXWCfI — ANI (@ANI) December 5, 2022 01: 55PM మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్ గుజరాత్ శాసనసభ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మాజీ టీమిండియా క్రికెటర్ నయన్ మోంగియా.. వడోదరలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Former Indian Cricketer Nayan Mongia casts his vote for the second phase of #GujaratAssemblyPolls at a polling booth in Vadodara pic.twitter.com/S1zsIvaoMX — ANI (@ANI) December 5, 2022 12: 15PM ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 10: 30AM ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్ గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గాంధీనగర్‌లో అత్యధికంగా 7 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్, అహ్మదాబాద్‌లోని శిలాజ్ అనుపమ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 95లో ఓటు వేశారు. Ahmedabad | Uttar Pradesh Governor Anandiben Patel cast her vote for the second phase of #GujaratAssemblyPolls at Polling Booth 95, Shilaj Anupam School#GujaratAssemblyPolls pic.twitter.com/dC7Jk8UKBH — ANI (@ANI) December 5, 2022 09: 23AM ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ Cast my vote in Ahmedabad. Urging all those voting today to turnout in record numbers and vote. pic.twitter.com/m0X16uCtjA — Narendra Modi (@narendramodi) December 5, 2022 Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N — ANI (@ANI) December 5, 2022 08:56AM Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi leaves from Gandhinagar Raj Bhawan to cast his vote for the Gujarat Assembly elections at Nishan Public School, Ranip.#GujaratElections2022 pic.twitter.com/gt9Rmg2tes — ANI (@ANI) December 5, 2022 ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఓటేయడానికి పోలింగ్ స్టేషన్‌కు బయల్దేరారు. రానిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ బూత్‌లో మోదీకి ఓటు.. గాంధీనగర్ నుంచి రానిప్కు బయల్దేరిన మోదీ 08:50AM కొనసాగుతున్న పోలింగ్ 08:00AM గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం మధ్య గుజరాత్లో బీజేపీ పట్టు కొనసాగుతున్నప్పటికీ ఆప్ నుంచి సవాళ్లు ఉత్తర గుజరాత్లో ఆప్ ఉనికి లేకపోయినప్పటికీ అధికార పార్టీకి ఎదురుగాలి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ Urging all those who are voting in Phase 2 of the Gujarat elections, particularly the young voters and women voters to vote in large numbers. I will be casting my vote in Ahmedabad at around 9 AM. — Narendra Modi (@narendramodi) December 5, 2022 గుజరాత్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని. 14 జిల్లాల్లో 93 స్థానాలకు మధ్య, ఉత్తర గుజరాత్‌ల్లోని 14 జిల్లాల్లో 93 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 833 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, ఆప్ మొత్తం 93 స్థానాల్లో, కాంగ్రెస్ 90 చోట్ల, దాని మిత్రపక్షం ఎన్సీపీ మూడు స్థానాల్లో పోటీ పడుతున్నాయి. 255 మంది స్వతంత్రులూ బరిలో ఉన్నారు. 2.54 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 14,975 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. బరిలో ఉద్యమకారులు ఈ దఫా ఎన్నికల్లో కొన్ని హాట్ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, ఠాకూర్ల ఆందోళనల నేత అల్పేశ్ ఠాకూర్ బీజేపీ తరఫున, దళిత సమస్యలపై గళమెత్తిన జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘాట్లోడియా స్థానం నుంచి పోటీ పడుతూ ఉంటే, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన హార్దిక్ పటేల్ వీరమ్‌గామ్ అల్పేష్ కుమార్ గాంధీనగర్–సౌత్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక జిగ్నేష్ మేవానీ వద్గమ్ నుంచి మరోసారి పోటీకి దిగారు. బీజేపీకి కనీసం నాలుగైదు స్థానాల్లో రెబెల్ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు. వఘోడియా, పాద్రా, బయాద్, నాందోడ్లలో రెబెల్స్ పార్టీకి తలనొప్పిగా మారారు. 16 ముస్లిం ప్రాబల్యం స్థానాలు కీలకం అహ్మదాబాద్‌లోని ముస్లింల ప్రాబల్యం ఉన్న 16 స్థానాలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. వీటిలో నాలుగు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల్ని నిలబెట్టడంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. గుజరాత్ మతఘర్షణలో అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో దోషుల్ని శిక్షాకాలం కాక ముందే విడుదల చేయడం కూడా అధికార పార్టీకి మైనస్‌గా మారింది. దీంతో ఓట్లు చీలిపోయి ఎవరికి లబ్ధి చేకూరుతుందా అన్న ఆందోళన కమలనాథుల్లో ఉంది. గుజరాత్ మోడల్ పాలనతో అత్యధిక ప్రయోజనం పొందిన అహ్మదాబాద్ దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ జిల్లాలో అయిదు స్థానాలు దక్కించుకోవడం, పట్టణ ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడడం బీజేపీకి సవాల్‌గా మారాయి. అందుకే ప్రచారంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో వరసగా రెండు రోడ్ షోలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓటుపై ఉదాసీనత డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో ఓటు వెయ్యడానికి ప్రజల్లో ఒక రకమైన ఉదాసీనత కనిపించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్‌లలో ఓటింగ్ అత్యంత స్వల్పంగా జరిగింది. మొత్తమ్మీద 63.3% పోలింగ్ నమోదైంది. పట్టణాలకు, గ్రామాలకి మధ్య పోలింగ్‌లో 35% వరకు తేడా ఉంది. అహ్మాదాబాద్, ఆనంద్, వడోదరా, గాంధీనగర్, గోధ్రా వంటి నగరాల్లో రెండో దశ పోలింగ్ ఉండడంతో ఓటర్లు ఉదాసీనంగా వ్యవహరించవద్దని, తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్లందరూ ముందుకు రావాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అహ్మాదాబాద్‌లో ఓటు వేయనున్నారు. -
Gujarat Assembly Election 2022: గుజరాత్లో ప్రచారానికి తెర
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది దశ ప్రచారానికి శనివారం తెరపడింది. రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు 5న పోలింగ్ జరగనుంది. 833 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అయితే ప్రచారంలో బీజేపీ, ఆప్‌తో కాంగ్రెస్ పోటీ పడలేకపోయింది. అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఒక్కరే ప్రచార భారం మోశారు. మోదీ.. అన్నీ తానై రాష్ట్రంలో బీజేపీ 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించే బాధ్యతను ప్రధాని మోదీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 31 ర్యాలీలు, 3 నగరాల్లో అతి పెద్ద రోడ్ షోలతో సుడిగాలి ప్రచారం చేశారు. అహ్మదాబాద్‌లో గురువారం ఆయన రోడ్ షో దేశంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టించింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలను మీదుగా 50 కి.మీ. వరకు ఈ రోడ్ షో సాగింది. నాలుగు గంటల సేపు సాగిన ఈ రోడ్ షోకి జనం పోటెత్తారు. రోడ్డుకిరువైపులా కిలో మీటర్ల మేర 10 లక్షల మంది వరకు నిల్చొని మోదీకి జన నీరాజనం సమర్పించారని బీజేపీ చెప్పుకుంటోంది. ప్రధాని ఏ సభకు వెళ్లినా మోదీ, మోదీ, మోదీ అంటూ యువత ఉత్సాహంగా కేకలు వేయడం కనిపించింది. ప్రచారంలో మోదీ ప్రధానంగా గుజరాత్ ఆత్మగౌరవ నినాదాన్ని, తమ పార్టీ చేస్తున్న అభివృద్ధినే ప్రస్తావించారు. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎక్కడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఆప్ పేరు తీసుకురాకుండా ఆ పార్టీ ఇచ్చే ఉచిత పథకాలను మోదీ ఎక్కడికక్కడ ఎండగట్టారు. ఉచితానికి, సంక్షేమానికి మధ్య తేడా తెలుసుకోవాలంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చురకలంటించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇక ఆప్ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. 30కిపైగా ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ప్రతీ చోటా ఉచిత విద్యుత్ పథకాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదుగుతామని ఆప్ ధీమాగా ఉంది. కాగా గుజరాత్ ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి. అది కాంగ్రెస్ ఢూండో యాత్ర: స్మృతీ భారత్ జోడో యాత్ర నిజానికి కాంగ్రెస్ ఢూండో (అన్వేషణ) యాత్ర అంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. గుజరాత్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలొచ్చాక కాంగ్రెస్ ఢూండో యాత్ర మొదలవుతుందని జోస్యం చెప్పారు. -
పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. గతంలో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతికి ఆస్కారమున్న పనులు తప్ప ప్రజలకు మంచి చేసే పనులు చేయలేదని ఆరోపించారు. మోదీ శుక్రవారం గుజరాత్లో బనస్కంతా జిల్లా కాంక్రేజ్ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగించారు. కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. పేదలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవు కాంగ్రెస్ పాలనలో దేశంలో మధ్యలో వదిలేసిన 99 తాగునీటి సరఫరా పథకాలను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 4 లక్షల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశామన్నారు. అవినీతి అడ్డుకోవడం కొందరికి నచ్చడం లేదని, అందుకే తనను దూషిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసి దొరికిపోయినవారు తనను తిడుతున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోబీజేపీ మరోసారి విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. కాంక్రేజ్‌లోని ఔగర్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలకులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నేతలు బానిస మనస్తత్వాన్ని అలవర్చుకున్నారని మోదీ చెప్పారు. బ్రిటిషర్ల చెడు అలవాట్లను కాంగ్రెస్ నాయకులు నేర్చుకున్నారని తెలిపారు. ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ సమస్య కేవలం సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ మాత్రమే కాదని, దేశ ఐక్యత కూడా అని చెప్పారు. విభజించు, పాలించు అనే విధానంపైనే కాంగ్రెస్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రజలందరినీ ఏకం చేయాలని సర్దార్ పటేల్ భావించారని, అందుకే ఆయనంటే కాంగ్రెస్‌కు గిట్టదని పేర్కొన్నారు. బీజేపీ విజయాన్ని ఒప్పుకున్న కాంగ్రెస్ గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ట్యాంపరింగ్ చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. ‘‘ఓటమి తప్పదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈవీఎంలపై నిందలు మోపుతోంది. తద్వారా బీజేపీ విజయాన్ని పరోక్షంగా అంగీకరించింది’’ అని అన్నారు. ఆయన ఉత్తర గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు మోదీని తిట్టడం, ఎన్నికలయ్యాక ఈవీఎంలను నిందించడం.. కాంగ్రెస్‌కు తెలిసింది ఈ రెండు విషయాలేనని ఎద్దేవా చేశారు. దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు దక్కాల్సిన సొమ్మును దోచుకున్నాయని దుయ్యబట్టారు. ధనికుల, పేదల మధ్య అంతరాలు పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు. -
Gujarat Assembly Election 2022: ఎవరి దశ తిరుగుతుంది?
గుజరాత్ మొదటి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశలో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. గుజరాత్ మోడల్ పాలనతో సెంట్రల్ గుజరాత్ అభివృద్ధిలో దూసుకుపోయింది. అధికార పార్టీకి అడ్డాగా మారింది. ఉత్తర గుజరాత్ పలు రకాల సమస్యలతో బీజేపీకి సవాళ్లు విసురుతోంది. మధ్య గుజరాత్లో కాంగ్రెస్ హవా తగ్గిపోతే, ఉత్తరాన ఆప్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ రెండు పార్టీల మధ్యే పోరు నెలకొంది. ఈ దశలో ఏ పార్టీ పట్టు బిగిస్తుంది ? గుజరాత్ రెండో దశ పోలింగ్ ఈ నెల 5న మొత్తం 93 స్థానాలకు జరగనుంది. మధ్య గుజరాత్లో 61 అసెంబ్లీ స్థానాలకు, ఉత్తర గుజరాత్లో 32 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. మధ్య గుజరాత్లో ఆదివాసీలు, నగరీకరణ జరిగిన ప్రాంతాలతో నిండి ఉంది. మొత్తం ఎనిమిది జిల్లాల్లో అహ్మదాబాద్, వడోదరా, ఖేదాలో కొన్ని ప్రాంతాలు, ఎస్టీల ప్రాబల్యం కగిలిన పంచ్‌మహల్ జిల్లాల్లో బీజేపికి పట్టు ఉంటే, మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఎస్టీ ప్రాంతాల్లో ఎదురొడ్డుతున్న కాంగ్రెస్ గిరిజన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది.ఈ సారి ఎన్నికలకి కాస్త ముందు కాంగ్రెస్‌లో ప్రముఖ ఎస్టీ నాయకుడు, ఛోటా ఉదేపూర్ నియోజకవర్గం నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సిన్హ్ రథ్వా బీజేపీలో చేరడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా మారింది. మోహన్ సిన్హాకున్న మంచిపేరు వల్ల మహిసాగర్, దాహోద్ జిల్లాల్లో ఓటర్లు బీజేపీకి మద్దతుగా ఉండే అవకాశాలున్నాయని బరోడా యూనివర్సిటీ ప్రొఫెసర్ అమిత్ ధోలకియా అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం (ఖామ్) సామాజిక వర్గం ఓట్లు కూడా ఈ సారి గంపగుత్తగా ఆ పార్టీకి వచ్చే అవకాశాల్లేవని, ఆ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది వ్యాఖ్యానించారు.ఈ ప్రాంతంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ వైపే ఓటర్లు చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్ మోడల్ పాలనతో బాగా లబ్ధి పొందిన పట్టణాలు, నగరాల్లో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలి బీజేపీ లాభపడే అవకాశాలైతే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్ కంటే ఆప్ పట్టు పెంచుకుంది. మొత్తమ్మీద మధ్య గుజరాత్ మరోసారి బీజేపీకే జై కొట్టే అవకాశాలున్నాయి. ఉత్తరాన బీజేపీకి సవాళ్లు ఈ ప్రాంతంలో చిన్ని చిన్న పట్టణాలు ఎక్కువగా ఉన్నాయి. చిరు వ్యాపారులు కరోనాతో భారీగా నష్టపోవడంతో పాటు నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. అధిక ధరలతో సామాన్యులకు బతుకు భారంగా మారింది. ఇవన్నీ బీజేపీకి సవాళ్లుగా మారాయి. ఈ ప్రాంతంలో సామాజిక సమీకరణలు కూడా బీజేపీకి అంతగా అనుకూలంగా లేవు. ఠాకూర్ల ప్రాబల్యం అధికం. వీరంతా మొదట్నుంచి కాంగ్రెస్‌కే మద్దతుగా ఉన్నారు. పటేళ్లు, ఠాకూర్లు చెరో పార్టీకి మద్దతునివ్వడం ఆనవాయితీగా మారిపోయింది. దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు మొదట్నుంచి బీజేపీ వెంట లేకపోవడం పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. ఈ ప్రాంతం ఉద్యమాల ఖిల్లాగా కూడా పేరు పడింది. హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటీదార్ ఆందోళన, అల్పేశ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఠాకూర్ల ఆందోళన, జిగ్నేష్ మేవానీ నేతృత్వంలో దళితుల ఆందోళనలు ఇక్కడ ఉధృతంగా జరిగాయి. అధికార పార్టీపై ఆ ఉద్యమాల ప్రభావం ఇంకా ఉండడం కమలనాథుల్ని కలవరపెడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభా ఎన్నికల సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’ ఆసక్తి కరంగా సాగుతున్నాయి. జడేజా సతీమణి రివాబా.. బీజేపీ తరపున జామ్‌నగర్ నార్త్ నుంచి పోటీలో నిలిచారు. భార్యను గెలిపించడానికి జడేజా విస్తృత ప్రచారం చేశాడు. అయితే జడేజా తండ్రి, అనిరుధ్‌సిన్హ్, సోదరి నయ్‌నబా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వాట్సాఫ్‌లో చక్కర్లు కొడుతోంది. తమ్ముడిలాంటోడు.. గెలిపించండి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న బిపింద్రసిన్హ్ తనకు తమ్ముడు లాంటివాడని, అతడిని గెలిపించాలని నార్త్ జామ్‌నగర్ ఓటర్లను అనిరుధ్‌సిన్హ్ కోరారు. ముఖ్యంగా రాజ్‌పుత్‌లు అతడికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’పై గుజరాత్ ఓటర్లు చర్చించుకుంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే జడేజా సోదరి నయ్‌నబా.. జామ్‌నగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇన్చార్జిగా ఉన్నారు. జడేజా వర్సెస్ జడేజా జామ్‌నగర్ నార్త్‌లో పోటీని ‘జడేజా వర్సెస్ జడేజా’గా చూడాల్సిన అవసరం లేదని నయ్‌నబా పేర్కొన్నారు. విభిన్న సైద్ధాంతికత కలిగిన కుటుంబాలు జామ్‌నగర్‌లో చాలా ఉన్నాయని వెల్లడించారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నా... తమ కుటుంబాల మధ్య ఎటువంటి వివాదాలు లేవన్నారు. తనవారంతా బాగుండాలని కోరుకుంటానని చెప్పారు. అది ఆయన వ్యక్తిగత విషయం మామగారి వీడియోపై రివాబా తనదైన శైలిలో స్పందించారు. ఒకే పార్టీలో రెండు పార్టీలకు చెందిన వారు ఉండడం కొత్త విషయమేమి కాదని అన్నారు. ‘నా మామగారిలా కాకుండా మరో పార్టీకి చెందిన కార్యకర్తగా ఆయన మాట్లాడారు. అది ఆయన వ్యక్తిగత విషయం. జామ్‌నగర్ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. జామ్‌నగర్ మాకు ఎన్నో ఇచ్చింది. నా భర్త ఇక్కడే పుట్టి, కెరీర్ ఆరంభించాడ’ని రివాబా పేర్కొన్నారు. అయితే తన భర్త మాత్రం తనకే అండగా ఉన్నాడని, ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కాగా, గుజరాత్ మొదటి విడత ఎన్నికలు గురువారం ముగిశాయి. నార్త్ జామ్‌నగర్‌లో ఈ రోజు పోలింగ్ జరిగిన 89 నియోజకవర్గాల్లో ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది డిసెంబర్ 8న తేలుతుంది. (క్లిక్ చేయండి: ఏ మ్యానిఫెస్టోలో ఏముంది?) -
Gujarat Polls: ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్.. 8 మంది సిబ్బంది
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ పోలింగ్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం.. కేవలం ఒక్క ఓటర్ కోసం ఏకంగా పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. అందుకోసం సుమారు 8 మంది వరకు పోలింగ్, భద్రతా సిబ్బందిని పంపించింది. ఈ పోలింగ్ బూత్ దట్టమైన గిర్ అడవుల్లో ఉంటుంది. బనేజ్ ప్రాంతంలోని ఉనా నియోజకవర్గానికి తొలి విడతలో పోలింగ్ జరిగింది. అటవీ ప్రాంతంలో నివసించే మహంత్ హరిదాస్జీ ఉదాసిన్ అనే వ్యక్తి కోసం ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. తొలి విడతలో భాగంగా మహంత్ హరిదాస్జీ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది ఎన్నికల కమిషన్. ఉనా అసెంబ్లీలోని బనేజ్ పోలింగ్ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్ భరత్‌దాస్ అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత పోలింగ్ బూత్‌ను మూసివేయాలనుకున్నారు. కానీ, ఆయన వారసుడిగా మహంత్ హరిదాస్జీ రావడం వల్ల తిరిగి పోలింగ్ బూత్‌ను ప్రారంభించారు. #ECI has set up a polling booth for only one voter, Mahant Haridasji Udasin in Banej (93-Una AC) in the dense jungles of Gir. Glimpses of Haridas Ji casting his vote during 1st phase of #GujaratElections2022.#novotertobeleftbehind #GujaratAssemblyPolls #ECI #EveryVoteMatters pic.twitter.com/FhDDELyRXU — Election Commission of India #SVEEP (@ECISVEEP) December 1, 2022 ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్ -
ఖర్గేని ఎంతో గౌరవిస్తా, కానీ..: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీ ఒకటి నడుస్తోంది. ఆ పార్టీ నేతలు పోటీ పడి మరీ మోదీని తిడుతున్నారు. ఎవరైతే ఎక్కువగా, పెద్దగా, పదునైన అవమానాలకు మోదీ గురిచేస్తారో.. అంటూ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కానీ, అలాంటి పదాలు వాడుతూ.. వాళ్లు పశ్చాత్తాపం చెందకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తర గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని కలోల్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనపై చేసిన రావణ్ కామెంట్‌పైనా ఆయన స్పందించారు. రామభక్తుల నేలపై ఒకరిని రావణుడు అని సంభోధించడం ఏమాత్రం సరికాదని మోదీ పేర్కొన్నారు. ‘‘కొన్నిరోజుల కిందట ఓ కాంగ్రెస్ నేత.. మోదీకి కుక్క చావు తప్పదన్నాడు. మరో నేత హిట్లర్‌లా మోదీ చస్తాడని వ్యాఖ్యానించారు. ఇంకొకరేమో.. ఛాన్స్ దొరికితే మోదీని నేనే చంపేస్తా అంటాడు. ఒకరేమో రావణుడంటున్నారు. మరొకరు రాక్షసుడంటున్నారు. ఇంకొకరు బొద్దింక అంటున్నారు. ఇలా.. కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే మోదీ పేరు వాడడం నాకు కొత్తేం అనిపించడం లేదు. కానీ, అలాంటి పదాలు వాడుతున్నప్పటికీ, కాంగ్రెస్‌కు ఎప్పుడూ పశ్చాత్తాపం చెందడం లేదని నేను ఆశ్చర్యపోతున్నా. అసలు వాళ్లు మోదీని అవమానించడం ఒక హక్కుగా అనుకుంటున్నారు అని మోదీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. గుజరాత్ నాకు బలం ఇస్తే.. కాంగ్రెస్‌ను మాత్రం ఇబ్బంది పెట్టింది. ఓ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడికి వచ్చి ఈ ఎన్నికల్లో మోదీ స్థాయి ఏంటో చూపిస్తాం అని సవాల్ విసిరాడు. అది సరిపోలేదని కాంగ్రెస్ అనుకుందేమో. అందుకే ఖర్గేను ఇక్కడికి పంపారు. ఆయన్ని(ఖర్గేని) నేను గౌరవిస్తా.. కానీ ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుజరాత్ రామభక్తుల నేల అని కాంగ్రెస్‌కు తెలియదు. అందుకే.. ఆయన ఇక్కడికి వచ్చి మోదీ వంద తలలున్న రావణుడన్నారు’’ అని మోదీ ఖర్గే విమర్శకు సమాధానం ఇచ్చారు. గుజరాత్లో ఇవాళ(గురువారం) ఫస్ట్ ఫేజ్ ఎన్నిక జరుగుతోంది. రెండో ఫేస్ ఎన్నిక డిసెంబర్ 5వ తేదీన(సోమవారం) జరగనుంది. -
మూడు ముక్కలాట.. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సౌరాష్ట్ర,, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎవరి వ్యూహాలు వారివే 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నారు. మోదీ ఇమేజ్, అభివృద్ధి, గుజరాత్ ఆత్మగౌరవం అంశాలనే బీజేపీ నమ్ముకుంది. ఎన్నికలకు ముందు మోదీ రూ.29 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. మొత్తం 43 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించడంతో పాటు ఎన్నికలకు ముందు సీఎం సహా మొత్తం కేబినెట్‌ను మార్చేసి కొత్త రూపుతో అధికార వ్యతిరేకతను ఎదుర్కోవడానికి బీజేపీ వ్యూహాలు పన్నింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్లో ప్రచారాన్ని నడిపించారు. గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్‌లలో పట్టు సాధించిన స్థానాలపై దృష్టి పెట్టారు. క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టడానికి రూపొందించిన ఖామ్ వ్యూహంపైనే ఆశలు పెట్టుకుంది. ఇక చాప కింద నీరులా విస్తరిస్తున్న ఆప్ పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి గురిపెట్టింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికే వ్యూహాలు పన్నుతూ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారాన్ని అంతా తానై నడిపించారు. ఉచిత కరెంట్, ఢిల్లీ మోడల్ పాలన ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా ఉంది. ఏ ప్రాంతంలో ఎవరి హవా ! 2017 ఎన్నికల్లో 89 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ 40 సీట్లలో గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్‌లలో బీజేపీ వెనుకబడి పోయింది. పటీదార్ల ఉద్యమంతో ఈ ప్రాంతంలోని ప్రాబల్యమున్న లెవా పటేళ్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. ఈ ఐదేళ్లలో మళ్లీ బీజేపీ వైపు మళ్లిపోయారు. ఈ ప్రాంతానికి చెందిన మల్దారీలు అందరూ ఈ సారి ఆప్‌కి అండగా ఉన్నారు.అధికార బీజేపీ ప్రతిపాదించిన పశువుల నియంత్రణ బిల్లును మల్దారీలు తీవ్రగా వ్యతిరేకించారు. ఆప్ పశు సంరక్షణ కోసం రోజుకి రూ.40 ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ వర్గం ఆప్ వైపే చూస్తోంది. సౌరాష్ట్రలో బీజేపీకి పట్టున్న రాజ్‌కోట్, భావ్‌నగర్ పట్టణ కేంద్రాలపై ఆప్ దృష్టి సారించింది. దక్షిణ గుజరాత్లో పటీదార్లతో పాటు మరాఠీలు, ఆదివాసీల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఆరెస్సెస్, క్రిస్టియన్ మిషనరీ సంస్థలు క్రియాశీలకంగా ఉండడం బీజేపీకి, కాంగ్రెస్ కలిసొచ్చే అంశం. బరిలో 788 మంది తొలి దశ ఎన్నికల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ ఉంటే, ఆప్ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్ నియోజకవర్గం అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆప్ 88 స్థానాలకే పరిమితమవాల్సి వచ్చింది. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ద్వారక జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా సూరత్‌లోని కటాగ్రామ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా జామ్‌నగర్ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు 89 పోటీ పడుతున్న అభ్యర్థులు 788 మహిళా అభ్యర్థులు 70 స్వతంత్ర అభ్యర్థులు 339 ఓటర్ల సంఖ్య 2 కోట్లు పోలింగ్ కేంద్రాలు 14,32 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Election 2022: కాంగ్రెస్‌ను ఊడ్చేస్తుందా?
గుజరాత్లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి. రేపు తొలి దశకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 5న రెండో, తుది దశ పోలింగ్‌తో అన్ని పార్టీల భవితవ్యమూ ఈవీఎంల్లోకి చేరనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేటికవే గెలుపుపై ధీమా వెలిబుచ్చుతున్నా అంతర్గతంగా మాత్రం ఇప్పటికే లోతుగా విశ్లేషణల్లో మునిగిపోయాయి. మూడో పక్షంగా బరిలోకి దిగిన ఆప్ ఈసారి గట్టిగా ఉనికి చాటుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఆప్ గట్టిగా గండి కొట్టొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు...! గుజరాత్లో ఈసారి ఆప్ ఏకంగా 22 శాతం ఓట్లు సాధిస్తుందని సీఎస్డీఎస్ లోక్‌నీతి ఇటీవల చేసిన సర్వేలో తేలడం విశేషం! పరిస్థితులు కలిసొస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేస్తుందని కూడా సర్వేను పర్యవేక్షించిన భాను పర్మార్ అభిప్రాయపడ్డారు. ఇది కాంగ్రెస్‌కు కచ్చితంగా ఆందోళనకర పరిణామమేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీకి గట్టి ఓటు బ్యాంకుంది. కనుక ఆప్ దెబ్బ గట్టిగా పడేది బహుశా కాంగ్రెస్ మీదే. అందుకే ఈసారి ఆ పార్టీకి నష్టం భారీగానే ఉండొచ్చు’’ అని విశ్లేషించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ ప్రదర్శన ఈ అభిప్రాయాలను బలపరిచేదిగానే ఉంది. వాటిలో పార్టీకి 13.28 శాతం ఓట్లు దక్కాయి. సూరత్‌లో అదే జరిగింది... రాష్ట్రంలో సూరత్ ప్రాంతంలో ఆప్‌కు ఆదరణ బాగానే ఉంది. సూరత్ కార్పొరేషన్ ఎన్నికల్లో 120 సీట్లకు ఆప్ 27 స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టింది కూడా! ఈ ప్రాంతంలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 7 నుంచి 8 గెలుస్తామని ఆప్ నేత కేజ్రీవాల్ ధీమా చెబుతున్నారు. సూరత్‌తో పాటు సౌరాష్ట్ర ప్రాంతంపైనా ఆప్ గట్టిగానే దృష్టి సారించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి ఈసారి ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీరితో పాటు దశాబ్దాలుగా ఓడుతున్న కాంగ్రెస్ తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ లాయలిస్టులు, బీజేపీపై ఆగ్రహంగా ఉన్న వర్గాల ఓట్లు కూడా రాబట్టగలిగితే ఆప్ అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకుడు ధవల్ వాస్వాడా అభిప్రాయపడ్డారు. ‘‘దీనికి తోడు గ్రామీణ గుజరాత్ ఓటర్లు బీజేపీ కంటే కాంగ్రెస్‌కే మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఆప్ వారిని కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది! పట్టణ ప్రాంతాల్లో యువత, విద్యాధికుల్లో పార్టీకి ఎటూ ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. అది అదనపు లాభంగా కలిసొస్తుంది’’ అని ఆయన విశ్లేషించారు. తొలి దశ ప్రచారానికి తెర 89 అసెంబ్లీ స్థానాలకు రేపే పోలింగ్ అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభకు సంబంధించిన తొలి దశ ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం ముగిసింది. తొలి దశలో దక్షిణ గుజరాత్, కచ్–సౌరాష్ట్ర పరిధిలోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉండగా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దూకి త్రిముఖపోరుగా మార్చేసింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఏసుదాన్ గడవీ పోటీ చేస్తున్న దేవభూమి ద్వారాక జిల్లాలోని ఖంభాలియా నియోజకవర్గంలో సైతం తొలి దఫాలోనే పోలింగ్ జరగనుంది. డిసెంబర్ ఒకటో తేదీన పోలింగ్ ఉంటుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన కున్వర్జీ బవలియా, మోర్బీ ‘హీరో’ కాంతీలాల్ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తదతరులూ తొలి దఫాలోనే అదృష్టం పరీక్షించుకోనున్నారు. 89 మంది బీజేపీ, 89 మంది కాంగ్రెస్, 88 మంది ఆప్ అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ తొమ్మిది మంది, కాంగ్రెస్ ఆరుగురు, ఆప్ ఐదుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 718 మంది పురుషులు, 70 మంది మహిళలున్నారు. 2,39,76,670 మంది ఓటేయనున్నారు. 9 వేలకుపైగా పట్టణ ప్రాంతాల్లో, 16వేలకుపైగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Polls: ముగిసిన ప్రచారం.. తొలిదశకు అంతా సిద్ధం
గాంధీనగర్: గుజరాత్ శాసనసభ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా ముమ్మర ప్రచారంతో దూసుకెళ్లిన రాజకీయ పార్టీలు.. తొలిదశ ప్రచారానికి ముగింపు చెప్పాయి. మొదటి విడతలో భాగంగా 89 స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. మరో 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా.. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 27 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్న తమ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే, 2017లో ఒక్కసీటు కూడా సాధించని ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ గెలుపు ఉత్సాహంతో గుజరాత్‌లోనూ పాగా వేయాలని భావిస్తోంది. 90 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి పి భారతి.. ఓటింగ్‌పై పలు వివరాలను వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ‘డిసెంబర్ 1న ఓటింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 50 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ ఉంటుంది. తొలి దశలో 2,39,76,760 మంది ఓటర్లు తమ ఓట హక్కును వినియోగించుకోనున్నారు. ’ అని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. బీజేపీ తరఫున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు భావ్‌నగర్, కచ్ జిల్లాలోని గాంధీధామ్‌లలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. తొలిదశలో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ బరిలో ఉన్నారు. ద్వారకా జిల్లాలోని ఖాంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గుజరాత్ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కున్వార్జీ బవాలియా, మోర్బీ హీరో కాంతీలాల్ అమృతీయ, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, ఆమ్ఆద్మీ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా వంటి ముఖ్య వ్యక్తులు తొలిదశ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
కాంగ్రెస్ సభలో ఎద్దు బీభత్సం.. బీజేపీ కుట్రేనటా!
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోకి ఓ ఎద్దు ప్రవేశించింది. ఎటు వెళ్లాలో తెలియక అటూఇటు పరుగులు పెట్టడం వల్ల అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన గుజరాత్‌లోని మెహ్సానా ప్రాంతంలో మంగళవారం జరిగింది. వేదికపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ మాట్లాడుతున్న క్రమంలో ఓ నల్లటి కొమ్ములు తిరిగిన ఎద్దు ఆ సభలోకి ప్రవేశించింది. దీంతో పలువురు భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఎద్దు బెదిరిపోకుండా అంతా నిశబ్దంగా ఉండాలని సీఎం అశోక్ గెహ్లట్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ సభ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, బీజేపీ సభ్యులు కావాలనే ఎద్దులు లేదా ఆవులను వదులుతున్నారని ఆరోపించారు. సభను చెదరగొట్టేందుకు ఎద్దును బీజేపీనే పంపించిందన్నారు. ఇది బీజేపీ చేసిన కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ సమావేశాలను భంగపరచాలనే దురుద్దేశంతో తరుచుగా ఇలాంటి వ్యూహాలను పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1, 5వ తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉండనుంది. మంగళవారంతో తొలివిడత 89 స్థానాల పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. गुजरात मे @ashokgehlot51 की सभा में घुसा सांड!! सीएम बोले.... मैं बचपन से देखता आ रहा हूं, ये भाजपा भेजती है मेरी सभा में सांडों को. pic.twitter.com/RkB8oSmowx — Sharad (@DrSharadPurohit) November 28, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే
-
మీకేమైనా రావణుడిలా 100 తలలున్నాయా?.. మోదీపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రిని రావణుడితో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లోని బెహ్రామ్పుర్లో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై బీజేపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘మేము మీ(మోదీ) ముఖాన్ని కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు సహా ప్రతిచోటా చూస్తున్నాం. మీకేమైనా రావణుడిలా 100 తలలు ఉన్నాయా? మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎమ్మెల్యే సహా ఏ ఎన్నికల్లోనైనా మోదీజీ పేరుతో ఓట్లు అడుగుతుండటం గమనించాను. మోదీ మున్సిపాలిటీల్లోకి వెళ్లి పని చేస్తారా? మీకు అవసరమైనప్పుడు మోదీ వచ్చి సాయం చేస్తారా?’ అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. मोदी जी प्रधानमंत्री हैं। वह काम छोड़कर नगर निगम का चुनाव, MLA का चुनाव, MP के चुनाव में प्रचार करते रहते हैं। हर वक्त अपनी ही बात करते हैं - 'आप किसी को मत देखो, मोदी को देखकर वोट दो।' आपकी सूरत कितनी बार देखें? आपके कितने रूप हैं? क्या रावण की तरह 100 मुख हैं? - @kharge जी pic.twitter.com/Iy6hYQfuhc — Congress (@INCIndia) November 29, 2022 ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా. ఆయన వ్యాఖ్యలు ప్రధాని మోదీని అవమానించటమేనన్నారు. ‘గుజరాత్ ఎన్నికల వేడిను తట్టుకోలేక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాటలు అదుపుతప్పుతున్నాయి. దాంతోనే ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు. గుజరాత్‌ను, ఆ రాష్ట్ర బిడ్డను కాంగ్రెస్ అవమానుస్తూనే ఉంది.’ అని విమర్శించారు. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సైతం ఖర్గేపై మండిపడ్డారు. పీఎం మోదీని రావణుడితో పోల్చడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ తీరును సూచిస్తున్నాయని విమర్శించారు. ఇదీ చదవండి: సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల -
Gujarat Assembly Election 2022: ఆకాశంలో సగం.. అవకాశాలే గగనం!
ఆకాశంలో సగం అంటూ గొప్పగా కీర్తించడమే తప్ప రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. జనాభాలో దాదాపు సగం ఉన్న అతివలకు ఆ మేరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. గుజరాత్లో శాసనసభ ఎన్నికల ముఖచిత్రం పరిశీలిస్తే నిరాశే మిగలడం ఖాయం. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, మొత్తం 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో మహిళల సంఖ్య కేవలం 139 అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీరిలో ఏకంగా 56 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండడం విశేషం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 మంది మహిళలు పోటీకి దిగారు, 13 మంది విజయం సాధించారు. అప్పట్లో 104 మంది మహిళలు డిపాజిట్ సైతం కోల్పోయారు. ‘ఆప్’ నుంచి ఆరుగురు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మహిళలకు పరిమిత సంఖ్యలోనే టిక్కెట్లిచ్చాయి. ఈ మూడు పార్టీల నుంచి కేవలం 38 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి సంఖ్య పెరగడం కొంత ఊరటనిచ్చే విషయం. 2017లో బీజేపీ 12 మంది మహిళామణులకు టిక్కెట్లు ఇవ్వగా, ఈ ఎన్నికల్లో 18 మందికి అవకాశం కల్పించింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. 2017లో 10 మందికి, ఇప్పుడు 14 మంది ఆ పార్టీ టిక్కెట్లు లభించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దళిత, గిరిజన మహిళలకు టిక్కెట్లు ఇచ్చాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో మహిళలు కేవలం ఆరుగురు. ఈ ఆరుగురిలో ముగ్గురు ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. 13 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆలిండియా మజ్లిస్ ఇత్తెహదూల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ చేస్తున్న ఇద్దరు మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. వీరిలో ఒకరు ముస్లిం కాగా, మరో మహిళ దళిత వర్గానికి చెందినవారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. 13 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన సీపీఎం ఒక మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపింది. ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని టిక్కెట్లు బీజేపీకి 9 మంది మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఐదుగురికి మొండిచెయ్యి చూపింది. నలుగురికి మరోసారి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్‌కు నలుగురు మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నారు. వీరిలో ఇద్దరికి మళ్లీ అవకాశం కల్పించింది. 2017 ఎన్నికల కంటే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడం సానుకూల అంశం. 2017లో బీజేపీ ఎస్సీ స్థానాల్లో ఇద్దరికి, ఎస్టీ స్థానాల్లో ఒక మహిళకు టిక్కెట్లు ఇవ్వగా, ఇప్పుడు ఎస్సీ స్థానాల్లో నలుగురికి, ఎస్టీ స్థానాల్లో ఇద్దరికి పోటీ చేసే అవకాశం కల్పించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎస్టీ మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్సీలకు చోటు దక్కలేదు. ఈసారి నలుగురు ఎస్టీ, ఒక ఎస్సీ మహిళా అభ్యర్థి కాంగ్రెస్ టిక్కెట్లు దక్కించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ఎస్టీ మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. బిల్లు ఆమోదం పొందితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితేనే ఎన్నికల్లో వారి సంఖ్య పెరుగుతుందని శాయాజీగంజ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమీ రావత్ చెప్పారు. ఉన్నత పదవుల్లో మహిళలను నియమించడంలో తమ పార్టీ ముందంజలో ఉందని గుజరాత్ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దీపికాబెన్ సర్వాదా వెల్లడించారు. ఒక గిరిజన మహిళను తమ పార్టీ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకుందని గుర్తుచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat assembly elections 2022: గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని, తమకు ఓటేసి గెలిపించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన కోరారు. సూరత్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని, ఆప్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన కాగితంపై రాసి చూపారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. పాత పింఛను విధానం సహా ఇతర డిమాండ్లను తీరుస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. -
Gujarat assembly elections 2022: కాంగ్రెస్‌కు గిరిజనులంటే గౌరవం లేదు: మోదీ
నెత్రంగోడా: కాంగ్రెస్ పార్టీకి గిరిజనులంటే ఏమాత్రం గౌరవం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సైతం ఆ పార్టీ బలపరచలేదని పేర్కొన్నారు. ‘బిర్సా ముండా, గోవింద్ గురు వంటి గిరిజన నేతలను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ముర్ముకు మద్దతివ్వాలని రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆ పార్టీని చేతులు జోడించి వేడుకున్నా కాదన్నారు. గిరిజన పుత్రికను రాష్ట్రపతిని చేసేందుకు సర్వశక్తులూ ధారపోయాల్సి వచ్చింది’ అన్నారు. గుజరాత్‌లోని ఖేడా, భరుచ్ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్లు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండేదన్నారు. దేశంలో భారీ ఉగ్రదాడుల సమయంలో మౌనంగా ఉండటం ద్వారా కాంగ్రెస్, సారూప్య పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్ మారలేదు. దేశాన్ని కాపాడుకోవాలంటే అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలి’అని ప్రధాని పేర్కొన్నారు. -
గుజరాత్లో సోషల్ శరణం గచ్ఛామి! ఏ పార్టీ ప్రచారంలో ముందుంది అంటే?
గుజరాత్ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రధాని మోదీ, ఆప్ నేత కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకుపోతూంటే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ మాత్రం ఒక్క రోజు ప్రచారంతో సరిపెట్టారు. మరోవైపు మూడు పార్టీలు డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రచారానికి తొలుత శ్రీకారం చుట్టిన బీజేపీ ఈ ప్రచారంలోనూ తానే ముందుంది. కాంగ్రెస్ పార్టీ కాలేజీ విద్యార్థులనే సోషల్ మీడియా ప్రచారంలో భాగస్వామ్యుల్ని చేసింది. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ ప్రచారానికి రాకపోవడంతో ఆ లోటు పూరించేలా క్షేత్ర స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయ త్నం చేస్తోంది. ఇక ఆప్ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి ప్రచారం దాకా సోషల్ మీడియా మీదే ఆధారపడింది. కాంగ్రెస్ ► వాట్సాప్ ద్వారా బాగా ప్రచారం చేస్తోంది. 27 ఏళ్లుగా బీజేపీ ఏమేం చెయ్యలేదో , తమ హయాంలో ఏం చేశామో చెబుతోంది. ► అసెంబ్లీ స్థానాల వారీగా ఫేస్బుక్ పేజీలు ఏర్పాటు చేసి సమస్యలపై, తాము చేయబోయే పరిష్కారంపై ప్రచారం చేస్తోంది. ► 50 వేల వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. ► ఠాకూర్లు, పటీదార్లు, ఆదివాసీలు ఇలా.. కులాలు, వర్గాల వారీగా కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ► కాంగ్రెస్ పార్టీకి ఫేస్బుక్లో 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 64 లక్షలు, ట్విటర్లో 2 లక్షలు, యూ ట్యూబ్‌లో 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ► కొన్ని టెక్కీ సంస్థల్ని అద్దెకు తీసుకొని ప్రచారానికి అవసరమైన కంటెంట్ తయారు చేస్తోంది. ► పార్టీలో అధికారులు కాకుండా, క్షేత్ర స్థాయిలో 10 వేల నుంచి 12 వేల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. ఆప్ ► ఢిల్లీ మోడల్, మేనిఫెస్టో హామీలు ఓటర్లకు చేరేలా వాట్సాప్‌ను అధికంగా వినియోగిస్తోంది. ► ఆప్‌కు ఫేస్బుక్లో 6 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. నేషనల్ యూ ట్యూబ్‌లోనూ ప్రచారం చేస్తోంది. దీనికి 43 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ► ఆప్ సోషల్ మీడియా ప్రచార బాధ్యతల్ని 25 మంది యువ ఇంజనీర్లు తమ భజస్కంధాల మీద మోస్తున్నారు. 20 వేలమంది సోషల్ మీడియా వారియర్లను కూడా నియమించింది. ► ఆప్ మద్దతుదారుల ద్వారా కూడా అన్ని యాప్‌లలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ► ప్రతీ గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ప్రచారం నిర్వహిస్తోంది. ► సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ఎంపిక కూడా సోషల్ మీడియా ఓటింగ్ ద్వారా నిర్వహించి కొత్త ట్రెండ్ సృష్టించింది. బీజేపీ ► గుజరాత్ ఆత్మ గౌరవ ప్రచారానికి ప్రాధాన్యమిస్తోంది. 15 యాప్‌లు వినియోగిస్తోంది. ► సోషల్ మీడియాలో ఆర్నెల్లుగా వారానికో హ్యాష్ ట్యాగ్‌తో ప్రచారం చేస్తోంది. ► మోదీ 20 ఏళ్ల పాలన, వందే భారత్, ఈ గుజరాత్ నేనే నిర్మించాను వంటి ట్యాగ్ లైన్లతో విస్తృతంగా ప్రచారం. ► సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వినియోగిస్తోంది. ► బీజేపీకి ఫేస్బుక్లో 35 లక్షల పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 58 లక్షలు, ట్విటర్లో 15 లక్షలు, యూ ట్యూబ్‌లో 50 వేల ఫాలోవర్లున్నారు. ► 20 వేల మంది వర్కర్లు, 60 వేల మంది వాలంటీర్లు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ► బీజేపీ డిజిటిల్ వార్ రూమ్‌లో కంటెంట్ ఇస్తున్న వారంతా 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న యువ టెక్కీలే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్ ఎన్నికల ప్రచారం లో ప్రధాని మోదీ
-
Gujarat Assembly Elections 2022: బ్రాండ్ మోదీకే పరీక్ష!
గుజరాత్ అంటే మోదీ. మోదీ అంటే గుజరాత్. రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా ఇదే మాట వినిపిస్తోంది. ఆయన పేరే ఓ బ్రాండ్‌గా మారి బీజేపీకి అప్రతిహతంగా అధికారాన్ని అందిస్తోంది. కేజ్రీవాల్ తదితరుల సభల్లోనూ జనం మోదీ నామజపం చేయడం రాష్ట్రంలో ఆయన కరిష్మాకు నిదర్శనం. మరి ఈసారేం జరగనుంది? త్రిముఖ పోరులో మోదీ ఇమేజీ బీజేపీని మరోసారి గట్టెక్కించగలదా? సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న గుజరాతీయులు మళ్లీ మోదీ మంత్రమే జపిస్తారా? గుజరాత్లో 27 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ ఉచిత హామీలు కమలనాథుల్ని కలవరపెడుతున్నాయి. కరోనా తాలూకు ఆర్థిక, సామాజిక సమస్యల నుంచి రాష్ట్రం ఇంకా బయట పడలేదు. రాష్ట్రంలో బీజేపీకి బలమైన నాయకులెవరూ లేకపోవడంతో ఈసారి కూడా గెలిపించే బాధ్యత మోదీ భుజస్కంధాలపైనే పడింది. ‘ఈ గుజరాత్ నేనే నిర్మించాను’ నినాదంతో ఎన్నికల్ని ఆయన తన చుట్టూ తిప్పుకుంటున్నారు. డిసెంబర్ 1, 5 రెండు దశల్లో జరిగే పోలింగ్‌కు ఓటర్ స్లిప్పులను స్వయంగా ఇవ్వడానికి మోదీ సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 28, 29ల్లో, డిసెంబర్ 2–3ల్లో ఆయన ఇంటింటికి వెళ్లి వాటిని పంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బ్రహ్మాస్త్రంగా కమలనాథులు భావిస్తున్నారు. ఇమేజ్ లేని సీఎంలు మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ సీఎంలుగా చేసిన ఎవరికీ ప్రజల్లో పేరు లేదు. ఆనందీ బెన్ పటేల్ హయాంలో పటీదార్ల ఉద్యమం ఎగిసిపడడం, పటీదార్ అయ్యుండీ ఆమె ఉద్యమాన్ని అణిచే చర్యలకు దిగి సొంత వర్గానికే దూరమయ్యారు. దాంతో విజయ్ రూపానీని సీఎంను చేశారు. కరోనాను ఎదుర్కోలేక ఆయనా దిగిపోయారు. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్‌ను రాష్టంలోనే చాలామంది గుర్తు పట్టరంటే అతిశయోక్తి కాదు. సన్నాఫ్ గుజరాత్ మోదీ ఈసారి ప్రచారంలో ప్రజలతో వ్యక్తిగత భావోద్వేగ బంధానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘నేను మీ కొడుకును. ఆశీర్వదించండి’ అంటూ ఓట్లడుగుతున్నారు. గత ఎన్నికల్లో అధికార వ్యతిరేకత, పటీదార్ల ఉద్యమ ప్రభావం, జీఎస్టీ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బీజేపీ 99 స్థానాలతో అధికారం నిలుపుకుందంటే కేవలం మోదీ కార్డుతోనే. అందుకే ఈసారీ హిందూత్వ, డబుల్ ఇంజన్ నినాదాలతో పాటు ‘ఇది నేను నిర్మించిన గుజరాత్’, ‘ఇవి గతిని మార్చే ఎన్నికలు’ అంటూ మోదీ ప్రచారం చేస్తున్నారు. సామూహిక వివాహాల్లో పాల్గొంటూ, ఆదివాసీల్లో కలిసిపోతూ ప్రచారం చేస్తున్నారు. కీలక సవాళ్లు మోదీకి ఈసారి సొంత పార్టీ నుంచే అసలు పరీక్ష ఎదురవుతోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన 17 మందికి టికెట్లివ్వడంతో పార్టీలో అసమ్మతి మొదలైంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ ఇప్పుడు ఆ పార్టీ వారినే ఇలా అక్కున చేర్చుకోవడమేంటని రెబెల్ నేతలంటున్నారు. కరోనా, చమురు ధరలు, ద్రవ్యోల్బణం తదితరాలతో మోదీ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తదుపరి ప్రధానిగా మోదీకి 53% మందే ఓటేశారు. ఒకప్పుడిది 70 శాతానికి పైగా ఉండేది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 2002లో 127 నెగ్గిన బీజేపీ 2007లో 117, 2012లో 116 సీట్లకుకు పరిమితమైంది. 2017లో 99తో సరిపెట్టుకుంది! ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొట్టాలంటే గుజరాత్ ఎన్నికల్లో నెగ్గితీరాలి. అందుకే ఈ ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly elections 2022: గుజరాత్ గతిని నిర్ణయించే ఎన్నికలివీ..
పాలన్పూర్/దేహ్‌గాం: గుజరాత్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. రాబోయే 25 ఏళ్లపాటు రాష్ట్ర భవిష్యత్తును తేల్చే ఎన్నికలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన గురువారం బనస్కాంతా జిల్లా పాలన్‌పూర్‌లో, గాంధీనగర్ జిల్లా దేహ్‌గాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గుజరాత్లో బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం పర్యావరణం, పర్యాటకం, పరిశుభ్రమైన తాగునీరు, సాగునీరు, పశువుల పెంపకం, ప్రజలకు పౌష్టికాహారం వంటివాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఉద్ఘాటించారు. తాగునీటి కొరత, విద్యుత్ కొరత వంటి సమస్యలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించిందన్నారు. గుజరాత్లో బీజేపీ సర్కారు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేసిందని చెప్పారు. మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యారంగం బడ్జెట్ ఏకంగా రూ.33,000 కోట్లకు చేరిందని, పలు రాష్ట్రాల మొత్తం విద్యారంగం బడ్జెట్ కంటే ఇది అధికమని చెప్పారు. డ్రోన్ కలకలం అహ్మదాబాద్ జిల్లా బావ్లా గ్రామంలో మోదీ సభకు ముందు వేదిక వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడం అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. డ్రోన్ ద్వారా జనసందోహాన్ని చిత్రీకరించే ప్రయత్నించడంతో స్థానికులు ముగ్గురి అరెస్టు చేíశారు. విద్యుత్‌తో ఆదాయం పొందాలి విద్యుత్ ద్వారా ఆదాయాన్ని పొందే రోజులు వచ్చాయని, ఉచితంగా తీసుకునే రోజులివి కావని ప్రధాని వ్యాఖ్యానించారు. అరావళి జిల్లా మోదాసాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని ఆప్, కాంగ్రెస్ ఇచ్చాయి. ఈ హామీ విపరీతంగా ఆకర్షించడంతో దానిని కౌంటర్ చేయడానికి ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నారు. -
ముక్కోణపు పోటీలో మురిసేదెవరు ?
-
ఆ ఊళ్లో ఎన్నికల ప్రచారమే ఉండదు! కానీ..
గుజరాత్లో మొత్తం 186 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఒక వారం మాత్రమే సమయం ఉన్నందున గుజరాత్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీల హోరుతో రసవత్తరమైన ఎన్నికల టెన్షన్‌తో ఉత్కంఠంగా ఉంది. కానీ, ఆ ఊరిలో మాత్రం ఎలాంటి కోలాహలం లేకుండా సాధారణ వాతావరణం కనిపిస్తుంటుంది. గుజరాత్లో రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్ సమాధియాల అనే ఒక గ్రామం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అక్కడి రాజకీయ పార్టీల ప్రచార ప్రవేశం మాత్రం పూర్తిగా నిషేధం. అసలు అక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచారం జరగదు. అయినప్పటికీ అక్కడి గ్రామస్తులంతా ఓటేస్తారు. అదీ కూడా ఒక్కరు కూడా మిస్స్ కాకుండా ఫుల్‌గా ఓట్లు పడతాయి. ఆ గ్రామంలో ఎన్నికల సమయంలో అందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తుంది అక్కడ గ్రామాభివృద్ధి కమిటీ. పైగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓటు వేసేందుకు రాకపోతే వారిపై రూ. 51/- జరిమాన కూడా విధిస్తుంది గ్రామాభివృద్ధి కమిటీ. అక్కడ గ్రామ సర్పంచ్‌ని కూడా అందరీ ఏకాభిప్రాయంతోనే ఎన్నుకుంటారు. అంతేగాదు పోలీంగ్‌కు కొన్ని రోజుల ముందు కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎవరైనా ఓటు వేయకపోతే కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదనే నియమం 1983 నుంచి ఉంది. పైగా ఇక్కడ ఏ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు రాదని, ఒకవేళ ప్రచారం చేస్తే తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలుసుని గ్రామస్తులు చెబుతున్నారు. ఐతే తమ గ్రామంలో వైఫై ఇంటర్నెట్ కనెక్షన్, సీసీటీవీ కెమెరాలు, తాగునీరు అందించే ఆర్ఓ ప్లాంట్ తదితర అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామంలో అభ్యుర్థులను ప్రచారం చేయడానికి అనుమతించరు కాబట్టి గ్రామ ప్రజలంతా తమకు మంచిదని భావించే నాయకుడికే ఏకగ్రీవంగా ఓటు వేస్తారుని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఏ కారణం చేతనైనా ఓటు వేయలేని పక్షంలో ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. (చదవండి: ప్రధాని తప్పు చేస్తే.. చర్యలు తీసుకునే సత్తా ఉన్న సీఈసీ కావాలి: సుప్రీం కోర్టు) -
దక్షిణం గాలి ఎటువైపు? ఆప్ దెబ్బకు బీజేపీ ఆశలు గల్లంతేనా?
దక్షిణ గుజరాత్. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఆదివాసీల సమ్మేళనమైన ఈ ప్రాంతవాసులు ఎటు వైపున్నారు? అధికార బీజేపీ ఆశల్ని ఆప్ గల్లంతు చేస్తుందా? జీఎస్టీపై గుర్రుగా ఉన్న వ్యాపారులు బీజేపీని కాదని ప్రత్యామ్నాయం వైపు చూస్తారా ? ఆదివాసీ ప్రాంతాల్లో పట్టున్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ...? దక్షిణ గుజరాత్ భరూచ్, నర్మద, తాపి, దాంగ్, సూరత్, వల్సద్, నవ్సారి జిల్లాలతో కూడుకొని ఉంది. డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్ జరిగే 89 స్థానాల్లో 35 దక్షిణ గుజరాత్లో ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ప్రాంతంపై బాగా దృష్టి పెట్టాయి. ఈ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలు వ్యాపారవేత్తలతో నిండిపోయి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువ. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 35 స్థానాలకు గాను 25 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 8, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) 2 నెగ్గింది. ఈసారి ఆప్ రాకతో దక్షిణ గుజరాత్లో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివాస ప్రాబల్య ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణ విద్యావంతులు కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ పాలనకు ఆకర్షితులవుతున్నారు. సూరత్ వ్యాపారులూ కీలకమే సూరత్‌లో వస్త్ర వ్యాపారులు జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నారు. కరోనా, జీఎస్టీ, పెరిగిన ధరలతో ఈసారి దీపావళి సీజన్లో వస్త్ర వ్యాపారం 60% తగ్గిపోవడంతో వారిలో భవిష్యత్‌పై బెంగ మొదలైంది. గత ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమం, అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 15 నెగ్గింది. ఆదివాసీ ప్రాబల్యమున్న మాండ్విలో మాత్రమే ఓడింది. ఈసారి ఆప్ ప్రభావం బాగా ఉండేలా ఉంది. గతేడాది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఏకంగా 27 సీట్లు నెగ్గింది. హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడం కలిసొచ్చే అంశమే అయినా ఆయన అనుచరులు తదితరులంతా ఆప్‌లో చేరారు. చిన్న పరిశ్రమల హబ్ దక్షిణ గుజరాత్లో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగానున్న పరిశ్రమల్లో 50శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పెట్టుబడుల్లో 33%, ఈ ప్రాంతంలోనే పెడుతున్నారు. ఉపాధి అవకాశాల్లో 43% ఇక్కడి పరిశ్రమలే కల్పిస్తున్నాయి. టెక్స్టైల్, డైమండ్ కటింగ్, పాలిజింగ్, కెమికల్, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ, ప్లాస్టిక్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. నాలుగు రేవు పట్టణాలతో కనెక్ట్ అయి ఉంది. రాష్ట్ర జనాభాలో 20% (1.2 కోట్లు) మంది దక్షిణ గుజరాత్‌లోనే నివసిస్తారు. ఈ ప్రాంతంలో వ్యాపారులందరూ జీఎస్టీపైనా, పెరిగిపోయిన విద్యుత్ బిల్లులపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఆదివాసీల ఆందోళనలు దక్షిణ గుజరాత్లో 14 ఎస్టీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో వీటిలో బీజేపీ 5 మాత్రమే నెగ్గింది. ఈసారి అన్ని కూడా రావంటున్నారు. సర్–తాపి–నర్మద నది లింకింగ్ ప్రాజెక్టు, వేదాంత జింగ్ స్మెల్టర్ ప్లాంట్ ద్వారా గుజరాత్ ప్రభుత్వం తమ భూముల్ని కొల్లగొడుతోందన్న ఆగ్రహంతో గిరిపుత్రులు చేసిన ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. వన్సాదా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్ ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రభుత్వానికి కంటీ మిద కునుకు లేకుండా చేస్తోంది. అభివృద్ధి గురించి ఆదివాసీలకు వివరించి వారి ఆదరణ పొందడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ వదిలేసిన ఆదివాసీలకు స్వయంపాలన అధికారాన్ని కట్టబెట్టే పంచాయతీ విస్తరణ చట్టాన్ని అమలు చేస్తామన్న ఆప్ హామీ వారిని అధికంగా ఆకర్షిస్తోంది. ‘‘దక్షిణ గుజరాత్లో ఆదివాసీలు, వ్యాపారులు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. వేదాంత రసాయన ఫ్యాక్టరీ వారి భూముల్ని, నీటిని విషతుల్యం చేస్తుందన్న ఆందోళన నెలకొంది. వారికి ఆప్ ఆశాదీపంలా కనిపిస్తోంది’’ అని ఎన్నికల విశ్లేషకుడు అమిత్ ధోల్కాయి అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Election 2022: వారసులపైనే ఆశలు!
వారసత్వ రాజకీయాలు.. దేశాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యమని కేవలం ప్రజాస్వామ్యవాదులే కాదు, సాక్షాత్తూ రాజకీయ పార్టీలు సైతం నిందిస్తుంటాయి. ఆచరణలో మాత్రం అన్ని పార్టీలదీ అదే వరుస. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని చెప్పే పార్టీలు చివరకు గెలుపు గుర్రాల పేరుతో వారసులకే పట్టం కడుతున్నాయి. రాజకీయాల్లో వారసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అధికార బీజేపీ గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో అదే బాటలో సాగుతోంది. గుజరాత్ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పుత్రరత్నాలే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలుండగా, దాదాపు 20 స్థానాల్లో వారసులకే పార్టీలు టికెట్లిచ్చాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 13 మందికి, బీజేపీ ఏడుగురికి టికెట్లు ఇవ్వడం గమనార్హం. ప్రోత్సాహం ఇందుకే.. ఆర్థికంగా బలవంతులు కావడం, ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకొట్టే సామర్థ్యం ఉండడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి లేకపోవడం వంటి కారణాలతో పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పదిసార్లు విజయం సాధించిన గిరిజన నేత మోహన్ సిన్హ్ రాథ్వా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. బీజేపీ అధిష్టానం ఆయన కుమారుడు రాజేంద్ర సిన్హ్ రాథ్వాకు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన చోటా ఉదయ్‌పూర్ టిక్కెట్ కేటాయించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి నరాన్బాయి రాథ్వా కుమారుడు సంగ్రామ్ సిన్హ్ రాథ్వా పోటీ చేస్తుండడం గమనార్హం. సనంద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కరణ్ సిన్హ్ పటేల్ కుమారుడు కానూ పటేల్ పోటీకి దిగుతున్నారు. థాస్రా నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్‌ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామ్ సిన్హ్ పర్మార్ కుమారుడు యోగేంద్ర పర్మార్ దక్కించుకున్నారు. వారసత్వం.. మా హక్కు అన్ని పార్టీల్లో కొన్ని కుటుంబాలు రాజకీయాలను తమకు దక్కిన వారసత్వంగా భావిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది చెప్పారు. తమ నియోజకవర్గాలపై పట్టు నిలుపుకుంటున్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారసత్వాన్ని అంగీకరించాల్సి వస్తోందని వెల్లడించారు. బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మరొకరు సాహసించడం లేదని చెప్పారు. ఫలితంగా అక్కడ వారసులే పాగా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఒకవేళ నేతలను పక్కనపెట్టాల్సి వస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి వారి కుమారులు, కుమార్తెలు, భార్యలే పార్టీలకు దిక్కవుతున్నారని తెలియజేశారు. మాజీ సీఎం కుమారుడికి మళ్లీ చాన్స్ దనిలీమ్దా స్థానంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనూబాయి పర్మార్ కుమారుడు శైలేశ్ పర్మార్‌కు ఆ పార్టీ నుంచి టికెట్ లభించింది. బయాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ వాఘేలా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మహేంద్రసిన్హ్ వాఘేలా మరోసారి పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీలో చేరిన మహేంద్రసిన్హ్ వాఘేలా గత నెలలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గుజరాత్ మాజీ సీఎం అమర్‌సిన్హ్ చౌదరీ కుమారుడైన తుషార్ చౌదరీ బార్దోలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. బీజేపీకి షాక్ తగులుతుందా?
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి విద్యుత్ షాక్ తగులుతుందా ? నానాటికీ పెరిగిపోతున్న చార్జీలు ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయా ? సామాన్య జనమే కాదు. బడా బడా పారిశ్రామికవేత్తలు కూడా విద్యుత్ టారిఫ్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ? గుజరాత్లో విద్యుత్ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీపీఏ) రూపంలో పెంచింది. ప్రస్తుతం యూనిట్ ధర వివిధ వర్గాల వాడకానికి అనుగుణంగా యూనిట్‌కు రూ.2.50 నుంచి రూ. 7.50 వరకు ఉంది. . ‘‘గుజరాత్లో విద్యుత్ వినియోగదారులు 2021 మే–జూన్‌లో యూనిట్‌కి రూ.1.80 చెల్లిస్తే, ఈ ఏడాది జూన్ నాటికి యూనిట్ ధర రూ.2.50 చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏడాదిలో 70 పైసలు పెరిగింది. గత రెండు నెలల్లోనే యూనిట్‌కు 30 పైసలు పెరిగేసరికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై నెలకి అదనంగా రూ.270 కోట్ల భారం పడింది’’ అని రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ నిపుణుడు కె.కె.బజాజ్ చెప్పారు. గుజరాత్లో విద్యుత్ వాడకం ఎక్కువ. ఒక వ్యక్తి ఏడాదికి సగటున 2,150 యూనిట్లు వాడితే, ఇతర రాష్ట్రాల్లో 1,150 యూనిట్లే వాడతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా కోసం విద్యుత్ కంపెనీలు రూ.20 పెట్టి యూనిట్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్ చార్జీలు వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపాయి. పారిశ్రామిక రంగానికి యూనిట్‌కు రూ.7.50 చెల్లించాల్సి రావడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే వ్యాపారాలు చేయలేమంటోంది సదరన్ గుజరాత్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మహారాష్ట్ర, తెలంగాణలో పరిశ్రమలు యూనిట్‌కు రూ.4 చెల్లిస్తే, తాము రూ.7.50 చెల్లించాల్సి వస్తోందన్న ఆందోళనలో వారు ఉన్నారు. ఆప్ వర్సెస్ బీజేపీ గుజరాత్లో మొదటిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తరహాలో గృహాలకు నెలకి 300 యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్ హామీ పట్ల సామాన్యులు ఆకర్షితులవుతున్నారు. 2021 డిసెంబర్ 31కి ముందు జారీ అయిన పెండింగ్ విద్యుత్ బకాయిల్ని మాఫీ చేస్తామని, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. .మరోవైపు కాంగ్రెస్ కూడా ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామంటోంది. ఇవన్నీ అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితాలు ఇచ్చే పార్టీల మాయలో పడొద్దని ఉచిత హామీ పథకాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయంటూ ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ హామీ నెరవేరాలంటే గుజరాత్ ఖజానాపై ఏడాదికి రూ.8,700 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇంత అదనపు భారాన్ని ఎలా మోస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందించడంమే తమ పార్టీ లక్ష్యమనం మోదీ అంటున్నారు. విద్యుత్ చౌర్యం జరగకుండా మీటర్లు పెట్టడం తప్పనిసరి చేశారు. మరోవైపు బీజేపీ ప్రచారాన్ని ఆప్ తిప్పి కొడుతోంది. గుజరాత్లో ముఖ్యమంత్రి నెలకి 5 వేల యూనిట్లు, ఇతర మంత్రులకి 4 వేల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నప్పుడు సాధారణ జనం 300 యూనిట్ల వరకు ఎందుకు వాడుకోకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉచిత విద్యుత్ గుజరాత్ ఓటర్లకు కొత్త కాదు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేశూభాయ్ పటేల్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన కేశూభాయ్ పటేల్ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం కింద 47 లక్షల ముంది లబ్ధి పొందుతారు. అయితే మోదీ ఛరిష్మాకు ఆయన ఎదురు నిలువ లేకపోయారు.అప్పట్లో ఉచిత విద్యుత్ హామీలేవీ ఫలించలేదు. ఇప్పుడు కూడా ఆప్, కాంగ్రెస్‌కు అదే జరుగుతుందని బీజేపీ ధీమాగా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Elections 2022: ప్రతి బూత్ బీజేపీదే కావాలి
వెరవాల్/ధొరాజి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీకే విజయం అందించాలని గుజరాత్ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. ఎన్నికల రోజు ఓటర్లంతా భారీగా పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి, గత రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ‘బీజేపీకే ఓటేయాలని మిమ్మల్ని అడగడం లేదు. ప్రతి పౌరుడూ ఈ ప్రజాస్వామ్య వేడుకలో భాగస్వామిగా మారాలి’అని కోరారు. ‘తరచూ వచ్చే కరువు పరిస్థితులు వంటి కారణాలతో గతంలో రాష్ట్రాన్ని అందరూ చిన్నచూపు చూసేవారు. కానీ, అభివృద్ధిమార్గంలో పయనిస్తోంది. యావత్తు ఉత్తరభారతం నుంచి ఉత్పత్తులు రాష్ట్రంలోని రేవుల నుంచే ప్రపంచదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశ సౌభాగ్యానికి ఈ ఓడరేవులే ద్వారాలుగా మారాయి’అని ప్రధాని చెప్పారు. నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ శనివారం మహారాష్ట్రలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడవడంపై ఆయన స్పందించారు. సౌరాష్ట్రకు జలాలను అందించే నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 3 దశాబ్దాలపాటు అడ్డుకున్న వారితో అంటకాగుతున్న కాంగ్రెస్‌కు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని మోదీ ప్రజలను కోరారు. కాంగ్రెస్‌కు వేసిన ఓటు వృధాయే అన్నారు. గిర్ సోమ్‌నాథ్, రాజ్‌కోట్ జిల్లాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 1, 5వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
గుజరాత్ ఎన్నికల్లో కొత్త ముఖాలకే చోటు..
గుజరాత్ ఎన్నికల్లో కొత్త ముఖాలకే చోటు.. -
గుజరాత్ ‘చేతికి’ చిక్కేనా?
ఒకప్పుడు గుజరాత్ కాంగ్రెస్‌కు కంచుకోట. నరేంద్ర మోదీ గుజరాత్ పగ్గాలు చేపట్టాక అదంతా గత వైభవంగా మారిపోయింది. గత 27 ఏళ్లుగా అధికారం కోసం పోరాటం చేస్తోంది. మరి ఈ సారైనా కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోగలదా ? అంతర్గత సమస్యల్ని దాటుకొని మోదీ సొంత గడ్డపై విజయకేతనం ఎగురవేయగలదా ? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు రెండే రెండు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికారం దక్కాలంటే వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. గుజరాత్లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ఉన్న వ్యతిరేకత కలిసివస్తుందని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన మల్లిఖార్జున ఖర్గే ఈ ఎన్నికల్ని ఒక సవాల్‌గా తీసుకున్నారు. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 2002 నుంచి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 77 సీట్లలో గెలిచింది. 2012 ఎన్నికలతో పోల్చి చూస్తే 16 స్థానాల బలాన్ని పెంచుకుంది. ఎక్కువ స్థానాలను స్వల్ప మెజార్టీతోనే పోగొట్టుకుంది. అందుకే ఈ సారి విజయం తమదేనని గట్టిగా విశ్వసిస్తోంది. బీజేపీ, ఆప్‌లు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా ప్రచారం నిర్వహిస్తోంది. 125 ప్లస్ లక్ష్యంగా కేంద్ర మాజీ మంత్రులు, ఇతర రాష్ట్రాల్లో కీలక నేతలు బూత్ స్థాయి లో ప్రచారం చేస్తున్నారు. ఆప్ ప్రభావం ఆప్ తొలిసారిగా బరిలో దిగడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. ఆప్ ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందన్నది అంతుచిక్కడం లేదు. ఆప్ పట్టణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసి బీజేపీ ఓటు బ్యాంకునే కొల్లగొడుతుందన్నది కాంగ్రెస్ ధీమా. దిగ్గజ నేత అహ్మద్ పటేల్ లేకుండా ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడం, పీసీసీ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్ ఇతర నేతల్ని కలుపుకొని పోతూ ఎంతవరకు పనిచేయగలరన్న సందేహాలైతే ఉన్నాయి. అనుకూలం ► బీజేపీ 27 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత ► కాంగ్రెస్‌కి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకు ఠాకూర్, కొలి వంటి ఓబీసీలు, ఖామ్ ఓటర్ల (క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం) అండదండలు ► ఆరు దఫాలుగా బీజేపీ చేతిలో ఓడిపోతున్నా కాంగ్రెస్ 40% ఓటు షేర్ సాధించడం ► గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కున్న పట్టు ఇంకా కొనసాగుతుండటం ప్రతికూలం ► రాష్ట్రస్థాయిలో బలమైన నేతల కొరత, పార్టీలో అంతర్గత పోరు ► గత 30 ఏళ్లలో 60 అర్బన్, సెమీ అర్బన్ సీట్లలో ఒక్కదాంట్లోనూ నెగ్గలేకపోవడం ► రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపైనే కేంద్ర నాయకత్వం దృష్టి సారించడం ► 2017–2022 మధ్య కాలంలో హార్ధిక్ పటేల్ సహా 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడం – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
-
ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ నిషేధం!
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నేటి (నవంబర్ 12)నుంచి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం ఉదయం 8 గంటలకు భారీ భద్రత నడుమ పోలింగ్ మొదలైంది. మరోవైపు.. గుజరాత్లో డిసెంబర్ 1, 5 వ తేదీల్లో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 12, ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5, సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ, ప్రసారం చేయకూడదని నోటిఫికేషన్ జారీ చేసింది. పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 126(1)(బీ)ప్రకారం.. అలాగే ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు సహా ఎలాంటి ఎన్నికల అంశాలను ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయరాదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారులకు సూచించింది. అలాగే.. మీడియా రంగాలకు సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత రాజీనామా
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. తాజాగా మరో సీనియర్ నేత, 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సింగ్ రథ్వా రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకుపైగా ప్రతిపక్షంలోనే కూర్చున్న కాంగ్రెస్‌కు ఆయన రాజీనామాతో మరింత కష్టాల్లో కూరుకుపోయినట్లయింది. మంగళవారం తన రాజీనామాను గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్ థాకోర్కు అందించారు. 78 ఏళ్ల మోహన్‌సింగ్ రథ్వా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీ తీర్థ పుచ్చుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చోటా ఉదయ్‌పుర్(గిరిజన ప్రాతం) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఆయనకు మంచి పట్టుంది. 2012కు ముందు పావి జెట్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు రథ్వా. కానీ, ఆయన కుమారుడు రాజేద్రసింగ్ రథ్వాను తన స్థానంలో నిలబెట్టాలనుకున్నారు. తన నియోజకవర్గంలో సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నోట్ల రద్దుపై రాహుల్ వీడియో.. ‘పేపీఎం’ అంటూ మోదీపై ఫైర్ -
అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి?
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగినట్లు ఆల్ ఇండియా మజ్లిజ్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించారు పోలీసులు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ట్రైను సూరత్‌కు చేరుకునే క్రమంలో రాళ్ల దాడి జరిగినట్లు ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆరోపించారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు ఆయన వెళ్తున్నారని చెప్పారు. రైలుపై రాళ్లు విసిరినట్లు తన వద్ద కొన్ని ఫోటో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘అసదుద్దీన్ ఓవైసీ సాబ్, సబిర్ కబ్లివాలా సర్, నేను, ఏఐఎంఐఎం టీం అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్నాం. ఈ క్రమంలో కొందరు దుండగులు రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.’ అని పేర్కొన్నారు వారిస్ పఠాన్. ఏఐఎంఐఎం ఆరోపణలను ఖండించారు పశ్చిమ రైల్వే పోలీసు ఎస్పీ రాజేశ్ పర్మార్. భరుచి జిల్లాలోని అంక్లేశ్వర్ సమీపంలో ట్రాక్ పనులు నడుస్తున్నందున కొన్ని రాళ్లు ట్రైన్‌పై పడ్డాయని తెలిపారు. ఇది రాళ్ల దాడి కాదని స్పష్టం చేశారు. ఆయన కిటికీకి దూరంగానే కూర్చుని ఉన్నారని తెలిపారు. దెబ్బతిన్న విండోను మార్చామని, దర్యాప్తు చేపట్టాని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ కూర్చున్న సీటు పక్క కిటికి అద్దం ఇదీ చదవండి: సౌత్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ట్రయల్ రన్ సక్సెస్ -
గుజరాత్‌ను నడిపిస్తున్నది వారే.. వంతెన ప్రమాదంపై చిదంబరం ఫైర్
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక, చిదంబంరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నడపడం లేదని.. ఢిల్లీ నుంచి నడుస్తోందని విమర్శించారు. ఇటీవల గుజరాత్లో కుప్పకూలిన మోర్బీ తీగల వంతెన ఘటన దారుణమైందన్నారు. ఈ ఘటన గుజరాత్‌కే తలవంపులు తెచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై బీజేపీ ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎవరూ క్షమాపణ చెప్పలేదన్నారు. ఈ ప్రమాద ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. కేంద్ర దర్యాప్తు సంస్థలపై కూడా చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఏజెన్సీలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ఏజెన్సీల ద్వారా అరెస్టు చేయబడిన వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష నాయకులేనని చిదంబరం ఆరోపించారు. ఈ సందర్భంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ముందు దేశ రాజధాని గురించి ఆలోచన చేయాలని హితవు పలికారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, గాలి నాణత్య గురించి ప్రజలు ఆలోచిస్తే.. కేజ్రీవాల్‌కు ఎవరూ ఓటు వేయరని అన్నారు. Gujarat | #MorbiBridgeCollapse has brought shame to the fair name of Gujarat... The most shocking development is that no one, on behalf of the govt, has apologized for the tragedy. No one has resigned taking responsibility: Congress MP P Chidambaram pic.twitter.com/tLs6muBk79 — ANI (@ANI) November 8, 2022 -
పొలిటికల్ ట్విస్ట్..‘అక్కడ బీజేపీని కేవలం కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదు’
Ghulam Nabi Azad.. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు.. ఈసారి గుజరాత్లో పాగావేసేందు రంగంలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాతీలను ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ స్పందించారు. పార్టీని వీడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాకిచ్చారు. కాగా, జమ్మూ కాశ్మీర్లో మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినప్పటికీ లౌకికత్వం అనే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. కేవలం పార్టీ సిస్టమ్ బలహీన పడుతున్నదన్న కారణంతోనే తాను బయటికి వచ్చానని అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో వెళ్లే బీజేపీని ఓడించవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ అని అన్నారు. పంజాబ్ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. కానీ.. ఆప్ సర్కార్ పంజాబ్‌ను సమర్థంగా పాలించడంలో విఫలమైందన్నారు. పంజాబ్ ప్రజలు మరోసారి ఆప్‌ను గెలిపించరని జోస్యం చెప్పారు. ఇక, ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. J&K | Although I have separated from Congress, I wasn't against their policy of secularism. It was only due to the party's system getting weakened. I would still want that Congress performs well in Gujarat & HP Assembly polls. AAP isn't capable to do so: Ghulam Nabi Azad pic.twitter.com/yjzRNIffwt — ANI (@ANI) November 6, 2022 -
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...!
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...! -
ఎన్నికల ముందు బీజేపీకి షాక్..!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి మాజీ మంత్రి జయనారాయణ్ వ్యాస్ షాకిచ్చారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. అయితే, ఆయన ఏపార్టీలో చేరతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాంగ్రెస్‌లో చేరతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నా.. మరోవైపు ఆప్ వైపు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు పంపించారు మాజీ మంత్రి. ‘నేను బీజేపీతో విసిగిపోయాను, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సద్ధాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఏ పార్టీలో చేరటమనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నాను.’ అని వ్యాస్ పేర్కొన్నారు. 75ఏళ్ల వ్యాస్ ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్, కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశమయ్యారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పెద్దలతో వ్యాస్ మంతనాలు జరుపుతున్నట్లు హస్తం పార్టీ నేత ఒకరు పేర్కొనటం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది. 2007లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో కాషాయ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వ్యాస్.. పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: ‘మిస్టర్ కేజ్రీవాల్ మీ దృష్టిలో నేను దొంగనైతే.. మరి మీరేంటి?’ -
గుజరాత్ నుంచి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన రోజుల వ్యవధిలోనే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగాలని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా చేస్తే విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియాలకు ఉపశమనం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు తెలిపారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్ర జైన్‌ను జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పిందని పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఎంసీడీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించటం ద్వారా కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నట్లు కనిపించటం లేదు. బీజేపీ భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. వారు రెండు ప్రాంతాల్లో గెలుస్తామనే ధీమాలో ఉంటే అలాంటి ఆలోచన అవసరం లేదు. నిజానికి గుజరాత్‌తో పాటు ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓడపోతామని బీజేపీ భయపడుతోంది. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనుకుంటున్నారు. ఆప్‌ను వీడితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్‌ను మనీశ్ సిసోడియా తిరస్కరించిన తర్వాత వారు నన్ను సంప్రదించారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటే.. సత్యేంద్ర జైన్, సిసోడియాలపై ఉన్న అన్ని కేసులను తొలగిస్తామని ఆఫర్ చేశారు.’ అని సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. అయితే, ఎవరు ఆఫర్ చేసారనే ప్రశ్నకు.. బీజేపీ నేరుగా ఎప్పుడూ సంప్రదించదని, సొంత పార్టీ నేతల ద్వారానే వచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం