అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 64.33 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2017 నాటి ఎన్నికలతో పోలిస్తే 4.08 శాతం తగ్గింది. రాష్ట్రంలో 2017 ఎన్నికల్లో 68.41 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ నెల 1న 89 స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 63.31 శాతం, 4న 93 స్థానాలకు జరిగిన రెండో దశ ఎన్నికల్లో 65.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
రాష్ట్రంలో 4.91 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ ఎన్నికల్లో 3.16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా నర్మదా జిల్లాలో 78.42 శాతం, అతి తక్కువగా బోతాడ్ జిల్లాలో 57.59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. తాపీ జిల్లాలో 77.04 శాతం, బనస్‌కాంతా జిల్లాలో 72.49 శాతం, సబర్‌కాంతా జిల్లాలో 71.43 శాతం, నవసారి జిల్లాలో 71.06 శాతం, మోర్బీ జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు తేలింది. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి: ఎగ్జిట్ పోల్స్: గుజరాత్ బీజేపీదే
Comments
Please login to add a commentAdd a comment