Voting per cent
-
గుజరాత్ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 64.33 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2017 నాటి ఎన్నికలతో పోలిస్తే 4.08 శాతం తగ్గింది. రాష్ట్రంలో 2017 ఎన్నికల్లో 68.41 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ నెల 1న 89 స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 63.31 శాతం, 4న 93 స్థానాలకు జరిగిన రెండో దశ ఎన్నికల్లో 65.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో 4.91 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ ఎన్నికల్లో 3.16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా నర్మదా జిల్లాలో 78.42 శాతం, అతి తక్కువగా బోతాడ్ జిల్లాలో 57.59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. తాపీ జిల్లాలో 77.04 శాతం, బనస్కాంతా జిల్లాలో 72.49 శాతం, సబర్‌కాంతా జిల్లాలో 71.43 శాతం, నవసారి జిల్లాలో 71.06 శాతం, మోర్బీ జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు తేలింది. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: ఎగ్జిట్ పోల్స్: గుజరాత్ బీజేపీదే -
ఓటుకు పోటెత్తిన జనం
సాక్షి, ముదినేపల్లి : మండలంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటేసేందుకు జనం పోటెత్తారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓటర్లు గురువారం ఉదయానికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రాల వద్ద బారులు తీరారు. సరైన శిక్షణలేని పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. బొమ్మినంపాడు శివారు గొల్లగూడెం 98వ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7గంటలకు ప్రారంభించాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎం సక్రమంగా పనిచేయనందున గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే కేంద్రం వద్ద ఓటర్లు భారీసంఖ్యలో బారులు తీరారు. వైవాక శివారు పెదగరువు 108వ బూత్‌లో ఇదే పరిస్థితి ఏర్పడింది. స్వల్ప సంఘటనల మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో సిబ్బంది, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కలిదిండిలో 80 శాతం... కలిదిండి మండలంలో గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం పోలింగ్ ప్రారంభంలో పలుగ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. దీనికి తోడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు తీవ్ర నిరాశ పరిచింది. రెండు భవనాలు ఉన్న గ్రామంలో ఒకే భవనంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, కొన్ని గ్రామాల్లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతకు కొందరు ఉదయం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. పనులు ముగించుకుని రెండవ పూట భారీగా హాజరయ్యారు. మండలంలో మూలలంక, పౌలుపేట, తాడినాడ, చిన తాడినాడ గ్రామాల్లో పోలింగ్ ఆలస్యంగా జరిగింది. భాస్కరరావుపేట, తాడినాడ, సానారుద్రవరం, కోట కలిదిండి గ్రామాల్లో ఏడుగంటల తరువాత కూడా పోలింగ్ నిర్వహించారు. మొత్తానికి 80 శాతం పోలింగ్ నమోదైనట్టు తహసీల్దార్ కనకరాజు తెలిపారు. పోలీసులు తగిన భద్రత కల్పించడంతో మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండవల్లిలో 84శాతం... మండవల్లి మండలంలో 37,791 ఓటర్లుకు గాను, 84 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ పీవీ రమణకుమారి తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ పలు బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండవల్లి మండలంలో 29 గ్రామాలు ఉండగా సుమారు 11 గంటల వరకు పోలింగ్ సక్రమంగా జరగలేదు. మండల పరిధిలో 49 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో కొందరు ఓటర్లు ఎక్కువసేపు లైన్లో ఉండలేక ఇంటికి వెళ్లి మళ్లీ వద్దామని అనుకుని వెళ్లి తిరిగి 4గంటలు దాటిన తర్వాత ఓటు వేయడానికి వస్తే ఓటు వేయడానికి బాగా జాప్యం జరిగి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 7 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉంది. కొవ్వాడలంక గ్రామంలో స్వల్ప ఘర్షణ చేసుకుంది. తక్కెళ్లపాడు గ్రామంలో 90 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది. కైకలూరులో... పోలింగు ఈవీఎంలు ఓటర్లును ఇబ్బందులు పెట్టాయి. సాంకేతికలోపం, అవగాహన రాహిత్యం వెరసి ఓటర్లు గంటల తరబడి మలమలమాడారు. కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో మొత్తం 234 పోలింగు బూత్‌లలో గురువారం పోలింగు జరిగింది. నియోజకవర్గాన్ని మొత్తం 12 సెక్టర్లు, 24 రూట్లుగా విభజించారు. ఈ ఏడాది ఎవరికి ఓటు వేశామనేది తిలకించే వీవీప్యాడ్లు తికమకపెట్టాయి. స్వల్ప సంఘటనల నడుమ పోలింగు ప్రశాతంగా ముగిసింది. ఓటు హక్కును ఉపయోగించుకున్న అభ్యర్థులు.. అసెంబ్లీకి పోటి చేసిన పలు పార్టీల అభ్యర్థులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు కైకలూరులో, టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ కొట్టాడ గ్రామంలో, బీజేపీ అభ్యర్థి కీర్తి వెంకట రామప్రసాద్, స్వతంత్య్ర అభ్యర్థి భూపతిరాజు రమేష్ కుమార్ రాజులు కైకలూరులో, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామమైన వరహాపట్నం గ్రామంలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్, టీడీపీ అభ్యర్థులు ఆయా పోలింగు బూత్‌లలో జరిగే పోలింగు సరళిని పరిశీలించారు. -
నిర్ణయం ఆమెదే..
సాక్షి, ఖమ్మం : పార్టీ ఏదైనా.. అభ్యర్థి ఎవరైనా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలుపును నిర్ణయించేది మహిళలే. వీరిదే కీలక పాత్ర. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లకన్నా.. మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో వీరి ఓటే కీలకంగా మారనుంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఈనెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళలే ప్రధాన భూమిక అయ్యే అవకాశం ఉంది. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో.. ఏ ఎన్నికలు వచ్చినా జిల్లా పరిధిలో మహిళా ఓటర్లే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక వరాలు ప్రకటిస్తున్నారు. తీరొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు, ఇతర మహిళా సంఘాలకు పార్టీలపరంగా చేసిన మేలును గుర్తు చేస్తూ.. మహిళల కోసం ఆయా పార్టీలు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఓటర్లు 10,83,175 మంది ఉండగా.. వారిలో పురుష ఓటర్లు 5,31,515 మంది, మహిళా ఓటర్లు 5,51,584 మంది, ఇతరులు 76 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 20,096 మంది అధికంగా ఉన్నారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మహిళా ఓటర్లే ఎక్కవగా ఉన్నట్లు తేలింది. ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించే సమయంలో సైతం ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటరు నమోదుకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించడంతో ఓటర్లు అధిక సంఖ్యలో నమోదయ్యారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓటర్ల వివరాలు ఇలా నియోజకవర్గం పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం ఖమ్మం 1,41,672 1,51,896 32 2,93,600 పాలేరు 1,05,736 1,10,885 01 2,16,622 మధిర 1,03,009 1,07,342 07 2,10,358 వైరా 90,281 93,001 04 1,83,286 సత్తుపల్లి 1,13,921 1,16,501 04 2,30,426 కొత్తగూడెం 1,11,440 1,17,142 15 2,28,597 అశ్వారావుపేట 73,466 76,736 03 1,50,205 -
అక్కడ 100 % ఓటింగ్..
సాధారణంగా మన దగ్గర ఎన్నికలు జరిగితే ఓటింగ్ శాతం చాలా రాష్ట్రాలు, ప్రాంతాల్లో.. మహా అయితే 70 శాతం వరకు నమోదవుతుంటుంది. అది కూడా అతి కష్టం మీద. మరి ఓ దేశంలో మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా వంద శాతం ఓటింగ్ నమోదు అవుతుంది. అరె అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడి ప్రజలు అంత జాగరూకతతో ఉంటారా అని అనుమానపడకండి. ఇంతకీ వంద శాతం నమోదయ్యేది ఎక్కడో తెలుసా.. ఉత్తరకొరియాలో.. ఆ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఇదే రిపీట్ అవుతుంది. అక్కడి సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి అదేనండీ మన దగ్గర పార్లమెంట్ అంటాం కదా.. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఇంకో విచిత్రం ఏంటంటే.. అక్కడి 687 స్థానాల్లో ఒక్కోస్థానానికి ఒకే అభ్యర్థి బరిలో ఉంటారు. ఆ నియోజకవర్గం ప్రజలు ఆ ఒక్కరికే ఓటు వేసి ఆ అభ్యర్థికే ఓటేయాలి. ఒకవేళ ఓటు వేయకపోతే వారిపై దేశద్రోహం కింద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అందుకే భక్తితోనో.. భయంతోనో.. అందరూ ఓటేస్తారన్న మాట. ఇదండీ అసలు సంగతి.. ‘ముందే ఫిక్స్ అయిన మ్యాచ్‌కు అంపైరింగ్ ఎందుకో?’ఇదే కదా మీ డౌట్! -
75% ఓటింగే లక్ష్యం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంధ సంస్థలు ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహనకల్పిస్తున్నారు. సైకిల్ ర్యాలీలు, ప్రచార రథాలతో ఓటు విలువను తెలియజేయడం, మారథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘ఓట్ ఎక్స్‌ప్రెస్’ మినీబస్‌ను కూడా ప్రాంభించారు. పింప్రి, చించ్వడ్, బోసిరి అసెంబ్లీ నియోజక వర్గాలలో తిరిగి ప్రజల్లో ఈ వాహనం జనజాగృతి కల్పించనుంది. చించ్వడ్ ఎన్నికల అధికారి భానుదాస్ గైక్వాడ్ ఓట్ ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. ఇదిలా వుండగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పుణే జిల్లాలో కేవలం 54.44 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 57.42 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే కేవలం మూడు శాతం మాత్రమే పెరిగింది. దీంతో ఎన్నికల సంఘం ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను కసరత్తు చేస్తోంది. మరోపక్క జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్య్ర అభ్యర్థులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. వీధి సభలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పార్టీల ప్రచార డిజిటల్ స్క్రీన్ల రథాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు పోటీపడి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండడంతో ఎన్నికల కురుక్షేత్రం మహా సంగ్రామాన్ని తలపిస్తోంది. దీనికి తోడుగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఓట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ఎన్నికల సందడి మరింత రసవత్తరంగా మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ ప్రచార కార్యక్రమంలో ప్రవీణ్ లడకత్, నోడల్ ఆఫీసర్ యశ్వంత్ మన్కేడ్కర్, అన్నా బోదడే, శరద్ మాన్కర్, ప్రకాష్బన్, షబ్బీర్షేఖ్, అనిల్ పాసల్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఓటింగ్ శాతం పెంచండి : కలెక్టర్
విజయవాడ, న్యూస్‌లైన్ : ఓటింగ్ శాతం పెంపుపై ఎన్నికల సిబ్బంది దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. జిల్లాలోని 16 నియోజకవర్గాలకు చెందిన సెక్టార్, రిటర్నింగ్ అధికారులకు గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెండు విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సెక్టార్ అధికారులదే కీలక బాధ్యత అని కలెక్టర్ చెప్పారు. అలసత్వం, జాప్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ఓటు వేయడానికి ఆసక్తిగా లేని ప్రాంతాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ బాధ్యత సెక్టార్ అధికారులదే... ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డుల్ని బాధ్యతలేని వ్యక్తులు, రాజకీయ పార్టీల ద్వారా జారీ చేయిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం 1951 నిబంధనలకు లోబడి కేసులు నమోదు చేస్తున్నట్లు విజయవాడ లోక్‌సభ సాధారణ పరిశీలకురాలు రేణుసంత్ హెచ్చరించారు. సెక్టార్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాల మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాల్సిందిగా సూచించారు. ఫొటో ఓటర్ స్లిప్పుల జారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు మంజూరు చేయాలన్నారు. సెంట్రల్ నియోజక వర్గ పరిశీలకులు పుష్యపాటి సక్సేనా పాల్గొన్నారు. తిరువూరు, కైకలూరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు ఉదయం.. మచిలీపట్నం, పెనమలూరు, విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, నూజివీడు, గుడివాడ, గన్నవరం నియోజక వర్గాల సెక్టార్, రిటర్నింగ్ అధికారులకు మధ్యాహ్నం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.