Ghulam Nabi Azad.. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు.. ఈసారి గుజరాత్‌లో పాగావేసేందు రంగంలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాతీలను ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ స్పందించారు. పార్టీని వీడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాకిచ్చారు.
కాగా, జమ్మూ కాశ్మీర్‌లో మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినప్పటికీ లౌకికత్వం అనే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. కేవలం పార్టీ సిస్టమ్ బలహీన పడుతున్నదన్న కారణంతోనే తాను బయటికి వచ్చానని అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో వెళ్లే బీజేపీని ఓడించవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ అని అన్నారు. పంజాబ్ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. కానీ.. ఆప్ సర్కార్ పంజాబ్‌ను సమర్థంగా పాలించడంలో విఫలమైందన్నారు. పంజాబ్ ప్రజలు మరోసారి ఆప్‌ను గెలిపించరని జోస్యం చెప్పారు. ఇక, ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.
J&K | Although I have separated from Congress, I wasn't against their policy of secularism. It was only due to the party's system getting weakened. I would still want that Congress performs well in Gujarat & HP Assembly polls. AAP isn't capable to do so: Ghulam Nabi Azad pic.twitter.com/yjzRNIffwt
— ANI (@ANI) November 6, 2022
Comments
Please login to add a commentAdd a comment