గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరుల అభినందనలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దుమ్ము రేపి వరుసగా ఏడోసారి అధికారంలోకి రావడంపై పలు రాజకీయ వర్గాల్లో పలు కోణాల్లో విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో చాలా విషయాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అంతటి అసంతృప్తిని, అధికార వ్యతిరేకతను అధిగమిస్తూ ఏకంగా నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించిన వైనం రాష్ట్ర బీజేపీ ముఖ్యులను కూడా ఆశ్చర్యపరిచింది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి కనీసం గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ చివరికి ఘోర పరాజయం పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీని అడ్డుకోలేకపోగా, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా దాని జైత్రయాత్రకు పరోక్షంగా సహకరించినట్టయింది! దాంతో రాష్ట్రంలో ఎటు చూసినా కాషాయ రెపరెపలే కనిపించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ విహంగ వీక్షణం...
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment